Skip to main content

HCU: పీజీ కోర్సుల దరఖాస్తుకు చివ‌రి తేదీ ఇదే..

రాయదుర్గం: 2023–24 విద్యా సంవత్సరానికి గాను హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సులకు, ఇతర పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్‌ 19వ తేదీ వరకు గడువు ఉందని, అభ్యర్థులు ఆ లోపు దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ అధికారులు కోరారు.
Application deadline for HCU PG courses is April 19
హెచ్‌సీయూ పీజీ కోర్సుల దరఖాస్తుకు చివ‌రి తేదీ ఇదే..

అడ్మిషన్లు సీయూఈటీ–2023 ద్వారా సీయూఈటీ–యూజీ, సీయూఈటీ– పీజీ దేశ వ్యాప్తంగా విదేశాల్లో 500కు పైగా పరీక్షా కేంద్రాల్లో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)చే నిర్వహించబడుతుందన్నారు. సీయూఈటీ–2023 పరీక్షకు ప్రయత్నించిన తర్వాత హెచ్‌సీయూలో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు acad.uohyd.ac.in అనే వెబ్‌సైట్‌ ద్వారా హెచ్‌సీయూకి విడిగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థుల షార్ట్‌ లిస్ట్, వారి సీయూఈటీ–2023 స్కోర్ల ఆధారంగా చేయబడుతుందని వివరించారు. ఇంకా ఎంసీఏ కోర్సులో ప్రవేశం ఎన్‌ఐటీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ద్వారా నిర్వహించబడే ఎన్‌ఐఎంసీఈటీ స్కోర్ల ఆధారంగా ఉంటుందన్నారు.

చదవండి: హెచ్‌సీయూ ప్రొఫెసర్లకు అరుదైన అవకాశం

ఎంటెక్‌ కోర్సులకు ప్రవేశం కోసం గేట్, ఎంటెక్‌ యొక్క సెంట్రలైజ్డ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా ఉంటుందన్నారు. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ (కంప్యూటర్‌సైన్స్‌)లో ప్రవేశం జేఈఈ యొక్క సెంట్రల్‌ సీట్‌ అలోకేషన్‌ బోర్డ్‌(సీఎస్‌ఏబీ) ద్వారా జరుగుతుందన్నారు. ఎంబీఏలో ప్రవే శం సీఏటీ ద్వారా, ఎంఎస్సీ బయోటెక్నాలజీ జీఏటీ–బీ ద్వారా  ఉంటుందన్నారు. దీనిని ఆర్‌సీబీ ఫరీదాబాద్‌ నిర్వహిస్తుందని, వివరాలకు అభ్యర్థులు వెబ్‌సైట్‌ను చూడవచ్చన్నా రు. ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సులకు మార్చి 30 చివరి తేదీ అని, ఇతర పీజీ కోర్సులకు ఏప్రిల్‌ 19 చివరి తేదీ అని వారు సూచించారు. 

చదవండి: 2 రకాలుగా హెచ్‌సీయూ ఎంబీఏ అడ్మిషన్లు

Published date : 28 Mar 2023 12:03PM

Photo Stories