Results: మత్స్య వర్సిటీ కౌన్సెలింగ్ ఫలితాలు వెల్లడి
నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని మత్స్య కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ కోర్సులో 2022–23లో ప్రవేశానికి ఎంపికైన అభ్యర్థుల జాబితాను డిసెంబర్ 8న సచివాలయంలో ఆయన మీడియాకు వెల్లడించారు. బీఎఫ్‌ఎస్సీ కోర్సులో ప్రస్తుత విద్యా సంవత్సరానికి 40 సీట్లు ఉండగా.. ఏపీకి 29, తెలంగాణకు 11 సీట్లు చొప్పున భారత వ్యవసాయ పరిశోధన మండలి కేటాయించిందని చెప్పారు. ఏపీకి కేటాయించిన 29 సీట్లతో పాటు ఐసీఏఆర్(న్యూఢిల్లీ) కోటాలో 6 సీట్లు, ఈడబ్ల్యూఎస్ కోటాలో 3 సీట్లు అదనంగా లభించాయన్నారు.
చదవండి: 40 ఎకరాల్లో.. పశ్చిమ డెల్టాలో ఫిషరీస్ వర్సిటీ
ఐసీఏఆర్ కోటాలో కేటాయించిన ఆరు సీట్లను ఆ సంస్థే భర్తీ చేస్తుందన్నారు. మిగిలిన 32 సీట్ల భర్తీ కోసం 535 మంది దరఖాస్తు చేశారన్నారు. మెరిట్, రిజర్వేషన్ ప్రాతిపదికన 32 సీట్లను కేటాయించామని పేర్కొన్నారు. https://apfu&ugadmissions.aptonline.in/APFU/ వెబ్‌సైట్ నుంచి అలాట్‌మెంట్ ఆర్డర్స్ డౌన్‌లోడ్ చేసుకుని.. డిసెంబర్ 13లోగా ఫీజులు చెల్లించి ప్రవేశం పొందాలని సూచించారు. మెరిట్ ఆధారంగా వీరిలో కొందరు ఇతర కోర్సులకు వెళ్లే అవకాశమున్నందున.. ఆ మేరకు ఖాళీ అయ్యే సీట్ల భర్తీ కోసం డిసెంబర్ 17 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ జాబితా విడుదల చేస్తామన్నారు.
చదవండి: AP Fisheries University: ఏపీ మత్స్య వర్సిటీ ఏర్పాటు
విద్యార్థినీ, విద్యార్థులకు ముత్తుకూరు కాలేజీలో వేర్వేరుగా హాస్టల్ వసతి సౌకర్యం ఉందన్నారు. ఎగుమతుల్లో దేశంలోనే మూడో స్థానంలో ఉన్న ఏపీ మత్స్య రంగానికి నైపుణ్యం కలిగిన వారి అవసరం ఉందన్నారు. ఇందుకోసం రూ.332 కోట్లతో దేశంలోనే మూడో మత్స్య వర్సిటీని నర్సాపురంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. వచ్చే ఏడాది నుంచి ఇదే ప్రాంగణంలో కొత్తగా డిగ్రీ కళాశాల ఏర్పాటవుతుందన్నారు. ఆ తర్వాత దశల వారీగా డిప్లొమా, పీజీ కోర్సులను.. ఇంక్యుబేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సమావేశంలో వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ వై.మధుసూదనరెడ్డి, వర్సిటీ అధికారులు డాక్టర్ ఓగిరాల సుధాకర్, డాక్టర్ టీవీ రమణ పాల్గొన్నారు.
చదవండి: ఏపీ ఫిషరీస్ యూనివర్శిటీలో బీఎఫ్‌ఎస్సీ కోర్సులో ప్రవేశాలు..