AP CM YS Jagan Mohan Reddy : దేశంలో ఏ రాష్ట్రంలో లేదు.. ఇలాంటి పథకం.. వీరి అకౌంట్లోకి రూ.25 వేలు జమ..
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏమన్నారంటే..
➤ నాలుగు సంవత్సరాలుగా లా నేస్తం అమలు చేస్తున్నాం: సీఎం
➤ 2677 మంది అడ్వకేట్ చెల్లెమ్మలకు, తమ్ములకు రూ.6.12 కోట్లను వారి ఖాతాల్లో జమచేస్తున్నాం
➤ లా కోర్సు పూర్తిచేసిన, మొదటి మూడు సంవత్సరాల్లో ప్రాక్టీసు పరంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంది.
➤ ఈ పరిస్థితుల్లో వారి కాళ్లమీద వాళ్లు నిలబడేందుకు, వారికి తోడుగా నిలుస్తూ
➤ ప్రతి నెలా రూ.5వేలు, ఏడాదిలో రూ.60వేలు ఇస్తున్నాం
➤ మూడేళ్లలో ఇలా ఒక్కొక్కరికీ రూ.1.8లక్షలు ఇస్తున్నాం. దీనివల్ల వృత్తిలో వాళ్లు నిలదొక్కుకుంటారు. అలాగే జీవితంలో ముందుకు వెళ్తారు.
➤ మంచి ఆలోచనతో ఈ పథకం ప్రారంభించాం
➤ ఇప్పటవరకూ 5,781 మందికి మేలు చేశాం
➤ మొత్తంగా 41.52కోట్లు జూనియర్ లాయర్లకు ఇచ్చాం
➤ ఇలాంటి పథకం, ఇలాంటి ఆలోచన దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. కేవలం మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతుంది.
➤ అడ్వకేట్లకు అన్నిరకాలుగా మంచి జరగాలనే ఉద్దేశంతో రూ.100 కోట్లతో ఇప్పటికే వెల్ఫేర్ ట్రస్టును పెట్టడం జరిగింది.
➤ మెడిక్లెయిం కాని, ఇతరత్రా అవసరాలకు రుణాలు కావొచ్చు. ఈ ఫండ్ నుంచి రూ.25 కోట్లు సహాయం చేయడం జరిగింది
➤ న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా నిలిచింది.
➤ ప్రభుత్వం తరఫునుంచి న్యాయవాదులను కోరేది ఒక్కటే.. జూనియర్లుగా ఉన్న న్యాయవాదులు ప్రతి ఒక్కరూ కూడా దీనివల్ల మంచి జరిగితే.. వీరు స్థిరపడ్డాక ఇదే మమకారం వీళ్లు పేదలపట్ల చూపిస్తారన్న విశ్వాసం. ఒక అన్నగా, ఒక స్నేహితుడిగా వారి దగ్గరనుంచి ఆశిస్తున్నది ఇదే. దీన్ని ఎప్పుడూ మరిచిపోవద్దని కోరుతున్నాను.
➤ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు (5 నెలలు) రూ. 25 వేల చొప్పున మొత్తం రూ.6,12,65,000 జమ చేయనున్నారు.
➤ ప్రభుత్వం కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ న్యాయవాదులు వృత్తిలో నిలదొక్కుకునేలా మూడేళ్ల పాటు ఏడాదికి రూ.60 వేల చొప్పున రెండు దఫాల్లో చెల్లిస్తూ.. మొత్తం రూ.1.80 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. తాజాగా విడుదల చేస్తున్న ఆర్థిక సాయంతో కలిపి ఇప్పటివరకు 5,781 మంది యువ న్యాయవాదులకు రూ.41.52 కోట్లు చెల్లించింది.
➤ న్యాయవాదుల సంక్షేమం కోసం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీ సభ్యులుగా రూ.100 కోట్లతో ‘అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్’ను ఏర్పాటు చేసి.. న్యాయవాదులకు రుణాలు, గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలు, తదితర అవసరాల కోసం ఇప్పటికే రూ.25 కోట్ల సాయం అందించింది. ఆర్థిక సాయం కోరే న్యాయవాదులు ఆన్‌లైన్‌లో sec_law@ap. gov.in ద్వారా/నేరుగా లా సెక్రటరీకి దరఖాస్తు చేసుకోవాలి. వైఎస్సార్ లా నేస్తం పథకానికి సంబంధించి న్యాయవాదుల ఇబ్బందులను అధిగమించేందుకు 1902 నంబర్‌ను అందుబాటులో ఉంచింది.