Postpone All Exams: వానలు తగ్గేదాకా.. పరీక్షలన్నీ వాయిదా!
వర్షాలు తగ్గి, సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అన్నిరకాల పరీక్షలను వాయిదా వేయాలని ఉన్నతాధికారులు యూని వర్సిటీలు, విద్యా సంస్థలకు సూచించారు. దీంతో ఇప్పటికే డిగ్రీ, ఇంజనీరింగ్‌లో ఇంటర్నల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. డిగ్రీ ప్రవేశాల తేదీల్లోనూ మార్పులు చేశారు.
ఇంజనీరింగ్ సీట్లలో తొలివిడత చేరికలకు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో.. సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీలను పొడిగించారు. మలి విడత ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి జూలై 27తో ఆప్షన్లు ఇచ్చే గడువు ముగుస్తుండటంతో.. ఈ గడువునూ మరికొంత పెంచాలని విద్యార్థులు కోరుతున్నారు.
చదవండి: Inter Admissions: ఇంటర్ ప్రవేశాల తేదీ పొడిగింపు.. దోస్త్ గడువు పెంపు..
బడుల్లో అంతర్గత పరీక్షలకు తిప్పలు
పాఠశాలల్లోని విద్యార్థులకు జూలైలో జరగాల్సి ఉన్న ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్‌ఏ–1) పరీక్షలను వాయిదా వేయాలని అధికారులు భావిస్తున్నారు. వర్షాల మూలంగా వారం రోజులుగా సెలవులు ఇచ్చారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇటీవలి వరకు పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అందలేదు. ఇప్పుడీ వర్షా లతో మళ్లీ అంతరాయం రావడంతో నిర్ణీత సిలబస్ పూర్తవలేదని.. ఎఫ్‌ఏ–1 పరీక్షలను వాయిదా వేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
చదవండి: TSBIE: ఇంటర్‌లోనే ఆంగ్లంపై విద్యార్థులు పట్టు సాధించేలా..