IPE: పీజీ డిప్లొమాకు ప్రవేశాలు
2023–25 బ్యాచ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 31 ఆఖరు తేదీ అని సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీనివాసమూర్తి తెలిపారు. హైదరాబాద్ శివార్లలో 21 ఎకరాల విస్తీర్ణంలో ఐపీఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: Admissions in NIT Warangal: నిట్, వరంగల్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..
తాముఅందించే కో ర్సులు మేనేజ్‌మెంట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిష్ట్రేషన్ (ఎంబీఏ)కు సమానమైందని, ఈ విషయాన్ని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ కూడా గుర్తించిందని ఆయన చెప్పారు. ఈ ఏడాది క్యాంప స్ ప్లేస్‌మెంట్లలో ఏడాదికి గరిష్టంగా 24.75 లక్షల ప్యాకేజీతో విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయని , సగటు జీతం రూ.7.6 లక్షలుగా ఉందని చెప్పారు.
చదవండి: Admissions in TISS: టిస్ నెట్-2023 పీజీలో ప్రవేశాలు.. పరీక్షా విధానం ఇలా..
ప్రవేశ అర్హతలివి..: కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)తోపాటు జేవియర్స్ అడ్మిషన్స్ టెస్ట్, సీమ్యాట్, జీమ్యాట్, ఏఏటీఎంఏ వంటి జాతీయ స్థాయి పరీక్షల ర్యాంకుల ఆధారంగా ఐపీపీ ప్రవేశాలు ఉంటాయని సంస్థ విద్యార్థి వ్యవహారాల సమన్వయకర్త డాక్టర్ కె.వి.అనంత కుమార్ తెలిపారు. ఈ ర్యాంకులతోపాటు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, డిగ్రీ కోర్సుల్లో సాధించిన మార్కులకు కూడా ప్రాధాన్యం ఉంటుందని, విదేశీ విద్యార్థులు, పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్, గల్ఫ్ దేశాల్లోని భారతీయ కారి్మకుల పిల్లలకు తగిన కోటా ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. విద్యా సంవత్సరం ఆగస్టులో ప్రారంభమవుతుందని చెప్పారు. కోర్సు ఫీజు రెండేళ్లకు రూ.ఎనిమిది లక్షల వరకూ ఉండగా.. సుమారు రూ.కోటి విలువైన స్కాలర్‌షిప్‌లు కూడా అందిస్తున్నట్లు తెలిపారు.
చదవండి: Admissions in NIT Puducherry: నిట్, పుదుచ్చేరిలో పీహెచ్‌డీలో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..