Admissions: తొలిసారిగా ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు ప్రారంభం.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..
Sakshi Education
మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ) రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశాలను ప్రారంభించారు.
యూనివర్సిటీలో తొలిసారిగా ప్రవేశ పరీక్ష ఆధారంగా పీహెచ్‌డీ కోర్సును దక్కన్ స్టడీస్‌లో ప్రారంభించనున్నారు. ఈ పీహెచ్‌డీ కోర్సును యూనివర్సిటీలోని హెచ్‌కే షేర్వానీ సెంటర్ ఫర్ దక్కన్ స్టడీస్ అందిస్తుంది. అలాగే, ‘మనూ’లో ఈ ఏడాది నుంచి ప్రతిభ ఆధా రంగా ఫ్రెంచ్, రష్యన్ భాషల్లో ఎంఏ ఇన్ లీగల్ స్టడీస్ ప్రోగ్రామ్, కొత్త సర్టిఫికెట్ కోర్సులను కూడా ప్రవేశపెట్టారు. ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్) ప్రవేశ ఆధారిత కోర్సులు, అన్ని పీహెచ్‌డీ కోర్సులకు దరఖాస్తుకు జూన్ 1 చివరి తేదీ. ప్రతిభ ఆధారిత కోర్సుల్లో ప్రవేశాలకు చివరి తేదీ ఆగస్టు 30గా నిర్ణయించారు.
చదవండి:
UGC – HRDC: మూడోస్థానంలో ‘మనూ’
కర్నూలు ఉర్దూ యూనివర్సిటీ వీసీగా ‘మనూ’ ప్రొఫెసర్
Published date : 26 May 2022 01:00PM