8 మెడికల్ కాలేజీలు.. 1,200 సీట్లు
ఈ మేరకు ఆయన ఆక్టోబర్ 3న విలేకరుల సమావేశంలో వివరించారు. సమైక్య రాష్ట్రంలో కేవలం ఐదు ఉంటే.. కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో 12 కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఈ విద్యా సంవత్సరంలో 8 కొత్త కాలేజీలకు రూ. 4,080 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. రాష్ట్రం ఏర్పడినపుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 850 ఎంబీబీఎస్ సీట్లుంటే, ఈ విద్యా సంవత్సరంతో 2,901 సీట్లకు పెంచామన్నారు. ఈ వైద్య విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 6,540 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉంటాయని ఈ మేరకు త్వరలోనే అడ్మిషన్ల ప్రక్రియకు నోటిఫికేషన్ జారీకానుందని మంత్రి వివరించారు. అనుమ తులు రద్దయిన మంచిర్యాల మెడికల్ కాలేజీకి సంబంధించి పునరుద్ధరణ కోసం ప్రయ త్నిస్తామని ఈసారి అక్కడ అడ్మిషన్లు జరుగు తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
చదవండి: ప్రైవేటు మెడికల్ సీట్లలో రిజర్వేషన్ .. రాష్ట్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం
కేంద్రం మొండిచెయ్యి...
దేశంలో 157 మెడికల్ కాలేజీలను కేంద్రం మంజూరు చేస్తే, తెలంగాణకు ఒక్క కాలేజీ కూడా ఇవ్వలేదని హరీశ్‌రావు మండిపడ్డారు. ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వకుండా ఇచ్చామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడడం దిగజారు డు రాజకీయమన్నారు. ఇదే విషయంలో గవర్నర్ ట్వీట్ సరికాదని హరీశ్‌రావు తప్పుబట్టారు.
చదవండి: 269 Jobs: పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్.. దరఖాస్తుకు చివరి తేదీలు ఇవే..
నా వ్యాఖ్యలను వక్రీకరించారు...
ఆర్‌ఎంపీలు, పీఎంపీలకు సంబంధించి నా వ్యాఖ్యలను వక్రీకరించారని హరీశ్ రావు చెప్పారు. అనాథరైజ్డ్ ప్రాక్టీషన ర్స్ ను కట్టడి చేసేందుకు స్పెషల్ డ్రైవ్ పెట్టామని, ఇప్పటికే 2,058 ఆసుపత్రులను తనిఖీ చేశామ న్నారు. 1,300 సీజ్ చేశామని, 633 ఆసుపత్రు లకు నోటీసులు ఇచ్చామని 75 ఆసుపత్రు లకు జరిమానాలు విధించామన్నారు.’’ ఓ ఎమ్మెల్యే మా దగ్గరకు తీసుకువచ్చి ఆర్‌ఎంపీలు, పీఎంపీలపై డీఎంహెచ్‌వోలు వేధింపులకు దిగుతు న్నారని’’ చెబితే, నిబంధన లకు అనుగు ణంగా వ్యవహరించాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించామని అన్నారు. నిబంధన లకు అనుగుణంగా వ్యవహరించే వారిపై వేధింపుల కు పాల్పడవద్దని అధికారులకు చెబుతా మన్నా మే కానీ ఎక్కడా అనాథరైజ్డ్ ప్రాక్టీషనర్లకు మద్ద తు ఇచ్చినట్లు కాదని హరీశ్ స్పష్టం చేశారు.