Civil Service Incentive Scheme: సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకానికి దరఖాస్తు చేసుకోండి
అనంతపురం రూరల్: యూపీఎస్సీ ద్వారా నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆర్థికంగా అండగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని బీసీ వెల్ఫేర్ డీడీ ఖుష్బూ కొఠారి సూచించారు. సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలు ఉండాలన్నారు.
టెన్నికాయిట్ జట్ల ఎంపిక
అనంతపురం: అంతర్ జిల్లా పోటీల్లో పాల్గొనే టెన్నికాయిట్ అండర్–14 , అండర్–17 బాల, బాలికల జట్ల ఎంపిక ప్రక్రియను నవంబర్ 3న శుక్రవారం ఆర్డీటీ స్టేడియంలో నిర్వహించినట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అనంతపురం జిల్లా కార్యదర్శి బి.సుగుణమ్మ తెలిపారు. ఎంపిక పోటీల్లో 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో నాగచరిత, కృష్ణవేణి, సుప్రియ, దివ్య, దిలక్షిత, బాలాజీ, వేము చరణ్, గణేష్, యశ్వంత్, గురుస్వామి, అనుష్క, జ్యోతిక, స్పందన, పూజ, వర్ష, రాంచరణ్, లతీఫ్, మోహన్ రాజ్, చిన్ని కృష్ణ, మహిధర్ ఎంపికయ్యారు.
6, 7 తేదీల్లో క్రికెట్ జట్ల ఎంపిక
అంతర్ జిల్లా క్రికెట్ పోటీల్లో పాల్గొనే అండర్ –14, అండర్ – 17 బాల, బాలికల జట్ల ఎంపికను ఆర్డీటీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అనంతపురం జిల్లా కార్యదర్శి సుగుణమ్మ తెలిపారు. అండర్ –14 బాల, బాలికల జట్లకు ఆరో తేదీన, అండర్ –17 బాల, బాలికల జట్లకు నవంబర్ ఏడో తేదీన ఎంపిక పోటీలు ఉంటాయని పేర్కొన్నారు.