Medical Faculty: వైద్య అధ్యాపకుల ఖాళీల వివరాలనూ తక్షణమే పంపించండి
Sakshi Education
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ పరిధిలో ఉన్న వైద్య కళాశాలల్లో వసతులపై వివరాలు ఇవ్వాలని జాతీయ మెడికల్ కమిషన్ ఆయా రాష్ట్రాలను ఆదేశించింది.
వైద్య అధ్యాపకుల ఖాళీల వివరాలనూ తక్షణమే పంపించండి
ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ఎన్ ఎంసీ లేఖ రాసింది. చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొన్ని విభాగాల్లో అధ్యాపకులు లేరని, వీటి భర్తీ గురించి పట్టించుకోవడం లేదని ఎన్ ఎంసీ తప్పుపట్టింది. ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ వైద్యవిద్యార్థులకు బోధించే అధ్యాపకులకు కావాల్సిన అర్హతలు లేవని తేలిందని పేర్కొంది.అత్యవసర వైద్యపరికరాలు అవసరమున్నా వాటిని తెప్పించుకోలేకపోవడం, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, వైద్యులకు సరైన శిక్షణ లేకపోవడం తదితర విషయాలు తమ దృష్టికొచ్చాయని తెలిపింది.