ఉన్నత కేరిర్‌కు ఉపయోగపడేలా లాక్‌డౌన్ కాలంలో నేర్చుకోవాల్సిన కోర్సులు ఇవే..!
స్కూల్ నుంచి కాలేజ్ వరకూ..
ఇప్పటికే పలు డిజిటల్ వేదికలు కోడింగ్‌పై ఆన్‌లైన్ కోర్సులను అందిస్తున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో మరికొన్ని కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో కొన్నింటిని నెల రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉంది. కాబట్టి స్కూలు నుంచి కాలేజీ విద్యార్థుల వరకూ.. రెగ్యులర్ విద్యకు సమాంతరంగా పైథాన్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేజ్ వంటి కోర్సుల్లో చేరి నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు.
ఉపయోగపడే కోర్సులు...
- జావా ప్రోగ్రామింగ్
- సీ++ ప్రోగ్రామింగ్
- ఫంట్ ఎండ్ డెవలప్‌మెంట్
- ఇంట్రడక్షన్ టు పైథాన్
- మెషీన్ లెర్నింగ్
- జావా స్క్రిప్ట్
- ఫైథాన్ ఫర్ డేటా సైన్స్
- క్లౌడ్ ఫౌండేషన్
- మెషీన్ లెర్నింగ్ ఫౌండేషన్.
ఈ కోర్సులో చేరితే కోట్లిన్ ఫండమెంటల్స్, ఇంట్రస్టింగ్ యాప్‌ల రూపకల్పనా నైపుణ్యాలు అలవడతాయి. నాలుగు నుంచి ఐదు నెలల వ్యవధిలో ఉండే ఈ కోర్సులో ఆండ్రాయిడ్ కాంపోనెంట్స్, టూల్స్, టెక్నాలజీలు (మల్టీస్క్రీన్ నావిగేషన్, యాండ్రాయిడ్ స్టూడియో, ఇంటెంట్స్, ఫ్రాగ్మెంట్స్, విడ్జెట్స్, లేఅవుట్) గురించి నేర్చుకుంటారు. దీంతోపాటు..
- అడ్వాన్స్‌డ్ ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్‌మెంట్ విత్ రియాక్ట్
- ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్
- జావా ఫౌండేషన్ విత్ డేటా స్ట్రక్చర్స్
- సీ++ ఫౌండేషన్ విత్ డేటా స్ట్రక్చర్స్
- పైథాన్ ఫౌండేషన్ విత్ డేటా స్ట్రక్చర్స్ వంటి కోర్సుల్లోనూ చేరుతున్నారు.
డేటా సైన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్..
ఈ కోర్సులో గిగా బైట్స్‌లో ఉండే డేటా నుంచి అర్థవంతమైన డేటాను వేరు చేసే నైపుణ్యాలను పెంపొందిస్తారు. కోర్సు ఆసాంతం పైథాన్, మెషీన్ లెర్నింగ్, డేటా క్లీనింగ్, డేటా అనాలసిస్ అంశాల చుట్టూ తిరుగుతుంది. కోర్సు వ్యవధి ఆరు నుంచి ఎనిమిది నెలలు ఉంటుంది.
ఆండ్రాయిడ్ యాప్..
ఈ కోర్సులో పదేళ్లు నిండిన వారంతా చేరొచ్చు. ఇందులో చేరేందుకు ఎలాంటి కోడింగ్ పరిజ్ఞానం అవసరం లేదు. కోర్సు వ్యవధి 16 గంటలు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య ఆన్‌లైన్ బోధన ఉంటుంది. కోర్సులో జీపీఎస్ ఆధారిత,గేమింగ్,సెన్సార్ అండ్ కెమెరా ఆధారిత యాప్‌లకు సంబంధించిన కోడింగ్ నైపుణ్యాలు, తయారీ విధానంపై బోధన సాగుతుంది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్
ఈ కోర్సులో టాకింగ్ బోట్, చాట్ బోట్, ఇమేజ్, ఫేస్ అండ్ ఎమోషన్ రికగ్నిషన్, ఏఐ ఆధారిత గేమ్స్‌కు సంబంధించిన కోడింగ్ నైపుణ్యాలు, వాటి తయారీ విధానంపై అవగాహన కల్పిస్తారు. పదేళ్లు నిండిన వారంతా ఈ కోర్సులో చేరొచ్చు. ఇందులో చేరేందుకు ఎలాంటి కోడింగ్ పరిజ్ఞానం అవసరం లేదు. కోర్సు వ్యవధి 16 గంటలు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల మధ్య ఆన్‌లైన్ బోధన సాగుతుంది.
మూక్స్ వేదికలు
- కోర్సెరా
- ఈడీఎక్స్
- ఉడెమీ
- గిట్‌హబ్
- మిట్ ఓపెన్ కోర్స్‌వేర్
- హ్యాక్.ప్లెడ్జ్
- కోడ్ ఎవెంజర్స్
- ఖాన్ అకాడెమీ కోడింగ్ నింజాస్
- ఎస్‌పీ రోబోటిక్స్ వర్క్స్
- ఫ్యూచర్ లెర్న్.కామ్.