Skip to main content

ఉపాధి , నైపుణ్యాలను పెంచే “ఇగ్నో” ఆన్ లైన్ ప్రోగ్రాములు

-శ్రవణ్ కుమార్కందగట్ల, యం.ఎ, పి.జి.డి.ఆర్.డి, యూజిసి –నెట్, (పి.హెచ్.డి.), అకాడమిక్ కౌన్సిలర్ , ఇగ్నో , వరంగల్
1985లో పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడిన ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో)దూర విద్య ద్వారా జ్ఞాన సమాజాన్ని నిర్మించడానికి నిరంతరం కృషి చేస్తోంది. ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ (ఓడిఎల్) మోడ్ ద్వారా నాణ్యత గల బోధనను అందించడం ద్వారా మన దేశంలో స్థూల నమోదు నిష్పత్తి (జిఇఆర్)ను పెంచడానికి నిరంతరం ప్రయత్నిస్తుంది. 21 స్కూల్స్ ఆఫ్ స్టడీస్ మరియు 67 ప్రాంతీయ కేంద్రాల నెట్‌వర్క్ 2,667 అభ్యాస సహాయక/అద్యయనకేంద్రాలు మరియు 29 విదేశీ భాగస్వామి సంస్థల ద్వారా ఇండియా మరియు ఇతర దేశాలలో 3 మిలియన్ల మంది విద్యార్థుల విద్యా ఆకాంక్షలకుఅనుగుణంగా దూర విద్య సేవలుఅందిస్తుంది. ఇగ్నో సర్టిఫికేట్, డిప్లొమా, పోస్ట్ డిప్లొమా,డిగ్రీ, మాస్టర్స్ మరియు డాక్టోరల్ ప్రోగ్రామ్‌లను ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ మరియు ఆన్ లైన్ విధానంలో కలిపి సుమారు 241ప్రోగ్రాములను అందిస్తుంది, సమాజంలోని అన్ని రకాల వర్గాలకు ఉన్నత విద్యనివివిధ స్థాయిలలో అవసరమైన వారందరికీ అందించడం, సరసమైన ఖర్చుతో దేశంలోని అన్ని ప్రాంతాలలో ప్రోగ్రాములను అందించడం ద్వారా వెనుకబడినవారికి దూర విద్యని అందించడం, దేశంలో సార్వత్రిక దూరవిద్య ద్వారా అందించే విద్యా ప్రమాణాలను ప్రోత్సహించడం, సమన్వయం చేయడం మరియు నియంత్రించడం.ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ కోసం నేషనల్ రిసోర్స్ సెంటర్, అంతర్జాతీయ గుర్తింపు మరియు ఉనికితో, వినూత్న సాంకేతిక పరిజ్ఞానాలు మరియు పద్దతులను ఉపయోగించడం ద్వారా మరియు అందరికీ సుస్థిర మరియు అభ్యాస-కేంద్రీకృత నాణ్యమైన విద్య, నైపుణ్యాలు పెంపొందించడం మరియు శిక్షణ ఇవ్వడానికి కృషి చేస్తోంది.విశ్వవిద్యాలయం అందించే విద్యావకాశాలను పెంపొందించడానికి ప్రఖ్యాత ప్రభుత్వ సంస్థలు మరియు ప్రైవేట్ సంస్థలతో కలిసి పని చేస్తుంది. దూర విద్యలో ప్రపంచ స్థాయీ ప్రమాణాలను పాటిస్తూ, కెనడాలోని కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (COL) చేత అనేకసార్లు ఎక్సలెన్స్ అవార్డులను కైవసం చేసుకున్న ప్రపంచంలో అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇగ్నో.

సెంటర్ ఫర్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ (COE) ఏర్పాటు చేసి సెంటర్ ఫర్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అభ్యాసన అనుభవాలు మరియు సహాయక సేవలతో డిజిటల్ అభ్యాసంలో ఇగ్నోను ప్రపంచంలో అత్యున్నత స్థానంలో ఉంచటానికి ప్రయత్నిస్తుంది. ఎవరికైనా, ఎప్పుడైనా మరియు ఎక్కడైనా వర్చువల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ద్వారా నాణ్యమైన విద్యను అందించడానికి దేశం యొక్క డిజిటల్ కార్యక్రమాలతో సమన్వయం చేయడమే దీని ప్రధాన లక్యం. ఆన్‌లైన్ లేదా వర్చువల్ లెర్నింగ్ విభాగంలో పనిచేసే ఇతర సంస్థలతో పరిశోధన మరియు నెట్‌వర్కింగ్ ద్వారా అభ్యాస సాంకేతికతలను నిరంతరం నవీకరించడానికి కృషి చేస్తుంది. నైపుణ్య మెరుగుదల, వ్యక్తిత్వ వృద్ధి, ఉద్యోగ సంసిద్ధత, జీవితకాలం నేర్చుకోవటంవంటి ప్రధానమైన లక్ష్యాలతో ఇగ్నో ఆన్ లైన్ ప్రోగ్రాములను కొత్తగా అందిస్తోంది, ముఖ్యంగా గిరిజనుల అభివృద్ధి సమస్యలను, గాంధీ సంఘర్షణల మార్గాలను వీడి శాంతి, అహింస మార్గాలను వ్యాప్తి చేయటానికి ,పర్యాటక రంగంలో ప్రావీణ్యం, ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం సర్టిఫికేట్, డిప్లొమా, డిగ్రీ ప్రోగాములు, లైబ్రరీ, ఇన్ఫర్మాటిక్స్ రంగాలతో పాటు మరియు అరబిక్, రష్యన్ వంటి విదేశీ భాషలు అలవోకగా నేర్చుకొని విదేశాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రోగ్రాంలతో పాటుగా, మన దేశంలో అత్యధికంగా మాట్లాడే భాష మరియు అన్ని రంగాల్లో ముఖ్యంగా అధ్యాపక రంగంలో కీలక పాత్ర వహించే హిందీ కోసం మాస్టర్ అఫ్ ఆర్ట్స్ ఇన్ హిందీని కూడా అందిస్తోంది.

అవి
 • సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ట్రైబల్ స్టడీస్ (సిటిఆర్బిఎస్)
  అర్హత :
  ఇంటర్మీడియట్ లేదా తత్సమానం
  వ్యవధి : ఆరు నెలలు
  మాధ్యమం: ఇంగ్లీష్
 • పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ గాంధీ అండ్ పీస్ స్టడీస్ (పిజిడిజిపిఎస్)
  అర్హత : ఏదైనా డిగ్రీ
  వ్యవధి : ఒక సంవత్సరం
  మాధ్యమం: ఇంగ్లీష్
 • పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్గాంధీ అండ్ పీస్ స్టడీస్ (పిజిసిజిపిఎస్)
  అర్హత :
  ఏదైనా డిగ్రీ
  వ్యవధి : ఆరు నెలలు
  మాధ్యమం: ఇంగ్లీష్
 • సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ పీస్ స్టడీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ (సిపిఎస్‌సిఎం)
  అర్హత :
  ఇంటర్మీడియట్
  వ్యవధి : ఆరు నెలలు
  మాధ్యమం: ఇంగ్లీష్
 • డిప్లొమా ఇన్ టూరిజం స్టడీస్ (డిటిఎస్)
  అర్హత :
  ఇంటర్మీడియట్ లేదా తత్సమానం/బిపిపి-ఇగ్నో
  వ్యవధి : ఒక సంవత్సరం
  మాధ్యమం: ఇంగ్లీష్/ హిందీ
 • ఎంఏ ఇన్ ట్రాన్స్ లేషన్ స్టడీస్ (ఎంఏ టి యస్)
  అర్హత :
  ఏదైనా డిగ్రీ
  వ్యవధి : రెండుసంవత్సరాలు
  మాధ్యమం: హిందీ
 • మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (హిందీ) (ఎంఏహెచ్)
  అర్హత :
  ఏదైనా డిగ్రీ
  వ్యవధి : రెండుసంవత్సరాలు
  మాధ్యమం: హిందీ
 • ఎంఏ ఇన్ గాంధీ అండ్ పీస్ స్టడీస్ (ఎంజిపిఎస్)
  అర్హత :
  ఏదైనా డిగ్రీ
  వ్యవధి : రెండుసంవత్సరాలు
  మాధ్యమం: ఇంగ్లీష్/ హిందీ
 • బ్యాచిలర్ ఆఫ్ టూరిజం (బిటియస్)
  అర్హత :
  ఇంటర్మీడియట్ లేదా తత్సమానం/బిపిపి-ఇగ్నో
  వ్యవధి : 3 సంవత్సరాలు
  మాధ్యమం: ఇంగ్లీష్/ హిందీ
 • సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (సియల్ఐయస్)
  అర్హత :
  ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత/బిపిపి-ఇగ్నో
  కాల వ్యవధి : ఆరు నెలలు
  మాధ్యమం: ఇంగ్లీష్
 • సర్టిఫికేట్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సిఐటి)
  అర్హత :
  పదవ తరగతి/బిపిపి-ఇగ్నో
  వ్యవధి : ఆరు నెలలు
  మాధ్యమం: ఇంగ్లీష్
 • సర్టిఫికేట్ ఇన్ టూరిజం స్టడీస్ (సిటిఎస్)
  అర్హత :
  ఇంటర్మీడియట్ లేదా తత్సమానం
  వ్యవధి : ఆరు నెలలు
  మాధ్యమం: ఇంగ్లీష్
 • సర్టిఫికేట్ ఇన్ అరబిక్ లాంగ్వేజ్ (సి ఏ యల్)
  అర్హత :
  ఇంటర్మీడియట్ లేదా 18 ఏళ్ళు నిండిన వాళ్ళు
  వ్యవధి : ఆరు నెలలు
  మాధ్యమం: ఇంగ్లీష్/అరబిక్
 • సర్టిఫికేట్ రష్యన్ లాంగ్వేజ్ (సిఆర్ యు యల్)
  అర్హత :
  18 ఏళ్ళు నిండిన వాళ్ళు లేదా కనీస ఇంగ్లీష్ పరిజ్ఞానం
  వ్యవధి : 6 నెలలు
  మాధ్యమం: ఇంగ్లీష్/ రష్యన్

ఈ అన్ లైన్ ప్రోగ్రాములు ఆన్ లైన్ విధానంలో అభ్యర్ధులకు అందించబడతాయి. డిజిటల్ రిసోర్సెస్ , వెబ్ బేస్డ్ రేడియో, టి.వి, ఇగ్నో లైబ్రరీ కాకుండా ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సామజిక మాధ్యమాల ద్వారా కూడా అభ్యర్ధులకు కౌన్సిలింగ్ తరగతులుమరియు సమాచారాన్ని అందిస్తారు, అభ్యర్ధులు ఆన్ లైన్ లోనే క్లాసులు విని అసైన్మెంట్స్ సబ్మిట్ చేయాలి వార్షిక లేదా సెమిస్టర్ పరీక్షల నిర్వహణ కుడా ఆన్ లైన్ లోనే ఉంటుంది.

ఆన్ లైన్ ప్రోగ్రాములలో ప్రవేశాలు తీసుకోవటానికి ఆసక్తిగా ఉన్నవారు https://iop.ignouonline.ac.in వెబ్ సైట్ ద్వారా ప్రవేశాలు తీసుకోవాలి coe@ignou.ac.in మెయిల్ లో గానీ, 011-2957-2322 ఫోన్ నెంబర్ లో సంప్రదించగలరు. ఈ ఆన్ లైన్ ప్రోగ్రాములకు సంభందించిన స్టూడెంట్ సపోర్ట్ సేవలు సోమవారం నుండి శుక్ర వారం వరకు అందుబాటులో ఉంటాయి శని, ఆదివారాలు సెలవు.

అభ్యర్ధులు మరిన్ని వివరాలకు ఇగ్నో ప్రధాన వెబ్ సైట్ http://ignou.ac.in ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చులేదా తెలుగు రాష్ట్రాల్లో దగ్గరలో ఉన్న అధ్యయన కేంద్రాల్లో సమాచారం పొందవచ్చు.
Published date : 18 Jun 2020 12:53PM

Photo Stories