Skip to main content

లెర్న్ సోషల్ ... ఆన్‌లైన్‌లో వృత్తి విద్యా కోర్సులు

ఆన్‌లైన్‌లో వృత్తి విద్యాపరమైన కోర్సుల వైపు యువతరం మొగ్గు చూపుతోంది.
ఆన్‌లైన్‌లో వృత్తి విద్యాపరమైన కోర్సుల వైపు యువతరం మొగ్గు చూపుతోంది. తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకోవాలన్న యువత దృక్ఫథానికి అనుగుణంగా ఆన్‌లైన్‌లో వృత్తిపరమైన కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. తద్వారా నైపుణ్యాలను పెంపొందించుకోవడంతోపాటు, డబ్బు, సమయం ఆదా చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌కు దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్ కోర్సులకు గిరాకీ పెరిగింది. ఆగ్నేయాసియా దేశాలలో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ కోర్సులు అందించే వెబ్‌సైట్లు ఇప్పటిదాకా అందుబాటులో లేవు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్ ద్వారా పాఠాలు నేర్పాలన్న లక్ష్యంతో ‘లెర్న్ సోషల్’ కృషి చేస్తోంది. ఏ కోర్సు కావాలన్నా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తూ, వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ‘లెర్న్ సోషల్’ గురించి విశేషాలు తెలుసుకుందాం..

ఏయే కోర్సులుంటాయి?
లెర్న్ సోషల్ ద్వారా ప్రస్తుతం పలు రకాల కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఆన్‌లైన్, లైవ్ కోర్సులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. రానున్న కాలంలో అకడమిక్, లాంగ్వేజెస్, టెస్ట్ ప్రిపరేషన్ విభాగాల్లోనూ రానున్నాయి.

లెర్న్ సోషల్ అంటే?
ఆన్‌లైన్ ద్వారా వృత్తి విద్యాపరమైన కోర్సులు అభ్యసించే విధానమే ‘లెర్న్ సోషల్’. ప్రస్తుతం ఉన్న ఈ-లెర్నింగ్ పోర్టళ్లకు భిన్నంగా ఇందులో కోర్సులను అందుబాటులో ఉంచుతున్నారు. సమయానుకూలంగా వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకొనేందుకు ఆన్‌లైన్ కోర్సులు నేర్చుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం విశేషం. భవిష్యత్తులో లెర్న్ సోషల్ సేవలు విస్తృతమవుతాయని ఈ రంగంలోని నిపుణులు పేర్కొంటున్నారు. పుస్తకాలు, పాఠశాలల్లో నేర్చుకొనే విధానానికీ, ఆన్‌లైన్‌లో నేర్చుకోవడానికీ వ్యత్యాసం ఉంటుంది. ఆన్‌లైన్‌లోనైతే ఒత్తిడి లేకుండా ఆసక్తికరంగా పాఠాలు బోధిస్తారని చెబుతున్నారు. సులభంగా అర్థమయ్యే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

అవకాశాలు ఇలా..
త్వరలోనే మరికొన్ని ఉచిత, పెయిడ్ లైవ్, వీడియో కోర్సులు అందుబాటులోకి తేనున్నారు. తద్వారా యూజర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్ కోర్సులను అంతర్జాతీయంగా చాలా మంది ప్రొఫెషనల్స్, ఇన్‌స్ట్రక్టర్ల ద్వారా అందిస్తున్నారు. పలు రకాల వీడియోలు సేకరించి అందుబాటులో ఉంచుతున్నారు. తీరిక సమయాల్లో వినియోగదారులు వీటిని చూడొచ్చు. ప్రస్తుతం మూడు నుంచి ఐదు వారాల నిడివి ఉన్న కోర్సులను ప్రవేశపెట్టారు. వీటికి రూ.5వేల నుంచి రూ.20 వేల వరకు ఫీజు ఉంటుంది. దీనికి సంబంధించిన లెర్న్ సోషల్ మొబైల్ యాప్‌ని త్వరలోనే విడుదల చేయనున్నారు. ఇందులో పారిశ్రామిక రంగ నిపుణులు, అనుభవజ్ఞులైన మేధావులు పాల్గొంటారు.

మారిన ట్రెండ్..
ఒకప్పుడు మొబైల్ నుంచి మరొకరికి సందేశం పంపాలంటే చాలా ఖర్చుతో కూడుకొనేది. ఎస్‌ఎంఎస్, కాల్ చార్జ్, ఇంటర్నెట్ చార్జ్.. ఇలా ఏదైనా పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించాల్సి వచ్చేది. ప్రస్తుతం ఈ-మెయిల్, ఫేస్‌బుక్, ట్వీటర్, వాట్సాప్‌ల ద్వారా శ్రమ తగ్గుతోంది. 4జీ సేవలతో ఇవి మరింత విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో వృత్తిపరమైన పాఠాలు బోధించేందుకు ప్రాధాన్యం పెరిగింది. ట్రెండ్‌కు అనుగుణంగా వీటిని ఫాలో అయ్యే వినియోగదారుల సంఖ్యా పెరిగింది. దీంతో అంతర్జాతీయంగా వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటోంది.

ఇప్పటి వరకు ఉన్న కోర్సులివే..
 1. హెచ్‌టీఎంఎల్-5
 2. డేటా అనాలసిస్ విత్ ఆర్
 3. డిజిటల్ మార్కెటింగ్
 4. స్పోకెన్ ఇంగ్లిష్
 5. అడ్వాన్స్‌డ్ స్పోకెన్ ఇంగ్లిష్
 6. అడ్వాన్స్‌డ్ ఎక్సెల్ కోర్సు
 7. బిగ్ డేటా హడూప్ డెవలప్‌మెంట్
 8. మోంగో డీబీ అడ్మినిస్ట్రేషన్
 9. ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్
 10. ఐఓఎస్ డెవలప్‌మెంట్
 11. వెబ్ డిజైనింగ్ (ఫొటోషాప్ హెచ్‌టీఎంఎల్ విత్ సీఎస్‌ఎస్)
 12. బిజినెస్ రైటింగ్ స్కిల్స్
 13. నెక్స్-జెన్ రోబోటిక్స్
 14. పీహెచ్‌పీ, మిక్సిల్ విత్ అజాక్స్
 15. ఎథికల్ హ్యాకింగ్
 16. హడూప్ అడ్మినిస్ట్రేషన్
 17. పీఎంపీ ఎగ్జామ్ ప్రిపరేషన్, (ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్)
 18. మాహౌట్
 19. బీ యూజింగ్ టేబుల్ ఏయూ, ఎంఎస్ యాక్సెస్
 20. ఇన్ఫర్మాటికా
 21. పైతాన్ ఫర్ డేటా అనాలసిస్
 22. అపాచి కసాండ్రా
 23. నోడ్ జేఎస్
Published date : 28 Jan 2015 02:53PM

Photo Stories