ఉన్నత విద్యకు‘విదేశీ’ ఉపకారం
Sakshi Education
ఉన్నత విద్య ఎక్కడైనా ఖర్చుతో కూడుకున్నదే... అదే విదేశాల్లోనైతే ఇక చెప్పేదేముంది. దరఖాస్తు ప్రక్రియ నుంచి ఆశించిన ఇన్‌స్టిట్యూట్‌లో అడుగు పెట్టింది మొదలు కోర్సు కాలంలో ఉండే ఫీజులు, ఇతరత్రా అవసరాల ఖర్చు లక్షల్లోనే. అయితే అకడమిక్ ప్రతిభ, నిర్దేశిత అర్హతలు ఉంటే స్టడీ అబ్రాడ్ స్కాలర్‌షిప్స్ సహాయంతో తక్కువ ఖర్చుతోనే ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. అమెరికా నుంచి సింగపూర్ వరకు అన్ని దేశాలు అంతర్జాతీయ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ /ఫెలోషిప్స్ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటి వివరాలపై స్పెషల్ ఫోకస్...
‘డూ’స్
‘డోన్ట్’స్
ఫుల్‌బ్రైట్ నెహ్రూ స్కాలర్‌షిప్స్
అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ఫుల్‌బ్రైట్ నెహ్రూ మాస్టర్ ఫెలోషిప్స్ అందిస్తున్నారు. ఆర్ట్స్, కల్చర్, మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, పబ్లిక్ హెల్త్, అర్బన్ అండ్ రీజనల్ ప్లానింగ్, ఉమెన్/ జండర్ స్టడీస్ విభాగాల్లోని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్స్‌కి ఎంపికైన అభ్యర్థులకు ట్యూషన్, ఇతర అకడమిక్ ఫీజుల మొత్తం స్కాలర్‌షిప్ ద్వారా లభిస్తుంది.
అర్హత: (ఫెలోషిప్)గుర్తించిన కోర్సుల్లో 55 శాతం మార్కులతో నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. బ్యాచిలర్ డిగ్రీ వ్యవధి నాలుగేళ్లకంటే తక్కువగా ఉంటే తప్పనిసరిగా సంబంధిత రంగంలో మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
వివరాలకు వెబ్‌సైట్: www.usief.org
చార్లెస్ వాలేస్ ఇండియూ ట్రస్ట్ ఫెలోషిప్స్
కళలు, సాహిత్యం, జర్నలిజం, అకెడమిక్స్‌కు సంబంధించి విదేశాల్లో రీసెర్చ్ చేయూలనుకునే వారికి చక్కని తోడ్పాటు ‘చార్లెస్ వాలేస్ ఇండియూ ట్రస్ట్ ఫెలోషిప్స్’. ముఖ్యంగా వారసత్వ సంపద, టెక్స్‌టైల్స్, పేపర్, ఫొటోగ్రాఫ్స్, మ్యూజియమ్స్ తదితర విభాగాల్లో పరిశోధన చేసే వారికి ఫీజు మొదలు ఇతర అన్ని ఖర్చులను స్కాలర్‌షిప్ ద్వారా అందిస్తారు. మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో హిస్టరీ, లిటరేచర్ ఆర్కియూలజీ, ఫిలాసఫీ, పెర్ఫార్మింగ్ అండ్ క్రియేటివ్ ఆర్ట్స్‌లో అధ్యయనం చేయూలనుకునే వారికి ‘గ్రాంట్స్ ఫర్ షార్ట్ అకెడమిక్ స్టడీస్’ పేరుతో 1000 పౌండ్ల స్కాలర్‌షిప్ లభిస్తుంది.
వివరాలకు వెబ్‌సైట్: www.britishcouncil.org/
ఆస్ట్రేలియన్ ఎండీవర్ స్కాలర్‌షిప్స్
ఆస్ట్రేలియూలో పరిశోధన, వృత్తి విద్యా విభాగాల్లో అధ్యయనం చేసే వారికి ఈ స్కాలర్‌షిప్స్ ఎంతగానో సహాయపడతాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ లేదా రీసెర్చ్‌కు సంబంధించి సోషల్ వర్క్ విభాగాల విద్యార్థులకు స్కాలర్‌షిప్ మంజూరులో ప్రాధాన్యం ఇస్తారు. ప్రొఫెషనల్ డవలప్‌మెంట్- ఎగ్జిక్యూటివ్ అవార్డ్స్ పేరుతో ఉద్యోగులకు కూడా అవకాశం ఉంటుంది. ఈ విభాగంలో స్కాలర్‌షిప్స్ పొందాలంటే.. అండర్ గ్రాడ్యుయేట్లకు 10 సంవత్సరాలు, గ్రాడ్యుయేట్లకు ఐదేళ్ల పని అనుభవం తప్పనిసరి. వృత్తి విద్య విభాగంలో.. ఆస్ట్రేలియూ యూనివర్సిటీల్లో ఆర్ట్స్, సంస్కృతి, పర్యావరణం, హెల్త్‌కేర్ అంశాల్లో చదవాల నుకునే వారికి స్కాలర్‌షిప్‌లు అందిస్తారు.
వివరాలకు వెబ్‌సైట్: www.internationaleducation.gov.au, endeavour.education.gov.au
డీఏఏడీ (DAAD) స్కాలర్‌షిప్స్
ఈ స్కాలర్‌షిప్‌లను జర్మన్ అకడెమిక్ ఎక్స్ఛేంజ్ సర్వీస్ అందిస్తోంది. డాక్టోరల్ స్టడీస్ అభ్యర్థులు, పీహెచ్‌డీ రిజిస్టర్డ్ స్కాలర్స్‌కి ఫెలోషిప్స్, పీహెచ్‌డీ స్కాలర్స్‌కు శాండ్‌విచ్ మోడల్ ఫెలోషిప్స్ అందిస్తారు. వీటితోపాటు కొన్ని నిర్దేశిత పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల విద్యార్థులకు కూడా వీటిని అందిస్తారు. ట్యూషన్ ఫీజు, తదితర ఖర్చులు స్కాలర్‌షిప్ లభిస్తుంది.
వెబ్‌సైట్: newdelhi.daad.de
టోఫెల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా
ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్‌లో ప్రసిద్ధి చెందిన టోఫెల్ నిర్వహణ సంస్థ భారత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రవేశ పెట్టిన స్కాలర్‌షిప్ పథకం.. ‘టోఫెల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా’. ప్రత్యేకంగా టోఫెల్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విదేశాల్లో గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదవాలనుకునే విద్యార్థుల కోసం ఉద్దేశించిన ప్రోగ్రాం ఇది. అకడమిక్ స్థాయిలో 80 లేదా అంతకుమించి జీపీఏ పొందిన అభ్యర్థులు ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తుకు చేసుకోవచ్చు. అడ్మిషన్ పొందాలనుకున్న ఇన్‌స్టిట్యూట్/యూనివర్సిటీ నిర్దేశించిన టోఫెల్ స్కోర్‌ను పొందాలి. ఎంపిక విధానం రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా వంద మందిని సెమీ ఫైనల్ దశకు ఎంపిక చేస్తారు. ఈ సెమీఫైనల్‌లో ఆయా అంశాల్లో (కమ్యూనికేషన్, లీడర్‌షిప్ స్కిల్స్, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఇన్నోవేటివ్ ఐడియాస్) చూపిన ప్రతిభ ఆధారంగా పది మందిని విజేతలుగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడు వేల డాలర్ల స్కాలర్‌షిప్ అందిస్తారు.
వివరాలకు వెబ్‌సైట్: www.ets.org
ఏషియన్ డవలప్‌మెంట్ బ్యాంక్ - జపాన్ స్కాలర్‌షిప్
ఏషియన్ డవలప్‌మెంట్ బ్యాంక్ సభ్యదేశాల్లోని విద్యార్థులు విదేశాల్లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులు చదివేందుకు ఆర్థిక చేయూతనందించడమే ఈ స్కాలర్‌షిప్ స్కీం ప్రధానోద్దేశం. జపాన్ ప్రభుత్వ సహకారంతో 1988లో దీన్ని ప్రారంభించారు. ఆయూ దేశాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి అవసరమైన అకెడమిక్ అర్హతలు .. కనీసం రెండేళ్ల పని అనుభవం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కచ్చితంగా స్వదేశంలో నివసిస్తుండాలనే నిబంధన ఉంది. ఈ స్కాలర్‌షిప్ కోసం గరిష్టంగా రెండుసార్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. ఎకనామిక్స్, కామర్స్, ఇంటర్నేషనల్ బిజినెస్, ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్, ఇంటర్నేషనల్ పబ్లిక్ హెల్త్, ఇంజనీరింగ్ విభాగాల్లో పీజీ ఔత్సాహికులకు స్కాలర్‌షిప్‌ను అందిస్తారు. దీని కింద ట్యూషన్‌ఫీజు, వసతి ఖర్చులు, విమాన ఛార్జీల మొత్తానికి స్కాలర్‌షిప్ అందుతుంది.
వివరాలకు వెబ్‌సైట్: www.adb.org/JSP/default.asp
స్వీడిష్ ఇన్‌స్టిట్యూట్ ఫెలోషిప్స్
స్వీడన్ ఇన్‌స్టిట్యూట్‌లలో పీజీ, డాక్టోరల్, పోస్ట్ డాక్టోరల్ కోర్సులు అభ్యసించాలనుకునే విద్యార్థులకు స్వీడిష్ ఇన్ స్టిట్యూట్ ఫెలోషిప్స్ లభిస్తాయి. ఆర్ట్స్, హ్యుమానిటీస్, సైన్స్ తదితర అన్ని విభాగాలకు వర్తిస్తాయి. పీజీ స్థాయిలో దాదాపు 200కుపైగా స్కాలర్‌షిప్స్ లభిస్తాయి. దీంతో పాటు కొన్ని ఎంపిక చేసిన కోర్సుల్లో షార్ట్ టర్మ్ ఫెలోషిప్స్ పేరుతో దాదాపు వంద మంది విదేశీ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందిస్తారు. ప్రతి ఏటా దాదాపు నాలుగు వందల స్కాలర్‌షిప్స్/ ఫెలోషిప్స్ అందుబాటులో ఉంటాయి. పీజీ అభ్యర్థులకు నెలకు ఎనిమిదివేల స్వీడిష్ క్రోనాలు, పీహెచ్‌డీ అభ్యర్థులకు 12 వేల స్వీడిష్ క్రోనాలు లభిస్తాయి.
వెబ్‌సైట్: www.studyinsweden.se
కేంద్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్స్
విదేశీ విద్య ఔత్సాహికులను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ పలు దేశాలతో ఒప్పందాలు చేసుకుని కొన్ని స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. వాటి వివరాలు..
కామన్వెల్త్ స్కాలర్‌షిప్స్- యూకే
యూకేలో మెడిసిన్, క్యాన్సర్ రీసెర్చ్, కార్డియూలజీ, గైనకాలజీ, డెంటిస్ట్రీ విభాగాల్లో పీజీ, పీహెచ్‌డీ చేసేవారికి.. ఇంజనీరింగ్, సైన్స్, వ్యవసాయం అనుబంధ శాస్త్రాలు, హ్యుమానిటీస్, సోషల్‌సైన్స్ ఔత్సాహికులకు ఈ స్కాలర్‌షిప్‌లు మంజూరు చేస్తారు. పీజీ విద్యార్థులకు ఏడాదిపాటు, పీహెచ్‌డీ చేసేవారికి మూడేళ్లు ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తారు. ట్యూషన్ ఫీజు, విమాన ఛార్జీలు, వసతి ఖర్చులకు మొత్తాన్ని విద్యార్థులకు అందిస్తారు. దరఖాస్తుకు మెడిసిన్, ఇంజనీరింగ్, సైన్స్ అండ్ అగ్రికల్చరల్ విభాగాల్లో 60 శాతం... హ్యుమానిటీస్, సోషల్ సైన్స్ విభాగాల్లో 55 శాతం ఉత్తీర్ణత తప్పనిసరి.
వెబ్‌సైట్: cscuk.dfid.gov.uk
హెచ్‌ఆర్‌డీ స్కాలర్‌షిప్స్- చైనా
చైనాలో ఫైన్ ఆర్ట్స్, బాటనీ, పర్యావరణ శాస్త్రం, ప్లాంట్ బ్రీడింగ్, జెనెటిక్స్, పొలిటికల్ సైన్స్, సెరీకల్చర్ అండ్ ఆగ్రానమీ సబ్జెక్టుల్లో పరిశోధనలు చేసే భారతీయ విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్స్ అందుబాటులో ఉంటాయి. సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ స్థాయిలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తుకు అర్హులు. ఒకటి నుంచి నాలుగు సంవత్సరాల కాలపరిమితితో వీటిని మంజూరు చేస్తారు. ట్యూషన్‌ఫీజు, ఇతర బోధన ఫీజులతోపాటు వసతి ఖర్చులు, విమాన ఛార్జీలు అందజేస్తారు. ఈ స్కాలర్‌షిప్‌లను చైనా, భారత ప్రభుత్వాలు సంయుక్తంగా అందిస్తున్నాయి.
వెబ్‌సైట్: www.csc.edu.cn/laihua ; www.campuschina.org
దరఖాస్తు ప్రక్రియలో జాగ్రత్తగా
స్టడీ అబ్రాడ్ ఔత్సాహికులు దరఖాస్తు ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అభ్యర్థులు సిద్ధం చేసుకోవాల్సిన డాక్యుమెంట్లు..

- అకడమిక్ సర్టిఫికెట్లు
- అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్
- కరిక్యులమ్ వీటే/ రెజ్యుమే
- శాట్/జీఆర్‌ఈ/జీమ్యాట్/టోఫెల్/ ఐఈఎల్‌టీఎస్ స్కోర్లు
- ఎస్సేలు
- స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్
- రిఫరెన్స్ లెటర్స్ కవరింగ్ లెటర్
‘డూ’స్
- ముందుగా మీ అర్హతను పరిశీలించుకోండి
- అన్ని రకాల డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి
- ఇంటర్వ్యూలకు ముందు నుంచే సన్నద్ధం కావాలి
- ఆయా స్కాలర్‌షిప్‌ల ముఖ్య తేదీలపై నిరంతరం సమాచారం తెలుసుకోవాలి.
‘డోన్ట్’స్
- స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్/ఎస్సే రైటింగ్‌లో తప్పులు / అక్షర దోషాలు
- ముందస్తు అనుమతి లేకుండా రిఫరెన్స్ పేర్లు వెల్లడించొద్దు.
- ఒకట్రెండు స్కాలర్‌షిప్ ప్రోగ్రాంలకే పరిమితం కావద్దు. (అర్హతలకు అనుగుణంగా వీలైనంత ఎక్కువ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు చేసుకోవాలి).
ఒకే సమయంలో కోర్సు, స్కాలర్‌షిప్ అన్వేషణ స్టడీ అబ్రాడ్ ఔత్సాహికులకు ఇప్పుడు అంతర్జాతీయంగా ఎన్నో స్కాలర్‌షిప్/ఫెలోషిప్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు కోర్సు /ఇన్‌స్టిట్యూట్ / దేశం అన్వేషణ ప్రారంభించినప్పటి నుంచే స్కాలర్‌షిప్ అవకాశాల గురించి తెలుసుకోవడం మంచిది. దీనివల్ల అవసరమైన అర్హతలు, ఇతర అంశాలపై ముందుగానే అవగాహన కలుగుతుంది. యూఎస్‌లో స్కాలర్‌షిప్స్ అవకాశాల గురించి యూఎస్‌ఐఈఎఫ్ (యూఎస్ కాన్సులేట్ ఆఫీస్, హైదరాబాద్) నుంచి సమాచారం తెలుసుకోవచ్చు. - తనుష్క బాలి, యూఎస్‌ఐఈఎఫ్ ఎడ్యుకేషనల్ ఎడ్వయిజర్ |
స్టాండర్డ్ టెస్ట్ స్కోర్స్‌తో మరింత ప్రయోజనం విదేశీ స్కాలర్‌షిప్స్ ఔత్సాహిక అభ్యర్థులు చేరదలచుకున్న కోర్సు విభాగం ఆధారంగా సంబంధిత స్టాండర్డ్ టెస్ట్స్‌లో మంచి స్కోరు సాధించాలి. ఉదాహరణకు స్టెమ్ విభాగం ఔత్సాహికులు జీఆర్‌ఈ/ జీమ్యాట్ వంటి వాటిలో మంచి స్కోరు పొందడం లాభిస్తుంది. అదే విధంగా లాంగ్వేజ్ టెస్ట్‌ల(ఐఈఎల్‌టీఎస్ / టోఫెల్)లో మంచి స్కోర్లు సాధించడం అవసరం. స్కాలర్‌షిప్ దరఖాస్తు చేసేటప్పుడు స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్, ఎస్సే రైటింగ్‌లలో కచ్చితత్వం ఉండేలా చూసుకోవాలి. చాలా మందికి అకడమిక్ అర్హతలు, టెస్ట్ స్కోర్లు బాగున్నా.. చిన్న,చిన్న పొరపాట్ల వల్ల చివరలో అవకాశం చేజార్చుకుంటున్నారు. - సోను హేమాని, సీనియర్ మేనేజర్, ఎడ్యుకేషన్ యూకే, సౌత్ ఇండియా. |
Published date : 11 Sep 2015 01:14PM