స్పోర్ట్స్ సైకాజిస్ట్ అవ్వండిలా..!
Sakshi Education
క్రీడలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత ప్రాధాన్యం ఉందో తెలిసిందే. ఒక్కో దేశంలో ఒక్కో క్రీడకు గుర్తింపు ఉంటుంది.
క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, కబడ్డీ.. తదితర క్రీడల్లో ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు. వారికి తమతమ క్రీడల్లో ఎలాంటి నైపుణ్యాలు అవసరమో, ఎక్కడ వెనుకబడ్డారో గుర్తించి శిక్షణనిచ్చేందుకు కోచ్‌లు ఉంటాయి. క్రీడల్లో పాల్గొనే వారు అధిక ఒత్తిడికి గురవుతుంటారు. క్రీడాకారుల మానసిక స్థితిని అంచనా వేసి.. ఎలాంటి పరిస్థితుల్లోనూ వారు వెనుకంజవేయకుండా చూసేందుకు ఒకరు ఉంటారు.. అతనే స్పోర్ట్స్ సైకాలజిస్ట్!! వీరి సేవలను విదేశాల్లో ఎప్పటి నుంచే వినియోగిస్తున్నా.. మన దేశంలో ఇటీవల కాలంలో స్పోర్ట్స్ సైకాలజిస్టులకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో.. స్పోర్ట్స్ సైకాలజీకి పెరుగుతున్న ప్రాధాన్యం, అందుబాటులో ఉన్న కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం...
క్రీడలకు ప్రాధాన్యం :
మన దేశంలో క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతోంది. క్రికెట్ పట్ల దేశంలో క్రేజ్ అంతా ఇంతాకాదు. జాతీయ స్థాయి టీమ్‌లో ఆడే క్రికెటర్లకు కోట్లమంది అభిమానులు ఉంటారు. ఇక హాకీ, బ్యాడ్మింటన్, టెన్నిస్ వంటి క్రీడలను సైతం లక్షల మంది అభిమానులు వీక్షిస్తుంటారు.
స్పోర్ట్స్ సైకాలజిస్ట్‌ల పని..
క్రీడాకారులకు మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆ ఒత్తిడి తగ్గించి, వారు సరైన వ్యాయామాలు చేసేందుకు దోహదపడుతుంది ‘స్పోర్ట్స్ సైకాలజీ’. ఇందులో భాగంగా క్రీడాకారులు చేసే వ్యాయామాలు మనసును, శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో అధ్యయనం చేస్తారు. క్రీడాకారులు మైదానంలోకి రాకముందే ఒత్తిడికి లోనవుతుంటారు. ఓడిపోయినప్పుడు తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. ఇలాంటి వారిని తిరిగి సాధారణ స్థితికి తెచ్చి.. మళ్లీ పోటీలో నిలిచేలా చేసే వారే.. స్పోర్ట్స్ సైకాలజిస్టులు. వీరు క్రీడాకారుల మానసిక స్థితిని విశ్లేషించి.. పునరుత్తేజంతో తిరిగి పోటీకి సిద్ధమయ్యేలా విశ్వాసం నింపుతారు. ఆటగాళ్ల ఆందోళన స్థాయిలను అదుపులో ఉంచుతారు.
అవసరమయ్యే నైపుణ్యాలు..
స్పోర్ట్స్ సైకాలజీ ఒక ప్రత్యేకమైన విభాగం. ఇందులో రాణించాలంటే..ఆసక్తితోపాటు కృషి ఎంతో అవసరం. ముఖ్యంగా బీఏలో సైకాలజీ సబ్జెక్టుగా చదివినవారు.. అదేవిధంగా అదే సబ్జెక్టులో పీజీతోపాటు పీహెచ్‌డీ చేసినవారికి ఈ రంగంలో ప్రాధాన్యం లభిస్తోంది. సైకాలజీ కోర్సు విదేశాల్లో చేసినవారికి మన దేశంలో అధిక డిమాండ్ ఉంది. సైకాలజీలో మాస్టర్స్, పీహెచ్‌డీ చేసినవారు స్పోర్ట్స్ సైకాలజిస్ట్‌గా ప్రాక్టీస్ చేసేందుకు ‘‘అసోసియేషన్ ఫర్ అప్లయిడ్ స్పోర్ట్ సైకాలజీ’’లో సభ్యత్వం పొందాలి. ఈ విభాగం అర్హత గల నిపుణులను ధృవీకరించే అంతర్జాతీయ మల్టీడిసిప్లినరీ బాడీ. ఈ ధృవీకరణ స్పోర్ట్స్ సైకాలజిస్ట్ కెరీర్‌కు ఎంతో ఉపయోగపడుతుంది.
అవకాశాలు..
క్రీడాకారుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు స్పోర్ట్స్ సైకాలజిస్టులను సంప్రదించాలన్న ధోరణి దేశంలో ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ప్రస్తుతం మన దేశంలో సుశిక్షుతులైన స్పోర్ట్స్ సైకాలజిస్టులు సరిపడ సంఖ్యలో అందుబాటులో లేరు. దాంతో మన దేశ క్రీడా సంఘాలు మానసిక ఫిట్‌నెస్‌పై సరైన శిక్షణ ఇవ్వగల యూఎస్, ఆస్ట్రేలియాకు చెందిన స్పోర్ట్స్ సైకాలజిస్టులను సంప్రదిస్తున్నాయి. కాబట్టి శిక్షణ పొందిన స్పోర్ట్స్ సైకాలజిస్టులకు సమీప భవిష్యత్‌లో డిమాండ్ పెరిగే అవకాశం ఉందని క్రీడారంగ నిపుణులు చెబుతున్నారు. స్పోర్ట్స్‌కు ప్రాధాన్యం ఇచ్చే కాలేజీలు సైతం ఇటీవల స్పోర్ట్స్ సైకాలజిస్టులను ప్రత్యేకంగా నియమించుకుంటున్నాయి.
వేతనాలు
నిణులైన స్పోర్ట్స్ సైకాలజిస్టులకు విదేశాల్లో 55 వేల డాలర్ల నుంచి 1.53 లక్షల డాలర్ల వరకు చెల్లిస్తున్నారు. మన దేశంలోనూ కొన్ని క్రీడా సంస్థలు వీరి సేవలకు నెలకు రూ.5 లక్షలకు పైనే చెల్లిస్తున్నారు.
కోర్సులు
అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా వంటి దేశాల్లో స్పోర్ట్స్ సైకాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మన దేశంలో మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో కోర్సులు నిర్వహించడంలేదు. సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన తరువాత స్పోర్ట్స్ సైకాలజీని అధ్యయనం చేయడానికి విదేశాలకు దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆన్‌లైన్ స్టడీ విధానం అందుబాటులోకి వచ్చాక ఆ దూరం తగ్గిపోయింది. ప్రస్తుతం మనదేశంలో దాదాపు అన్ని యూనివర్సిటీలు ఎంఏ, ఎంఎస్సీ సైకాలజీ కోర్సులు అందిస్తున్నా.. స్పోర్ట్స్ సైకాలజీ కోర్సును మాత్రం తక్కువ యూనివర్సిటీలు అందిస్తున్నాయి.
ఇన్‌స్టిట్యూట్‌లు–కోర్సులు

- గురునానక్‌దేవ్ యూనివర్సిటీ(అమృత్‌సర్)–ఎంఏ/ఎంఎస్సీ స్పోర్ట్స్ సైకాలజీ, ఎంపీటీ స్పోర్ట్స్ సైకోథెరఫీ.
- తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ(చెన్నై)–ఎంఎస్సీ/ ఎంఫీల్/ పీహెచ్‌డీ స్పోర్ట్స్ సైకాలజీ.
- రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ–ఎంఏ/ ఎంఎస్సీ స్పోర్ట్స్ సైకాలజీ .
- లక్ష్మీబాయి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(గ్వాలియర్)–ఎంఏ స్పోర్ట్స్ సైకాలజీ
Published date : 13 Oct 2020 07:10PM