స్కిల్ ఉంటేనే.. సరైన కొలువు!
Sakshi Education
అభ్యర్థుల చేతిలో ఎన్ని పట్టాలున్నా... అకడమిక్ గ్రేడ్‌లు ఎంత బలంగా ఉన్నా.. నేటి పోటీ ప్రపంచంలో ‘స్కిల్స్’దే పైచేయి! నైపుణ్యాలు ఉంటేనే నాణ్యమైన కెరీర్ సొంతమవుతుంది. ఈ నేపథ్యంలో కంపెనీలు కోరుకుంటున్న స్కిల్స్ ఏమిటి? వాటిని పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి? తదితరాలపై విశ్లేషణ..
ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థుల నుంచి కంపెనీలు ‘జాబ్ రెడీ’ స్కిల్స్‌ను ఆశిస్తున్నాయి. అప్పుడే పోటీ కంపెనీలను తట్టుకొని, ముందుకెళ్లే అవకాశముంటుందని భావిస్తున్నాయి. కానీ, మన విద్యా విధానం, కరిక్యులం, మార్కుల కోసం పుస్తకాలతో కుస్తీపట్టే పరిస్థితి తదితర కారణాల వల్ల విద్యార్థుల్లో కార్యక్షేత్ర నైపుణ్యాల లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నైపుణ్యాలు లేని అభ్యర్థులకు జాబ్ మార్కెట్లో ప్రతికూల ఫలితాలు ఎదురవుతున్నాయి.
కంపెనీలు కోరుకుంటున్న నైపుణ్యాలు
విద్యార్థుల్లో స్కిల్స్ ఉండటం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అదే కారణంతో కంపెనీలు.. అభ్యర్థుల దరఖాస్తులను తిరస్కరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు జాబ్ మార్కెట్లో ముందుండాలంటే ఏ నైపుణ్యాలు అవసరం అనే ప్రశ్న విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది. స్థూలంగా పరిశీలిస్తే కంపెనీలు.. విద్యార్థులకు ప్రాక్టికల్ పరిజ్ఞానం, ఆలోచనా సామర్థ్యం, నిర్ణయం తీసుకునే నైపుణ్యాలు, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, సమయ పాలన, ఒత్తిడిని ఎదుర్కొనే నైపుణ్యం, మంచి ఫలితాలు రాబట్టే దృక్పథం ఉండాలని కోరుకుంటున్నాయి.
కరిక్యులం ప్రధాన సమస్య
ప్రొఫెషనల్ కోర్సుల కరిక్యులంలో 60 నుంచి 70 శాతం థియరీ; 30 నుంచి 40 శాతం ప్రాక్టికల్స్ ఉంటున్నాయి. ప్రాక్టికల్స్‌ను తప్పనిసరిగా చేయించేలా కరిక్యులం లేకపోవడంతో విద్యార్థులకు వాస్తవ పరిజ్ఞానం లభించడం లేదు. ఉదాహరణకు ఒక మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి కొత్త మెషీన్ రూపకల్పనకు సంబంధించి చక్కని డ్రాయింగ్, గ్రాఫ్స్, 3డి డిజైన్ రూపకల్పన వంటివి చేయగలుగుతున్నాడు. కానీ, ప్రాక్టికల్‌గా వాటిని అమలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
ప్రాక్టికాలిటీ
కంపెనీలు కోరుకునే నైపుణ్యాల్లో ప్రధానమైంది.. ప్రాక్టికాలిటీ. సంస్థలో చేరిన అభ్యర్థులకు తమ డొమైన్ నాలెడ్జ్‌ను ప్రాక్టికాలిటీలోకి బదిలీ చేసే నైపుణ్యాలు ఉండాలని కంపెనీలు ఆశిస్తున్నాయి. అందువల్ల విద్యార్థులు కాలేజీల్లో ఉండగానే ప్రాక్టికల్ నైపుణ్యాలను పెంచుకునేందుకు ప్రయత్నించాలి. దీనికి ఇంటర్న్‌షిప్స్, ప్రాజెక్టు వర్క్‌ను నిబద్ధతతో పూర్తిచేయాలి.
ఇంటర్ పర్సనల్ స్కిల్స్
విధుల నిర్వహణలో సహచరులతో కలివిడిగా ఉండే దృక్పథం, సంస్థకు సంబంధించిన ఉన్నతాధికారులు, క్లయింట్లతో నేర్పుతో మాట్లాడగలిగే నైపుణ్యాలను ఇంటర్ పర్సనల్ స్కిల్స్‌గా చెప్పుకోవచ్చు. కోర్సులో ఉన్నప్పుడే నలుగురితో మాట్లాడటం, గ్రూప్ డిస్కషన్స్ వంటి వాటిలో పాల్గొనాలి. వీటికి సెమినార్లు, గెస్ట్ లెక్చర్స్ వంటి వాటిని ఉపయోగించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంటర్ పర్సనల్ స్కిల్స్ లభిస్తాయి.
ఆలోచనా సామర్థ్యం
కంపెనీలు కోరుకుంటున్న మరో ముఖ్యమైన నైపుణ్యం.. ఆలోచనా సామర్థ్యం. విధి నిర్వహణలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దాన్ని పరిష్కరించేలా లోతైన ఆలోచన, అన్ని కోణాల్లో ఆలోచించే నైపుణ్యం ఉద్యోగిలో ఉండాలని కంపెనీలు కోరుకుంటున్నాయి. నిత్య విద్యార్థిగా పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ.. గత, ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేస్తూ ముందుకు సాగాలి. వాటి ఆధారంగా భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లు, వాటిని ఎదుర్కొనే నైపుణ్యాలపై అవగాహన పెంచుకోవాలి.
డెసిషన్ మేకింగ్ స్కిల్స్
వివిధ విభాగాల్లో మిడిల్ లెవల్ ఉద్యోగులకు డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అత్యంత అవసరమైనవి. అకస్మాత్తుగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేలా నిర్ణయం తీసుకోవడం లేదా ఒక ప్రాజెక్టుకు సంబంధించి కంపెనీలకు అనువైన నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలు ముఖ్యం. వాస్తవ కేస్ స్టడీలను అధ్యయనం చేయడం, ఆయా రంగాల్లో సాధారణంగా ఎదురయ్యే సమస్యలు, వాటికి నిపుణులు సూచించిన మార్గాలపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా స్కిల్స్‌ను పెంపొందించుకోవచ్చు.
టైం మేనేజ్‌మెంట్
ఒక అభ్యర్థికి ఇచ్చిన పనిని, సకాలంలో పూర్తిచేస్తున్నాడా.. లేదా? అని సంస్థలు పరిశీలిస్తున్నాయి. డెడ్‌లైన్‌కు ఇంకా సమయం ఉంది కదా.. అనే ఆలోచనతో పని పూర్తిచేసే సామర్థ్యం ఉన్నా కొందరు నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇలాంటి ధోరణిని కంపెనీలు తీవ్రంగా పరిగణిస్తాయి. కార్పొరేట్ ప్రపంచంలో సమయ పాలనకు అత్యంత ప్రాధాన్యం ఉంది.
స్ట్రెస్ మేనేజ్‌మెంట్
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగంలో నిలదొక్కుకునేందుకు అత్యంత అవసరం స్ట్రెస్ మేనేజ్‌మెంట్. ఒక పని పూర్తయిందని అనుకుంటున్న సమయంలో కొత్త సమస్యలు తలెత్తడం.. డెడ్‌లైన్ లోపు ప్రాజెక్టును పూర్తిచేయాల్సి రావడం.. ఇలాంటి వాటివల్ల ఒత్తిడి ఎదురవుతుంది. దీన్ని సరిగా ఎదుర్కొని, నిలబడాలని కంపెనీలు కోరుకుంటాయి. అందువల్ల ఒత్తిడికి తలొగ్గకుండా పనిచేయగలిగే నైపుణ్యాలను సొంతం చేసుకోవాలి. అదే విధంగా కంపెనీ అప్పగించిన పనిని.. ఉద్యోగి అంకితభావంతో మంచి ఫలితాలు వచ్చేలా చేస్తున్నాడా.. లేదా? అనే దానిపై కంపెనీలు ప్రత్యేకంగా దృష్టిసారిస్తాయి. అభ్యర్థులను ఇంటర్వ్యూ సమయంలోనే ఈ స్వభావాన్ని అంచనా వేసేలా ప్రశ్నలు వేస్తున్నాయి.

కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలు పెంచుకోవడం అనే భావన విద్యార్థులో ఉంది. ఇది సరికాదు. అందరితో కలివిడిగా, చొరవగా మాట్లాడే నైపుణ్యాలను కమ్యూనికేషన్ నైపుణ్యాలుగా చెప్పొచ్చు. దీనికి ఇంగ్లిష్ నైపుణ్యాలు కొంత వరకు ఉపయోగపడతాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నవారితోనైనా కమ్యూనికేట్ చేయడానికి ఇంగ్లిష్ ఉపయోగపడుతున్నందు వల్ల ఆ భాషకు ప్రాధాన్యం లభిస్తోంది. - ప్రొఫెసర్ ఇ.సురేశ్ కుమార్, ఓయూ రిజిస్ట్రార్, ఓయూ సెల్ట్ ఫ్యాకల్టీ. |
Published date : 30 May 2016 04:44PM