సైకాలజీ అందించే ఇన్‌స్టిట్యూట్స్ గురించి తెలుసుకోండిలా..
బ్యాచిలర్ ఆఫ్ సైకాలజీ(బీఏ), ఆ తర్వాత పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ కో ర్సుల్లో చేరొచ్చు. ఇటీవల కాలంలో పలు యూనివర్సిటీలు పీజీ డిప్లొమా, డిప్లొమా ఇన్ సైకాలజీ వంటి కోర్సులను ప్రవేశ పెడుతున్నాయి. కాని దీర్ఘకాలిక కెరీర్ కోణంలో యూనివర్సిటీ స్థాయిలో లభిం చే బ్యాచిలర్ ఆఫ్ సైకాలజీ కోర్సులను ఎంచుకోవడం మేలని నిపుణులు చెబుతున్నారు.
క్లినికల్ సైకాలజిస్ట్..
సైకాలజీ విభాగంలో ప్రత్యేకమైంది.. క్లినికల్ సైకాలజీ. ఈ కోర్సు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలోనే అందుబాటులో ఉంది. బ్యాచిలర్ స్థాయిలో సైకాలజీ ఒక సబ్జెక్ట్‌గా పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే ఈ కోర్సులో చేరేందుకు అర్హులు. ఈ కోర్సు ఉత్తీర్ణులకు హాస్పిటల్స్, మెంటల్ రిహాబిలిటేషన్ సెంటర్స్‌లో ఎక్కువగా అవకాశాలు లభిస్తాయి. వీరు వ్యక్తుల మానసిక సమస్యలను గుర్తించి.. ఔషధాల ద్వారా సదరు సమస్యలను పరిష్కరిస్తారు.
పర్సనాలిటీ డెవలప్‌మెంట్..
ఇటీవల కాలంలో వ్యక్తిత్వ వికాసం కోసం పలువురు సైకాలజిస్ట్‌లను ఆశ్రయిస్తున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచి మెట్రో సిటీలకు వచ్చిన విద్యార్థులు.. బిడియ పడే వ్యక్తులు.. పోటీ పరీక్షలకు, ఇంటర్వూకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోసం సైకాలజిస్ట్‌లను సంప్రదిస్తున్నారు.
సైకాలజీ.. బెస్ట్ ఇన్‌స్టిట్యూట్స్
రాష్ట్రాల స్థాయిలో యూనివర్సిటీల్లో యూజీ, పీజీ సైకాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియెట్/10+2 ఉత్తీర్ణులు డిగ్రీ స్థాయి కోర్సుల్లో చేరొచ్చు. సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు పీజీ స్థాయి కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. జాతీయ స్థాయిలో –యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ(బీహెచ్‌యూ), సెంట్రల్ యూనివర్సిటీల్లో కోర్సులకు మంచి గుర్తింపు ఉంది. వీటితోపాటు అన్నామలై యూనివర్సిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకాలజీ అండ్ రీసెర్చ్(బెంగళూరు) తదితరాలు అందించే సైకాలజీ కోర్సులకు కూడా విద్యార్థుల్లో ఆదరణ ఉంది.
ఇంకా చదవండి : part 3 : సైకాలజీతో అందే ఉపాధి అవకాశాలు.. వేతన వివరాలు ఇలా..