నిత్యం సవాళ్లుతో స్వాగతం పలికే కొలువులెన్నో...
Sakshi Education
మనలో చాలామంది ఏదో ఒక ఉద్యోగం ఉంటే చాలు అని సరిపెట్టుకుంటాం. కొంత మందికి మాత్రం రోజూ కొత్త కొత్త సవాళ్లు కావాలి.
వేతనం..
ప్రారంభంలో నెలకు 30 వేలకు పైగానే అందుతుంది. అనుభవంతో నెలకు రూ. లక్షకు పైగా వేతనం పొందొచ్చు.
వెబ్‌సైట్స్: https://www.upsc.gov.in/, https://www.joinindiannavy.gov.in
మర్చంట్ నేవీ..
నేవీ ఆపీసర్... రక్షణ దళాలకు సంబంధించిన అధికారి. మర్చంట్ నేవీ ఆఫీసర్ అంటే... సముద్రంపై వాణిజ్య నౌకల సరుకుల రవాణా, ప్రయాణ నౌకలు సురక్షితంగా ఒడ్డుకు చేరేలా చూసే అధికారి. సముద్రంలో ప్రతికూల వాతావరణం, సాంకేతిక సమస్యలు, సముద్ర దొంగల దాడులు వంటి ఎన్నో సవాళ్లు నిత్యం నలువైపుల నుంచి చుట్టుముడుతున్నా.. నెలల తరబడి సముద్రంలో ప్రయాణిస్తూ.. నిబ్బరంగా పనిచేసుకుపోవాల్సిన కొలువు.. మర్చంట్ నేవీ ఆఫీసర్!
జాబ్ ప్రొఫైల్:
పపంచ వాణిజ్యానికి కీలకమైన వాణిజ్య నౌకల ద్వారా సరుకుల రవాణాలో మర్చంట్ నేవీ ఆఫీసర్‌ది కీలక బాధ్యత. అత్యంత సంక్లిష్టమైన సముద్ర ప్రయాణంలో నౌకను సురక్షితంగా గమ్యానికి చే ర్చే అధికారి ఇతను. నౌకలోకి సరుకుల లోడింగ్ అన్‌లోడింగ్, నౌకకు సాంకేతిక సమస్యలు, సిబ్బంది బాగోగులు.. అన్నీ ఈ అధికారి చూసుకోవాల్సి ఉంటుంది.
అర్హతలు..
కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్(ఎంపీసీ) పూర్తిచేసిన విద్యార్థులు... బీఎస్సీ నాటికల్ సైన్‌స కోర్సులో చేరొచ్చు. ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ క్యాంపస్‌లు, అనుబంధ ఇన్‌స్టిట్యూట్‌లు మూడేళ్ల బీఎస్సీ నాటికల్ సైన్‌స, మెరైన్ సైన్‌స, షిప్‌బిల్డింగ్ కోర్సును; నాలుగేళ్ల బీ టెక్ మెరైన్ ఇంజనీరింగ్, నావెల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్ కోర్సులను అందిస్తున్నాయి.
అవసరమైన స్కిల్స్..
వేతనాలు- కెరీర్ స్కోప్ :
ప్రారంభంలో నెలకు రూ.1లక్ష నుంచి 2లక్షల వరకూ ఉంటుంది. కొంత అనుభవంతోపాటు నైపుణ్యం సాధించాక రూ.5లక్షలకు పైగా వేతనం అందుకునే వీలుంది.
వెబ్‌సైట్: https://www.imu.edu.in
వైల్డ్ లైఫ్ ఎక్స్‌పర్ట్...
వైల్డ్‌లైఫ్ ఎక్స్‌పర్ట్... అడవిలోని వన్యమృగాలను కాపాడటం ఇతని బాధ్యత. ఆ క్రమంలో అటవీ మాఫియాతో ఢీ కొనాల్సి ఉంటుంది. అంతేకాకుండా వేటగాళ్లు, స్మగ్లర్ల నుంచి జంతువులను, చెట్లను, రక్షించడం నిజంగా సవాలుతో కూడుకున్నదే! నిత్యం సుదీర్ఘంగా ఒంటరిగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా క్రూరమృగాలమధ్య సంచరించాల్సి రావడం ప్రాణాలకు రిస్క్. వైల్డ్‌లైఫ్ ఎక్స్‌పర్ట్‌కు అటవీ సంరక్షణపై అవగాహన ఉండాలి. దాంతోపాటు అటవీ చట్టాలు, ప్రభుత్వ నియమ నిబంధనలు తెలిసుండాలి. అందుకోసం ఇంటర్ బైపీసీ తర్వాత ఫారెస్ట్రీ కోర్సులో చేరొచ్చు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్.. పీజీ డిప్లొమా ఇన్ ఫారె్‌స్ట్ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తోంది. వెబ్ సైట్స్: https://iifm.ac.in
ఆర్మీ ఆఫీసర్...
సవాళ్లతో కూడుకున్న అత్యంత బాధ్యతాయుతమైన ఉద్యోగం.. ఆర్మీ ఆఫీసర్. సరిహద్దుల రక్షణలో, యుద్ధ సమయంలో, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు.. ఆర్మీ ఆఫీసర్ ప్రాణాలకు తెగించి పోరాడాల్సి ఉంటుంది. అంతేకాకుండా తన టీంను నిత్యం ప్రోత్సహిస్తూ.. దేశభక్తి, అంకితభావంతో పనిచేసేలా చూడాలి. ఆర్మీ ఆఫీసర్‌కు దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా భావించే గుణం ఉండాలి.
జాబ్ ప్రొఫైల్ :
ర్యాంకును అనుసరించి ఆర్మీ ఆఫీసర్...ప్లటూన్, కంపెనీ, డివిజన్,బ్రిగేడ్, కార్పస్, కమాండ్ లేదా బెటాలియన్‌కు నేతృత్వం వహిస్తాడు. సైనిక దళాల్లో ముఖ్యంగా మూడు విభాగాలు ఉంటాయి. అవి... పోరాటం(ఫైటింగ్), మద్దతు (సపోర్ట్), సేవలు (సర్వీసెస్) వీటిలో ఫైటింగ్ విభాగంలో పనిచేసే ఆర్మీఆఫీసర్లు ప్రమాదపు అంచున కష్టసాధ్యమైన ఆపరేషన్‌సలో ముందుండి నడిపిస్తారు. వీరికి సపోర్టింగ్ బృందాలు.. ఆయుధాలు, పరికరాలు, టెలికమ్యూనికేషన్ సిగ్నల్స్ వంటివి అందించడంలో తోడ్పాటును అందిస్తుంటాయి. అలాగే సేవల విభాగం ఆహారం, వైద్య సేవలు వంటివి సమకూరుస్తుంది.
నైపుణ్యాలు..
ధైర్యసహసాలు కలిగి ఉండటం, సవాళ్లను సంతోషంగా స్వీకరించే మనస్తత్వం, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, త్యాగబుద్ధి, క్రమశిక్షణ, నీతి నిజాయితీ వంటి లక్షణాలుండాలి.
చేరడం ఎలా ?
ఇంటర్మీడియెట్ అర్హతతో ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ పరీక్ష ద్వారా ఆర్మీలో చేరొచ్చు. అలాగే డిగ్రీ తర్వాత కంబైన్డ్ డిఫెన్‌స సర్వీస్(సీడీఎస్)పరీక్ష ద్వారా కూడా సైన్యంలో అధికారిగా చేరే వీలుంది. ఆర్మీలో ఆఫీసర్‌గా అవకాశం లభించడం అంత తేలిక కాదు. సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూకు వెళ్లే వారిలో 10శాతం కంటే తక్కువ మంది మాత్రమే విజయం సాధించగలుగుతున్నారంటే... వడపోత ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సవాళ్లకు తగ్గట్లు జీతభత్యాలు, ఇతర సౌకర్యాలు, అలవెన్సులు భారీగానే ఉంటాయి. దేశభక్తి, అంకితభావంతో ఎదగడానికి ఆకాశమే హద్దు!
వెబ్‌సైట్: https://www.upsc.gov.in/, https://indianarmy.nic.in
అంతరిక్ష యానం.. ఆస్ట్రోనాట్ (వ్యోమగామి) :
సవాళ్లతో కూడుకున్న ఉద్యోగాల్లో మరో ముఖ్యమైంది.. ఆస్ట్రోనాట్. అంతరిక్షంలో ప్రయోగాలు చేసేందుకు వ్యోమనౌకలో కూర్చొని.. అంతరిక్షంలో ప్రయాణించే వారే వ్యోమగాముల. వ్యోమగాముల పని ఎంతో సాహసం, సవాలుతో కూడున్నది. ఎందుకంటే.. వ్యోమగాములు అంతరిక్ష నౌకలో అనంత విశ్వంలోకి ప్రయాణిస్తారు. శూన్యంలో, సున్నా గ్రావిటీ వద్ద మనుగడ సాగించడం, బతికి బట్టకట్టడం అంత తేలికకాదు. వేల, లక్షల కిలోమీటర్లు అనంతంలోకి ప్రయాణించే వ్యోమగాములు... ఏ క్షణమైనా ప్రతికూల వాతావరణం బారిన పడి... వ్యోమనౌక పేలిపోవచ్చు. వ్యోమగామిగా మారేందుకు జరిగే ఎంపిక ప్రక్రియలో నెగ్గేందుకు ఎంతో పట్టుదల, దృఢ సంకల్పం, ప్రతిభాపాటవాలు ప్రదర్శించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సంవత్సరాల తరబడి అత్యంత కఠోరమైన శిక్షణను తట్టుకొని... అంతరిక్షంలోకి వెళ్లడం అత్యంత సవాలుతో కూడుకున్నది.
అర్హతలు..
ఇంటర్మీడియెట్ ఎంపీసీ తర్వాత బీఎస్సీ ఫిజిక్స్ లేదా బీఈ/బీటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ తదితర కోర్సులు పూర్తిచేసి.. సంబంధిత స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్‌లో చేరొచ్చు. ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఐఐఎస్సీలలో ఇంజనీరింగ్, ఫిజికల్‌సైన్స్, బయలాజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్ తదితర సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, పీజీ, పీహెచ్‌డీ పూర్తిచేసిన అభ్యర్థులు ఆస్ట్రోనాట్‌గా మారేందుకు ప్రయత్నించొచ్చు.
ఎంపిక ప్రక్రియ..
పోలీస్ ఆఫీసర్ విధులు :
పోలీసు అధికారులకు ముఖ్యంగా ఐపీఎస్ అధికారులకు విశేష అధికారాలతోపాటు అనేక బాధ్యతలు ఉంటాయి. జిల్లా సూపరింటెండ్ ఆఫ్ పోలీస్(ఎస్‌పీ)గా తమ పరిధిలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తారు. శాంతి భద్రతలు, పౌరుల రక్షణ, నేరాలు అరికట్టడం, ట్రాఫిక్ నియంత్రణ వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వీటితోపాటు వీఐపీలకు భద్రత కల్పించడం, మాదక ద్రవ్యాల నియంత్రణ, అవినీతిని అరికట్టడం, సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలు నియంత్రించడం, విపత్తులు సంభవించినప్పుడు సహాయక చర్యలు చేపట్టడం, వివిధ ప్రభుత్వ విభాగాలతో సమన్యయం చేసుకోవడం... ఇలా ఎన్నో సవాళ్లతో కూడిన జాబ్ పోలీస్ ఉద్యోగం. నిజాయితీ, అంకితభావం కలిగిన పోలీస్ అధికారులకు పదోన్నతులు, కెరీర్ ఉజ్వలంగా ఉంటుంది.
వెబ్‌సైట్స్https://www.upsc.gov.in/, https://indianrailways.gov.in/, https://www.ssc.nic.in/
ఉద్యోగం అంటే అస్సలు బోర్ కొట్టకూడదని వీరు భావిస్తారు. మీరు కూడా అలాంటి కెరీర్‌నే కోరుకుంటున్నారా..అందరు నడిచే దారి... మీకు ఎంతమాత్రం నచ్చదా..! ఏ పని చేసినా ‘కిక్’ ఉండాలి అనుకుంటున్నారా..జాబ్‌లో థ్రిల్ లేకుంటే.. మనసు పెట్టి పనిచేయలేరా..మీలాంటి వారి కోసం నిత్యం సవాళ్లతో స్వాగతం పలికేకొలువులెన్నో ఉన్నాయ్! మరి ఆ కిక్ ఇచ్చే కొలువులేంటి... అవి విసిరే సవాళ్లు ఏమిటి... ఆయా జాబ్స్‌లో చేరడమెలాగో తెలుసుకుందామా....!!!
పెలైట్... ఆకాశ మార్గాన..
గ్లామర్‌తోపాటు సవాళ్లతో కూడుకున్న జాబ్.. పెలైట్. వందల మంది విలువైన ప్రాణాలను వేల కిలోమీటర్ల ఎత్తులో.. తీసుకెళ్తూ వారిని గమ్యస్థానానికి సురక్షితంగా చేరవేయడం బాధ్యతోపాటుసాహసంతో కూడిన పని. నిత్యం ప్రతికూల వాతావరణం, ఇంజన్ ఫెయిల్యూర్, ఇంధన కొరత తదితర సాంకేతిక సమస్యలు, ఉగ్రవాదుల హైజాకింగ్ ముప్పు వంటి ఎన్నో ఊహించని ఉపద్రవాలతో పెలైట్ నిత్యం సహవాసం చేయాల్సిందే! ఇంజన్‌లో సమస్య వచ్చినప్పుడు సురక్షితంగా విమానాన్ని కిందకు దించగలిగే చాకచక్యం... ఏదైనా సమస్య ఎదురైనప్పుడు క్షణాల్లో అత్యంత వేగంగా కచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలిగే సామర్థ్యం పెలైట్‌కు ఉండాలి. అందుకే పెలైట్ కెరీర్ కోరుకునే వారికి ధైర్య సాహసాలు, సవాళ్లకు వెరవని నైజం తప్పనిసరి.
పెలైట్‌గా మారేందుకు..
కమర్షియల్ పెలైట్, ట్రాన్‌సపోర్ట్ పెలైట్, హెలికాప్టర్ పెలైట్, మిలటరీ పెలైట్‌గా మారొచ్చు. అందుకోసం ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ, సీడీఎస్, ఏఎఫ్‌క్యాట్, డీజీసీఏ అందించే కమర్షియల్ పెలైట్ లెసైన్‌స.. ఇలా పెలైట్‌గా మారేందుకు మార్గాలు అనేకం!
ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ: ఇంటర్ ఎంపీసీ పూర్తిచేసుకున్న విద్యార్థులు యూపీఎస్సీ ప్రతిఏటా రెండుసార్లు నిర్వహించే ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ పరీక్ష ద్వారా ఎయిర్‌ఫోర్స్‌లో చేరి పెలైట్ శిక్షణ పొందొచ్చు.
సీడీఎస్: బీఎస్సీ(మ్యాథ్‌స, ఫిజిక్స్)/ఇంజనీరింగ్ పూర్తయ్యాక యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ డిఫెన్‌స సర్వీసెస్ పరీక్షలో ప్రతిభ చూపి.. ఎయిర్‌ఫోర్స్‌లో చేరి శిక్షణ పొందాల్సి ఉంటుంది. శిక్షణ పూర్తయ్యాక ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లయింగ్ ఆఫీసర్ కొలువు లభిస్తుంది.
ఏఎఫ్‌క్యాట్: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏటా రెండుసార్లు విడుదలచేసే ఏఎఫ్‌క్యాట్(ఫ్లయింగ్ బ్రాంచ్)లో ప్రతిభ ద్వారా పెలైట్ శిక్షణలో చేరి... శిక్షణ పూర్తయ్యాక ఫ్లయింగ్ ఆఫీసర్‌గా విధుల్లో చేరొచ్చు.
కమర్షియల్ పెలైట్: ప్రైవేటు విమానయాన రంగంలో అవకాశాలు అందుకునేందుకు కమర్షియల్ పెలైట్ లెసైన్‌స అవసరం. అందుకోసం ఇంటర్ (మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ తప్పనసరి) పూర్తయ్యాక పెలైట్ శిక్షణలో చేరొచ్చు. డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గుర్తింపున్న పెలైట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో 200 గంటల పాటు విజయవంతంగా విమానం నడిపిన తర్వాతే కమర్షియల్ పెలైట్ లెసైన్‌స లభిస్తుంది. అంతకుముందుగా స్టూడెంట్ పెలైట్ లెసైన్‌స (ఎస్‌పీఎల్) పొందాలి. అందుకోసం ఓరల్ పరీక్షతోపాటు మెడికల్ టెస్టు, ఆ తర్వాత పెలైట్ ఆప్టిట్యూడ్ టెస్టు పాసవ్వాలి. ఆ తర్వాత ప్రైవేటు పెలైట్ లెసైన్‌స(పీపీఎల్) పొందేందుకు 60గం. విమానం నడపడంతోపాటు థియరీ పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించాలి.
అవసరమైన స్కిల్స్..
పెలైట్‌లకు అసమాన ధైర్యసాహసాలు, ఏకాగ్రత, సమయస్ఫూర్తి చాలా అవసరం. మంచిక మ్యూనికేషన్ నైపుణ్యాలు, ఇంగ్లిష్‌పై పట్టు కలిగి ఉండాలి. టెక్నికల్ స్కిల్స్ తప్పనిసరి.
అవకాశాలు ఎక్కడ ?
ఎయిర్ ఫోర్స్, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏిసియా, జెట్ ఎయిర్‌వేస్, ఇండిగో, స్పైస్ జెట్, గోఎయిర్ వంటి వాటిల్లో పెలైట్‌గా అవకాశం అందుకోవచ్చు.
జీతభత్యాలు: మొదట్లో నెలకు లక్ష నుంచి రెండు లక్షల వరకు.. ఆ తర్వాత నాలుగైదేళ్ల అనుభవంతో భారీ జీతం లభిస్తుంది.
వెబ్‌సైట్లు: https://www.upsc.gov.in, https://indianairforce.nic.in, https://dgca.nic.in
నిత్య సవాళ్ల... నేవీ ఆఫీసర్
ఆ సముద్ర గర్భాన దాగిన బడబాగ్నులెన్నో..! అన్నాడో కవి. సముద్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సముద్రంపై ఉద్యోగం అంటేనే నిత్యం సవాళ్లతో కూడుకున్నది. భారత నావికా దళం.. దేశ జల వనరులు, తీర ప్రాంతాలు, సముద్ర జలాలు ఆక్రమణకు గురికాకుండా రక్షిస్తుంది. అలాంటి కీలకమైన నావికా దళంలో చేరి... దేశ సరిహద్దులను, దేశ తీర ప్రాంత భద్రతను అనుక్షణంగా అప్రమత్తంగా పహారాకాస్తూ కంటికి రెప్పలా కాపాడే అధికారే... నేవీ ఆఫీసర్. నేవీ అధికారి దేశ రక్షణ కోసం ఒక రకంగా సముద్రంలో యుద్ధం చేస్తుంటాడు! వ్యూహాత్మకంగా దేశ రక్షణకు ఎంతో కీలకమైన, సంక్లిష్ట యుద్ధ నౌకల వ్యవస్థలో ఎన్నో సవాళ్లతో కూడిన బాధ్యతలు నిర్వర్తించే అధికారి.. నేవీ ఆఫీసర్. ఈ అధికారి ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా... దేశం ఎంతో అమూల్యమైన సముద్ర వనరులతోపాటు సముద్ర జలాల్లో వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాలను శత్రుదేశాలకు కోల్పోవాల్సి వస్తుంది.
సవాళ్లు ఇవిగో..
నేవీ ఆఫీసర్ ప్రధాన బాధ్యత దేశ సముద్ర జలాలను, సముద్ర వనరులను, దేశ సరిహద్దులను విదేశీ ఆక్రమణల నుంచి కాపాడటం. దాంతోపాటు వీరు సముద్ర దొంగల పనిపట్టేందుకు యాంటీ పైరసీ ఆపరేషన్‌స నిర్వహిస్తుంటారు. సముద్ర మార్గంలో జరిగే అంతర్జాతీయ వాణిజ్య కార్య కలాపాలు, సరుకుల రవాణాను సైతం పర్యవేక్షిస్తుంటారు. సముద్రంపై ప్రతికూల వాతావరణం, క్లిష్టమైన పరిస్థితులను తట్టుకొనేందుకు నిత్యం సిద్ధంగా ఉండాలి. దాంతోపాటు సముద్రంలో పనిచేసే వారికి మరో పెద్ద సమస్య మంచినీటి కొరత. బకెట్ నీటితో నాలుగు రోజులు గడపాల్సిన పరిస్థితి, బాటిల్ మంచినీటితో సర్దుకోవాల్సిన గడ్డు పరిస్థితులు ఎదురుకావచ్చు.
శిక్షణ :
జలాంతర్గాముల యుద్ధ నైపుణ్యం, యుద్ధ నౌకలు నడపడం, కమ్యూనికేషన్, డ్రైవింగ్, గన్నింగ్, హైడ్రోగ్రఫీ, లాజిస్టిక్స్ వంటి అనేక అంశాలపై శిక్షణ ఇచ్చి..నేవీ ఆఫీసర్‌ను సుశిక్షితుడిగా తీర్చిదిద్దుతారు.
ఇలా చేరొచ్చు ..
భారత నౌకాదళంలో నేవీ ఆఫీసర్‌గా చేరేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిఏటా రెండుసార్లు ప్రకటన విడుదల చేసే ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ. దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత..ఇంటర్మీడిఝెట్ ఎంపీసీ ఉత్తీర్ణత. అలాగే మరో మార్గం కంబైన్డ్ డిఫెన్‌స సర్వీసెస్(సీడీఎస్). దీనికి అర్హత గ్రాడ్యుయేషన్. యూపీఎస్సీ ప్రతిఏటా నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.

- సవాళ్లకు ఎదురొడ్డి నిలిచే దృక్పథం
- నిత్యం ఒత్తిళ్లను తట్టుకోగలిగే మానసిక, శారీరక దృడత్వం
- పట్టుదల, పోరాట పటిమ
- నాయకత్వ లక్షణాలు, ఆలోచనల్లో స్పష్టత
- సముద్రం, నౌకాయానం పట్ల ఎనలేని ఇష్టం.
వేతనం..
ప్రారంభంలో నెలకు 30 వేలకు పైగానే అందుతుంది. అనుభవంతో నెలకు రూ. లక్షకు పైగా వేతనం పొందొచ్చు.
వెబ్‌సైట్స్: https://www.upsc.gov.in/, https://www.joinindiannavy.gov.in
మర్చంట్ నేవీ..
నేవీ ఆపీసర్... రక్షణ దళాలకు సంబంధించిన అధికారి. మర్చంట్ నేవీ ఆఫీసర్ అంటే... సముద్రంపై వాణిజ్య నౌకల సరుకుల రవాణా, ప్రయాణ నౌకలు సురక్షితంగా ఒడ్డుకు చేరేలా చూసే అధికారి. సముద్రంలో ప్రతికూల వాతావరణం, సాంకేతిక సమస్యలు, సముద్ర దొంగల దాడులు వంటి ఎన్నో సవాళ్లు నిత్యం నలువైపుల నుంచి చుట్టుముడుతున్నా.. నెలల తరబడి సముద్రంలో ప్రయాణిస్తూ.. నిబ్బరంగా పనిచేసుకుపోవాల్సిన కొలువు.. మర్చంట్ నేవీ ఆఫీసర్!
జాబ్ ప్రొఫైల్:
పపంచ వాణిజ్యానికి కీలకమైన వాణిజ్య నౌకల ద్వారా సరుకుల రవాణాలో మర్చంట్ నేవీ ఆఫీసర్‌ది కీలక బాధ్యత. అత్యంత సంక్లిష్టమైన సముద్ర ప్రయాణంలో నౌకను సురక్షితంగా గమ్యానికి చే ర్చే అధికారి ఇతను. నౌకలోకి సరుకుల లోడింగ్ అన్‌లోడింగ్, నౌకకు సాంకేతిక సమస్యలు, సిబ్బంది బాగోగులు.. అన్నీ ఈ అధికారి చూసుకోవాల్సి ఉంటుంది.
అర్హతలు..
కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్(ఎంపీసీ) పూర్తిచేసిన విద్యార్థులు... బీఎస్సీ నాటికల్ సైన్‌స కోర్సులో చేరొచ్చు. ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ క్యాంపస్‌లు, అనుబంధ ఇన్‌స్టిట్యూట్‌లు మూడేళ్ల బీఎస్సీ నాటికల్ సైన్‌స, మెరైన్ సైన్‌స, షిప్‌బిల్డింగ్ కోర్సును; నాలుగేళ్ల బీ టెక్ మెరైన్ ఇంజనీరింగ్, నావెల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్ కోర్సులను అందిస్తున్నాయి.
అవసరమైన స్కిల్స్..
- మానసికంగా స్థిరత్వం అవసరం.
- నాయకత్వ లక్షణాలు ఉండాలి.
- సరుకుల నిర్వహణ పట్ల ఆసక్తి ఉండాలి.
వేతనాలు- కెరీర్ స్కోప్ :
ప్రారంభంలో నెలకు రూ.1లక్ష నుంచి 2లక్షల వరకూ ఉంటుంది. కొంత అనుభవంతోపాటు నైపుణ్యం సాధించాక రూ.5లక్షలకు పైగా వేతనం అందుకునే వీలుంది.
వెబ్‌సైట్: https://www.imu.edu.in
వైల్డ్ లైఫ్ ఎక్స్‌పర్ట్...
వైల్డ్‌లైఫ్ ఎక్స్‌పర్ట్... అడవిలోని వన్యమృగాలను కాపాడటం ఇతని బాధ్యత. ఆ క్రమంలో అటవీ మాఫియాతో ఢీ కొనాల్సి ఉంటుంది. అంతేకాకుండా వేటగాళ్లు, స్మగ్లర్ల నుంచి జంతువులను, చెట్లను, రక్షించడం నిజంగా సవాలుతో కూడుకున్నదే! నిత్యం సుదీర్ఘంగా ఒంటరిగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా క్రూరమృగాలమధ్య సంచరించాల్సి రావడం ప్రాణాలకు రిస్క్. వైల్డ్‌లైఫ్ ఎక్స్‌పర్ట్‌కు అటవీ సంరక్షణపై అవగాహన ఉండాలి. దాంతోపాటు అటవీ చట్టాలు, ప్రభుత్వ నియమ నిబంధనలు తెలిసుండాలి. అందుకోసం ఇంటర్ బైపీసీ తర్వాత ఫారెస్ట్రీ కోర్సులో చేరొచ్చు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్.. పీజీ డిప్లొమా ఇన్ ఫారె్‌స్ట్ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తోంది. వెబ్ సైట్స్: https://iifm.ac.in
ఆర్మీ ఆఫీసర్...
సవాళ్లతో కూడుకున్న అత్యంత బాధ్యతాయుతమైన ఉద్యోగం.. ఆర్మీ ఆఫీసర్. సరిహద్దుల రక్షణలో, యుద్ధ సమయంలో, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు.. ఆర్మీ ఆఫీసర్ ప్రాణాలకు తెగించి పోరాడాల్సి ఉంటుంది. అంతేకాకుండా తన టీంను నిత్యం ప్రోత్సహిస్తూ.. దేశభక్తి, అంకితభావంతో పనిచేసేలా చూడాలి. ఆర్మీ ఆఫీసర్‌కు దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా భావించే గుణం ఉండాలి.
జాబ్ ప్రొఫైల్ :
ర్యాంకును అనుసరించి ఆర్మీ ఆఫీసర్...ప్లటూన్, కంపెనీ, డివిజన్,బ్రిగేడ్, కార్పస్, కమాండ్ లేదా బెటాలియన్‌కు నేతృత్వం వహిస్తాడు. సైనిక దళాల్లో ముఖ్యంగా మూడు విభాగాలు ఉంటాయి. అవి... పోరాటం(ఫైటింగ్), మద్దతు (సపోర్ట్), సేవలు (సర్వీసెస్) వీటిలో ఫైటింగ్ విభాగంలో పనిచేసే ఆర్మీఆఫీసర్లు ప్రమాదపు అంచున కష్టసాధ్యమైన ఆపరేషన్‌సలో ముందుండి నడిపిస్తారు. వీరికి సపోర్టింగ్ బృందాలు.. ఆయుధాలు, పరికరాలు, టెలికమ్యూనికేషన్ సిగ్నల్స్ వంటివి అందించడంలో తోడ్పాటును అందిస్తుంటాయి. అలాగే సేవల విభాగం ఆహారం, వైద్య సేవలు వంటివి సమకూరుస్తుంది.
నైపుణ్యాలు..
ధైర్యసహసాలు కలిగి ఉండటం, సవాళ్లను సంతోషంగా స్వీకరించే మనస్తత్వం, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, త్యాగబుద్ధి, క్రమశిక్షణ, నీతి నిజాయితీ వంటి లక్షణాలుండాలి.
చేరడం ఎలా ?
ఇంటర్మీడియెట్ అర్హతతో ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ పరీక్ష ద్వారా ఆర్మీలో చేరొచ్చు. అలాగే డిగ్రీ తర్వాత కంబైన్డ్ డిఫెన్‌స సర్వీస్(సీడీఎస్)పరీక్ష ద్వారా కూడా సైన్యంలో అధికారిగా చేరే వీలుంది. ఆర్మీలో ఆఫీసర్‌గా అవకాశం లభించడం అంత తేలిక కాదు. సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూకు వెళ్లే వారిలో 10శాతం కంటే తక్కువ మంది మాత్రమే విజయం సాధించగలుగుతున్నారంటే... వడపోత ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సవాళ్లకు తగ్గట్లు జీతభత్యాలు, ఇతర సౌకర్యాలు, అలవెన్సులు భారీగానే ఉంటాయి. దేశభక్తి, అంకితభావంతో ఎదగడానికి ఆకాశమే హద్దు!
వెబ్‌సైట్: https://www.upsc.gov.in/, https://indianarmy.nic.in
అంతరిక్ష యానం.. ఆస్ట్రోనాట్ (వ్యోమగామి) :
సవాళ్లతో కూడుకున్న ఉద్యోగాల్లో మరో ముఖ్యమైంది.. ఆస్ట్రోనాట్. అంతరిక్షంలో ప్రయోగాలు చేసేందుకు వ్యోమనౌకలో కూర్చొని.. అంతరిక్షంలో ప్రయాణించే వారే వ్యోమగాముల. వ్యోమగాముల పని ఎంతో సాహసం, సవాలుతో కూడున్నది. ఎందుకంటే.. వ్యోమగాములు అంతరిక్ష నౌకలో అనంత విశ్వంలోకి ప్రయాణిస్తారు. శూన్యంలో, సున్నా గ్రావిటీ వద్ద మనుగడ సాగించడం, బతికి బట్టకట్టడం అంత తేలికకాదు. వేల, లక్షల కిలోమీటర్లు అనంతంలోకి ప్రయాణించే వ్యోమగాములు... ఏ క్షణమైనా ప్రతికూల వాతావరణం బారిన పడి... వ్యోమనౌక పేలిపోవచ్చు. వ్యోమగామిగా మారేందుకు జరిగే ఎంపిక ప్రక్రియలో నెగ్గేందుకు ఎంతో పట్టుదల, దృఢ సంకల్పం, ప్రతిభాపాటవాలు ప్రదర్శించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సంవత్సరాల తరబడి అత్యంత కఠోరమైన శిక్షణను తట్టుకొని... అంతరిక్షంలోకి వెళ్లడం అత్యంత సవాలుతో కూడుకున్నది.
అర్హతలు..
ఇంటర్మీడియెట్ ఎంపీసీ తర్వాత బీఎస్సీ ఫిజిక్స్ లేదా బీఈ/బీటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ తదితర కోర్సులు పూర్తిచేసి.. సంబంధిత స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్‌లో చేరొచ్చు. ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఐఐఎస్సీలలో ఇంజనీరింగ్, ఫిజికల్‌సైన్స్, బయలాజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్ తదితర సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, పీజీ, పీహెచ్‌డీ పూర్తిచేసిన అభ్యర్థులు ఆస్ట్రోనాట్‌గా మారేందుకు ప్రయత్నించొచ్చు.
ఎంపిక ప్రక్రియ..
- వాస్తవానికి ఆస్ట్రోనాట్ ఎంపిక ప్రక్రియ అత్యంత కఠినంగా ఉంటుంది. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జపనీస్ ఎయిరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ, రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ, చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్... ఇలా అయా దేశాలకు చెందిన స్పేస్ ఏజెన్సీలు విభిన్నమైన ఎంపిక ప్రక్రియను అనుసరిస్తున్నాయి.
- అమెరికాకు చెందిన నాసా విడుదల చేసే ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపడం ద్వారా అవకాశాలు మెరుగుపరచుకోవచ్చు. నాసాకు దరఖాస్తు చేసుకునేందుకు ఇంజనీరింగ్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ తదితర విభాగాల్లో కనీసం గ్రాడ్యుయేషన్ ఉండాలి. అయితే ఎక్కువ శాతం ఎంపికయ్యే వారిలో పీజీ, పీహెచ్‌డీ కలిగి ఉంటారు. దీంతోపాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. అంతేకాకుండా సంబంధిత విభాగంలో(మిలిటరీ) పనిచేసినట్లు కనీసం మూడేళ్ల అనుభవం, 1000 గంటల పాటు జెట్ విమానాన్ని నడిపిన అనుభవం వంటి అర్హతలు ఉండాలి. అభ్యర్థి మానసిక స్థైర్యాన్ని అంచనా వేసేందుకు చివర్లో ఇంటర్వ్యూ ఉంటుంది. ఎంపికైతే మొదట రెండు మూడేళ్లు కఠోర శిక్షణ ఇస్తారు. సవాళ్లకు తగ్గట్టు జీతభత్యాలకు కొదవ ఉండదు.
- భారత అంతరిక్ష సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)లో సైంటిస్ట్‌గా చేరి.. ఇస్రోకు చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వంటి వాటిలో అంతరిక్ష పరిశోధనల్లో పనిచేయొచ్చు.
వెబ్ సైట్స్: https://www.nasa.gov/, //www.isro.gov.in
స్కూబా డైవింగ్ శిక్షకుడు..
కొంచెం కొత్తదనం.. కాస్త సాహసం.. ఈ రెండింటి వెనకే యువత పయనం. అలా నేటి యువత మనసుల్ని దోచేస్తున్న తాజా ట్రెండ్ స్కూబా డైవింగ్..! సరదా, సాహసాలే కాదు ఉపాధి అవకాశాలూ ఇందులో బోలెడున్నాయి. అందుకే స్కూబా డైవింగ్ ఇప్పుడు వెరీ పాపులర్.
సముద్రపు నీటిలో ఈదులాడే సాహసక్రీడే స్కూబా డైవింగ్. సముద్రగర్భంలో చేపలా ఈదుతూ.. అక్కడి అందాలను, వింత జలచరాలను అతి దగ్గర నుంచి వీక్షిస్తుంటే.. ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేం.! సముద్రంలోకి దిగి.. నీటి అడుగున ప్రకృతి చెక్కిన అందాలను తనివితీరా చూసి ఆస్వాదించాలంటే.. స్కూబా డైవింగ్ నేర్చుకోవాల్సిందే. అయితే ఈతలో నైపుణ్యం లేకపోయినప్పటికీ స్కూబా డైవింగ్ చేయొచ్చు. కానీ నిపుణుల పర్యవేక్షణలోనే స్కూబా డైవింగ్ చేయాల్సి ఉంటుంది. డైవింగ్ సమయంలో పక్కనే ఉండి సలహాలిచ్చే మాస్టర్‌నే ‘స్కూబా డైవింగ్ ఇన్‌స్ట్రక్టర్’ అంటారు. అయితే స్కూబా డైవింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి సర్టిఫికేషన్‌తో పాటు అమితమైన ఓర్పు ఉండాలి. ఈత రావడం తప్పనిసరి. దాంతోపాటు చీకటిని, నీటిలోని జలచరాలను చూసి భయపడేవారిని సన్నద్ధం చేసే నేర్పు ఉండాలి. అలాగే సముద్రపు భాగం, ఫిజియాలజీ, ఫిజిక్స్ అంశాలపై సంపూర్ణ అవగాహన ఉండాలి.
బాధ్యతలివే..
డైవింగ్ సమయంలో ఎదురయ్యే ప్రమాదమేంటి? ఎలా అప్రమత్తంగా ఉండాలి? లోపలికి వెళ్తున్న కొద్దీ ఏ అవయవాల మీద ఒత్తిడి పడుతుంది. దాన్ని ఎదుర్కొంటూ మధ్యమధ్యలో ఎలా విశ్రాంతి తీసుకోవాలి? ఎలా ముందుకెళ్లాలి, నోట్లోకి, మాస్క్‌లోకి నీళ్లు వెళితే ఎలా కవర్ చేసుకోవాలి అనే అంశాల్ని నేర్పించాల్సి ఉంటుంది.
వేతనం:
స్కూబా డైవింగ్ ఇన్‌స్ట్రక్టర్ వేతనం అనుభవం, నైపుణ్యాన్ని బట్టి లక్షల్లోనే ఉంటుంది.
పోలీస్ అధికారి.. లా అండ్ ఆర్డర్
దేశంలోని అత్యంత సవాళ్లతో కూడుకున్న ఉద్యోగాల్లో పోలీస్ ఆఫీసర్ జాబ్ ఒకటి. సమస్యాత్మక ప్రాంతాల్లో పోస్టింగ్ పడితే పోలీస్ విధి నిర్వహణ మరింత చాలెంజింగ్‌గా మారుతుందనడంలో సందేహంలేదు. ఉగ్రవాదుల దాడులు, వేర్పాటువాద అలజడులు, తీవ్రవాదం, కులమత సంఘర్షణలకు ఆస్కారమున్న దేశంలో పోలీసు ఆఫీసర్ కొలువు కత్తిమీద సామే! పోలీసు అధికారి ఒక్కోసారి ఎలాంటి విరామం లేకుండా రోజుల తరబడి తీవ్ర ఒత్తిళ్ల నడుమ పనిచేయాల్సి ఉంటుంది. శాంతి భద్రతలు కాపాడటం, అంతర్గత భద్రతను పర్యవేక్షించడంలో పోలీస్ ఆఫీసర్‌ది ప్రధాన బాధ్యత. క్లిష్టమైన కేసులు ఛేదించే క్రమంలో నేరగాళ్ల నుంచి వచ్చే బెదిరింపులు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లు తట్టుకోవాల్సి ఉంటుంది.
పోలీసు అధికారిగా మారాలంటే..
సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్(ఎస్‌ఐ) నుంచి ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపీఎస్) వరకూ.. పోలీస్ అధికారిగా మారేందుకు మార్గాలు అనేకం.

- దేశంలోని ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ల్లో ఒకటైన ఐపీఎస్‌లో చేరేందుకు ప్రతిఏటా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఏదైనా డిగ్రీతో ఈ పరీక్ష రాయొచ్చు. మూడంచెల సివిల్ సర్వీసెస్ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించిన వారికే ఐపీఎస్ వరిస్తుంది. ఎంపికై న అభ్యర్థులను వివిధ రాష్ట్రాలకు కేటాయిస్తారు. వీరు అనుభవంతో అనేక కీలక పోస్టుల్లో నియమితులవుతారు. సీబీఐ(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్), రా(రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్), ఐబీ(ఇంటెలిజెన్‌స బ్యూరో), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ), సీఆర్‌పీఎఫ్ వంటి వాటి అధిపతులుగా కీలక బాధ్యతలు నిర్వహించే అవకాశముంది. అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నిర్వహించే పరీక్షల ద్వారా వివిధ కేంద్ర దళాల్లో ఎస్‌ఐగా చేరొచ్చు. అలాగే రాష్ట్రాల స్థాయిలో గ్రూప్1, ఎస్‌ఐ వంటి పోటీ పరీక్షల ద్వారా పోలీస్ అధికారిగా మారేందుకు అవకాశముంది. వీరు కూడా అంచెలంచెలుగా ఎదిగేందుకు వీలుంది. భారతీయ రైల్వేకు చెందిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లోనూ ఎస్‌ఐగా చేరొచ్చు.
పోలీస్ ఆఫీసర్ విధులు :
పోలీసు అధికారులకు ముఖ్యంగా ఐపీఎస్ అధికారులకు విశేష అధికారాలతోపాటు అనేక బాధ్యతలు ఉంటాయి. జిల్లా సూపరింటెండ్ ఆఫ్ పోలీస్(ఎస్‌పీ)గా తమ పరిధిలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తారు. శాంతి భద్రతలు, పౌరుల రక్షణ, నేరాలు అరికట్టడం, ట్రాఫిక్ నియంత్రణ వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వీటితోపాటు వీఐపీలకు భద్రత కల్పించడం, మాదక ద్రవ్యాల నియంత్రణ, అవినీతిని అరికట్టడం, సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలు నియంత్రించడం, విపత్తులు సంభవించినప్పుడు సహాయక చర్యలు చేపట్టడం, వివిధ ప్రభుత్వ విభాగాలతో సమన్యయం చేసుకోవడం... ఇలా ఎన్నో సవాళ్లతో కూడిన జాబ్ పోలీస్ ఉద్యోగం. నిజాయితీ, అంకితభావం కలిగిన పోలీస్ అధికారులకు పదోన్నతులు, కెరీర్ ఉజ్వలంగా ఉంటుంది.
వెబ్‌సైట్స్https://www.upsc.gov.in/, https://indianrailways.gov.in/, https://www.ssc.nic.in/
Published date : 06 Jan 2024 12:06PM