‘గేట్’ స్కోరుతో ఉన్నత కొలువులను సొంతం చేసుకోండిలా..
Sakshi Education
గేట్–2021 దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 8వ తేదీతో ముగిసింది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి మొదటి వారంలో గేట్ పరీక్ష ప్రారంభం కానుంది.
అడ్మిట్ కార్డుల జారీ(జనవరిలో)కి ముందే మహారత్న, నవరత్న, మినీరత్న కంపెనీలు గేట్ ద్వారా నియామకాలకు నోటిఫికేషన్స్ విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. గేట్ స్కోరుతో కొలువులను భర్తీ చేసే పీఎస్‌యూలు(ప్రభుత్వ రంగ సంస్థలు), అర్హతలు, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ, కటాఫ్ మార్కులు తదితర వివరాలతో సమగ్ర కథనం...
కొలువుల పరీక్షగా..
గేట్‌తో ఉన్నత చదువులు, ఉపకార వేతనాలు, పరిశోధనలు వంటి ప్రయోజనాలతోపాటు ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)ల్లో ఉద్యోగం సొంతం చేసుకునేందుకు అవకాశం ఉంది. గేట్‌కు హాజరయ్యే అభ్యర్థుల్లో అధిక శాతం మందికి పీఎస్‌యూ కొలువు దక్కించుకోవడం మొదటి ప్రాధాన్యంగా ఉంటోంది.
గేట్ స్కోరుతో ఉద్యోగ నియామకాల ఇలా..
2012 నుంచి పీఎస్‌యూలు గేట్ స్కోరు ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాయి. అలా రిక్రూట్‌మెంట్స్ చేపడుతున్న పీఎస్‌యూల సంఖ్య ప్రస్తుతం 50కి పైగా ఉంది. ఈ జాబితాలో బీహెచ్‌ఈఎల్, గెయిల్, హెచ్‌పీసీఎల్, హెచ్‌ఏఎల్, ఐవోసీఎల్, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, ఎన్‌ఎండీసీ లిమిటెడ్, ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్, కేఐఓసీఎల్ లిమిటెడ్, ఎన్‌హెచ్‌ఏఐ, ఎన్‌ఏఎల్‌సీవో, డీఆర్‌డీవో, బీఐఎస్, ఎన్‌పీసీఐఎల్, హెచ్‌యూఆర్‌ఎల్, బార్క్, ఈసీఐఎల్, ఓఎంపీఎల్, పీఎస్‌పీసీఎల్, ఎంఎన్‌ఆర్‌ఈ, పవర్‌గ్రిడ్, బీఎంఆర్‌సీ, బీఎస్‌ఎన్‌ఎల్, ఎండీఎల్, వైజాగ్ స్టీల్, ఆర్‌ఐటీఈఎస్, సీఈఎల్, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, డీడీఏ, ఎన్‌బీసీసీ, ఆర్‌వీఎన్‌ఎల్, బీపీసీఎల్, ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్, ఆయిల్ ఇండియా,మిధాని, డీఎంఆర్‌సీ, కోల్ ఇండియా లిమిటెడ్,ఎన్‌ఎస్‌పీసీఎల్ తదితరం ఉన్నాయి.
దరఖాస్తు ప్రక్రియ :
వాస్తవానికి గేట్ ఫలితాలు విడుదలైన తర్వాతే పీఎస్‌యూలు దరఖాస్తు ప్రక్రియను చేపడుతున్నాయి. కాకపోతే అభ్యర్థులకు వెసులుబాటు కల్పించేలా నియామక ప్రక్రియ షెడ్యూల్‌ను ముందుగానే ప్రకటిస్తున్నాయి. కొన్ని పీఎస్‌యూలు సెప్టెంబర్/ అక్టోబర్‌ల్లో నోటిఫికేషన్లను విడుదల చేసి.. షెడ్యూల్, ఎంపిక ప్రక్రియ వివరాలను అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతున్నాయి. మరికొన్ని సంస్థలు జనవరి/ ఫిబ్రవరిల్లో నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నాయి. పీఎస్‌యూ జాబ్స్ కోరుకునే అభ్యర్థులు.. గేట్ ప్రిపరేషన్‌తోపాటు ఆయా కంపెనీల నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని.. దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కటాఫ్ మార్కులు..
అభ్యర్థుల గేట్ స్కోరును మలిదశ ఎంపిక ప్రక్రియ(గ్రూప్ డిస్కషన్/గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ)కు పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి పీఎస్‌యూ కొలువులను లక్ష్యంగా పెట్టుకున్న వారు గేట్ ప్రిపరేషన్‌తోపాటు సమాంతరంగా పీఎస్‌యూల ఎంపిక ప్రక్రియపైనా స్పష్టత తెచ్చుకోవాలి. పీఎస్‌యూలు కేటగిరీల ఆధారంగా, కటాఫ్ మార్కులు నిర్ణయించి ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తున్నాయి. కటాఫ్ మార్కులు పీఎస్‌యూలను బట్టి మారతాయి. కనీస కటాఫ్‌ను ప్రకటించే సమయంలో 1:5 లేదా1:7 నిష్పత్తిలో అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తున్నారు. అంటే.. ఒక్కో ఖాళీకి అయిదుగురు లేదా ఏడుగురు అభ్యర్థులను మలి దశ ప్రక్రియకు ఎంపిక చేస్తారు. ఎంపిక ప్రక్రియ ఆయా పీఎస్‌యూల విధానాల మేరకు ఉంటుంది. అధికశాతం ప్రభుత్వ రంగ సంస్థలు.. జీడీ(గ్రూప్ డిస్కషన్), మౌఖిక పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఇంటర్వ్యూలో వ్యక్తిగత వివరాలు మొదలు కంపెనీపై అవగాహన, సమకాలీన అంశాల పరిజ్ఞానం, టెక్నికల్ స్కిల్స్ కోణాల్లో ప్రశ్నలు అడుగుతారు.
మలిదశ
పీఎస్‌యూలు అభ్యర్థులను మలిదశ ఎంపిక ప్రక్రియకు పిలిచేందుకు.. ఆ తర్వాత తుది జాబితా రూపకల్పనలో వెయిటేజీ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఈ వెయిటేజీ మొత్తం వంద మార్కుల స్కేలింగ్ విధానంలో ఉంటుంది. పీఎస్‌యూలు గేట్ స్కోర్‌కు 70 శాతం నుంచి 75 శాతం వెయిటేజీ; గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ(పీఐ)లకు 25 శాతం నుంచి 30 శాతం వెయిటేజీ ఇస్తున్నాయి. ఈ మొత్తం వెయిటేజీలో ఖాళీలకు అనుగుణంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తున్నారు. షార్ట్‌లిస్ట్‌లో నిలిచిన చివరి అభ్యర్థి పొందిన స్కోర్/పర్సంటేజీనే ఫైనల్ కటాఫ్‌గా పేర్కొంటున్నారు.
గ్రూప్ డిస్కషన్ :
గేట్ స్కోర్ ఆధారంగా మలిదశకు ఎంపికైన అభ్యర్థులకు పీఎస్‌యూలు గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తాయి. ఐదు నుంచి పది మంది అభ్యర్థులను ఒక బృందంగా ఏర్పాటు చేసి.. ఏదైనా ఒక టాపిక్‌పై చర్చించమంటారు. దాదాపు అరగంట వ్యవధిలో ఉండే గ్రూప్ డిస్కషన్‌లో ప్రతి అభ్యర్థికి సగటున అయిదు నిమిషాల సమయం లభిస్తుంది. ఈ సమయంలో అభ్యర్థులు సదరు అంశంపై తమ అభిప్రాయాలు నిర్దిష్టంగా చెప్పాలి. ఇతర అభ్యర్థుల వాదనలపై స్పందిస్తూనే తమకంటూ కచ్చితమైన అభిప్రాయం ఏంటో తెలియజేయాల్సి ఉంటుంది.
గ్రూప్ టాస్క్..
కొన్ని పీఎస్‌యూలు అభ్యర్థులకు గ్రూప్ టాస్క్ ఇస్తున్నాయి. ఏదైనా ఒక వాస్తవ సమస్యను అభ్యర్థుల ముందుంచి దానికి పరిష్కారం కనుగొనమంటారు. పరిష్కారం కనుగొనే క్రమంలో అభ్యర్థులు బృందంగా పని చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా అభ్యర్థుల్లోని సబ్జెక్ట్ నాలెడ్జ్‌ను రియల్ టైం అప్లికేషన్ పరంగా ఎలా వినియోగిస్తున్నారో పరీక్షిస్తారు. అదే విధంగా టాస్క్ నిర్వహణలో ఇతరులతో కలిసి పనిచేసే దృక్పథాన్ని ఇందులో పరిశీలిస్తారు.
పర్సనల్ ఇంటర్వ్యూ ఇలా...
గ్రూప్ డిస్కషన్ లేదా గ్రూప్ టాస్క్‌లలో విజయం సాధించిన అభ్యర్థులు చివరిగా ఎదుర్కోవాల్సిన దశ.. పర్సనల్ ఇంటర్వ్యూ. ఈ పర్సనల్ ఇంటర్వ్యూల్లో అభ్యర్థుల వ్యక్తిత్వం, సాంకేతిక నైపుణ్యం, వ్యక్తిగత నేపథ్యాలను పరిశీలిస్తారు. సాంకేతిక నైపుణ్యం పరంగా అభ్యర్థులు పూర్తి చేసిన ప్రాజెక్ట్ వర్క్స్, ఇంటర్న్‌షిప్స్ వంటి వాటిపై ప్రశ్నలు అడుగుతారు. వ్యక్తిగత నేపథ్యానికి సంబంధించిన ప్రశ్నలు సైతం అభ్యర్థుల భవిష్యత్తు కెరీర్ కోణంలోనే ఉంటాయి. భవిష్యత్తు లక్ష్యాలు ఏంటి? ఎంపిక చేసుకున్న విభాగం లేదా సబ్జెక్ట్ ద్వారా వాటిని అందుకోగలరా? వంటి ప్రశ్నలు ఎదురవుతాయి.
800కు పైగా స్కోరు..
గేట్ ఉత్తీర్ణత సాధిస్తున్న అభ్యర్థుల్లో ఎక్కువ మంది పీఎస్‌యూ నియామకాలే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. దాంతో నియామకాల పరంగా ఫైనల్ కటాఫ్ పెరుగుతోంది. జనరల్ కేటగిరీలో 800కు పైగా స్కోర్ లేదా తత్సమాన పర్సంటేజీ లేదా మార్కులు సాధించిన అభ్యర్థులకే కొలువు ఖాయం అవుతోంది. అంతేకాకుండా సంస్థ స్థాయి, నియామకం చేపడుతున్న విభాగం ఆధారంగానూ ఫైనల్ కటాఫ్ ఉంటుంది. డీఆర్‌డీఓ, ఎండీఎల్, వైజాగ్ స్టీల్ వంటి పీఎస్‌యూల్లో గేట్ స్కోరు జనరల్ కేటగిరీలో సగటున 750, రిజర్వ్‌డ్ కేటగిరీల్లో 500 నుంచి 600 మధ్యలో ఉంటోంది.
లక్షల్లో వేతనాలు...
పీఎస్‌యూల్లో కొలువులను ఖరారు చేసుకున్న అభ్యర్థులకు ప్రారంభంలోనే రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల వార్షిక వేతనం అందుతుంది. కొన్ని పీఎస్‌యూలు సర్వీస్ బాండ్ నిబంధన విధానాన్ని అమలు చేస్తున్నాయి. అంటే.. నియామకం ఖరారైన అభ్యర్థులు కచ్చితంగా నిర్దిష్ట కాలం పాటు సంస్థలో పనిచేస్తామని అంగీకార పత్రం ఇవ్వాలి. ఈ వ్యవధి రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు ఉంటోంది.
ముఖ్య సమాచారం:
అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్: 2021 జనవరి 8వ తేదీ నుంచి...
గేట్ 2021 పరీక్ష తేదీలు: 2021 ఫిబ్రవరి 5, 6, 7, 12, 13, 14.
గేట్ 2021 పరీక్ష ఫలితాల వెల్లడి: 22.03.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://gate.iitd.ac.in

Published date : 13 Oct 2020 06:02PM