ఆబ్జెక్టివ్ విధానమైనా.. డిస్క్రిప్టివ్ ఓరియెంటేషన్‌తో!
Sakshi Education
డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలలో లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ వృత్తిలో చేరేందుకు ప్రతి అభ్యర్థి సంబంధిత అకాడమిక్ అర్హతలతోపాటు.. నిర్దేశించిన ఎలిజిబిలిటీ పరీక్షల్లో అర్హత సాధించడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట(నెట్), ఆ తరహాలోనే కొన్ని రాష్ట్రాలు సొంతంగా స్లెట్ (స్టేట్ లెవల్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్షలను నిర్వహిస్తున్నాయి. యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో పరీక్ష విధానం, ప్రిపరేషన్ గెడైన్స్ వివరాలు...
హ్యుమానిటీస్ (లాంగ్వేజెస్‌తో కలిపి), ఫోరెన్సిక్ సెన్సైస్, సోషల్ సెన్సైస్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్, ఎన్విరాన్‌మెంటల్ సెన్సైస్, ఎలక్ట్రానిక్ సెన్సైస్ వంటి దాదాపు 95 సబ్జెక్ట్‌లలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)కి చెందిన నేషనల్ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ బ్యూరో ప్రతి ఏటా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్)ను నిర్వహిస్తుంది. ఇందులో అర్హత సాధించిన వారికి లెక్చరర్‌షిప్, పరిశోధన దిశగా ప్రోత్సహించేందుకు వీలుగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్) ప్రదానం చేస్తారు. రాష్ట్ర విద్యార్థుల్లో ఎక్కువ మంది.. తెలుగు, ఎకనామిక్స్, ఫిలాసఫీ, హిస్టరీ, సోషియాలజీ,ఇంగ్లిష్ తదితరా సబ్జెక్ట్‌లలో నెట్‌కు హాజరవుతున్నారు.
ఆబ్జెక్టివ్‌గా:
రాత పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో మూడు పేపర్లు.. పేపర్-1, 2, 3గా ఉంటుంది. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ఉంటాయి. మూడు పేపర్లకు కూడా ఒకే రోజున వేర్వేరు సెషనల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌తోపాటు హిందీ మాధ్యమంలో కూడా ప్రశ్నపత్రం ఉంటుంది. ఆయా సబ్జెక్ట్‌ల సిలబస్‌ను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వెబ్‌సైట్లోని ప్రీవియస్ పేపర్లను పరిశీలించడం ద్వారా పరీక్ష విధానం, ప్రశ్నల సరళిపై ఒక అవగాహన ఏర్పడుతుంది.

పేపర్-1 ఇలా:
పేపర్-1 అన్ని సబ్జెక్ట్‌ల విద్యార్థులకు కామన్‌గా ఉంటుంది. మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. వీటిల్లో కనీసం 50 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున కేటాయించిన మార్కులు: 100. సమయం: గంటా 15 నిమిషాలు. బోధన/పరిశోధనల పట్ల అభ్యర్థి అభిరుచిని అంచనా వేసేందుకు ఉద్దేశించింది ఈ పేపర్. ఈ క్రమంలో టీచింగ్ ఆప్టిట్యూడ్, రీడింగ్ కాంప్రెహెన్షన్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, కమ్యూనికేషన్, రీజనింగ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్ ఎన్విరాన్‌మెంట్, హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంశాలను ప్రశ్నలుగా అడగొచ్చు.
- ఈ నేపథ్యంలో సిలబస్ పరిధి విస్తృతం అనే విషయం స్పష్టమవుతుంది. కాబట్టి అభ్యర్థి తదనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలి. ఆయా అంశాలను సమకాలీన అంశాలతో అన్వయం చేసుకోవడం లాభిస్తుంది. ఇందులో తార్కిక సామర్థ్యం, విశ్లేషణ శక్తి, ఆలోచన విధానం,గ్రహణ శక్తి వంటి స్కిల్స్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఇందులోని మొత్తం 60 ప్రశ్నల్లో.. 50 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాయాలి. 50 కంటే ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన పక్షంలో.. అభ్యర్థి సమాధానాలను గుర్తించిన మొదటి 50 ప్రశ్నలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని మార్కులు కేటాయిస్తారు.
- పేపర్-2: మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం కేటాయించిన మార్కులు: 100. సమయం: గంటా 15 నిమిషాలు. అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్‌లో పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ఈ పేపర్‌ను రూపొందించారు.
- పేపర్-3: మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం కేటాయించిన మార్కులు: 150. సమ యం: రెండున్నర గంటలు. ఎంచుకున్న సబ్జెక్ట్‌పై అభ్యర్థిలో లోతైన అవగాహనను పరీక్షించడం.. ఆ సబ్జెక్ట్‌లోని స్పెషలైజేషన్స్ కవర్ అయ్యే విధంగా ప్రశ్నలు వస్తాయి.
- పేపర్-2, 3 సబ్జెక్ట్ పేపర్లు: వీటిల్లో అడిగే ప్రశ్నలు క్లిష్టంగా ఉండడంతోపాటు వాటి పరిధి విస్తృతం. కాబట్టి అభ్యర్థులకు ఆయా సబ్జెక్ట్‌లలో అడ్వాన్స్‌డ్ నాలెడ్జ్ ఉండడం తప్పనిసరి. కేవలం అకడమిక్ పరంగా ఉండే పరీక్షలకు సన్నద్ధమయ్యే విధంగా కాకుండా పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే కోణంలో అధ్యయనం సాగించా లి. ఒక్కొక్క ఆధ్యాయాన్ని పూర్తి చేస్తున్నప్పుడే సంబంధిత అంశంపై మాక్ టెస్ట్‌లు రాయడం ఉపయోగకరంగా ఉంటుంది. మాక్ టెస్ట్‌లకు హాజరుకావడం వల్ల ప్రశ్నను అవగాహన చేసుకోవడంతోపాటు వేగంగా సమాధానాన్ని గుర్తించే నైపుణ్యం సొంతమవుతుంది.
సిలబస్ పరిధి విస్తృతం. కాబట్టి ముందుగా సిలబస్‌పై ఒక అవగాహనకు రావడం మంచిది. ఆబ్జెక్టివ్ విధానం కాబట్టి ప్రతి అంశం నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఏ ఒక్క అంశాన్ని విస్మరించకుండా విస్తృత స్థాయిలో ప్రిపరేషన్ సాగించాలి. ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తున్నప్పటికీ అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను డిస్క్రిప్టివ్ ఓరియెంటేషన్‌తో సాగించాలి. అప్పుడే సబ్జెక్ట్‌లో ఎంత లోతైన ప్రశ్న అడిగినా సమాధానం గుర్తించడం సాధ్యం. ప్రిపరేషన్‌లో గ్రాడ్యుయేషన్, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ క్రమాన్ని అనుసరించాలి.
- చాలామంది అభ్యర్థులు పేపర్-1 నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది సరికాదు. పేపర్-1లో పాసైతేనే మిగతా రెండు పేపర్లను మూల్యాంకనం చేస్తారు. కాబట్టి పేపర్-1 విషయంలో నిర్లక్ష్యం కూడదు.
- ముఖ్యంగా పేపర్-3 విషయంలో ఎక్కువ దృష్టి సారించాలి. సబ్జెక్ట్ నాలెడ్‌జ ఉన్న అభ్యర్థులు పేపర్-1పై దృష్టి పెట్టాలి. రెగ్యులర్ మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం మంచిది. కనీసం వారానికి ఒక మాక్‌టెస్ట్ అయినా రాసేవిధంగా ప్లాన్ చేసుకోవాలి. ప్రస్తుతం యూజీసీ-నెట్ కోసం దాదాపు అన్ని యూనివర్సిటీల్లో ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్లను నెలకొల్పారు. ఔత్సాహిక అభ్యర్థులు దీన్ని వినియోగించుకోవాలి.
- నెట్‌లో కనీస అర్హత మార్కులను నిర్ణయించినప్పటికీ.. అంతకుమించి ఎక్కువ మార్కులు స్కోర్ చేసే విధంగా ప్రిపరేషన్ సాగించాలి. 60 నుంచి 70 శాతం మార్కులు పొందే దిశగా నైపుణ్యం సాధించాలి.
- పేపర్-1లో విభిన్న అంశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ ఒకే పుస్తకంలో దొరకడం కష్టం. కాబట్టి ఇందుకోసం ప్రముఖ పబ్లిషర్స్ ప్రచురించిన పుస్తకాలను ఎంచుకోవాలి.
- యూజీసీ-నెట్/సెట్ (పేపర్-1)-టాటామెక్‌గ్రిహిల్స్
- యూజీసీ-నెట్/సెట్ (పేపర్-1)-ఉప్‌కార్ పబ్లికేషన్స్
- పేపర్-2,3కు సంబంధించి సిలబస్‌లో పేర్కొన్న అంశాలను గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తూ..డిగ్రీ, పీజీ సబ్జెక్ట్ పుస్తకాలను చదవాలి.
అర్హత మార్కులు:
మూడు పేపర్లలో పరీక్ష నిర్వహిస్తున్నారు కాబట్టి.. పేపర్లు, కేటగిరీల వారీగా వేర్వేరు అర్హత మార్కులను నిర్ణయించారు. ప్రతి పేపర్‌లో నిర్దేశించిన అర్హత మార్కులు సాధించిన వారిని మాత్రమే ఫైనల్ రిజల్ట్స్ ప్రిపరేషన్‌లో పరిగణనలోకి తీసుకుంటారు.

కేటగిరీ | పేపర్-1 | పేపర్-2 | పేపర్-3 |
జనరల్ | 40 | 40 | 75 |
బీసీ | 35 | 35 | 67.5 |
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ | 35 | 35 | 60 |
తుది జాబితా ఇలా:
అభ్యర్థులు నిర్దేశించిన అర్హత మార్కులు సాధించినప్పటికీ మోడరేషన్ కమిటీ నిర్ధారించే కటాఫ్ మార్కుల ఆధారంగా జే ఆర్‌ఎఫ్, లెక్చరర్‌షిప్‌ను ప్రదానం చేస్తారు. అందుబాటులోని జేఆర్‌ఎఫ్‌ల సంఖ్యను, అభ్యర్థుల ఉత్తీర్ణతను పరిగణనలోకి తీసుకుని తుది కటాఫ్‌ను నిర్ణయిస్తారు. యూజీసీ రెండు రకాల మెరిట్ లిస్ట్‌లను రూపొందిస్తుంది. మొదటి లిస్ట్‌లో లెక్చరర్‌షిప్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిఫ్ రెండిటికీ అర్హత సాధించిన అభ్యర్థులకు చోటు కల్పిస్తారు. రెండో లిస్ట్‌లో కేవలం లెక్చరర్‌షిప్‌నకు అర్హత సాధించిన వారి పేర్లు మాత్రమే ఉంటాయి.
ప్రయోజనాలు:
- నెట్‌లో క్వాలిఫై కావడం ద్వారా దేశంలోని అన్ని డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలలో/ తత్సమాన ఇన్‌స్టిట్యూట్‌లలో లెక్చరర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు.
- డిగ్రీ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే నెట్/ సెట్ క్వాలిఫై అయి ఉండాలి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌నకు ఎంపికైన అభ్యర్థులకు.. ఐదేళ్లపాటు ఫెలోషిప్ లభిస్తుంది.
- ఐఐటీ/ఐఐఎస్‌సీ వంటి ఇన్‌స్టిట్యూట్‌లలో పరిశోధన కోర్సుల్లో చేరడానికి.. పరిగణించే అర్హతల్లో నెట్/జేఆర్‌ఎఫ్ క్వాలిఫికేషన్‌కు ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు.
నోటిఫికేషన్ సమాచారం:
అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లో 55 శాతం మార్కులతో (ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు) మాస్టర్ డిగ్రీ లేదా తత్సమానం. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు: జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్: 28 సంవత్సరాలు (డిసెంబర్ 1, 2013 నాటికి). రిజర్వ్‌డ్ అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది. లెక్చరర్‌షిప్‌నకు ఎటువంటి వయోపరిమితి లేదు.
రిజిస్ట్రేషన్ ఫీజు: జనరల్-రూ.450, బీసీ- రూ. 225 (నాన్‌క్రీ మిలేయర్), ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ- రూ. 110. ఫీజును చలాన్ రూపంలో చెల్లించాలి.
దరఖాస్తు విధానం: https://ugcnetonline.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ హార్డ్ కాపీని ప్రింట్ అవుట్ తీసుకోవాలి. దీంతోపాటు బ్యాంక్ చలాన్, సంబంధిత సర్టిఫికెట్లను జత చేసి నిర్దేశించిన విధంగా కో-ఆర్డినేటింగ్ యూనివర్సిటీలకు పంపాలి.
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుకు, చలాన్ తీసుకునేందుకు చివరి తేదీ: నవంబర్ 4, 2013.
చలాన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: నవంబర్ 7, 2013.
దరఖాస్తును ప్రింట్ అవుట్, తీసుకోవడానికి చివరి తేదీ: నవంబర్ 10, 2013.
కో-ఆర్డినేటింగ్ యూనివర్సిటీలో ప్రింట్ అవుట్ దరఖాస్తు, సంబంధిత సర్టిఫికెట్ల స్వీకరణకు చివరి తేదీ: నవంబర్ 14, 2013.
పరీక్ష తేదీ: డిసెంబర్ 29, 2013.
వెబ్‌సైట్: https://ugcnetonline.in

- గత జూన్‌లో నిర్వహించిన నెట్‌లో 27,402 మంది అభ్యర్థులు లెక్చరర్‌షిప్‌నకు అర్హత సాధించారు.
- 3,200 మందికి జేఆర్‌ఎఫ్ లభించింది.
రాష్ట్రంలోని కో-ఆర్డినేటింగ్ వర్సిటీలు:
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్
వెబ్‌సైట్: www.osmania.ac.in
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి
వెబ్‌సైట్: www.svuniversity.in
నాగార్జున యూనివర్సిటీ-గుంటూరు
వెబ్‌సైట్: www.nagarjunauniversity.ac.in
రీజనింగ్.. గత ప్రశ్న పత్రాల సాధనే ప్రధానం
ప్రస్తుత యూజీసీ నెట్ ఔత్సాహిక అభ్యర్థులు ప్రధానంగా పేపర్-1కు సంబంధించి సాధారణ అంశాలైన లాజికల్ రీజనింగ్, అర్థమెటిక్ రీజనింగ్, డేటా ఇంటర్ ప్రిటేషన్, పర్యావరణం వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి. మొత్తం ప్రశ్నల్లో 80 నుంచి 90 శాతం వీటి నుంచే అడిగే అవకాశం ఉంది. ఇందుకోసం బ్యాంక్ రిక్రూట్‌మెంట్ పరీక్ష పత్రాలను ప్రాక్టీస్ చేయడం ఉపకరిస్తుంది. ఇదే పేపర్ విషయంలో అభ్యర్థులు బాగా గుర్తించాల్సిన మరో అంశం.. మొత్తం 60 ప్రశ్నలతో ఉండే పేపర్లో 50 ప్రశ్నలు తప్పనిసరిగా రాయాలి. 50కు మించి కూడా ప్రశ్నలు రాసే అవకాశం ఉంది. కానీ అభ్యర్థులు రాసిన మొదటి 50 ప్రశ్నలనే మూల్యాంకనలో పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి సమాధానం కచ్చితంగా తెలుసు అనుకున్న ప్రశ్నలనే మొదటి 50 ప్రశ్నలుగా ఎంచుకోవాలి.
ఇక సబ్జెక్ట్ పేపర్ల విషయంలో.. ప్రస్తుతమున్న సమయంలో అభ్యర్థులు ముందుగా గత ప్రశ్న పత్రాలను విశ్లేషించుకుని ఏఏ చాప్టర్లకు ఎంత వెయిటేజీ ఉంటుందో గమనించి ఆ మేరకు ప్రిపరేషన్ సాగించాలి. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహాలో ఉన్నప్పటికీ.. పూర్తి విషయ పరిజ్ఞానం ఉంటే తప్ప సమాధానం గుర్తించడం కష్టం. ఈ నేపథ్యంలో సిలబస్‌లో పేర్కొన్న అంశాలపై పూర్తి అవగాహన పొందాలి. రెడీమేడ్ గైడ్స్, నోట్స్‌లకు పరిమితమైతే సత్ఫలితం ఆశించలేం. సిలబస్ కూడా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోని సిలబస్‌ల స్థాయిలో ఉంటుంది. అందువల్ల విద్యార్థులు పకడ్బందీ ప్రణాళికతో అడుగులు వేయాలి. ఇప్పటికే నెట్ లక్ష్యంగా ప్రిపరేషన్ సాగిస్తున్న విద్యార్థులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు నెలల సమయాన్ని రివిజన్‌కు కేటాయిస్తే విజయానికి చేరువ కావచ్చు. ఇక.. ఇప్పుడే తొలిసారి పరీక్ష రాస్తున్న అభ్యర్థులు నిరాశాజనక ఫలితం ఎదురైనా.. నెట్ స్థాయిని దృష్టిలో పెట్టుకుని ఆందోళన చెందకుండా తదుపరి నెట్‌లో విజయం సాధించేలా మానసికంగా సన్నద్ధం కావాలి.
- ప్రొఫెసర్ ఎం.వి.ఎస్. కోటేశ్వర రావు, కోఆర్డినేటర్,
యూజీసీ-నెట్ కోచింగ్ ప్రోగ్రామ్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ

Published date : 04 Nov 2013 12:29PM