వైద్యవిద్యకు జాతీయ మార్గం...
Sakshi Education
డాక్టర్.. ఇంటర్మీడియెట్‌లో బైపీసీ గ్రూపు తీసుకున్న ప్రతి విద్యార్థి కల.. ఇందుకోసం కోర్సులో చేరిన మొదటి రోజు నుంచే శ్రమిస్తుంటారు..
గతంతో పోలిస్తే మెడికల్ సీట్లు పెరగడం.. సిలబస్‌లో చెప్పుకోదగ్గ వ్యత్యాసం లేకపోవడంతో.. ఎంసెట్ నుంచి ఎయిమ్స్ ఎంట్రెన్స్ టెస్ట్ వరకు.. రాష్ర్టంతోపాటు జాతీయ స్థాయి వైద్య కళాశాల్లో సీటే లక్ష్యంగా సన్నద్ధం అయ్యే విద్యార్థులు ఎందరో.. ఈ నేపథ్యంలో ఏయే పరీక్షలకు ఏవిధంగా సిద్ధం కావాలి? దృష్టిసారించాల్సిన అంశాలు? అనుసరించాల్సిన వ్యూహాలు? తదితరాలపై విశ్లేషణ...
సిలబస్ ఒకటే:
ఇన్‌స్టిట్యూట్ ఏదైనా.. ప్రవేశ పరీక్షలోని బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీల సిలబస్ దాదాపుగా ఒకే విధంగా ఉంటుం ది. ప్రశ్నించే విధానం, క్లిష్టతలో మాత్రమే కొద్ది తేడాను గమనించవచ్చు. ఈ పరీక్షల్లో అధిక శాతం ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ పద్ధతిలోనే ఉంటాయి. వీటితోపాటు మ్యాచ్ ది ఫాలోయింగ్, కరెక్ట్/ఇన్‌కరెక్ట్ స్టేట్‌మెంట్స్, చూస్ ది ఆడ్ వన్ వంటి ప్రశ్నలు కూడా అడుగుతారు.
జనరల్ నాలెడ్జ్/జనరల్ ఎబిలిటీ/ఇంగ్లిష్:
కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు మాత్రం అకడమిక్ సబ్జెక్టులతోపాటు ఇంగ్లిష్, లాజికల్ రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్ వంటి విభాగాలపై కూడా అభ్యర్థుల సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నాయి. అవి.. ఎయిమ్స్ ఎంట్రెన్స్‌లో జీకేపై 20 ప్రశ్నలు ఉంటాయి. సీఎంసీ-వెల్లూరు ప్రవేశ పరీక్ష.. రెండో పేపర్లో రీజనింగ్, ఇంగ్లిష్, కరెంట్ టాపిక్స్‌పై 120 ప్రశ్నలు ఉంటాయి. ఇవి వేగం, కచ్చితత్వాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించినవి. ఎంజీఐఎంఎస్-వార్థా ఇతర ఇన్‌స్టిట్యూట్‌లకు భిన్నంగా గాంధీ ఆలోచనలపై ప్రత్యేకంగా ఒక పేపర్‌నే కేటాయించింది. గాంధీ ఆలోచనలకు సంబంధించి అడిగే ప్రశ్నలకు నిర్దేశిత బుక్‌లెట్‌లో ఎస్సే/షార్ట్ ఆన్సర్స్ పద్ధతిలో సమాధానాలను రాయాలి. జిప్‌మర్‌లో అభ్యర్థి ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగానికి 40 మార్కులు కేటాయించారు.
సులభమే:
సబ్జెక్ట్‌లకు భిన్నంగా జనరల్ నాలెడ్జ్, ఇంగ్లిష్ విభాగాల్లో ప్రశ్నలు అడుగుతున్నప్పటికీ.. వాటి క్లిష్టత సులభంగానే ఉంటుంది. ఓ సాధారణ విద్యార్థి కూడా సమాధానాలు గుర్తించే విధంగా ఉంటాయి. కాబట్టి సంబంధిత మాక్ టెస్ట్‌లను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. బేసిక్ గ్రామర్‌పై పట్టు ఉంటే ఇంగ్లిష్‌లో చక్కని స్కోర్ చేయొచ్చు. ముఖ్యంగా కరక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, స్పాటింగ్ ద ఎర్రర్, ప్యాసేజ్ కొశ్చన్స్ వంటి అంశాలు ఉంటాయి. దీని కోసం మార్కెట్లో దొరికే ఏదైనా ప్రామాణిక పుస్తకాన్ని చదవడం లాభిస్తుంది. జనరల్ నాలెడ్జ్ విషయానికొస్తే.. చరిత్ర, రాజ్యాంగం, స్వాతంత్య్రోద్యమం, తదితర అంశాలకు సంబంధించిన ప్రధాన ఘట్టాలపై క్షుణ్నమైన అవగాహన ఉండాలి. కరెంట్ అఫైర్స్ కోసం.. పరీక్ష జరిగే తేదీకి ముందు సంవత్సర కాలంలో జరిగిన ప్రధాన అంశాలను (సదస్సులు, సమావేశాలు, ఒప్పందాలు, వ్యక్తులు, విజయాలు, అవార్డులు వంటివి) తెలుసుకోవాలి. ఇందుకోసం దినపత్రికలను, కాంపిటీటివ్ మ్యాగజీన్లను చదవాలి. జనరల్ ఆప్టిట్యూడ్ కోసం బ్యాంక్ పరీక్షలకు ఉయోగపడే పుస్తకాల అధ్యయనం మేలు.
జాతీయ స్థాయి ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్షల వివరాలు
సబ్జెక్ట్‌ల వారీగా సిద్ధం ఇలా
గుర్తుంచుకోవాల్సినవి

ఇన్‌స్టిట్యూట్ | మొత్తం ప్రశ్నలు | సబ్జెక్ట్‌ల వారీగా |
ఎయిమ్స్ | 200 | ఫిజిక్స్- 60; కెమిస్ట్రీ- 60; బయాలజీ- 60; జీకే- 20 |
ఏఐపీఎంటీ | 180 | ఫిజిక్స్- 45; కెమిస్ట్రీ- 45; బయాలజీ- 90 |
జిప్‌మర్ | 200 | ఫిజిక్స్- 40; కెమిస్ట్రీ- 40; బయాలజీ- 80;ఇంగ్లిష్- 40 |
సీఎంసీ | 300 | ఫిజిక్స్- 60; కెమిస్ట్రీ- 60; బయాలజీ- 60; జనరల్ ఎబిలిటీ- 120 ప్రశ్నలు(రెండు సెక్షన్లు) |
ఎంజీఐఎంఎస్ |
| ఫిజిక్స్- 60; కెమిస్ట్రీ- 60; బయాలజీ- 60; గాంధీ ఆలోచనలు- 60 |
ఏఐపీఎంటీ ఆధారంగానే బీహెచ్‌యూ, ఏఎఫ్‌ఎంసీ-పుణేలో ప్రవేశం కల్పిస్తారు. |
సబ్జెక్ట్‌ల వారీగా సిద్ధం ఇలా
ఫిజిక్స్
|
కెమిస్ట్రీ
|
బోటనీ
|
జువాలజీ
|
గుర్తుంచుకోవాల్సినవి
- జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ ఎంట్రెన్స్‌లు జ్ఞాపకశక్తి కంటే అవగాహనకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
- గతంలో సీబీఎస్‌ఈ సిలబస్‌కు మన సిలబస్‌కు మధ్య వ్యత్యాసం ఉండేది. ఇప్పుడు ఆ సమస్య అంతగా లేదు. కాబట్టి జాతీయ స్థాయి పరీక్షలకు ప్రత్యేక ప్రిపరేషన్ అవసరం లేదు. ఆయా పరీక్షలను అనుసరించి సబ్జెక్ట్‌లు కాకుండా అదనంగా ఉండే ఇంగ్లిష్, జీకే అంశాలపై దృష్టి సారిస్తే సరిపోతుంది.
- సంబంధిత ఎంట్రెన్స్‌కు సంబంధించి సాధ్యమైనన్ని మాక్ టెస్ట్‌లు రాయాలి. దీని వల్ల సమస్య పరిష్కారంలో వేగంతోపాటు కచ్చితత్వం అలవడుతుంది.
- ముఖ్య ఫార్ములాలు, కీలక పాయింట్లపై క్రమ పద్ధతిలో అవగాహన పెంచుకోవడం మంచిది.
- సెక్షన్ల వారీగా సమయ విభజన చేసుకోవాలి. విరామం, మైండ్ రిలాక్స్ కోసం 10 నిమిషాలు కేటాయించుకోవాలి. విపరీతమైన పోటీ ఉండే ఈ ఎంట్రెన్స్‌లలో ఈ పద్ధతి ఎంతో లాభం చేకూరుస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
- కాన్సెప్ట్ బేస్డ్‌గా ఉండే ప్రశ్నలను ముందు ఎంచుకోండి. వీటి పరిష్కారానికి తక్కువ సమయం పట్టడమే కాకుండా ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. మిగతా విభాగాలను ఆత్మవిశ్వాసంతో చేయడానికి ఇది ఉపకరిస్తుంది.
- సబ్జెక్ట్‌ల వారీగా ఎన్‌సీఈఆర్‌టీ 11,12 తరగతి పుస్తకాలు,చాంద్ పబ్లికేషన్స్,మల్హోత్ర పబ్లికేషన్స్.
Published date : 15 Nov 2014 04:35PM