Skip to main content

నిమ్‌సెట్-2014

డిగ్రీ తర్వాత సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడాలనుకుంటున్న యువతకు చక్కని అవకాశం.. నిమ్‌సెట్ (నిట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్).. దేశంలో ఐఐటీల తర్వాత సాంకేతిక విద్యకు ప్రామాణిక ఇన్‌స్టిట్యూట్‌లుగా పేరొందిన నిట్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) విద్యా సంస్థల నుంచి ఎంసీఏ కోర్సును పూర్తిచేసే అవకాశం కల్పిస్తోంది.. 2014-15 విద్యా సంవత్సరానికి నిమ్‌సెట్ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో సంబంధిత వివరాలు..

11 నిట్‌లు 867 సీట్లు

ప్రవేశం:
మల్టిపుల్ చాయిస్ విధానంలో నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. అభ్యర్థ్ధిలోని వెర్బల్ (శాబ్దిక), మ్యాథమెటికల్ (గణిత) నైపుణ్యాలను ఒక క్రమ పద్ధతిలో పరీక్షించడానికి ఉద్దేశించిన పరీక్ష ఇది. సాధారణంగా ఇటువంటి పరీక్షల్లో కచ్చితత్వానికి ప్రాధాన్యతనిస్తారు. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి తప్పు ప్రశ్నకు 1 మార్కు కోత విధిస్తారు. వివరాలు..
అంశం ప్రశ్నలు
గణితం 50
అనలిటికల్ ఎబిలిటీ -
లాజికల్ రీజనింగ్
40
కంప్యూటర్ అవేర్‌నెస్ 10
జనరల్ ఇంగ్లిష్ 20
మొత్తం 120
సమయం రెండు గంటలు

పిపరేషన్ ఇలా:
మ్యాథమెటిక్స్:
ఇందులో డిగ్రీ స్థాయి సిలబస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. సెట్ థియరీ, ప్రొబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, ఆల్జీబ్రా, కో-ఆర్డినేట్ జ్యామెట్రీ, కాలిక్యులస్, వెక్టార్‌‌స, ట్రిగ్నోమెట్రీ వంటి అంశాలను సిలబస్‌లో పొందుపరిచారు. జాతీయ స్థాయి పరీక్ష కాబట్టి అప్లికేషన్ స్కిల్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు రావచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రాక్టీస్ చేయాలి. అంతేకాకుండా ఈ విభాగానికి అత్యధిక వెయిటేజీ ఇచ్చారు. డిగ్రీ అకాడమీ పుస్తకాలను చదవడం ప్రయోజనకరం.
  • ఇంగ్లిష్ విభాగంలో అభ్యర్థుల సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా కాంప్రెహెన్షన్, బేసిక్ గ్రామర్, వర్డ్ పవర్, సినానిమ్స్, యాంటోనిమ్స్, ఫ్రేజెస్, టెక్నికల్ రైటింగ్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. మాదిరి ప్రశ్నపత్రాలను పరిశీలిస్తూ.. మార్కెట్లో లభించే ప్రామాణిక మెటీరియల్‌ను చదవడం ప్రయోజనకరం.
  • కంప్యూటర్ అవేర్‌నెస్‌కు అన్ని విభాగాల కంటే తక్కువ వెయిటేజీ ఇచ్చారు. కాబట్టి మరీలోతుగా కాకుండా ప్రాథమిక అంశాల ను క్షుణ్నంగా తెలుసుకోవాలి. కంప్యూటర్ ఆర్గనైజేషన్,సీపీయూ, డివెజైస్, డేటారిప్రెజెంటేషన్, ఇంటీజర్‌‌స, ఫ్రాక్షన్స్, బైనరీ-అర్థమెటిక్ ఆపరేషన్స్ ప్రిపేర్ కావాలి.
  • అనలిటికల్ ఎబిలిటీ: ఇందులో సీక్వెన్సెస్ అండ్ సిరీస్, డేటా అనాలిసిస్, కోడింగ్-డీకోడింగ్, డేట్ అండ్ టైమ్ అరేంజ్‌మెంట్ ప్రాబ్లమ్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇందులో మెరుగైన మార్కులు సాధించాలంటే విశ్లేషణ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. 1-20 వరకు టేబుల్స్, 1-30 వరకు వర్గమూలాలు, 1-20 వరకు ఘనాలు, A-Z, Z-A వరకు అక్షర క్రమం (ముందు నుంచి వెనక్కు, వెనక నుంచి ముందుకు), స్థాన విలువలపై పట్టు సాధించాలి.
నిమ్‌సెట్-2014 సమాచారం:
అర్హత:
కనీసం 60 శాతం మార్కులతో బీఎస్సీ/బీఎస్సీ(ఆనర్స్)/బీసీఏ/మూడేళ్ల వ్యవధి ఉన్న ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ/బీఈ/బీటెక్/తత్సమానం.
దరఖాస్తు: ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 3, 2014.
ప్రింట్ అవుట్ దరఖాస్తు పంపడానికి చివరి తేదీ: ఏప్రిల్ 17, 2014
రాత పరీక్ష తేదీ: మే 25, 2014
వివరాలకు: nimcet2014.nita.ac.in

పవేశపరీక్షలో కనీసం 50 శాతం కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే ఏదైనా ఒక ఇన్‌స్టిట్యూట్‌లో సీటు పొందొచ్చు. తిరుచిరాపల్లి, వరంగల్, సూరత్‌కల్, కాలికట్ క్యాంపస్‌లకు ఎక్కువ డిమాండ్ ఉంటోంది. వీటిలో ప్రవేశం పొందాలంటే కనీసం 72 శాతం మార్కులు సాధించాలి. సంబంధిత టాపిక్స్‌లోని క్లిష్ట ప్రశ్నలను గుర్తించి వాటి సాధనపై ఎక్కువ దృష్టి పెట్టాలి. గ్రాడ్యుయేషన్ స్థాయిలో కాలేజీల్లో నేర్చుకునే అంశాలపైనే ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది . ప్రిపరేషన్ నోట్స్‌ను తయారు చేసుకోండి. పరీక్షకు ముందు కనీసం రెండుసార్లు రివిజన్ జరిగేలా ప్రణాళిక వేసుకోవాలి. సమయపాలన ఎంతో కీలకం. గత ప్రశ్నపత్రాలతోపాటు నమూనా పేపర్లను సాధన చేస్తే ప్రభావవంతంగా ఉంటుంది.
Published date : 03 Apr 2014 04:00PM

Photo Stories