Skip to main content

కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2015

కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఇండియన్ ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీలు, ఇండియన్ రైల్వే వంటి వివిధ విభాగాల్లో వైద్యాధికారుల నియామకానికి యూపీఎస్సీ ఏటా కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎంఎస్‌ఈ) నిర్వహిస్తోంది.
ఆకర్షణీయ జీతభత్యాలతో పాటు పవిత్రమైన వైద్య వృత్తి ద్వారా దేశానికి సేవచేసే అవకాశానికి వీలుకల్పించే ఈ పరీక్షకు తాజాగా కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో సీఎంఎస్‌ఈ-2015పై స్పెషల్ ఫోకస్...

ఉద్యోగాల వివరాలు:

విభాగం

ఉద్యోగాల సంఖ్య

1.అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ (రైల్వే)

600

2.అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ (ఇండియన్ ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీస్ హెల్త్ సర్వీసెస్)

39

3.జూనియర్ స్కేల్ (సెంట్రల్ హెల్త్ సర్వీసెస్)

391

4.జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్-గ్రేడ్ 2 (తూర్పు ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లు)

372


అర్హత:
బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ- ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. చివరి ఏడాది చదువుతున్న వారు కూడా పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీరు ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ సమయానికి ఉత్తీర్ణత ధ్రువీకరణపత్రాలు చూపించాల్సి ఉంటుంది.
  • ‘కంపల్సరీ రొటేటింగ్ ఇంటర్న్‌షిప్’లో ఉన్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సీఎంఎస్‌ఈ తుది జాబితా ఎంపిక సమయానికి ఇంటర్న్‌షిప్ పూర్తిచేస్తేనే అపాయింట్‌మెంట్ లభిస్తుంది. వయసు: 32 ఏళ్లు (జనవరి 1, 2015 నాటికి). 1983, జనవరి 2కు ముందు జన్మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు; పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:
రెండు దశల్లో ఉంటుంది. పార్ట్-1 కంప్యూటర్ ఆధారిత పరీక్షకు 500 మార్కులు కేటాయించారు. పార్ట్-2 ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్‌కు 100 మార్కులుంటాయి. పార్ట్-1లో అర్హులకు మాత్రమే పార్ట్-2 పరీక్ష నిర్వహిస్తారు.

పార్ట్-1 ప్రశ్నపత్రం
ఇందులో రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 250 మార్కులుంటాయి. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటా యి. నెగిటివ్ మార్కులున్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.33 మార్కుల కోత విధిస్తారు. ఒక్కో పేపర్‌కు రెండు గంటల సమయం ఉంటుంది.

పేపర్-1:

విభాగం

ప్రశ్నలు

జనరల్ ఎబిలిటీ

30

జనరల్ మెడిసిన్

70

పీడియాట్రిక్స్

20

మొత్తం:

120


పేపర్-2:

విభాగం

ప్రశ్నలు

సర్జరీ

40

గైనకాలజీ అండ్ ఆబ్‌స్టెట్రిక్స్

40

ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్

40

మొత్తం:

120


పేపర్-1 సిలబస్
జనరల్ ఎబిలిటీ:
  • భారతీయ సమాజం, వారసత్వం-సంస్కృతి, ఇండియన్ పాలిటీ, ఎకానమీ, మానవాభివృద్ధి సూచికలు, అభివృద్ధి కార్యక్రమాలు.
  • సహజ వనరులు-వాటి విస్తరణ, లభ్యత, సంరక్షణ సంబంధిత అంశాలు.
  • జీవావరణ శాస్త్రం, పర్యావరణం ప్రాథమిక భావనలు.. ఆరోగ్యం, ఆర్థిక రంగాలపై వాటి ప్రభావం.
  • జనాభా ధోరణులు- ఆరోగ్యం, పర్యావరణం, సమాజంపై వాటి ప్రభావం.
  • దేశంలో వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యం, రవాణా, సేవా రంగాల తీరుతెన్నులు.
  • విపత్తులు, వాటి నిర్వహణ.
  • ఆహార పదార్థాల కల్తీ, ఆహార శుద్ధి, పంపిణీ, నిల్వ.. ప్రజారోగ్యంతో వీటికి సంబంధం.
  • సైన్స్, టెక్నాలజీలో ఇటీవల పరిణామాలు.

జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్: కార్డియాలజీ, రెస్పిరేటరీ డిసీజెస్, గ్యాస్ట్రో- ఇంటెస్టినల్, జెనిటో యురినరీ, న్యూరాలజీ, హెమటాలజీ, ఎండోక్రినాలజీ, మెటబాలిక్ డిసీజెస్, ఇన్ఫెక్షన్స్-కమ్యూనికబుల్ డిసీజెస్, న్యూట్రిషన్/గ్రోత్, డెర్మటాలజీ, మస్కులోస్కెలిటిల్ సిస్టమ్, సైకియాట్రీ, జనరల్ అంశాలపై ప్రశ్నలుంటాయి. వీటితో పాటు పీడియాట్రిక్స్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు వస్తాయి.
Which one of the following is not a vector aborne disease?
(a) Japanese encephalitis
(b) Dengue fever
(c) Kalaazar
(d) Meningococcal meningitis

పేపర్-2
సర్జరీ:
జనరల్ సర్జరీకి సంబంధించి గాయాలు, కాలేయం, రక్త నాళాలు, పేగులు, కణితులు, ఉదర సంబంధ సమస్యలు తదితరాలకు సంబంధించిన శస్త్రచికిత్సల అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటితో పాటు యూరాలజికల్ సర్జరీ, న్యూరో సర్జరీ, ఈఎన్‌టీ సర్జరీ, థొరాసిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, ఆఫ్తమాలజీ, అనస్థీసియాలజీ, ట్రామటాలజీ అంశాలు సిలబస్‌లో ఉన్నాయి.

గైనకాలజీ అండ్ ఆబ్‌స్టెట్రిక్స్: ప్రసూతికి సంబంధించి గర్భ పరిస్థితులు, ప్రసవానంతర పరిస్థితులపై ప్రశ్నలు వస్తాయి. గైనకాలజీలో అప్లయిడ్ అనాటమీ, అప్లయిడ్ ఫిజియాలజీ, జెనిటల్ ట్రాక్ట్‌లో ఇన్ఫెక్షన్లు, నియోప్లాస్మా, గర్భాశయం స్థానంలో మార్పులు వంటివాటిపై ప్రశ్నలుంటాయి. కన్వెన్షనల్ కాంట్రాసెప్టివ్స్, యూడీ, ఓరల్ పిల్స్, ఆపరేటివ్ ప్రొసీజర్, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంశాలుంటాయి.

ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్:ఇందులో సోషల్ అండ్ కమ్యూనిటీ మెడిసిన్, కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్, డిసీజ్, ప్రివెంటివ్ మెడిసిన్, హెల్త్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్లానింగ్, డెమోగ్రఫీ అండ్ హెల్త్ స్టాటిస్టిక్స్, ఎన్విరాన్‌మెంటల్ హెల్త్, న్యూట్రిషన్ అండ్ హెల్త్, ఆక్యుపేషనల్ హెల్త్, జెనిటిక్స్ అండ్ హెల్త్, ఇంటర్నేషనల్ హెల్త్, మెడికల్ సోషియాలజీ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్,మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్, నేషనల్ ప్రోగ్రామ్స్ అంశాలపై ప్రశ్నలు వస్తాయి.
Absolute contraindication for the use of OCPs is:
(a) Thromboembolism
(b) Hypertension
(c) Diabetes
(d) Epilepsy

ముఖ్య సమాచారం
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 10, 2015.
  • పరీక్ష తేదీ: జూన్ 28, 2015.
  • వెబ్‌సైట్: www.upsconline.nic.in

2014 సీఎంఎస్‌ఈ కటాఫ్ వివరాలు
రాత పరీక్ష కటాఫ్:

కేటగిరీ

మార్కులు (500కు)

జనరల్

265

ఓబీసీ

232

ఎస్సీ

203

ఎస్టీ

151

పీహెచ్-1

103



తుది ఎంపిక కటాఫ్ మార్కులు:

కేటగిరీ

మార్కులు (600కు)

జనరల్

340

ఓబీసీ

325

ఎస్సీ

284

ఎస్టీ

255

పీహెచ్-1

197


పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ
ఆన్‌లైన్ ఆధారిత పరీక్షలో అర్హత సాధించిన వారికి పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దీనికి వంద మార్కులు ఉంటాయి. తమ అకడమిక్ నేపథ్యానికి సంబంధించి అభ్యర్థులకున్న సాధారణ పరిజ్ఞానం, సామర్థ్యాన్ని ఇంటర్వ్యూ ద్వారా అంచనా వేస్తారు. బృందంతో కలిసి పనిచేసే సామర్థ్యం, భావప్రసార నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యం, నిర్ణయాలు తీసుకునే నేర్పు తదితర నైపుణ్యాలను ఈ పరీక్ష ద్వారా తెలుసుకుంటారు. నిజాయితీ, నైతిక విలువలు, వృత్తిపట్ల నిబద్ధత, వర్తమాన వ్యవహారాలపై పరిజ్ఞానాన్ని కూడా అంచనా వేస్తారు.

కెరీర్
  • ఆన్‌లైన్ పరీక్ష, పర్సనాలిటీ పరీక్షలో విజయం సాధించిన వారిని ప్రతిభ, ఖాళీలను బట్టి వివిధ విభాగాల్లో నియమిస్తారు. రైల్వేలో అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ (ఏడీఎంవో) పోస్టుకు ఎంపికైన వారు సంస్థకు సంబంధించిన ఆసుపత్రుల్లో పనిచేయాల్సి ఉంటుంది. వీరికి వేతన స్కేలు రూ.15,600-రూ.39,100 (గ్రేడ్ పే రూ.5,400). దీంతో పాటు నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్సు కూడా ఉంటుంది.
  • అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్‌గా ఇండియన్ ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీస్‌కు ఎంపికైన వారికి వేతన స్కేలు రూ.15,600 - రూ.39,100 (గ్రేడ్ పే రూ.5,400). దీంతో పాటు ఇతర అలవెన్సులుంటాయి. సెంట్రల్ హెల్త్ సర్వీస్‌లో జూనియర్ స్కేల్ పోస్టుల్లో నియమితులైన వారు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీం (సీజీహెచ్‌ఎస్) పరిధిలోని ఆసుపత్రుల్లో పనిచేయాలి.
  • తూర్పు ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లకు జనరల్ డ్యూటీ ఆఫీసర్‌గా ఎంపికైన వారు ఆయా ప్రాంతాల పరిధిలోని ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కుటుంబ సంక్షేమ కేంద్రాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
  • ఎంపికైన విభాగాన్ని బట్టి ఏడాది నుంచి రెండేళ్లవరకు ప్రొబేషన్ ఉంటుంది. అవసరమనుకుంటే దీన్ని పొడిగిస్తారు. ఈ దశను విజయవంతంగా పూర్తిచేసుకున్న వారిని పూర్తిస్థాయి ఉద్యోగంలో నియమిస్తారు.

పీజీ ఎంట్రన్స్ స్థాయి కంటే తేలికే!
కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ పరీక్ష క్లిష్టత స్థాయి పీజీ మెడికల్ ఎంట్రన్స్ స్థాయి కంటే కొంత సులభంగానే ఉంటుంది. అడిగే ప్రశ్నలు కూడా క్లినికల్, పారా క్లినికల్‌కు సంబంధించి ఎక్కువగా ఉంటాయి. ఔత్సాహిక అభ్యర్థులు ఎంబీబీఎస్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయడం బాగా ఉపకరిస్తుంది. అంటే ఎంబీబీఎస్ అకడమిక్స్‌లో నైపుణ్యం ఉంటే సీఎంఎస్‌లో రాణించడం కష్టం కాదు. అంతేకాకుండా ఆయా అంశాలను అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో చదవడం కూడా ఎంతో అవసరం. మొత్తం ప్రశ్నల్లో 70 నుంచి 80 శాతం ప్రశ్నలు ఈ తరహాలోనే ఉంటాయి. జనరల్ స్టడీస్‌కు సంబంధించి 30 ప్రశ్నల్లో అధిక శాతం పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాల నుంచే ఉంటున్నాయి. ఇవి కూడా బేసిక్ నైపుణ్యాలను పరీక్షించేలా ఉంటున్నాయి. కాబట్టి ఆందోళన అనవసరం. అదేవిధంగా సీఎంఎస్ ఔత్సాహికులకు ఉండాల్సింది లక్ష్యంపై స్పష్టత. చాలా మంది మెడికల్ గ్రాడ్యుయేట్లలో సీఎంఎస్ ద్వారా ఉద్యోగంలో చేరితే ఉన్నత విద్య సాధ్యం కాదనే అభిప్రాయం ఉంది. అయితే ఇలా నియామకాలు పొందిన అభ్యర్థులకు ఆయా విభాగాల నిబంధనల మేరకు రెండేళ్ల బాండ్ పిరియడ్ (రైల్వేలో ఏడాది) తర్వాత ఉన్నత విద్యను అభ్యసించేందుకు స్టడీ లీవ్ లభిస్తుంది. కాబట్టి ఉన్నత విద్యపరంగా ఆందోళన చెందక్కర్లేదు. ఇక సీఎంఎస్-2015 ఔత్సాహికులకు ఇచ్చే సలహా.. ఒక క్రమబద్ధమైన ప్రిపరేషన్ సాగిస్తే అందుబాటులో ఉన్న సమయంలో విజయావకాశాలు మెరుగుపరచుకోవడం తేలికే. ఈ క్రమంలో ఎయిమ్స్ పీజీ ఎంట్రన్స్ నమూనా ప్రశ్న పత్రాలను Comprehensive Guide to Combined Medical Services Rajeev Kumar, Prakash Nayak పుస్తకాన్ని చదివడం మరింత ఉపయుక్తంగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్.
సూరబత్తుని మహేశ్, సీఎంఎస్-2014 విజేత (ఆల్ ఇండియా ర్యాంకు 14).
Published date : 27 Mar 2015 05:43PM

Photo Stories