ఎంబీబీఎస్, బీడీఎస్‌కు ప్రత్యామ్నాయం.. వెటర్నరీ
Sakshi Education
బైపీసీ విద్యార్థులుఎంబీబీఎస్, బీడీఎస్ తర్వాత ప్రత్యామ్నాయంగా భావించే కోర్సు.. బీవీఎస్‌సీ అండ్ ఏహెచ్ (Bachelor of Veterinary Science and Animal Husbandry). ఇది వైద్య వృత్తికి ప్రత్యామ్నాయంగా.. కొలువుల కామధేనువుగా నిలుస్తోంది. జంతువుల వ్యాధుల నిర్ధారణ, చికిత్స వంటి నైపుణ్యాలు అందించే బీవీఎస్‌సీ అండ్ ఏహెచ్ కోర్సు పూర్తి చేస్తే సర్కారీ కొలువు ఖాయం. స్వయం ఉపాధికీ అవకాశాలు మెండు...
పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా..
ఈ కోర్సులో మార్పులు చేయడానికి పెరుగుతున్న అవసరాలే కారణం. ప్రస్తుత పరిస్థితుల్లో పరిశోధన, క్షేత్ర నైపుణ్యాలు తప్పనిసరి. అందుకే ఇంటర్న్‌షిప్ వ్యవధిని ఏడాదికి పెంచారు. ఎంటర్‌ప్రెన్యూరియల్ ట్రైనింగ్ పేరుతో ఔత్సాహికులను ప్రోత్సహించే చర్యలూ చేపట్టనున్నారు. తద్వారా స్వయం ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. విద్యార్థులు దీన్ని ప్రధాన కోర్సులా కాకుండా ప్రత్యామ్నాయ కోర్సు అనుకుంటే నిరాసక్తత ఏర్పడుతుంది. జంతు సంరక్షణ, పశు పోషణ/సంరక్షణ విభాగాల్లో వాస్తవ ఆసక్తి ఉంటేనే ఈ రంగంలో మంచి కెరీర్ సొంతమవుతుంది.
- ఎ.కృష్ణమాచారి, ప్రెసిడెంట్, ఏపీ వెటర్నరీ కౌన్సిల్.
ఇటీవల కాలంలో ఈ కోర్సుకు క్రేజ్ పెరుగుతోంది. అయితే కోర్సు పూర్తి చేసిన విద్యార్థుల్లో ప్రాక్టికల్ నైపుణ్యాల కొరత.. నాణ్యమైన బోధన లేకపోవడం వంటి పరిస్థితులను గుర్తించిన వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ).. బీవీఎస్‌సీ అండ్ ఏహెచ్ కోర్సులో మార్పులకు శ్రీకారం చుట్టింది. జాతీయ స్థాయిలో ఈ విద్యా సంవత్సరం (2016-17) నుంచే వీటిని అమలు చేయాలని సంబంధిత యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు, కళాశాలలకు ఉత్తర్వులు జారీ చేసింది.
కోర్సు వ్యవధి అయిదున్నరేళ్లు
బీవీఎస్‌సీ అండ్ ఏహెచ్ కోర్సు కాల వ్యవధిని అయిదున్నరేళ్లకు పెంచారు. ఇప్పటివరకు ఈ కోర్సు కాల వ్యవధి నాలుగున్నరేళ్లు. అదనంగా మరో ఆరు నెలలు రొటేటరీ ఇంటర్న్‌షిప్ కలిపి మొత్తం అయిదేళ్లుగా అమలవుతోంది. విద్యార్థుల్లో ప్రాక్టికల్ నైపుణ్యాలు మరింత పెంపొందించాలనే ఉద్దేశంతో వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, రొటేటరీ ఇంటర్న్‌షిప్ వ్యవధిని ఆరు నెలల నుంచి 12 నెలలకు పెంచింది. అంటే.. మొత్తం కోర్సు వ్యవధి అయిదున్నరేళ్లకు పెరిగింది.
పెరిగిన ఇంటర్న్‌షిప్ వ్యవధి
బీవీఎస్‌సీ అండ్ ఏహెచ్ కోర్సు మార్పుల్లో భాగంగా ప్రాక్టికల్ అప్రోచ్‌కు ప్రాధాన్యం పెరిగింది. థియరీ - ప్రాక్టికల్స్ నిష్పత్తిని 60:40గా పేర్కొనడమే ఇందుకు నిదర్శనం. అదేవిధంగా ఆరు నెలలుగా ఉండే రొటేటరీ ఇంటర్న్‌షిప్ వ్యవధిని ఏడాదికి పెంచారు. ఇంటర్న్‌షిప్ సమయంలో కచ్చితంగా నిర్వర్తించాల్సిన విధి విధానాలను స్పష్టంగా పేర్కొన్నారు. దీని ప్రకారం- ముందుగా అభ్యర్థులు ఇంటర్న్‌షిప్ కోసం సంబంధిత రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్‌లో తమ పేరు నమోదు చేసుకోవాలి. ఇంటర్న్‌షిప్‌ను నిపుణులైన, గుర్తింపు పొందిన ఫ్యాకల్టీ పర్యవేక్షణలో పూర్తిచేయాలి. తప్పనిసరిగా వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్, జంతు ప్రదర్శన శాలలు, పాల కేంద్రాలు, పౌల్ట్రీ ఫామ్స్, ఫీల్డ్ హాస్పిటల్, జంతు సంరక్షణ సంస్థలు, వ్యాక్సీన్ ఇన్‌స్టిట్యూట్స్, లైవ్ స్టాక్ ఫార్మాస్యూటికల్ సంస్థలు, ఫీడ్ ఇండస్ట్రీల్లో మాత్రమే చేయాలి. మొత్తం 12 నెలల వ్యవధిలో ఉండే రొటేటరీ ఇంటర్న్‌షిప్ సమయంలో విద్యార్థులు ప్రతి నెలా కచ్చితంగా 500 ఔట్ డోర్, 10 ఇండోర్ కేసెస్‌ను సమీక్షించాల్సి ఉంటుంది.
క్రెడిట్స్ విధానం
వీసీఐ తాజా మార్పులను అనుసరించి బీవీఎస్‌సీ కోర్సు సిలబస్ క్రెడిట్స్ పద్ధతిలో అమలు కానుంది. సెమిస్టర్ విధానంలో 179 క్రెడిట్ అవర్స్‌కు సరితూగేలా 81 క్రెడిట్స్‌ను నిర్దేశించింది. థియరీకి, ప్రాక్టికల్‌కు వేర్వేరుగా సంవత్సరం వారీగా ఈ క్రెడిట్స్‌ను పేర్కొంది. కోర్సు వ్యవధిలోని సంవత్సరాలను ప్రొఫెషనల్ ఇయర్‌గా పేర్కొనే బీవీఎస్‌సీ అండ్ ఏహెచ్‌లో తొలి మూడు ప్రొఫెషనల్ ఇయర్స్ ఏడాది వ్యవధిలో ఉంటాయి. నాలుగో ప్రొఫెషనల్ ఇయర్ మాత్రం ఏడాదిన్నర వ్యవధిలో ఉంటుంది.
వ్యాపార నైపుణ్యాలు పెంపొందేలా
ఇంటర్న్‌షిప్ ద్వారా ఆయా విభాగాల్లో క్షేత్ర నైపుణ్యాలతోపాటు అభ్యర్థుల్లో వ్యాపార నైపుణ్యాలు పెంపొందేలా నిర్దిష్ట వ్యవధిలో ఎంటర్‌ప్రెన్యూరియల్ ట్రైనింగ్ అండ్ మేనేజ్‌మెంట్ విధానం అమలు చేయనున్నారు. దీని ప్రకారం- అభ్యర్థులు పశు సంరక్షణ పరిధిలోని పలు విభాగాల్లో కొత్త ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలు చేసేలా శిక్షణనిస్తారు. కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే విద్యార్థులకు వడ్డీ లేని రుణాలు, మౌలిక సదుపాయాలు కల్పించి స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించాలని వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సూచించింది.
ప్రాజెక్ట్ రిపోర్ట్ తప్పనిసరి
ఇంటర్న్‌షిప్, ఎంటర్‌ప్రెన్యూరియల్ ట్రైనింగ్ పూర్తిచేసిన విద్యార్థులు తప్పనిసరిగా ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించాలి. అంతేకాకుండా ఇంటర్న్‌షిప్ సమయంలో అభ్యర్థులు పొందిన నైపుణ్యాలను పరీక్షించే విధానం కూడా అమలవుతోంది. దీని ప్రకారం- మొత్తం వంద మార్కులకు మూల్యాంకన చేయనున్నారు. అభ్యర్థులు ఇంటర్న్‌షిప్ సమయంలో ఆయా విభాగాల్లో చూపిన ప్రతిభ, పనితీరు, ప్రాజెక్ట్ రిపోర్ట్ సహా పలు అంశాలను నిర్దేశించి వంద మార్కులకు ఇంటర్న్‌షిప్ పెర్‌ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగ్ బుక్ - 10 మార్కులు; వివిధ విభాగాల్లో పనితీరు-20 మార్కులు; ఎంటర్‌ప్రెన్యూరియల్ అవుట్‌పుట్ -20 మార్కులు; కేస్ రిపోర్ట్స్/ప్రెజెంటేషన్-10 మార్కులు; రాత పరీక్ష -30 మార్కులు; వైవా -10 మార్కులు; మొత్తం: 100 మార్కులు.
అదనంగా నాలుగు నెలల గడువు
మొత్తం 12 నెలల ఇంటర్న్‌షిప్ సమయం తర్వాత నిర్వహించిన మూల్యాంకనలో కనీస అర్హత మార్కులు (50 శాతం) సాధించని అభ్యర్థులకు మరో రెండు నెలలు గడువు ఇస్తారు. ఈ లోపు వారు తమ నైపుణ్యాలను పెంపొందించుకొని, మరోసారి మూల్యాంకనకు సిద్ధం కావాలి. ఈ రెండు నెలల్లోనూ చేయలేకపోతే మరోసారి మరో రెండు నెలల గడువు ఇస్తారు. ఇలా మొత్తం రెండు విడతలుగా నాలుగు నెలల అదనపు గడువులో ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ పొందాలి. అది చేయలేకుంటే.. అప్పటివరకు వారు చేసిన ఇంటర్న్‌షిప్ రద్దవుతుంది. అలాంటి విద్యార్థులు కొత్తగా ఇంటర్న్‌షిప్‌నకు నమోదు చేసుకొని అందుకోసం మరో 12 నెలలు కేటాయించాలి.
ఫ్యాకల్టీపై ప్రత్యేకంగా
విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడంలో కీలకమైన ఫ్యాకల్టీ విషయంలోనూ వీసీఐ పటిష్ట నిబంధనలు రూపొందించింది. ప్రతి విభాగానికి నిర్దిష్టంగా ఉండాల్సిన అధ్యాపకులు, వారి అర్హతలను పేర్కొంది. మొత్తం 17 విభాగాలకు సబ్జెక్టుల వారీగా ఉండాల్సిన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ల సంఖ్యను నిర్దిష్టంగా పేర్కొంది. వెటర్నరీ సర్జరీ అండ్ రేడియాలజీ విభాగానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయిలో ముగ్గురు; అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయిలో ఒక్కరు; ప్రొఫెసర్ స్థాయిలో ఒక్కరు మొత్తం అయిదుగురు ఫ్యాకల్టీ ఉండాలి. వెటర్నరీ అనాటమీ బోధనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయిలో ఇద్దరు; అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ స్థాయిల్లో ఒక్కరు చొప్పున మొత్తం నలుగురు సిబ్బంది ఉండాలి.

సంవత్సరం థియరీ ప్రాక్టికల్ మొత్తం
సంవత్సరం | థియరీ | ప్రాక్టికల్ | మొత్తం |
మొదటి | 12 | 6 | 18 |
రెండో | 15 | 7 | 22 |
మూడో | 15 | 9 | 24 |
నాలుగో | 8 | 9 | 17 |
మొత్తం | 50 | 31 | 81 |
పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా..
ఈ కోర్సులో మార్పులు చేయడానికి పెరుగుతున్న అవసరాలే కారణం. ప్రస్తుత పరిస్థితుల్లో పరిశోధన, క్షేత్ర నైపుణ్యాలు తప్పనిసరి. అందుకే ఇంటర్న్‌షిప్ వ్యవధిని ఏడాదికి పెంచారు. ఎంటర్‌ప్రెన్యూరియల్ ట్రైనింగ్ పేరుతో ఔత్సాహికులను ప్రోత్సహించే చర్యలూ చేపట్టనున్నారు. తద్వారా స్వయం ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. విద్యార్థులు దీన్ని ప్రధాన కోర్సులా కాకుండా ప్రత్యామ్నాయ కోర్సు అనుకుంటే నిరాసక్తత ఏర్పడుతుంది. జంతు సంరక్షణ, పశు పోషణ/సంరక్షణ విభాగాల్లో వాస్తవ ఆసక్తి ఉంటేనే ఈ రంగంలో మంచి కెరీర్ సొంతమవుతుంది.
- ఎ.కృష్ణమాచారి, ప్రెసిడెంట్, ఏపీ వెటర్నరీ కౌన్సిల్.
Published date : 30 Jul 2016 01:50PM