సెల్ఫ్ ఇంట్రడక్షన్ సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు- సూచనలు
కాబట్టి, మిలియన్ డాలర్ల విలువ చేసే ప్రశ్న ఏంటంటే... సెల్ఫ్ ఇంట్రడక్షన్ (స్వీయ పరిచయం) సమయంలో ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? అది ఆకట్టుకునేలా, వినడానికి యోగ్యంగా ఉండాలంటే ఏమి చేయాలి?
ఏ విషయాలు చెప్పాలంటే...
పర్సనల్ ఇన్ఫర్మేషన్:
పేరు, ఊరు, అర్హతలు (టెన్త్, ఇంటర్, డిగ్రీ మార్కులతో సహా), కుటుంబ నేపథ్యం (కుటుంబ సభ్యుల సంఖ్య, తల్లిదండ్రులు, తోబుట్టినవారి వృత్తి, అవసరమైన ఇతర విషయాలు) చెప్పాలి.
ఇంటర్న్‌షిప్- ప్రోజెక్టులు:
మీరు గతంలో చేపట్టినప్రాజెక్టు గురించి వివరంగా చెప్పడానికిప్రయత్నించాలి. అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ కనెక్టివిటీ, భవిష్యత్తు ప్రణాళిక, ప్రాజెక్ట్ ద్వారా మీరు నేర్చుకున్న టెక్నికల్, మేనేజ్‌మెంట్ స్కిల్స్‌ను చెప్పాలి.
ఉదా: ఇంతకు ముందు జావా లాంగ్వేజ్ గురించి నాకు తెలియదు కానీ ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్‌లో పనిచేయడం ప్రారంభించానో ఈ లాంగ్వేజ్‌ను క్షుణ్ణంగా తెలుసుకోగలిగాను. అంతేకాకుండా ఈ ప్రాజెక్టులో మంచి నాయకుడిగా ఏవిధంగా రానించింది వివరించాలి.
బలాలు (స్ట్రెంథ్స్):
నిజజీవితంలోని ఉదాహరణల ద్వారా మీ బలాలను కనీసం ఐదింటిని వివరించండి.
ఉదా: మా కాలేజీలో నేను కల్చరల్ సెక్రటరీగా వరుసగా రెండు సంవత్సరాలు పనిచేశాను. చిన్న తప్పులుకూడా దొర్లకుండా ఫంక్ష న్స్ ఎంతో నైపుణ్యంగా నిర్వహించగలిగాను (ఇది మీలోని నాయకత్వ లక్షణాలను, టీమ్ ప్లేయర్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, సానుకూల ప్రవర్తనను తెలియజేస్తుంది)
బలహీణతలు (వీక్‌నెస్):
మీ బలహీణత లు... ప్రస్తుతం మీకు బలాలుగా ఏవిధంగా మారాయో వివరించండి.
ఉదా: ప్రాజెక్ట్ పనుల్లోపడి మొదట్లో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాను. కానీ ఇప్పుడు ప్రతీరోజు 15 నిముషాలు క్రమంతప్పకుండా వ్యాయామం చే స్తున్నాను. ఇది నా మనస్సును, మైండ్‌ను ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది.
సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఆకట్టుకునేలా, వినడానికి యోగ్యంగా ఉండాలంటే.... పాటించవలసిన జాగ్రత్తలు
- నా ఇంటర్న్‌షిప్ విషయాలు మొదటిగా మీతో పంచుకుంటాను లేదా నా విద్యాసంబంధిత విషయాలుతో ప్రారంభిస్తాను... వంటి అసాధారణ పద్ధతిలో కాన్ఫిడింట్‌గా మీ పరిచయం ప్రారంభించండి (సాధారణంగా ఇతరులు వారి పేరుతో ప్రారంభిస్తారు). తర్వాత ఇంటర్న్‌షిప్ వివరాలు ఆ తర్వాత కుటుంబ సంబంధిత విషయాలు చెప్పాలి.
- మీరు మీ గురించి పరిచయం చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఆపకండి.
- ఒకే విధమైన పదాలను (తరచుగా వాడటం) రిపీట్ చేయడం మానండి. ఉదా: నేను ప్రాథమిక విద్యను పూర్తిచేశాను. నేను ఇంజనీరింగ్ పూర్తి చేశాను. ముగిసింది లేదా చదివాను వంటివి వాడాలి.
- నా కుటుంబ నేపథ్యం గురించి లేదా అకడమిక్స్ గురించి మరింతగా తెలుసుకోవాలనుకుంటున్నారా.. వంటి ప్రశ్నలను ఇంటర్వ్యూ చేసేవారిని అడగటం ద్వారా వారిని ఆకట్టుకోవచ్చు.
- ఇంటర్వ్యూచేసేవారికి గత ప్రాజెక్ట్‌లో మీరు నేర్చుకున్న విషయాల గురించి స్పష్టంగా తెలియజేయండి.
- మిమ్మల్ని సపోర్ట్ చేసిన లేదా సహాయం చేసిన ప్రొఫెసర్స్, సీనియర్ల గురించి తెలియజేయండి.
- ఆ ప్రాజెక్ట్‌ను మీరు ఇష్టపడటానికి గల కారణాన్ని లేదా మీరు ఎంచుకోవడానికి లేదా సమాజ అభివృద్ధి కోసం ప్రాజెక్ట్ చేపట్టిన భవిష్యత్తు ప్రణాళికలను తెలియజేయండి.
- మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే కంపెనీ లక్ష్యాలు, మిషన్, ఆబ్జెక్టివ్స్‌తో పరోక్షంగా సంబంధమున్న సమాధానాలు ఇవ్వండి. అది ఒకవేళ టెక్నికల్ ఆన్సర్ అయితే ఆ కంపెనీ నుంచి టెక్నాలజీ సంబంధిత ఆఫర్ రావచ్చు.
- మీరు మాట్లాడేటప్పుడు సానుకూల (పాజిటివ్) పదాలను, ప్రాఫెషన్‌కు సంబంధించిన పదాలను వినియోగించండి.
పైన పేర్కొన్న అంశాలన్నింటిని దృష్టిలో ఉంచుకుంటే మీ ఇంటర్వ్యూ నల్లేరుపై నడకలా సాఫీగా సాగిపోతుంది.