ఇంటర్వ్యూలో మెరవాలంటే... ఇవిగో మార్గాలు!
ప్రోబ్లెంసాల్వింగ్ స్కిల్స్ఇంటర్వ్యూవర్స్‌సమస్యలను చేధించేవారిని వెదుకుతారు. సమస్యలను సృష్టించేవారిని కాదు. అందుకే ఇంటర్వ్యూలో మిమ్మల్ని ప్రోబ్లెంసాల్వింగ్ స్కిల్స్‌ను పరీక్షించే ప్రశ్నలను అడుగుతారు. సమధానం చెప్పేముందు.. మొదటిగా ఆ ప్రశ్నను బాగా అర్థం చేసుకోండి. ఆ తర్వాత దానిని సాధించే లేదా పరిష్కరించే అన్ని మార్గాల గురించి వారికి తెలియజేయండి. సమస్యా పరిష్కారమార్గాలలో సృజనాత్మకతను ప్రదర్శించడం మనకు ప్లస్ పాయింట్ అవుతుంది.
లిజనింగ్ స్కిల్స్
ఇంటర్వ్యూలో విజయం సాధిండానికి వినే నైపుణ్యం కూడా తోడ్పడుంది. ఎప్పుడైతే ఇంటర్వ్యూవర్ చెప్పేది శ్రద్ధగా వింటారో ఆ ప్రశ్నను సరిగ్గా అనలైజ్ చేసి, కరెక్ట్ ఆన్సర్ ఇవ్వగలుగుతారు.
విశ్లేషణాత్మకమైన ఆలోచన
ఇంటర్వ్యూలో ఒకటి లేదా రెండు కష్టసాధ్యమైన ప్రశ్నలను మీరు ఎదుర్కోవచ్చు. రిక్రూటర్స్ ఈ విధమైన ప్రశ్నలను అడగడం ద్వారా మీలోని డెషిషన్ మేకింగ్ స్కిల్స్‌ను, క్లిష్టసమయాల్లో ఆలోచించే విధానమును అంచనా వేస్తారు. ఇంటర్వ్యూచేసేవారికి సమయస్ఫూర్తితో ఆలోచించగలిగే వారు కావాలి.
సరైన నిర్ణయాలు తీసుకోవడం
ప్రతీ ఒక్కరు ప్రతీ రోజు వ్యక్తిగతంగా లేదా వృత్తి పరంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆయా నిర్ణయాలు ఆయా సమస్యలకు పరిష్కారాన్ని చూపుతాయి. కాబట్టి ప్రతిఒక్కరికీ సమస్యలను పరిష్కరించగల నైపుణ్యం ఉంటుంది. ఇంటర్వ్యూలో కూడా... రిక్రూటర్స్ ఎవరైతే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించగలరో అటువంటి వారి కోసం వెదుకుతారు. వారు అడిగే ప్రోబ్లం సాల్వింగ్ ప్రశ్నలకు మీరు ఇచ్చే సమాధానాలు మీలోని సమస్యలను పరిష్కరింగలిగే నైపుణ్యాన్ని అంచనా వేయడానికి దోహదపడతాయి. వారి ప్రశ్నలకు మీరు సూచించే పరిష్కారమార్గాలే మీ సమస్యా పరిష్కార సామర్ధ్యానికి గీటురాయి.
నాయకత్వ లక్షణాలు
ఇంటర్వ్యూ చేసే కంపెనీలు టీమ్‌ను నిర్వహించగలిగే వారి కోసం వెదుకుతాయి. మీరు ఒక టీమ్ కు లీడర్ అయితే, ఒక కొత్త ప్రాజెక్ట్‌ను ఏవిధంగా నిర్వహిస్తారు ? వంటి ప్రశ్నలను అడగడం ద్వారా మీలోని నాయకత్వలక్షణాలను ఇంటర్వ్యూవర్స్ పరీక్షిస్తారు. ఇటువంటి ప్రశ్న అడగగానే మీరు తొందరపడి సమాధానం చెప్పకూడదు. నిదానంగా ఆలోచించి కాన్ఫిండెంట్‌గా సమాధానం చెప్పాలి. మీ సమాధానం నిజాయితీగా ఉండాలి, టీమ్ పట్ల మీ బాధ్యతను వ్యక్తీకరించాలి. ఇంకా... గతంలో మీరు టీమ్‌లీడర్ గా పనిచేసి ఉంటే మీ ఎక్స్‌పీరియన్స్ ను వారితో పంచుకోవాలి.
సానుకూల ధృక్పదం
స్నేహపూర్వక వైఖరి, చిరునవ్వుతో కూడిన ముఖం ఇతరులు మిమ్మల్ని ఇష్టపడేలా చేస్తుంది. ఇంటర్వ్యూవర్లు మిమ్మల్ని అడిగే ప్రశ్నల ద్వారా మీ వైఖరిని అంచనా వేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి పాజిటివ్ ఆటిట్యూడ్ తో ఇంటర్వ్యూకి వెళ్తే సత్ఫలితాలు పొందవచ్చు.
చివరిగా... ఇంటర్వ్యూకి వెళ్లేముందు అన్ని అంశాలపై క్షుణ్ణంగా ప్రిపేరై వెళ్లాలి. ఏం చెబుతున్నారు, ఎలా చెబుతున్నారు అనే అంశాలు కూడా మీ విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. గుర్తుంచుకోండి... మంచి ప్రణాళికల ద్వారానే మంచి ఫలితాలను పొందగలుగుతారు.