Skip to main content

ఇంటర్వ్యూకి వెళ్లే రోజు ఏం చేయాలంటే...!

రాత పరీక్షకంటే ఇంటర్వ్యూచాలా భిన్నమైనది. ఇంటర్వ్యూలో ప్రాముఖ్యంగా మూడు ముఖ్యమైన విషయాలపై జాగ్రత్త వహించాలి. ఒకటి శరీరకదలిక లు, రెండు డ్రెస్, ఇకమూడోది ముఖకవళికలు.

 

ఇంటర్వ్యూరోజు తీసుకోవల్సిన జాగ్రత్తలు

 

  • డ్రెస్ నీట్‌గా, సాధారణంగా ఉండాలి. దృష్టిని మరల్చేలా ఆడంబరంగా ఉండకూడదు.
  • సాధారణగా చాలా మంది చేసే మిస్టేక్...ఇంటర్వ్యూ రూమ్‌లోకి ప్రవేశించిన తర్వాత లోపలికి రావచ్చా అని అనుమతి కోరడం. కానీ ముందుగానే ప్రవేశించారనే విషయం గ్రహించాలి. ఇటువంటివి చేయకూడదు. మెల్లగా తలుపు తట్టి ఇంటర్వ్యూవర్ అనుమతి తీసుకుని ప్రవేశించాలి.
  • ఇంటర్వ్యూ టేబుల్ దగ్గరికి కాన్ఫిడెంట్‌గా నడుచుకుంటూ వెళ్లాలి. తర్వాత ఇంటర్వ్యూ ప్యానెల్ కూర్చోమని చెప్పేంతవరకూ మీకైమీరుగా కుర్చీలో కూర్చోకూడదు.
  • కూర్చునేతీరు కంఫర్టబుల్‌గా ఉండాలి. ఇంటర్వ్యూ టేబుల్‌పై పడడం లేదా వెనుకకు వాలి కూర్చోవడం చేయకూడదు. శరీరం నిటారుగా, రిలాక్స్‌గా ఉంచాలి. చేతులు మీ తొడలపై ఉంచాలి. ఈ విధంగా కూర్చోవడం ద్వారా మీ చేతికదలికలను అదుపులో ఉంచడానికి వీలుగా ఉంటుంది.
  • ముఖంలో చిరునవ్వు ఉండేలా చూసుకోండి.
  • ఇంటర్వ్యూ బోర్డులో ఇద్దరు లేదా ముగ్గురు ఉంటే ప్రతిఒక్కరితో ఐ కాంటాక్ట్ ఉండాలి. ప్రశ్న ఎవరు అడుగుతున్నారో వారి కళ్లలోకి ప్రశాంతంగా చూస్తూ వినాలి సమాధానం చెప్పేటప్పుడు మాత్రం మిగతావారి వైపుకూడా చూస్తూ చెప్పాలి.
  • సాధారణంగా చేసే మిస్టేక్.... సమాధానం చెప్పేటప్పుడు పైకి లేదా కిందికి చూస్తూ చెప్పడం ద్వారా వారి దృష్టి మీనుంచి తొలగిపోతుంది. ఇది చేయకూడదు.
  • పశ్నలకు సమాధానాలు చెప్పేటప్పుడు కాన్ఫిడెంట్‌గా చెప్పండి. గుర్తుపెట్టుకోండి ఇంటర్వ్యూ కేవలం ప్రశ్నాసమాధానాల కోసం ఏర్పాటు చేసింది కాదు. ఒకవేళ మీకు ఏదైనా ప్రశ్నకు సమాధానం తెలియకపోతే, అప్పుడు కాన్ఫిడెంట్‌తో ప్రశాతంగా నవ్వుతూ మీకు సమాధానం తెలియదని చెప్పండి. ఇది మీ నిజాయితీని ప్రతిబింబిస్తుంది.
  • మీ బయోడేటా సింపుల్‌గా, నిజాయితీగా ఉండాలి. ఎందుకంటే... చాలా ప్రశ్నలు మీ బయోడేటా నుంచే అడుగుతారు.


సాధారణంగా ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలు
మీ అలవాట్లు (హాబీస్) ఏమిటి?

 

  • ఒక వేళ న్యూస్ పేపర్ చదవడం అయితే... తాజా వార్తలపై మిమ్మల్ని ప్రశ్నలను అడుగుతారు.
  • మీ అలవాటు పుస్తకాలు చదవడం అయితే... రకరకాల పుస్తకాలు, రచయితలు, సింపుల్ కంటెట్.. లపై ప్రశ్నలు అడగవచ్చు.
  • ఒకవేళ మ్యూజిక్ వినడం అయితే... ఎటువంటి మ్యూజిక్ వింటారు? మీ ఫేవరేట్ సింగర్ ఎవరు? వంటివి అడుగుతారు.


సాధారణంగా అడిగే ప్రశ్నల్లో ముఖ్యమైనది... మీ గురించి చెప్పండి?
మీ పేరు, ఊరు, మీ విద్యార్హతలు, మీ తండ్రి, తల్లి, అక్కాచెల్లెల్లు, అన్నదమ్ముల వివరాలు తెలియజేయండి. ఇంకా మీరు ముఖ్యమని భావించే ఇతర విషయాలు కూడా చెప్పండి.

మీ ఊరి గురించి చెప్పండి?
మీ ఊరి గురించి... అంటే ముఖ్యమైన టూరిస్ట్ ప్రదేశాల గురించి, అవి ఎందుకు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.. మొదలైన విషయాలు వివరంగా చెప్పాలి.

గుర్తుంచుకోవల్సిన విషయాలు

 

 

  • ఇంటర్వ్యూ గదిలోనికి ప్రవేశించే ముందుగా తలుపు తట్టి అనుమతి కోరాలి
  • ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని ఎగాదిగా చూడకూడదు
  • ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని ఇంటర్వ్యూవర్‌గాకాకుండా స్నేహితుడిలా చూడండి


ఇంటర్వ్యూ గదిలోకి ప్రవేశించే ముందు...

 

 

  • కొన్ని నిముషాలపాటు దీర్ఘంగా శ్వాస (డీప్ బ్రీత్) తీసుకోండి.
  • గతంలో విజయం సాధించిన సన్నివేశాలను గుర్తుచేసుకోండి. ఇది మీ మైండ్‌ను పాజిటివ్‌గా ఉంచుతుంది.
  • ఇంటర్వ్యూకి ముందు కొంచెం నీరు తాగండి.

 

Published date : 03 Sep 2021 04:15PM

Photo Stories