Skip to main content

రాత పరీక్ష ఫలితాలొచ్చాయ్‌... నెక్ట్స్‌ ఏంటి?

ఫ్యాషన్‌ నిపుణులకు పుట్టిల్లు.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌)! ఫ్యాషన్‌ డిజైన్, మేనేజ్‌మెంట్, టెక్నాలజీ స్పెషలైజేషన్స్‌లో బ్యాచిలర్, మాస్టర్స్‌ కోర్సులు చదవాలనుకొనే విద్యార్థులకు తొలి గమ్యం..
నిఫ్ట్‌! కాగా, తాజాగా నిఫ్ట్‌ 2021 రాత పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. దీంతో అభ్యర్థులు కీలకమైన మలిదశకు సన్నద్ధం కావాల్సి ఉంది. మలి దశ సిట్యుయేషన్‌ టెస్ట్‌ ఏప్రిల్‌/మేలో జరుగనుంది. ఈ నేపథ్యంలో.. నిఫ్ట్‌ మలిదశ ఎంపిక ప్రక్రియ, సిట్యుయేషన్‌ టెస్ట్‌లో రాణించేందుకు గైడెన్స్, క్యాంపస్‌ల వారీగా అందుబాటులో ఉన్న కోర్సులు–సీట్ల వివరాలతో సమగ్ర కథనం...

కోర్సులు ఇవే...
  • బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌(బీడీఈఎస్‌): ఫ్యాషన్‌ డిజైన్, యాక్సెసరీ డిజైన్, టెక్స్‌టైల్‌ డిజైన్, నిట్‌వేర్‌ డిజైన్, ఫ్యాషన్‌∙కమ్యూనికేషన్, లెదర్‌ డిజైన్‌ స్పెషలైజేషన్స్,బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (బీఎఫ్‌టెక్‌)–అప్పెరల్‌ ప్రొడక్షన్‌.
  • మాస్టర్స్‌: మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌(ఎండీఈఎస్‌); మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌ (ఎంఎఫ్‌ఎం); మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (ఎంఎఫ్‌టెక్‌).
బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల స్వరూపం..
  • ఫ్యాషన్‌ డిజైన్‌: ఇందులో డిజైనింగ్‌పై దృష్టిపెడతారు. డ్రెస్సులు, జ్యులరీ,‡ యాక్సెసరీల డిజైన్‌ల గురించి నేర్చుకుంటారు. మార్కెట్‌లో ఫ్యాషన్స్‌ తాజా మార్పులు, ధోరణులను అధ్యయనం చేస్తారు.
  • లెదర్‌ డిజైన్‌: హ్యాండ్‌ బ్యాగులు, ట్రావెల్‌ బ్యాగులు, ఫుట్‌వేర్, బెల్టులు తదితరాల డిజైన్‌ను అధ్యయనం చేస్తారు. కోర్సులో భాగంగా లెదర్‌ డిజైనింగ్, ఎంబ్రాయిడరింగ్, సాంకేతికతల గురించి తెలుసుకుంటారు.
  • యాక్సెసరీస్‌ డిజైన్‌: ప్రస్తుతం యాక్సెసరీల ప్యాషన్‌ హవా నడుస్తోంది. ప్రజలు వస్త్రాలతోపాటు ఇతర యాక్సెసరీలు–వాటి డిజైన్‌లపై దృష్టిపెడుతుండటమే దీనికి కారణం. ఇందులో జ్యులరీ, ఫుట్‌వేర్, స్కార్ఫ్, హ్యాండ్‌బ్యాగ్, హ్యాట్‌ తదితరాల డిజైన్‌ల గురించి నేర్చుకుంటారు.
  • టెక్స్‌టైల్‌ డిజైన్‌: ఈ కోర్సు ద్వారా వస్త్రాలు–ప్రింటింగ్, డైయింగ్, ఎంబ్రాయిడరీ, డిజైన్‌ డెవలప్‌మెంట్‌ నైపుణ్యాలు పెంపొం దుతాయి. అలాగే రంగుల మేళవింపు, వస్త్ర తయారీకి సంబంధించి ముడి సరుకు నుంచి ఔట్‌పుట్‌ వరకు అన్ని అంశాలపై అవగాహన లభిస్తుంది.
  • ఇతర స్పెషలైజేషన్స్‌: నిట్‌వేర్‌ డిజైన్, ఫ్యాషన్‌ కమ్యూనికేషన్, అప్పెరల్‌ ప్రొడక్షన్‌.
ఎంపిక ప్రక్రియ ఇలా..
  • సిట్యుయేషన్‌ టెస్టు.. బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుకు సంబంధించి ఎంట్రన్స్‌ టెస్టులో అర్హత సాధించిన వారికి తదుపరి దశలో.. సిట్యుయేషన్‌ టెస్టు ఉంటుంది. ఇందులో అభ్యర్థులకు ఒక సిట్యుయేషన్‌ పేర్కొని, కొంత మెటీరియల్‌ను అందిస్తారు. దానికి తగ్గట్టు అభ్యర్థులు ఒక డిజైన్‌ను రూపొందించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా అభ్యర్థుల్లోని మెటీరియల్‌ హ్యాండ్లింగ్, కలర్‌ ఎంపిక, వినూత్నత, సృజనాత్మకత, కన్‌స్ట్రక్షన్‌ స్కిల్స్, ప్రజెంటేషన్‌ తదితరాలను పరిశీలిస్తారు.
  • జీడీ, పీఐ.. మాస్టర్స్‌ కోర్సులకు సంబంధించి రాత పరీక్షలో షార్ట్‌ లిస్టు అయిన అభ్యర్థులకు గ్రూప్‌ డిస్కషన్‌(జీడీ), పర్సనల్‌ ఇంటర్వూ (పీఐ) కూడా ఉంటాయి. గ్రూప్‌ డిస్కషన్‌లో ఏదైనా ఒక కేస్‌ స్టడీ ఇచ్చి దానిపై 15 నుంచి 20 నిమిషాలు చర్చించమంటారు.
పరిశీలించే అంశాలు:
  • కాన్సెప్ట్‌పై అభ్యర్థికి ఉన్న స్పష్టత
  • టాపిక్‌పై ఉన్న నాలెడ్జ్‌
  • ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌
  • కొత్త ఆలోచనలు చేయగలిగే సామర్థ్యం
  • సమస్యా పరిష్కార దృక్పథం
  • నాయకత్వ లక్షణాలు
  • భావాలు పంచుకున్న తీరు, భావాల్లో పరిణితి, భాషలో స్పష్టత ఉండాలి.
ఇంటర్వూ..
ఇంటర్వూ సందర్భంగా ఫ్యాషన్‌ కెరీర్‌పై అభ్యర్థికి ఉన్న ఆసక్తి, ప్యాషన్‌ రంగంపై అవగాహన, అడమిక్‌ ప్రతిభ, కో కరిక్యులర్‌ యాక్టివిటీస్, కమ్యూనికేషన్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ అండ్‌ ఆప్టిట్యూడ్, క్రియేటివిటీ, లేటరల్‌ థింకింగ్‌ తదితరాలను పరీక్షిస్తారు. ఇంటర్వూలోనూ అర్హత సాధించిన వారికి నిఫ్ట్‌లో ప్రవేశం లభిస్తుంది. అభ్యర్థి ఎంచుకున్న ప్రాధాన్యత ఆధారంగా మెరిట్‌ ప్రాతిపదికన ఏదైనా నిఫ్ట్‌లో సీటు కేటాయిస్తారు.

విదేశీ చదువు..
నిఫ్ట్‌ విద్యార్థులు కావాలనుకుంటే అమెరికాలోనూ చదువుకోవచ్చు. దీనికోసం న్యూయార్క్‌లోని ఫ్యాషన్‌ ఇ¯ŒSస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఫిట్‌)తో నిఫ్ట్‌ ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థులు నిఫ్ట్‌లో రెండేళ్లు చదివిన తర్వాత.. ఫిట్‌లో ఏడాదిపాటు విద్యనభ్యసించాలి. అనంతరం నిఫ్ట్‌లో చదువుకోవాలి. కోర్సు పూర్తయిన వెంటనే నిఫ్ట్, ఫిట్‌ రెండు సంస్థలూ డిగ్రీని ప్రదానం చేస్తాయి.

రిక్రూటర్స్‌..
కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు లైఫ్‌స్టైల్, పాంటలూన్, అలెన్‌సోలీ, అర్వింద్‌ స్టోర్, అడిడాస్, రేమండ్, స్పైకర్, స్వరోస్కి (జ్యులరీ డిజైన్‌),ఏఎన్‌డీ(అండ్‌), బాటా, ఐటీసీ విల్స్‌ లైఫ్‌సై్టల్, లిబర్టీ షూస్‌ లిమిటెడ్, రీడ్‌ అండ్‌ టేలర్, యునైటెడ్‌ కలర్స్‌ ఆఫ్‌ బెనటన్, మార్క్స్‌ అండ్‌ స్పెన్సర్స్, షాపర్‌స్టాప్, ఉడ్‌లాండ్, గ్యాప్, ఇండియన్‌ టెరైన్, రిలయన్స్‌ ఫుట్‌వేర్,మోంటెకార్లో వంటి సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి.

క్యాంపస్‌లు–సీట్లు
హైదరాబాద్‌..
మొత్తం సీట్లు: 259
బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (బీడీఈఎస్‌)
ఫ్యాషన్‌ డిజైన్‌ (ఎఫ్‌డీ): 37 సీట్లు

యాక్సెసరీ డిజైన్‌(ఏడీ): 37 సీట్లు

టెక్స్‌టైల్‌ డిజైన్‌(టీడీ): 37 సీట్లు

నిట్‌వేర్‌ డిజైన్‌(కేడీ): 37 సీట్లు

ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌: 37 సీట్లు

  • బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ–అప్పెరల్‌ ప్రొడక్షన్‌: 37 సీట్లు
  • మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌: 37 బెంగళూరు..

మొత్తం సీట్లు: 327
బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ : 185 సీట్లు

బ్యాచిలర్‌ ఆఫ్‌ టెక్నాలజీ : 37

మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ : 37

మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌ : 37

మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ : 31

చెన్నై..
మొత్తం సీట్లు: 327
బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ : 185 సీట్లు


బ్యాచిలర్‌ ఆఫ్‌ టెక్నాలజీ : 37

మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ : 37
మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌ : 37

మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ : 31

కన్నూర్‌..
మొత్తం సీట్లు: 241
బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ : 136 సీట్లు

బ్యాచిలర్‌ ఆఫ్‌ టెక్నాలజీ : 35

మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ : 35

మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌ : 35

కోల్‌కతా..
మొత్తం సీట్లు: 296
బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ : 222 సీట్లు

బ్యాచిలర్‌ ఆఫ్‌ టెక్నాలజీ : 37

మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌ : 37

ముంబై..
మొత్తం సీట్లు: 296
బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ : 185 సీట్లు


బ్యాచిలర్‌ ఆఫ్‌ టెక్నాలజీ : 37

మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ : 37

మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌ : 37.

గాంధీనగర్‌..
మొత్తం సీట్లు: 253
బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ : 148 సీట్లు,

బ్యాచిలర్‌ ఆఫ్‌ టెక్నాలజీ : 37

మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌ : 37

మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ : 31

పంచకుల..
మొత్తం సీట్లు: 102
బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ : 68 సీట్లు


మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌ : 34

న్యూఢిల్లీ..
మొత్తం సీట్లు: 364
బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ : 222 సీట్లు


బ్యాచిలర్‌ ఆఫ్‌ టెక్నాలజీ : 37

మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ : 37

మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌ : 37

మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ : 31

పాట్నా..
మొత్తం సీట్లు: 205
బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ : 136 సీట్లు


బ్యాచిలర్‌ ఆఫ్‌ టెక్నాలజీ : 34

మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌ : 35

రాయ్‌బరేలి..
మొత్తం సీట్లు: 185
బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ :148 సీట్లు


మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌: 37.

షిల్లాంగ్‌..
మొత్తం సీట్లు: 171
బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ : 136 సీట్లు


మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌ : 35.

Published date : 01 Apr 2021 03:44PM

Photo Stories