కెరీర్ గైడెన్స్-ఫుట్‌వేర్ డిజైనింగ్
అవసరమైన స్కిల్స్:
సంప్రదాయ కోర్సులకు భిన్నంగా ఏదైనా వినూత్నమైన కెరీర్‌ను కోరుకునేవారికి, డి జైనింగ్ పట్ల ఆసక్తి, సృ జనాత్మకత కలిగి, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తిని ఇవ్వాలన్న తపన కలిగిన వారికి, ఫుట్‌వేర్ టెక్నాలజీ కోర్సులు ఎంతో అనువైనవి. అయితే నిత్యం తోళ్లు ఇంకా వివిధ రసాయనాలతో పని చేయాల్సి ఉంటుంది.
అవకాశాలు:
ఫుట్‌వేర్ పరిశ్రమ మన దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. చిన్న పిల్లల నుంచి వృద్ధులు వరకు వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పరిశ్రమకు తగినవిధంగా నిపుణులు లభ్యం కావడంలేదని చెబుతున్నారు. ఫుట్‌వేర్ టెక్నాలజీలో సర్టిఫికెట్ కోర్సు నుంచి పీజీ డిప్లొమా కోర్సుల వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు చేసినవారికి ఉద్యోగానికి ఢోకా ఉండదు. ప్రొడక్షన్ నుంచి సర్వీస్ వరకు ఈ పరిశ్రమలో అనేక ఉద్యోగాలు ఉన్నాయి. ప్రొడక్ట్ ప్లానింగ్,క్వాలిటీ కంట్రోల్,ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్స్‌గా చేరవచ్చు. మర్కండైజర్స్, ఫుట్‌వేర్ డిజైనర్స్, రేంజ్ బిల్డర్స్, కేటగిరీ హెడ్స్‌గా కూడా అవకాశాలుంటాయి. సొంతంగా ఫుట్‌వేర్ ప్రొడక్షన్ యూనిట్‌లను ప్రారంభించవచ్చు.
వేతనాలు:
ఫుట్‌వేర్ పరిశ్రమలో ప్రారంభ వేతనం నెలకు రూ.20 వేల నుంచి 25 వేల వరకు ఉంటుంది. మిడ్ లెవెల్ పొజిషన్‌లో 35 వేల వరకు కూడా డ్రా చేయవచ్చు.
టాప్ రిక్రూటర్స్:
అడిడాస్, టాటా ఇంటర్నేషనల్, బాటా, బజార్ కనక్షన్, ఫ్రాంకో లియోని, గుడ్ ఎర్త్, గుప్తా ఓవర్‌సీస్, హైడిజైన్, ఐటీసీ, జెపీసీ షూస్, కబీర్ బ్రదర్స్, లఖాని అర్మాన్, లీలా ట్రెండ్స్ ప్రైవేట్ లిమిటెడ్, లివిస్, మీర్జా ఇంటర్నేషనల్, మోచికో, ప్యూమా, రీబాక్, ష్రుబ్స్ ఆన్‌లైన్, విరోలా ఇంటర్నేషనల్ వంటి కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయి.
ఆఫర్ చేస్తున్న సంస్థలు:
ఉత్తర ప్రదేశ్ (నోయిడా)లోని ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ): ఫుట్‌వేర్ టెక్నాలజీకి సంబంధించి ఇది దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన సంస్థ. దీన్ని 1986లో ఏర్పాటు చేశారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఈ సంస్థ ఫుట్‌వేర్ టెక్నాలజీకి సంబంధించిన అన్ని అంశాల్లోనూ శిక్షణ, పరి శోధనతోపాటు పరిశ్రమకు అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేస్తోంది. ఎఫ్‌డీడీఐ దేశంలోని ఆరు శిక్షణ కేంద్రాల్లో (నోయిడా, ఫుర్సత్‌గంజ్, చెన్నై, కోల్‌కత, రోహ తక్, చింద్వారా) పీజీ ప్రోగ్రాం, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం, సర్టిఫికెట్ ప్రోగ్రాంలనందిస్తోంది.
కోర్సుల వివరాలు:
పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం:
ఈ విభాగంలోని కోర్సుల కాల వ్యవధి రెండేళ్లు.
- పీజీ డిప్లొమా ఇన్ రిటైల్ మేనేజ్‌మెంట్ (పీజీడీఆర్‌ఎం)
- పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్-ఇన్ ఫుట్‌వేర్ టెక్నాలజీ (పీజీడీఎం-ఎఫ్‌టీ)
- పీజీ డిప్లొమా ఇన్ క్రియేటివ్ డిజైనింగ్ (పీజీడీసీడీ)
- పీజీ డిప్లొమా ఇన్ లెదర్ గూడ్స్ అండ్ యాక్ససరీస్ డిజైన్ (పీజీడీఎల్ జీఏడీ)
- పీజీ డిప్లొమా ఇన్ విజువల్ మర్కండైజింగ్ అండ్ కమ్యూనికేషన్ డిజైన్ (పీజీడీబీఎం అండ్ సీడీ)
అర్హత: ఏదైనా డిగ్రీ.
అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం:
ఈ విభాగంలో మూడు కోర్సులు అందిస్తున్నారు. వ్యవధి మూడేళ్లు.
- డిప్లొమా ఇన్ ఫ్యాషన్ మర్కండైజింగ్ అండ్ రిటైల్ మేనేజ్‌మెంట్ (డీఎఫ్‌ఎంఆర్‌ఎం)
- డిప్లొమా ఇన్ ఫుట్‌వేర్ టెక్నాలజీ (డీఎఫ్‌టీ)
- డిప్లొమా ఇన్ లెదర్‌గూడ్స్ అండ్ యాక్ససరీస్ డిజైన్(డీఎల్‌జీఏడీ).
అర్హత: 10+2 లేదా ఇంటర్మీడియెట్ .
షార్ట్ టర్మ్ ప్రోగ్రాం:
ఇందులో ఆరు నెలల వ్యవధి కలిగిన ఫుట్‌వేర్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ (ఎఫ్‌ఎంటీ) కోర్సును అందిస్తున్నారు.
అర్హత: 10+2 లేదా ఇంటర్మీడియెట్.
వెబ్‌సైట్: www.fddiindia.com
ఏవీఐ స్కూల్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ షూ టెక్నాలజీ,చండీగఢ్.
షూ డిజైనింగ్ అండ్ ప్యాట్రన్ కటింగ్ (ఏడాది కోర్సు-అర్హత 10+2 ఉత్తీర్ణత), షూ డిజైనింగ్ (రెండేళ్ల కోర్సు-అర్హత ఏదేని డిగ్రీ)లలో సర్టిఫికెట్ కోర్సులను అందిస్తోంది.
సెంట్రల్ ఫుట్‌వేర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, ఆగ్రా.
ఏడాది, రెండేళ్ల డిప్లొమా కోర్సులు, షార్ట్ టర్మ్ కోర్సులను అందిస్తుంది.
వెబ్‌సైట్: www.cftiagra.org.in/
ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ డెవలప్‌మెంట్ (సెంట్రల్ ఫుట్‌వేర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్), చెన్నై.
ఆఫర్ చేస్తున్న కోర్సులు:
- డిప్లొమా ఇన్ ఫుట్‌వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్ (రెండేళ్ల కోర్సు)
అర్హత: ఇంటర్మీడియెట్
- పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫుట్‌వేర్ టెక్నాలజీ (ఏడాది కోర్సు)
అర్హత: ఏదైనా డిగ్రీ.
- పోస్ట్ డిప్లొమా ఇన్ ఫుట్‌వేర్ టెక్నాలజీ (ఏడాది కోర్సు)
అర్హత: ఏదైనా డిప్లొమా.
- సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఫుట్‌వేర్ టెక్నాలజీ (ఏడాది కోర్సు)
అర్హత: 10వ తరగతి.
వెబ్‌సైట్: www.cftichennai.in