TCS National Qualifier Test: ఎన్‌క్యూటీతో టీసీఎస్ కొలువు..
![tcs national qualifier test preparation tips for software jobs](/sites/default/files/images/2022/06/22/tcs-1655906201.jpg)
ఐటీ సంస్థలో ఉద్యోగం కోసం అన్వేషించే ప్రతిభ కలిగిన విద్యార్థులకు టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) ప్రకటన వెలువడింది. నైపుణ్యం కలిగిన మానవ వనరులను రిక్రూట్ చేసుకునేందుకు టీసీఎస్ సంస్థ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్‌ను నిర్వహించి..అర్హులైన వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటుంది. ప్రస్తుతం 2022 జూన్ సెషన్‌కు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నేపథ్యంలో.. టీసీఎస్ క్వాలిఫయర్ టెస్ట్‌కు అర్హతలు, ఎంపిక విధానం గురించి తెలుసుకుందాం...
అర్హతలు
యూజీ, పీజీ విద్యార్థులందరూ దరఖాస్తుకు అర్హులు. ఫైనల్ ఇయర్ వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ రెండేళ్లకు మించి పని అనుభవం ఉండకూడదు.
నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ (ఎన్‌క్యూటీ)
ఈ పరీక్షను ఆన్‌లైన్(ఇంటి నుంచి రాసే వెసులుబాటు), ఫిజికల్(ఇన్‌సెంటర్) విధానంలో నిర్వహిస్తారు. ఈ టెస్ట్‌లో సాధించిన స్కోర్‌కు రెండేళ్ల వాలిడిటీ ఉంటుంది.
Tech Skills: ఎథికల్ హ్యాకింగ్‌లో పెరుగుతున్న డిమాండ్.. అర్హతలు, నైపుణ్యాలు..
పరీక్ష విధానం
ఈ పరీక్షలో ఐదు విభాగాల నుంచి 92ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం 180 నిమిషాలు. ఆయా విభాగాల వారీగా ప్రశ్నలకు సమయాన్ని నిర్దేశించారు. వెర్బల్ ఎబిలిటీ 24 ప్రశ్నలు–30 నిమిషాలు, రీజనింగ్ ఎబిలిటీలో 30 ప్రశ్నలు–50 నిమిషాలు, న్యూమరికల్ ఎబిలిటీ 26 ప్రశ్నలు 40 నిమిషాలు, ప్రోగ్రామింగ్ లాజిక్ 10 ప్రశ్నలు–15 నిమిషాలు, కోడింగ్ 2 ప్రశ్నలు–25 నిమిషాల్లో పూర్తిచేయాలి.
పరీక్ష కేంద్రాలు
టీసీఎస్ ఆయాన్ కేంద్రాల్లో ఈ ఎన్‌క్యూటీ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో సాధించిన స్కోరు ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ చూపిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. టీసీఎస్ పోర్టల్‌లో పరీక్ష నమూన పత్రాలు అందుబాటులో ఉన్నాయి.
Industry 4.0 Skills: బీటెక్ తర్వాత వెంటనే కొలువు కావాలంటే.. ఈ 4.0 స్కిల్స్ ఉండాల్సిందే!
ప్రిపరేషన్ ఇలా
- వెర్బల్ ఎబిలిటీలో ఇంగ్లిష్ గ్రామర్, రీడింగ్ కాంప్రహెన్షన్ విభాగాల్లో ప్రశ్నలను అడుగుతారు. రీజినింగ్ ఎబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, డెసిషన్ మెకింగ్ తదితర అంశాల్లో నుంచి ప్రశ్నలు వస్తాయి.
- న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి నంబర్ సిస్టమ్,ఆర్థమెటిక్,ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, డేటా ఇంటర్‌ప్రిటెషన్‌ల నుంచి ప్రశ్నలుంటాయి. ప్రోగ్రామింగ్ లాజిక్‌లో సూడోకోడ్, అల్గారిథమ్స్, ప్రోగ్రామింగ్ కన్‌స్ట్రక్ట్, ఎస్‌డీఎల్‌సీ,సీ,సీ++. జావా తదితర అంశాల్లో నుంచి ప్రశ్నలు ఇస్తారు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- దరఖాస్తులకు చివరి తేదీ: 25.06.2022
- పరీక్ష తేదీ: 10.07.2022 నుంచి
- వెబ్‌సైట్: https://learning.tcsionhub.in/hub/national-qualifier-test