ఆ మూడు సబ్జెక్ట్‌ల ఆధారంగా నిర్వహించే జేఈఈ పరిస్థితి ఏంటి?
ఎన్‌ఐటీలు, ఐఐటీలు.. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరి చేస్తూ ఎంట్రన్స్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నాయి. కాబట్టి ఇంజనీ రింగ్‌లో చేరాలనుకునే విద్యార్థులు.. ఇంటర్మీడియెట్ స్థాయిలో ఎంపీసీనే ఎంచుకుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏఐసీటీఈ బీటెక్ ప్రవేశ అర్హతలు.. ముఖ్యాంశాలు
- ఇంటర్‌లో ఫిజిక్స్, మ్యాథ్స్ చదవకపోయినా బీటెక్‌లో చేరే అవకాశం.
- బీటెక్ మొదటి సంవత్సరంలో బ్రిడ్జ్ కోర్సుల ద్వారా ఫిజిక్స్, మ్యాథ్స్ నైపుణ్యాలు అందించొచ్చని సూచన.
- ఫిజిక్స్, మ్యాథ్స్‌లో పూర్తి స్థాయి అవగాహన లేకుండా ఇంజనీరింగ్‌లో రాణించడం కష్టమంటున్న నిపుణులు.
- ఇంజనీరింగ్‌లోని దాదాపు అన్ని బ్రాంచ్‌లలోనూ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సిద్ధాంతాల ఆధారంగానే పట్టు సాధించాల్సిన ఆవశ్యకత.
- భవిష్యత్తులో జాబ్ మార్కెట్‌లో, ఉన్నత విద్య, విదేశీ విద్య పరంగా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం.
- రీసెర్చ్, డెవలప్‌మెంట్ కోణంలోనూ సైన్స్ రంగంలో పరిశోధనలు చేసే విషయంలో ఇబ్బందులు.
ఉద్దేశం మంచిదే అయినప్పటికీ..
అందరికీ ఉన్నత విద్య.. అందులోనూ విద్యార్థులు వారు కోరుకున్న కోర్సుల్లో అడుగు పెట్టే అవకాశం కల్పించే ఉద్దేశంతో ఏఐసీటీఈ తీసుకున్న నిర్ణయం మంచిదే. సాంకేతిక విద్యలో ముఖ్యంగా ఇంజనీరింగ్‌లో ఏ బ్రాంచ్‌లో ముందుకు సాగాలన్నా.. మ్యాథ్స్, ఫిజిక్స్‌లో నైపుణ్యాలు తప్పనిసరి. బ్రిడ్జ్ కోర్స్‌ల్లో బేసిక్స్‌కే పరిమితం కాకుండా.. అప్లయిడ్ నాలెడ్జ్, అప్లికేషన్ అప్రోచ్ ఉండేలా చూస్తే ఏఐసీటీఈ ఉద్దేశం నెరవేరుతుంది.
- డా‘‘ డి.ఎన్.రెడ్డి, జేఎన్‌టీయూ–హెచ్ మాజీ వైస్ ఛాన్స్‌లర్
కోర్ టు కోడింగ్.. మ్యాథ్స్ కీలకం
ఇంజనీరింగ్ విభాగాల్లో కోర్ సెగ్మెంట్స్ మొదలు కోడింగ్ వరకూ...అన్నింటా మ్యాథ్స్, ఫిజిక్స్‌లో అప్లికేషన్ నైపుణ్యాలు ఎంతో కీలకం. వాటి ఆధారంగానే సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్స్ రూపొందించే నైపుణ్యం, కోడింగ్ స్కిల్స్ లభిస్తాయి. ఇలాంటి కీలకమైన సబ్జెక్ట్‌ల విషయంలో మినహాయింపు ఇస్తూ తీసుకున్న నిర్ణయం.. విద్యార్థులకు బీటెక్ కల నెరవేర్చినా.. భవిష్యత్తులో వారు కెరీర్ పరంగా, రీసెర్చ్ విషయంలో కొంత ఇబ్బందులకు గురయ్యే ఆస్కారముంది.
– రమేశ్ లోగనాథన్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ హెడ్, ఐఐఐటీ–హెచ్
ఇంకా చదవండి: part 1: మ్యాథ్స్, ఫిజిక్స్‌పై పట్టు లేకుండా ఇంజనీరింగ్‌లో రాణింపు సాధ్యమేనా?!