Skip to main content

కాలేజ్ ఏదైనా కోర్సులకు ప్రత్యేకంగా ఇచ్చే గుర్తింపే ఎన్‌బీఏ.. అసలేంటీ ఎన్‌బీఏ?

ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ తదితర ప్రొఫెషనల్ కోర్సుల పరంగా నిర్దిష్టంగా ఒక కళాశాలలో, ఓ ప్రోగ్రామ్‌లో చేరాలనుకుంటున్న విద్యార్థులకు.. ఆ ప్రోగ్రామ్ పరంగా బోధన, మౌలిక సదుపాయాలు, ఇతర అకడెమిక్ అంశాల నాణ్యతను తెలుసుకోవడం ఎలా?! అనే సమస్య ఎదురవుతుంది. దీనికి సమాధానమే ఎన్‌బీఏ గుర్తింపు!!

ఎన్‌బీఏ అంటే..

  • నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్.. సంక్షిప్తంగా ఎన్‌బీఏ. ఇది జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల పర్యవేక్షణ, నియంత్రణ చేపట్టే ఏఐసీటీఈ ఆధ్వర్యంలో పనిచేసే సంస్థ. ఎన్‌బీఏ ప్రధాన ఉద్దేశం.. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉండే కళాశాలల్లో ప్రోగ్రామ్‌ల వారీగా సదరు కళాశాలలు అనుసరిస్తున్న ప్రమాణాలు గుర్తించి.. నిర్దిష్ట ప్రమాణాలు ఉన్న బ్రాంచ్‌లు, ప్రోగ్రామ్‌లకు మాత్రమే గుర్తింపు ఇవ్వడం.
  • ఉదాహరణకు ఒక ఇంజనీరింగ్ కళాశాలలో సీఎస్‌ఈ, ఈసీఈ, సివిల్, మెకానికల్, ఈఈఈ.. ఇలా నాలుగు బ్రాంచ్‌లు ఉన్నాయనుకుందాం. ఆ బ్రాంచ్‌ల బోధన, ఇతర ప్రమాణాలను ఎన్‌బీఏ నేతృత్వంలోని నిపుణుల కమిటీ తనిఖీ చేస్తుంది. నిర్దిష్ట ప్రమాణాలను పరిశీలిస్తుంది. ప్రమాణాల మేరకు ఉన్న బ్రాంచ్‌లకే ఎన్‌బీఏ గుర్తింపు ఇస్తుంది. మొత్తం అయిదు బ్రాంచ్‌లలో ఒక బ్రాంచ్‌లో మాత్రమే నిర్దిష్ట ప్రమాణాలుంటే.. ఆ బ్రాంచ్‌కు మాత్రమే ఎన్‌బీఏ గుర్తింపు లభిస్తుంది. దీనివల్ల విద్యార్థులు ఒక కళాశాలను ఎంచుకునేటప్పుడు ఆ ఇన్‌స్టిట్యూట్‌లో మెరుగైన బ్రాంచ్ ఏదో తెలుసుకునే వీలుంటుంది.

 

ఇంకా తెలుసుకోండి: part 4: కోర్సులకు ఎన్‌బీఏ గుర్తింపు ఇచ్చే క్రమంలో వేయి మార్కుల విధానం.. ఉపయోగం ఏంటో తెలుసా?
Published date : 15 Oct 2020 04:22PM

Photo Stories