ఇంజనీరింగ్‌కు ధీటైన కోర్సులెన్నో..!
Sakshi Education
తెలుగు రాష్ట్రాల్లోని ఇంటర్మీడియెట్ ఎంపీసీ విద్యార్థుల దృష్టంతా ఇంజనీరింగ్‌పైనే ఉంటుంది. ఎంపీసీ విద్యార్థుల్లో నూటికి తొంభై శాతం మంది లక్ష్యం.. ఇంజనీరింగ్. ఇందుకోసం జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్, ఎంసెట్..ఇలా అనేక ఎంట్రెన్స్‌లకు హాజరవుతుంటారు.
ఇంజనీరింగ్ మాత్రమే లక్ష్యంగా చేసుకున్న విద్యార్థులు.. ప్రత్యామ్నాయాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. మరి కోరుకున్న విధంగా ఇంజనీరింగ్‌లో ప్రవేశం లభించకుంటే.. ముందున్న మార్గమేంటి?! ప్రస్తుతం ఎంపీసీ విద్యార్థులకు ఇంజనీరింగ్‌కు దీటైన కోర్సులెన్నోఅందుబాటులోకి వచ్చాయి. కాబట్టి విద్యార్థులు ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ మార్గాలపైనా దృష్టిసారిస్తే.. బీటెక్ అవకాశం చేజారినా.. చక్కటి భవిష్యత్తుకు మార్గం వేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ఎంపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఉత్తమ ప్రత్యామ్నాయ కోర్సుల గురించి తెలుసుకుందాం... ఐఐఎస్‌సీ-బెంగళూరు : సైన్స్ రంగంలో ఉజ్వల భవిష్యత్తుకు మార్గం వేసే మరో వేదిక.. ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)-బెంగళూరు. ఈ ఇన్‌స్టిట్యూట్‌లో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(రీసెర్చ్) ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. కేవీపీవై ఎస్‌ఎక్స్, కేవీపీవై-ఎస్‌ఏ విభాగాల్లో ఉత్తీర్ణత ఆధారంగా/జేఈఈ మెయిన్/ అడ్వాన్స్‌లో పొందిన స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. 2019-20 సంవత్సరానికి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 30, 2019.
వెబ్‌సైట్: http://www.iisc.ac.in/ug/
సైన్స్ కోర్సులు : ఐఐఎస్‌ఈఆర్
ఎంపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో ఉత్తమ ప్రత్యామ్నాయం.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ క్యాంపస్‌లు (ఐఐఎస్‌ఈఆర్). దేశవ్యాప్తంగా ఏడు ప్రాంతాల్లో(పుణె, బరంపూర్, భోపాల్, కోల్‌కత, మొహాలీ, తిరువనంతపురం, తిరుపతి) ఉన్న ఐఐఎస్‌ఈఆర్ క్యాంపస్‌లలో బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ కోర్సు అందుబాటులో ఉంది. ఇందులో ప్రవేశానికి కేవీపీవై ఎక్స్‌ఏ స్ట్రీమ్ ఉత్తీర్ణతను లేదా, జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకులను పరిగణనలోకి తీసుకుంటారు. ఇవి రెండూ లేకుంటే... ఐఐఎస్‌ఈఆర్ ప్రత్యేకంగా నిర్వహించే ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ర్యాంకు సాధించాలి. ఆ తర్వాత ఉమ్మడి కౌన్సెలింగ్ విధానం ద్వారా సీట్ల భర్తీ ప్రక్రియ చేపడతారు. ఐఐఎస్‌ఈఆర్ క్యాంపస్‌ల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు స్కాలర్‌షిప్ సదుపాయం కూడా ఉంది. 2019-20 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రక్రియ ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభం కానుంది.
వెబ్‌సైట్: www.iiseradmission.in
నెస్ట్‌తో నైసర్‌లో అడ్మిషన్ :
ఎంపీసీ విద్యార్థులకు ఇంజనీరింగ్‌కు దీటుగా అందుబాటులో ఉన్న మరో కోర్సు.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైసర్) అందించే ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సు. భారత అణుశక్తి శాఖ ఆధ్వర్యంలోని.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-భువనేశ్వర్, యూనివర్సిటీ ఆఫ్ ముంబై-డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ సంయుక్తంగా అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సును అందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా నిర్వహించే.. నేషనల్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత ద్వారా ఈ కోర్సులో ప్రవేశం ఖరారు చేసుకోవచ్చు. మొత్తం నాలుగు సబ్జెక్ట్‌లలో (బయలాజికల్ సెన్సైస్; కెమికల్ సెన్సైస్; మ్యాథమెటిక్స్; ఫిజిక్స్) కోర్సు అందుబాటులో ఉంది. అంతేకాకుండా.. ప్రవేశం సొంతం చేసుకున్న విద్యార్థులకు నెలకు రూ.5వేల స్కాలర్‌షిప్ సైతం లభిస్తుంది.
వెబ్‌సైట్: https://www.nestexam.in
ఐఎస్‌ఐ ఫర్ ఫ్యూచర్ స్టాటిస్టిషియన్స్ :
ఎంపీసీ విద్యార్థులు భవిష్యత్తులో గణాంక శాస్త్ర నిపుణులుగా.. కార్పొరేట్ రంగంలో సమున్నత కెరీర్‌కు మార్గం వేసే మరో వేదిక.. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్(ఐఎస్‌ఐ). కోల్‌కత ప్రధాన కేంద్రంగా, ఢిల్లీ, చెన్నై, తేజ్‌పూర్‌లో అనుబంధ క్యాంపస్‌లు ఉన్న ఈ ఇన్‌స్టిట్యూట్.. బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కోర్సులు అందిస్తోంది. ఇందులో ప్రవేశించాలంటే.. సదరు ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే ప్రత్యేక ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ కోర్సులు పూర్తి చేసుకున్న తర్వాత ఎంకాం, ఎమ్మెస్సీలో స్టాటిస్టిక్స్ స్పెషలైజేషన్ కూడా పూర్తి చేసుకుంటే.. కార్పొరేట్ రంగంలో ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న డేటా అనలిటిక్స్ విభాగంలో చక్కటి కెరీర్ సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా కేంద్ర గణాంక శాఖలోనూ స్టాటిస్టికల్ ఆఫీసర్‌గా ఉద్యోగాలకు పోటీపడొచ్చు.
వెబ్‌సైట్: https://www.isical.ac.in/
బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ :
ఇంజనీరింగ్‌కు ధీటైన కెరీర్ అవకాశాలను కోరుకునే ఎంపీసీ విద్యార్థులకు మరో మంచి ప్రత్యామ్నాయం.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) అందించే వివిధ బ్యాచిలర్ స్థాయి కోర్సులు. దేశవ్యాప్తంగా క్యాంపస్‌లు ఉన్న నిఫ్ట్‌కి జాబ్ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సులను అందించడంలో మంచి పేరుంది. నిఫ్ట్‌లో కోర్సు పూర్తి చేసుకున్న వారికి చక్కటి వేతనాలతో కొలువులు లభిస్తాయి.
వెబ్‌సైట్: https://nift.ac.in/
ఆర్కిటెక్చర్ :
ఇంజనీరింగ్ లక్ష్యంగా అడుగులు వేసే ఎంపీసీ విద్యార్థులకు మంచి ప్రత్యామ్నాయం.. ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్‌లో బీటెక్ కోర్సు. ఐఐటీలు, ఎన్‌ఐటీలు సహా దేశంలోని పలు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఎన్‌ఐటీల్లో ఆర్కిటెక్చర్ కోర్సులో చేరాలనుకుంటే.. జేఈఈ మెయిన్‌లో రెండో పేపర్ రాయాల్సి ఉంటుంది. ఐఐటీల్లో ప్రవేశం కోసం జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల తర్వాత ప్రత్యేకంగా నిర్వహించే ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
నాటా’తో బీఆర్క్: దేశంలోని ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశానికి.. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నిర్వహించే... నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్‌లో ఉత్తీర్ణత సాధించాలి. దీనిద్వారా కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతి పొందిన కళాశాలల్లో బీఆర్క్ కోర్సులో పవేశం పొందొచ్చు.
వెబ్‌సైట్: http://www.nata.in/
ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ :
ఇంజనీరింగ్‌లో ప్రవేశం పొందని ఎంపీసీ విద్యార్థులకు ఉన్నత విద్య పరంగా టక్కున గుర్తొచ్చే కోర్సు..బీఎస్సీ. ప్రస్తుతం ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సుకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సు పూర్తిచేస్తే ఏకకాలంలో.. బ్యాచిలర్, పీజీ రెండు సర్టిఫికెట్లు సొంతమవుతాయి. ఈ కోర్సుల పరంగా ప్రస్తుతం సెంట్రల్ యూనివర్సిటీలు ప్రాచుర్యం పొందుతున్నాయి. జాతీయ స్థాయిలోని 14 సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశానికి సీయూసెట్ పేరుతో ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. మిగతా యూనివర్సిటీలు సొంత ప్రవేశ పరీక్షల ద్వారా సీట్ల భర్తీ చేస్తున్నాయి.
వెబ్‌సైట్: https://cucetexam.in
బీఫార్మసీ, ఫార్మ్-డి :
ఎంపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో ప్రొఫెషనల్ కోర్సు.. బీ-ఫార్మసీ. తెలుగు రాష్ట్రాల్లో బీఫార్మసీ సీట్లలో 50 శాతం సీట్లను ఎంపీసీ విద్యార్థులకు కేటాయిస్తారు. ఇందుకోసం అభ్యర్థులు ఎంసెట్‌లో ర్యాంకు సొంతం చేసుకోవాలి. బీ-ఫార్మసీ పూర్తి చేసుకున్న తర్వాత ఎం-ఫార్మసీ కూడా పూర్తి చేసుకుంటే.. ఫార్మాస్యుటికల్ సంస్థల్లో కీలక విభాగాలు (ఫార్ములేషన్, డ్రగ్ డిస్కవరీ, రీసెర్చ్, క్లినికల్ రీసెర్చ్)లో స్థిరపడొచ్చు.
బీటెక్-బయో టెక్నాలజీ :
ఎంపీసీ పూర్తి చేసుకొని కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లపై మక్కువ ఉన్న విద్యార్థులకు మంచి ప్రత్యామ్నాయ కోర్సు.. బీటెక్ బయోటెక్నాలజీ. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి కెమికల్, టెక్స్‌టైల్ పరిశ్రమల్లో, వ్యవసాయ ఉత్పత్తుల తయారీ సంస్థల్లో, ఫార్మాస్యుటికల్ సంస్థల్లో కొలువులు లభిస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్(ఇంజనీరింగ్ స్ట్రీమ్)లో ర్యాంకు ఆధారంగా ఆయా కళాశాలల్లో సీటు పొందొచ్చు. ఈ కోర్సుకు బైపీసీ విద్యార్థులు కూడా అర్హులే. వారు మ్యాథమెటిక్స్‌లో బ్రిడ్జ్ కోర్స్‌లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి.
ఎన్‌డీఏ.. ఉద్యోగం + డిగ్రీ :
ఇంటర్మీడియెట్ ఎంపీసీ విద్యార్థులకు ఒకవైపు ఉద్యోగం, మరోవైపు కొలువు ఖాయం చేస్తున్న మరో ఉత్తమ వేదిక.. నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ). త్రివిధ దళాల్లో పర్మనెంట్ కమిషన్డ్ ర్యాంక్ ఉద్యోగాలకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి ఏటా రెండుసార్లు ఈ పరీక్ష నిర్వహిస్తుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించి, తుది విజేతలుగా నిలిచిన వారికి ఎన్‌డీఏ-పుణెలో శిక్షణనిస్తారు. ఈ శిక్షణ పూర్తి చేసుకుంటే.. బీటెక్ డిగ్రీ అందిస్తారు. 2019 సంవత్సరానికి సంబంధించి ఎన్‌డీఏ ఎన్‌ఏ(2) ఎగ్జామ్ నోటిఫికేషన్ ఆగస్టు 7వ తేదీన విడుదల కానుంది.
వెబ్‌సైట్: https://upsc.gov.in/examinations/examcalendar
త్రివిధ దళాల్లో 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ :
ఎన్‌డీఏ ఎన్‌ఏ మాత్రమే కాకుండా.. ఎంపీసీ విద్యార్థులు త్రివిధ దళాల్లో కెరీర్ ప్లస్ డిగ్రీ ఖాయం చేసే మరో విధానం 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ విభాగాలు ప్రత్యేక నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్ట్‌లలో ఉత్తీర్ణత సాధించి ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో నిలిచిన అభ్యర్థులను ప్రాథమికంగా శిక్షణకు ఎంపిక చేస్తారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి.. టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, నావల్ ఆర్కిటెక్చర్ బ్రాంచ్‌లతో బీటెక్ డిగ్రీ అందిస్తారు. దీంతోపాటు పర్మనెంట్ కమిషన్డ్ ర్యాంకు హోదాతో ఉద్యోగ అవకాశం కల్పిస్తారు.

Published date : 18 Apr 2019 04:57PM