ఇంజనీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యాల అంచన వేసేందుకు నిర్వహించే సీఐఐ ఐప్యాట్ 2021 నోటిఫికేషన్ విడుదల.. అర్హత వివరాలు తెలుసుకోండిలా..
కాని వాస్తవానికి వీరి నైపుణ్యాలను అంచనా వేసేందుకు సరైన వేదిక లేదు. ఇలాంటి పరిస్థితిల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నైపుణ్యాలను పరీక్షించి, వారి ప్రతిభను గుర్తించి.. కంపెనీలకు అందజేసేందుకు భారత పరిశ్రమల సమాఖ్య (కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్)... ఐపాట్ (ఇండస్ట్రియల్ ప్రొఫిషియన్సీ అప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఇంజనీర్స్)ను నిర్వహిస్తోంది. సీఐఐ ఐపాట్–2021కు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నేపథ్యంలో... ఐపాట్ పరీక్షతో ప్రయోజనాలు.. పరీక్ష విధానం.. సిలబస్‌పై ప్రత్యేక కథనం...
సీఐఐ ఐప్యాట్..
కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(సీఐఐ).. నిర్వహించే పరీక్ష.. ఐపాట్. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థుల స్కోర్‌ను కంపెనీలకు అందుబాటులో ఉంచుతారు. కంపెనీలు ఖాళీలను అనుసరించి అభ్యర్థులను నేరుగా ఇంటర్వూ్యలకు పిలుస్తాయి. సీఐఐ ఐపాట్ అనేది ఇంజనీరింగ్ అభ్యర్థుల్లో నైపుణ్యాలను గుర్తించే పరీక్ష మాత్రమే. అభ్యర్థుల ఎంపిక, నియామకం సంస్థలు తమ స్వీయ నిర్ణయం మేరకు తీసుకుంటాయి. ఐపాట్..ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు తమ ప్రొఫెషనల్ నైపుణ్యాలను ప్రదర్శించడానికి.. సాధించిన స్కోర్ ద్వారా కంపెనీల దృష్టిలోపడి.. ఉద్యోగం పొందేందుకు చక్కటి వేదికగా పేర్కొనవచ్చు. ఐపాట్‌లో ఒకసారి అర్హత సాధిస్తే.. మూడేళ్ల వరకు చెల్లుబాటు అవుతుంది.
అర్హతలు..
- ఇంజనీరింగ్ నేపథ్యంæ ఉన్న అభ్యర్థులు మాత్రమే ఐపాట్ పరీక్షకు అర్హులు. బీఈ/బీటెక్/బీఆర్క్/బీప్లానింగ్, డిప్లొమా ఇంజనీరింగ్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు చివరి సంవత్సరం చదువుతున్న వారు సైతం దరఖాస్తుకు అర్హులే. ఐప్యాట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి వయో పరిమితి నిబంధన లేదు. పరీక్షకు నిర్దిష్ట కటాఫ్ మార్కులంటూ లేవు. సీఐఐ నిర్దేశించిన విధంగా ఐపాట్‌లో కనీసం 30శాతం మార్కులు సాధించిన అభ్యర్థులను టెస్ట్‌లో అర్హత పొందినట్లు పరిగణిస్తారు.
ఈ బ్రాంచ్‌లకే అవకాశం..
- ఏరోస్పేస్ ఇంజనీరింగ్
- అగ్రికల్చరల్ ఇంజనీరింగ్
- ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్
- బయోమెడికల్ ఇంజనీరింగ్
- బయోటెక్నాలజీ
- కెమికల్ ఇంజనీరింగ్
- సివిల్ ఇంజనీరింగ్
- కంప్యూటర్ ఇంజనీరింగ్
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
- ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్
- ఫుడ్ టెక్నాలజీ
- మెకానికల్ ఇంజనీరింగ్
- మెటలర్జికల్ ఇంజనీరింగ్
- మైనింగ్ ఇంజనీరింగ్
- పెట్రోలియం ఇంజనీరింగ్
- ప్రొడక్షన్ ఇంజనీరింగ్
- టెక్స్‌టైల్ ఇంజనీరింగ్.
పరీక్ష విధానం..
- ఏటా దేశవ్యాప్తంగా 25కు పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విద్యార్థులు 18 ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల్లో ఐపాట్ రాస్తుంటారు. ఇందులో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు, డిప్లొమా హోల్డర్స్‌కు వేర్వేరుగా పరీక్ష నిర్వహిస్తారు.
- ఐపాట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో జరుగుతుంది. పరీక్ష సమయం మూడు గంటలు (180 నిమిషాలు). పరీక్ష 100 ప్రశ్నలు–100 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. నెగిటివ్ మార్కుల విధానం అమలులో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి అర మార్కు(1/2) కోత విధిస్తారు.
- సెక్షన్–1: కాగ్నిటివ్ ఎబిలిటీస్‌గా పిలిచే ఈ విభాగంలో.. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఇంగ్లిష్ కమ్యూనికేషన్, అనలిటికల్ రీజనింగ్ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి.
- సెక్షన్–2: ప్రొఫెషనల్ ఎబిలిటీస్‌గా పిలిచే ఈ విభాగంలో.. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, లీగల్, కాంట్రాక్ట్స్ అండ్ ఆర్బిట్రేషన్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్స్, హెల్త్, సేఫ్టీ అండ్ రిస్క్, సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎథిక్స్, ఎన్విరాన్‌మెంటల్ లాస్ నుంచి 20 ప్రశ్నలు ఉంటాయి.
- సెక్షన్3(ఏ): టెక్నికల్ ఎబిలిటీస్‌గా పిలిచే ఈ విభాగంలో.. ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి 10 ప్రశ్నలు వస్తాయి.
- సెక్షన్–3(బీ): టెక్నికల్ ఎబిలిటీస్‌గా పేర్కొనే ఈ విభాగంలో.. విద్యార్థులు చదివిన (సివిల్/మెకానికల్/కంప్యూటర్ సైన్స్ వంటివి) ఇంజనీరింగ్ విభాగం నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు.
ఇంకా చదవండి: part 2: సీఐఐ ఐప్యాట్ 2021 ఎగ్జామ్ సిలబస్, ప్రిపరేషన్ గురించి తెలుసుకోండిలా..