ఇంజనీరింగ్ తొలి అడుగు
Sakshi Education
గ్లోబల్‌గా ‘ఇంజనీరింగ్’ అన్ని రంగాల్లోనూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఐటీ, నిర్మాణం, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, ఆటోమొబైల్ తదితర రంగాల్లో ఇంజనీరింగ్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. రాబోయే రోజుల్లోనూ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఇంజనీర్ల పాత్ర ప్రధానంగా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.
ఇంజనీర్లు ఆవిష్కరణలతో ప్రపంచ ముఖచిత్రాన్నే మార్చేయగలరు. అలాంటి సత్తా ఉన్న కోర్సులో చేరి.. ఇంజనీర్లుగా ఎదగడానికి మరో బ్యాచ్ విద్యార్థులు సిద్ధమయ్యారు. ప్రతిష్టాత్మక జేఈఈ, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలు దాటి.. ఇంజనీరింగ్ సీటు సంపాదించిన విద్యార్థులకు తరగతులు ప్రారంభ మవుతున్నాయి. ఇంజనీరింగ్ కోర్సులో అడుగుపెట్టిన విద్యార్థులు... కొత్త కోర్సు.. కొత్త క్యాంపస్... భిన్న ప్రాంతాలు, సంస్కృతుల నుంచి వచ్చిన విద్యార్థులతో ఎలా మమేకం అవ్వాలి.. లక్ష్య నిర్దేశం.. నైపుణ్యాలు పెంచుకోవడంపై నిపుణుల సలహాలు..
దేశంలో ఈ విద్యాసంవత్సరానికి కొత్త బ్యాచ్ మొదటి ఏడాది ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటివరకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో.. ప్రణాళికబద్ధంగా చదివిన విద్యార్థులకు నూతన ప్రపంచం స్వాగతం పలుకుతుంది. పన్నెండేళ్లుగా పుస్తకాలు, పరీక్షలే లోకంగా గడిపిన విద్యార్థులు.. ఒక్కసారిగా రంగురంగుల స్వేచ్ఛా ప్రపంచంలో అడుగుపెడుతున్నారు. వారికోసం భిన్నమైన విద్యావిధానం ఎదురుచూస్తోంది. ఇప్పటివరకు ప్రతిదీ టీచర్లు చెబితే నేర్చుకున్నారు. హోంవర్క్ ఇస్తే పూర్తిచేశారు. కానీ, ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. తరగతి గదిలో చెప్పే పాఠాలకంటే.. సొంతంగా శోధించి నేర్చుకునేదే ఎక్కువగా ఉంటుంది.
హ్యాపీడేస్..
పట్టణం, పల్లె అనే తేడా లేకుండా.. పదోతరగతి పూర్తవుతూనే ఇంజనీరింగ్ లక్ష్యంతో కార్పొరేట్ జూనియర్ కళాశాల్లో చేరిపోయారు. రెండేళ్లపాటు మార్కులు, ర్యాంకులు అంటూ.. ఇంటర్‌లో క్షణం తీరికలేకుండా క్లాసులు, కోచింగ్‌లకు హాజరయ్యారు. ఇంజనీరింగ్‌లో సీటు వచ్చే వరకూ తీవ్రంగా శ్రమించిన విద్యార్థులు.. ఆ తర్వాత బీటెక్‌లో చేరగానే రిలాక్స్‌డ్ మూడ్‌లోకి వెళ్లిపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇన్నేళ్లపాటు కష్టపడి చదివాం.. కోరుకున్న కాలేజీలో సీటు సాధించాం.. ఇక అంతా ‘హ్యాపీడేస్’! అనే భావనలో ఉంటున్నారు. ఈ ధోరణి సరికాదని.. అసలు ప్రయాణం ఇప్పుడే మొదలైందనే విషయాన్ని విద్యార్థులు గుర్తించాలంటున్నారు నిపుణులు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకు ఇంజనీరింగ్‌లో చేరిన తొలిరోజు నుంచే కృషిచేయాలని సూచిస్తున్నారు.
బిడియం వదిలి
ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థులకు కొత్త క్యాంపస్, కొత్త ప్రదేశం, కొత్త స్నేహితులు, కొత్త అధ్యాపకులు.. ఇలా ఎటుచూసినా.. అంతా కొత్త వాతావరణ కనిపిస్తుంది. కొత్త ప్రాంతం, కొత్త మనుషులు... ఎవరికై నా మొదట్లో బెరుగ్గానే ఉంటుంది. కొత్తవారితో మాట్లాడే చొరవను అలవరచుకోవాలి. భిన్న మనస్తత్వాలున్న తోటి విద్యార్థులతో త్వరగా కలిసేపోయే ప్రయత్నం చేయాలి. ఇదో లైఫ్ స్కిల్ (జీవన నైపుణ్యం). ఈ నైపుణ్యం జీవితంలో ప్రతి మలుపులోనూ ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు, తెలుగు మీడియం విద్యార్థుల్లో బిడియం ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి విద్యార్థులు ముందు ఇంగ్లిష్ నేర్చుకోవడంపై దృష్టిసారించాలి. దాంతోపాటు సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపరచుకోవాలి. తరగతిగదిలో తలెత్తే సందేహాలను అధ్యాపకులను అడిగి నివృత్తి చేసుకోవాలి. సీనియర్లతో స్నేహంగా మెలుగుతూ.. ఆయా సబ్జెక్టులను ఎలా చదవాలో తెలుసుకోవాలి.
భిన్నత్వంలో ఏకత్వం
ముఖ్యంగా ఐఐటీ, ఎన్‌ఐటీలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు దేశంలోని భిన్న ప్రాంతాల నుంచి వచ్చిన వారు కనిపిస్తారు. వారి భాష, ఆహారపు అలవాట్లు, వేషధారణ భిన్నంగా ఉంటాయి. భిన్నత్వంలో ఏకత్వం లాంటి మన దేశ సంస్కృతిని అవగాహన చేసుకోవడంలో ఇక్కడే పునాది పడుతుంది. ఇది చదువు పూర్తయ్యాక గ్లోబల్ సిటిజన్‌గా ఎదిగేందుకు దోహదపడుతుంది. కాబట్టి ఇతరుల అభిప్రాయాలు, అభిరుచులు, ఇష్టాయిష్టాలను గౌరవించే దృక్పథం అలవరచుకోవాలి. మరోవైపు స్నేహితుల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. చదువుపై ఆసక్తి, మంచి ప్రవర్తన ఉన్నవారితో స్నేహం చేయడం మేలు చేస్తుంది. సబ్జెక్టుపై పట్టు పెంచుకునేందుకు గ్రూపు డిస్కషన్‌స ఉపయోగపడతాయి. అలాగే స్నేహితులతో కలిసి టెక్నికల్ ఫెస్టులు, సెమినార్లలో పాల్గొనడం ద్వారా నాయకత్వ లక్షణాలు పెంచుకోవచ్చు. సబ్జెక్టుల పరంగా అర్థంకాని పాఠ్యాంశాలను కంబైన్‌డ స్టడీ ద్వారా అవగాహన చేసుకోవచ్చు. ముఖ్యంగా చెడు స్నేహాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉంటే.. ఉజ్వల భవిష్యత్‌కు ముందడుగు పడినట్లే!
లక్ష్యం నిర్దేశించుకోండి
పరిష్కార మార్గాలు కనుగొనాలి - డాక్టర్ ఎ.గోవర్థన్, రెక్టారు, జేఎన్‌టీయూ హైదరాబాద్.
ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు తొలుత రెండు నుంచి మూడు వారాలపాటు అవగాహన తరగతులు జరుగుతాయి. ఇందులో విలువలతో కూడిన చదువు, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, జండర్ సెన్సిటైజేషన్, భారత రాజ్యాంగం, కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, వ్యక్తిత్వం, సాఫ్ట్‌స్కిల్స్ మొదలైన వాటిపై అవగాహన కల్పిస్తాం. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రత్యేకంగా ఇంగ్లిష్ నైపుణ్యాలు పెంచేందుకు కృషిచేస్తున్నాం. విద్యార్థులు బిడియం, బెరుకు వదిలి అధ్యాపకులను వ్యక్తిగతంగా కలిసైనా సందేహాలు నివృత్తి చేసుకోవాలి. ఇంజనీరింగ్‌లో విద్యార్థులకు స్పూన్ ఫీడింగ్ విధానం ఉండదు. సెల్ఫ్ లెర్నింగ్‌కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. మొదటి సంవత్సరంలో అన్ని బ్రాంచుల విద్యార్థులకు కామన్ సబ్జెక్టులు ఉంటాయి. వీటిని అప్లికేషన్ ఓరియెంటేషన్‌లో నేర్చుకోవాలి. ఉదాహరణకు సమాజంలోని పలు సమస్యల పరిష్కారానికి మ్యాథమెటికల్ మోడలింగ్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి. సామాజిక సమస్యలు గుర్తించి పరిష్కార మార్గాలు కనుగొనాలి. మొదటి సంవత్సరం నుంచే కోడింగ్, అనలిటికల్ స్కిల్స్‌ను పెంచుకోవడం ప్రారంభించాలి. తద్వారా మూడో సంవత్సరానికి వచ్చేసరికి సొంతంగా ప్రాజెక్టులు చేయగలిగే నైపుణ్యం అలవడుతుంది. మొదటి సంవత్సరం ముగిసేసరికి ఇంటర్న్‌షిప్స్ చేయడం ప్రారంభించాలి. తద్వారా ప్రాక్టికల్ నాలెడ్‌జతోపాటు కంపెనీల అవసరాలు కూడా తెలుస్తాయి. అలాగే లెర్నింగ్ బై డూయింగ్, స్కిల్ బేస్డ్ లెర్నింగ్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ వంటి కొత్త విధానాలు వస్తున్నాయి. విద్యార్థులు వీటిల్లో పాల్గొనడం ద్వారా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫలితంగా ప్లేస్‌మెంట్స్‌లో మంచి అవకాశాలు అందుకునే వీలుటుంది.
అప్పుడే బంగారు భవిష్యత్ సొంతమవుతుంది -ప్రొఫెసర్ బి.రాజేంద్రనాయక్, డీన్, స్టూడెంట్స్ అఫైర్స్, ఓయూ.
ఇంజనీరింగ్‌కు వచ్చేసరికి విద్యార్థులకు స్వేచ్ఛాపూరిత వాతావరణం లభిస్తుంది. దీన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. కొత్త వాతావరణానికి త్వరగా అలవాటు పడాలి. ఇప్పటి నుంచే సమయపాలన అలవరచుకోవాలి. సందేహాలను నివృత్తి చేసుకుంటూ.. ప్రాక్టికల్ లెర్నింగ్‌కు ప్రాధాన్యమివ్వాలి. ఇంటర్‌లో శ్రమించినట్టే.. ఇంజనీరింగ్‌లోనూ చదవాలి. మంచి ప్రవర్తనతో మెలగాలి. దురలవాట్లకు దూరంగా ఉండాలి. సాఫ్ట్‌స్కిల్స్‌పై దృష్టిసారించాలి. అప్పుడే బంగారు భవిష్యత్ సొంతమవుతుంది.

- విద్యార్థులు మొదట ఇంజనీరింగ్‌లో కోర్సు కరిక్యులం, సిలబస్‌పై అవగాహన పెంపొందించుకోవాలి. ఇంజనీరింగ్ కోర్సులో మిడ్, అసైన్‌మెంట్స్, సెమిస్టర్స్, ల్యాబ్స్, ఎలెక్టివ్ సబ్జెక్టులు వంటి వినూత్న పదజాలం కనిపిస్తుంది. వీటన్నింటిపైనా విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి. అలాగే కోర్సులో భాగంగా ఆయా సంవత్సరాల్లో చదవాల్సిన సబ్జెక్టులు ఏంటో తెలుసుకోవాలి.
- ఇంజనీరింగ్ తొలి సంవత్సరంలోనే విద్యార్థులు తమకంటూ ఒక ఉన్నత లక్ష్యం దిశగా ఆలోచన ప్రారంభించాలని అధ్యాపకులు సూచిస్తున్నారు. విద్యార్థులు తాము చేరిన బ్రాంచ్‌కు సంబంధించి భవిష్యత్‌లో అందుబాటులోకి వచ్చే ఉన్నత విద్య, ఉద్యోగావకాశాల గురించి తెలుసుకోవాలి. ఉదాహరణకు కంప్యూటర్ సైన్‌స విద్యార్థి.. నెట్‌వర్కింగ్, ప్రోగ్రామింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైంటిస్ట్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్‌స విభాగాల్లో ఉద్యోగం సాధించాలనే లక్ష్యం నిర్దేశించుకోవచ్చు. లేదా ఆయా విభాగాల్లో ఉన్నతవిద్య, పరిశోధనలు చేయాలని నిర్ణయించుకోవచ్చు. విదేశీ విద్య, మేనేజ్‌మెంట్ స్టడీస్ వైపు అడుగులు వేయాలని లక్ష్యంగా పెట్టుకోవచ్చు.
- ఎలక్ట్రానిక్స్ విద్యార్థి... వీఎల్‌ఎస్‌ఐ, నానో టెక్నాలజీ, వైర్‌లెస్ కమ్యూనికేషన్‌స, సర్క్యూట్ డిజైన్, సిగ్నల్ ప్రాసెసింగ్ మొదలైన కోర్ విభాగాలపై ముందుకెళ్లొచ్చు. లేదా కోడింగ్, వెబ్ డిజైనింగ్‌పై ఆసక్తి ఉంటే ఐటీలో స్థిరపడొచ్చు. అందుకోసం ఇంజనీరింగ్‌లోనే కంప్యూటర్ సైన్‌స సబ్జెక్టులను ఎలెక్టివ్‌సగా ఎంచుకొని చదవాలి.
- ప్రభుత్వ రంగంలో ఉద్యోగం సంపాదించాలనుకుంటే.. సివిల్ సర్వీసెస్, గ్రూప్స్, బ్యాంక్ పీవోస్ వంటి పరీక్షల గురించి అవగాహన పెంచుకోవాలి. సబ్జెక్టుపై పట్టు పెంచుకుంటే ఏ ఉద్యోగంలో చేరినా.. సమర్థవంతంగా సేవలు అందించవచ్చు.
- ఇంజనీరింగ్‌లో మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సబ్జెక్టులు తప్పడం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్‌లాగ్స్ వల్ల ప్లేస్‌మెంట్స్‌కు మాత్రమే కాకుండా, ఉన్నత విద్యతోపాటు విదేశీ విద్యపరంగానూ మంచిది కాదు.
- విద్యార్థులు నిర్దేశిత క్రెడిట్స్ పొందకుంటే... తర్వాతి సంవత్సరానికి ప్రమోట్ అయ్యే అవకాశం కోల్పోతారు. కాబట్టి ఎప్పటికప్పుడు అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి అని గుర్తించాలి.
- కంపెనీలు ప్లేస్‌మెంట్స్ నిర్వహించేటప్పుడు సబ్జెక్టులు ఫెయిల్‌కాని వారిని, మంచి జీపీఏ ఉన్న విద్యార్థులను ఎంచుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి. కాబట్టి అన్ని సబ్జెక్టులను రెగ్యులర్‌గా గట్టెక్కేందుకు కృషిచేయాలి.
- ఇంజనీరింగ్‌లో సబ్జెక్టులు తప్పిన నేపథ్యమున్న విద్యార్థులకు అమెరికాలో ఉన్నత విద్యకు వీసా అవకాశాలు సైతం సన్నగిల్లుతాయి.
- ఇంజనీరింగ్ సబ్జెక్టులను అప్లికేషన్ ఓరియెంటేషన్‌లో చదవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజూ తరగతులకు హాజరవుతూ, రిఫరెన్‌స పుస్తకాలు చదువుతూ సొంతంగా నోట్స్ రాసుకోవాలి. సందేహాలు ఉంటే.. అధ్యాపకులను అడిగి నివృత్తి చేసుకోవాలి.
- రిఫరెన్‌స పుస్తకాలు, లైబ్రరీలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ల్యాబ్స్‌కు తప్పకుండా హాజరకావాలి.
- ఎన్‌పీటీఈఎల్, కోర్సెరా, ఎడ్‌ఎక్స్ వంటి మూక్స్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎంతగానో ఉపయో గపడతాయి. ముఖ్యంగా ఎన్‌పీటీఈఎల్‌లో ఐఐటీ ఫ్యాకల్టీ బోధిస్తారు. వీటిని అనుసరించడం ద్వారా విద్యార్థులు సబ్జెక్టుపై గట్టి పట్టు సాధించొచ్చు.
- ఇంజనీరింగ్ విద్యార్థుల కెరీర్‌కు సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు చాలా అవసరం. వీటిని మెరుగుపరచుకునేందుకు కాలేజీల్లో జరిగే ఫెస్టులు, ఇతర ఎక్స్‌ట్రా, కో కరిక్యులర్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొనాలి.
- ఇంజనీరింగ్‌లో ఇంటర్న్‌షిప్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఇంటర్న్‌షిప్స్ చేయడం ద్వారా ప్రాక్టికల్ నైపుణ్యాలతోపాటు పాకెట్ మనీ కూడా సంపాదించుకోవచ్చు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ మార్గాల్లో ఇంటర్న్‌షిప్స్ అవకాశాలు అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాలి.
పరిష్కార మార్గాలు కనుగొనాలి - డాక్టర్ ఎ.గోవర్థన్, రెక్టారు, జేఎన్‌టీయూ హైదరాబాద్.
ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు తొలుత రెండు నుంచి మూడు వారాలపాటు అవగాహన తరగతులు జరుగుతాయి. ఇందులో విలువలతో కూడిన చదువు, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, జండర్ సెన్సిటైజేషన్, భారత రాజ్యాంగం, కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, వ్యక్తిత్వం, సాఫ్ట్‌స్కిల్స్ మొదలైన వాటిపై అవగాహన కల్పిస్తాం. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రత్యేకంగా ఇంగ్లిష్ నైపుణ్యాలు పెంచేందుకు కృషిచేస్తున్నాం. విద్యార్థులు బిడియం, బెరుకు వదిలి అధ్యాపకులను వ్యక్తిగతంగా కలిసైనా సందేహాలు నివృత్తి చేసుకోవాలి. ఇంజనీరింగ్‌లో విద్యార్థులకు స్పూన్ ఫీడింగ్ విధానం ఉండదు. సెల్ఫ్ లెర్నింగ్‌కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. మొదటి సంవత్సరంలో అన్ని బ్రాంచుల విద్యార్థులకు కామన్ సబ్జెక్టులు ఉంటాయి. వీటిని అప్లికేషన్ ఓరియెంటేషన్‌లో నేర్చుకోవాలి. ఉదాహరణకు సమాజంలోని పలు సమస్యల పరిష్కారానికి మ్యాథమెటికల్ మోడలింగ్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి. సామాజిక సమస్యలు గుర్తించి పరిష్కార మార్గాలు కనుగొనాలి. మొదటి సంవత్సరం నుంచే కోడింగ్, అనలిటికల్ స్కిల్స్‌ను పెంచుకోవడం ప్రారంభించాలి. తద్వారా మూడో సంవత్సరానికి వచ్చేసరికి సొంతంగా ప్రాజెక్టులు చేయగలిగే నైపుణ్యం అలవడుతుంది. మొదటి సంవత్సరం ముగిసేసరికి ఇంటర్న్‌షిప్స్ చేయడం ప్రారంభించాలి. తద్వారా ప్రాక్టికల్ నాలెడ్‌జతోపాటు కంపెనీల అవసరాలు కూడా తెలుస్తాయి. అలాగే లెర్నింగ్ బై డూయింగ్, స్కిల్ బేస్డ్ లెర్నింగ్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ వంటి కొత్త విధానాలు వస్తున్నాయి. విద్యార్థులు వీటిల్లో పాల్గొనడం ద్వారా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫలితంగా ప్లేస్‌మెంట్స్‌లో మంచి అవకాశాలు అందుకునే వీలుటుంది.
అప్పుడే బంగారు భవిష్యత్ సొంతమవుతుంది -ప్రొఫెసర్ బి.రాజేంద్రనాయక్, డీన్, స్టూడెంట్స్ అఫైర్స్, ఓయూ.
ఇంజనీరింగ్‌కు వచ్చేసరికి విద్యార్థులకు స్వేచ్ఛాపూరిత వాతావరణం లభిస్తుంది. దీన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. కొత్త వాతావరణానికి త్వరగా అలవాటు పడాలి. ఇప్పటి నుంచే సమయపాలన అలవరచుకోవాలి. సందేహాలను నివృత్తి చేసుకుంటూ.. ప్రాక్టికల్ లెర్నింగ్‌కు ప్రాధాన్యమివ్వాలి. ఇంటర్‌లో శ్రమించినట్టే.. ఇంజనీరింగ్‌లోనూ చదవాలి. మంచి ప్రవర్తనతో మెలగాలి. దురలవాట్లకు దూరంగా ఉండాలి. సాఫ్ట్‌స్కిల్స్‌పై దృష్టిసారించాలి. అప్పుడే బంగారు భవిష్యత్ సొంతమవుతుంది.
Published date : 19 Jul 2018 06:11PM