Skip to main content

ఈ ఎవర్‌ గ్రీన్‌ కోర్సుపై యువతకు పెరుగుతున్న ఆసక్తి.. వివరాలు తెలుసుకోండిలా..

ప్రపంచవ్యాప్తంగా ఇంధన వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా పెట్రో ఉత్పత్తులకు తరగని డిమాండ్‌.

ముడి చమురును భూమి నుంచి వెలికితీసి.. ఇంధనంగా మార్చే క్రమంలో ఎన్నో దశలు దాటాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించే వారే.. పెట్రోలియం ఇంజనీర్లు. భూమి లోపల ఉన్న పెట్రోలియం, సహజవాయువు నిక్షేపాలను గుర్తించి.. వెలికి తీయడానికి అవసరమైన నైపుణ్యాలను అందించే కోర్సు.. పెట్రోలియం ఇంజనీరింగ్‌! అవకాశాల పరంగా ఎవర్‌గ్రీన్‌ బ్రాంచ్‌గా నిలుస్తున్న పెట్రోలియం ఇంజనీరింగ్‌పై ప్రత్యేక కథనం..


పెట్రోలియం ఇంజనీరింగ్‌కు సంబంధించి యూజీ (అండర్‌ గ్రాడ్యుయేట్‌), పీజీ(పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌), పీహెచ్‌డీ స్థాయి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యూజీ స్థాయిలో దేశంలోని పలు విద్యా సంస్థలు బీటెక్‌/ఎంటెక్‌ ప్రోగ్రామ్స్‌ను అందిస్తున్నాయి. నాలుగేళ్ల బీటెక్‌ పెట్రోలియం ఇంజనీరింగ్‌ని విజయవంతంగా పూర్తి చేసిన తరువాత.. రెండేళ్ల ఎంటెక్‌ కోర్సులో చేరే అవకాశం ఉంది. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ తరువాత పరిశోధనల దిశగా కొనసాగాలనుకుంటే.. పీహెచ్‌డీలో ప్రవేశం పొందొచ్చు. 


పెట్రోలియం కోర్సులు..

పెట్రోలియం ఇంజనీరింగ్‌లో బీటెక్‌/ఎంటెక్‌తోపాటు పలు ఇన్‌స్టిట్యూట్స్‌ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌  బీటెక్‌+ఎంటెక్‌ కోర్సునూ అందిస్తున్నాయి. మరికొన్ని కాలేజీలు పెట్రోలియం విభాగంలో ఎంఎస్‌ కోర్సుల్లోనూ ప్రవేశాలు కల్పిస్తున్నాయి. అంతేకాకుండా మేనేజ్‌మెంట్‌ విద్యకు సంబంధించి ఎంబీఏ –పెట్రోలియం కోర్సు కూడా అందుబాటులో ఉంది.


అర్హతలు..

  1. బీఈ/బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి 10+2/ ఇంటర్మీడియెట్‌ ఎంపీసీ(మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) ఉత్తీర్ణత ఉండాలి. దాంతోపాటు సంబం ధిత ఎంట్రెన్స్‌ టెస్ట్‌లు జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్, యూపీఈఎస్‌ఈఏటీ (యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్, డెహ్రాడూన్‌) ర్యాంకు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
  2.  పీజీ స్థాయిలో ఎంటెక్‌లో చేరేందుకు బీఈ/ బీటెక్‌ పెట్రోలియం ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణతతో పాటు గేట్‌(గ్రాడ్యుయేట్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌)లో ర్యాంకు సాధించాలి.  


ఇన్‌స్టిట్యూట్స్‌..

  •   ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌(ఐఐటీ)–ధన్‌బాద్‌
  •     యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌–డెహ్రాడూన్‌
  •     పండిట్‌ దీన్‌దయాళ్‌ పెట్రోలియం యూనివర్సిటీ–గాంధీనగర్‌
  •     ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ– విశాఖపట్నం
  •     మహారాష్ట్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ–పుణె
  •     రాజీవ్‌ గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం టెక్నాలజీ–యూపీ
  •     ఐఐటీ–ఖరగ్‌పూర్‌ (పీజీ స్థాయి)
  •     ఐఐటీ –గౌహతి (పీజీ స్థాయి)
  •     జేఎటీయూ–కాకినాడ తదితర ఇన్‌స్టిట్యూట్స్‌ పెట్రోలియం ఇంజనీరింగ్‌ కోర్సులు అందిస్తున్నాయి. 


జాబ్‌ ప్రొఫైల్స్‌..

యూజీ, పీజీ స్థాయిలో పెట్రోలియం ఇంజనీరింగ్‌ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులు.. ఫీల్డ్‌ ఆపరేటర్, టెస్టింగ్‌ మేనేజర్, ప్రాజెక్ట్‌ మేనేజర్, టెక్నీషియన్, జూనియర్‌ ఇంజనీర్, రీసెర్చ్‌ ఇంజనీర్, రిజర్వాయర్‌ ఇంజనీర్, డ్రిల్లింగ్‌ ఇంజనీర్, పైప్‌లైన్‌ ఇంజనీర్, సైంటిస్ట్‌ జియాలజిస్ట్, మినరాలజిస్ట్, వెల్‌ స్టిమ్యులేటింగ్‌ ఇంజనీర్‌ వంటి ఉద్యోగాలు దక్కించుకోవచ్చు.

ఇంకా చదవండి: part 2: పెట్రోలియం కోర్సు పూర్తి చేస్తే కెరీర్‌ స్కోప్‌.. రూ. 5లక్షల ప్రారంభ వేతనంతో ఉద్యోగాలు..

Published date : 28 Jun 2021 01:50PM

Photo Stories