దివ్యమైన కెరీర్ కోసం ..డిజైనింగ్ కోర్సులు
Sakshi Education
సమాజం నిరంతరం మార్పు చెందుతూనే ఉంటోంది. కొత్త దనాన్ని కోరుకోవడం, అందులోనూ ప్రత్యేకతను ప్రదర్శించాలనుకోవడం మానవ నైజం. అటువంటి భావనలపై ఆధారపడి అభివృద్ధి దిశలో పయనిస్తున్న రంగమే డిజైనింగ్. భారతదేశంలో డిజైనింగ్ స్కూల్స్ ఖండాంతర ఖ్యాతిని పొందుతున్నాయి. ఒక వైపు సంప్రదాయాన్ని మరోవైపు నూతన పోకడలు రెండింటి మేళవింపుగా డిజైనింగ్ రంగం అభివృద్ధి చెందుతుంది.
నేటి ఫ్యాషన్ యుగంలో ఆటోమొబైల్ నుంచి లైఫ్ స్టైల్ వరకు..సిరామిక్స్ నుంచి ఇంటరీయర్ వరకు ఇలా అన్ని రంగాల్లో ప్రొఫెషనర్ల డిజైనర్ల అవసరం ఎంతో. అంతేకాకుండా మారుతున్న అభిరుచులకనుగుణంగా మార్కెట్లోకి ప్రవేశించే ప్రతి వస్తువును ప్రత్యేకంగా రూపొందించాలంటే ప్రొఫెషనల్ డిజైనర్లు కావాల్సిందే. ఇలా అన్ని రంగాలకు చెందిన వస్తువులను మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వినూత్న రీతిలో డిజైన్ చేయడం ఎలాగో తెలిపేవే డిజైనింగ్ కోర్సులు. పాత వస్తువులను కొత్త వాటిగా ఎలా తీర్చిదిద్దవచ్చు? వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వాటిని ఏ విధంగా రూపొదించవచ్చు..అనే విషయాలను డిజైనింగ్ కోర్సుల్లో నేర్చుకుంటారు. వినూత్నంగా మార్కెట్‌లోకి వచ్చే ప్రతి కొత్త వస్తువు తయారీ వెనుక డిజైనర్ పాత్ర ఉంటుంది.
ఏం బోధిస్తారు?
డిజైన్ కోర్సులో డిజైనింగ్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలపై మొదట అవగాహన కల్పిస్తారు. తర్వాత డిజైనింగ్ అంటే ఏమిటి? ఈ ప్రక్రియలో ఏయే కలర్స్ ఉపయోగించాలి? 3డి డిజైనింగ్, డిజిటల్ మెథడ్స్, స్పెస్ అండ్ స్ట్రక్చర్, డిజైన్ డ్రాయింగ్, జామెట్రీ వంటి అంశాలను బోధిస్తారు. టెక్నాలజీ, ప్రొడక్ట్, గ్రాఫిక్స్, టెక్నిక్స్, ఎలాంటి మెటీరియల్‌ను వినియోగించాలి? మార్కెట్ ట్రెండ్‌ను అంచనా వేయడం వంటి అనేక అంశాలు గురించి ఈ కోర్సులో వివరిస్తారు. మొత్తంగా ఒక వస్తువును గానీ, ఒక అంశానికి సంబంధించిన విషయాలను గానీ వినియోగదారుల అభిరుచికనుగుణంగా ఎలా డిజైన్ చేయొచ్చు, డిజైనింగ్‌లో ఉండే టెక్నిక్స్ ఏమిటీ? అనే అనేక అంశాలను డిజైనింగ్ కోర్సుల్లో వివరిస్తారు.
స్పెషలైజేషన్స్:
డిజైనింగ్ అంటే కేవలం ఫ్యాషన్ డిజైనింగ్ అనే భావన మాత్రమే ఉంది. కానీ మనం ఉపయోగించే మోటార్ బైక్ నుంచి టీవీ రిమోట్ వరకు..ఇలా అన్ని వస్తువుల్లో డిజైనర్ల పాత్ర కీలకం. ఈ క్రమంలో ఉండే
స్పెషలైజేషన్స్..

- ప్రొడక్ట్ డిజైన్
- గ్రాఫిక్ డిజైన్
- టెక్స్‌టైల్ డిజైన్
- ఎగ్జిబిషన్ డిజైన్
- ఫర్నీచర్ డిజైన్
- ఇంటీరియర్ డిజైన్
- సిరామిక్ డిజైన్
- గ్లాస్ డిజైన్
- ట్రాన్స్‌పోర్టేషన్ డిజైన్
- ఆటోమొబైల్ డిజైన్
- యానిమేషన్ డిజైన్
- ఆపెరల్ డిజైన్
- టాయ్ డిజైన్
- గేమ్ డిజైన్
- మీడియా డిజైన్
- ఫోటోగ్రఫి డిజైన్
- లైఫ్ స్టైల్ యాక్సెసరీస్ డిజైన్
- ఇన్ఫర్మేషన్ డిజైన్
- ఇంట్రాక్షన్ డిజైన్
- రిటైల్ డిజైన్
ఈ రంగంలో రాణించాలంటే కొన్ని నైపుణ్యాలు తప్పనిసరి. అవి..
- సృజనాత్మకత, వినూత్ననంగా ఆలోచించడం
- ఆర్టిస్టిక్ వ్యూ
- డ్రాయింగ్ వేసే నేర్పు
- విశ్లేషణ సామర్థ్యం
- తార్కిక ఆలోచన
- కలర్ సెన్స్ (కలర్ల ఎంపిక పట్ల చక్కని అవగాహన)
- జట్టుగా పని చేనే సామర్థ్యం
- మార్కెట్ అవసరాలను/వినియోగదారుల అభిరుచిని అంచనా వేయడం
- సంబంధిత రంగంలో సమకాలీనంగా చోటు చేసుకుంటున్న మార్పులను పరిశీలించడం
అవకాశాలు:
కట్టుకునే ఇల్లు దగ్గర నుంచి గోడ గడియారం వరకు, కాళ్లకు వేసుకునే చెప్పుల దగ్గర నుంచి కళ్లజోడు వరకు ప్రతి వస్తువు ఫ్యాషన్‌గా ఉండాలి... కొత్తగా ప్రత్యేకంగా కనిపించాలి అనే ధోరణి ఇటీవల కాలంలో పెరుగుతుంది. దానికి అనుగుణంగా అనేక కొత్త వస్తువులు, ప్రత్యేక డిజైన్లతో మార్కెట్‌లోకి వస్తున్నాయి. మార్కెట్‌లోకి వచ్చే ప్రతి కొత్త రకం వస్తువు వెనుక దాన్ని తయారు చేసే డిజైనర్ కృషి ఉంటుంది. అందుకే డిజైనింగ్ కోర్సు చేసే వారికి అవకాశాలకు కొదవ ఉండదు. ప్రతి కంపెనీ, సంస్థ, కమ్యూనిటీలు అన్నీ మార్కెట్ ట్రెండ్‌ను అందుకునే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి అందరికీ డిజైనర్స్ అవసరం ఉంటుంది.
ఈక్రమంలో కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్న సంస్థలు:

- ఆటోమొబైల్ కంపెనీలు
- ఫ్యాషన్ స్టూడియోస్
- మాన్యుఫాక్చరింగ్ సంస్థలు
- మీడియా హౌసెస్
- రిటైల్ సంస్థలు
- సిరామిక్ ఇండస్ట్రీస్
- గ్లాస్ వేర్ హౌసెస్
- యానిమేషన్ స్టూడియోలు
- గేమింగ్ కంపెనీలు
- బోటిక్స్
- టాయ్ ఇండస్ట్రీస్
కెరీర్-వేతనాలు:
కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్‌గా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. తర్వాత అసోసియేట్, చీఫ్ డెరైక్టర్/డిజైనర్, క్రియేటివ్ డెరైక్టర్ వంటి హోదాలకు చేరుకోవచ్చు. ప్రతిభ/నైపుణ్యాల ఆధారంగా మాత్రమే ఈ రంగంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. ప్రారంభంలో సంవత్సరానికి రూ. 3 నుంచి రూ. 4 లక్షల వరకు వేతనాన్ని అందుకోవచ్చు. తర్వాత హోదా ఆధారంగా రూ. 8-10 లక్షల వరకు కూడా అందుకోవచ్చు. వేతనాలు కంపెనీ, రంగం, ప్రదేశాన్ని బట్టి మారుతుంటాయి.
టాప్ రిక్రూటర్స్:
డిజైనింగ్ కోర్సులు చేసిన వారికి మారుతీ సుజుకీ, రెనాల్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా మోటార్స్, ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ ఇండియా లిమిటెడ్, ఎల్‌జీ, వర్‌లపుల్, గోద్రేజ్, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, జీఈ హెల్త్‌కేర్, ఐబీఎమ్, సినర్జీ లైఫ్ స్టైల్స్, టాటా మోటార్‌స వంటి అనేక జాతీయ, బహుళజాతి కంపెనీలు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. డిజైనర్లకు విదేశాల్లోను మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగాఅమెరికా, యూకేలలో డిజైనర్లకు చక్కని అవకాశాలు లభిస్తున్నాయి.
ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ) డిజైనింగ్ కోర్సులకు సంబంధించి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్. దీనికి అహ్మదాబాద్, గాంధీనగర్, బెంగళూరులలో క్యాంపస్‌లున్నాయి. కోర్సులు: గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రాం ఇన్ డిజైనింగ్ (జీడీపీడీ- స్పెషలైజేషన్‌స ఇండస్ట్రియల్ డిజైన్, కమ్యూనికేషన్ డిజైన్, టెక్స్‌టైల్స్ డిజైన్) అర్హత : ఇంటర్ ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత.
వ్యవధి: నాలుగేళ్లు ప్రవేశం: డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్(డీఏటీ) ఆధారంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రాం ఇన్ డిజైనింగ్ (పీజీడీపీడీ- అహ్మదాబాద్, గాంధీనగర్, బెంగళూరు క్యాంపస్‌లు) ప్రొడక్ట్ డిజైన్, ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్ డిజైన్, సిరామిక్ అండ్ గ్లాస్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్, యూనిమేషన్ ఫిల్మ్ డిజైన్, ఫిల్మ్ అండ్ వీడియో కమ్యూనికేషన్, టెక్స్‌టైల్స్ డిజైన్, ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ ఆటోమొబైల్, టాయ్ అండ్ గేమ్, ఫోటోగ్రఫీ, అపెరల్, లైఫ్ స్టైల్ యాక్సెసరీస్, న్యూమీడియా, స్ట్రాటజిక్ డిజైన్ మేనేజ్‌మెంట్ కోర్సులను ఆఫర్ చేస్తుంది.
అర్హత: ఎంపిక చేసుకున్న ప్రోగ్రాంను బట్టి ఆయా ప్రోగ్రాంలో నాలుగేళ్లు డిగ్రీ లేదా డిప్ల్లొమా (10+2+4) కోర్సు చేసి ఉండాలి.
వ్యవధి: మూడేళ్లు ప్రవేశం: డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆధారంగా యూజీ కోర్సులను కేవలం అహ్మదాబాద్ క్యాంపస్‌లో మాత్రమే ఆఫర్ చేస్తుంది.
వివరాలకు: www.nid.edu
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-గౌహతి
కోర్సులు: బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ డిజైన్ అర్హత: ఇంటర్/తత్సమానం ప్రవేశం: జేఈఈ అడ్వాన్‌సడ్ మాస్టర్స్ ఇన్ డిజైన్స్ ప్రవేశం: కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్ (సీఈఈడీ) ఆధారంగా పీహెచ్‌డీ: ప్రవేశం: గేట్/సీఈఈడీ ఆధారంగా
వివరాలకు: www.iitg.ac.in
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-కాన్పూర్ మాస్టర్ ప్రోగ్రామ్ ఇన్ డిజైన్, పీహెచ్‌డీ
ప్రవేశం: గేట్/సీఈఈడీ ర్యాంక్ ఆధారంగా
వివరాలకు: www.iitk.ac.in
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)- బాంబే మాస్టర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్
అర్హత: ఆర్కిటెక్చర్, డిజైన్, ఇంటీరియర్ డిజైన్‌లో ఇంజనీరింగ్, ఎన్‌ఐడీ, సెప్ట్‌లో ప్రొఫెషనల్ డిప్లొమాలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
ప్రవేశం: సీఈఈడీ స్కోర్ ఆధారంగా పీహెచ్‌డీ:
అర్హత: ఐఐటీ, ఐఐఎస్‌సీ, ఎన్‌ఐడీలో మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. సీఈఈడీ స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు.
వివరాలకు: www.iitb.ac.in
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్- బెంగళూరు మాస్టర్ ఆఫ్ డిజైన్
ప్రవేశం: ఐఐఎస్‌సీ ఎంట్రెన్స్ ఆధారంగా
వివరాలకు: www.iisc.ernet.in
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ-క్యాంపస్‌లు.
వివరాలకు: www.nift.ac.in

Published date : 28 Oct 2013 04:07PM