Skip to main content

బీటెక్ కాలేజీ, కోర్సులకు ఇచ్చేన్యాక్, ఎన్‌బీఏ గుర్తింపునకు పాటించే ప్రామణికాలు ఇవే?

బీటెక్ కాలేజ్‌లు, ఇన్‌స్టిట్యూట్‌లకు గ్రేడింగ్ ఇచ్చే క్రమంలో న్యాక్ పలు ప్రామాణికాలను పరిగణనలోకి తీసుకుంటుంది. అవి..
  • కరిక్యులర్ సంబంధిత అంశాలు
  • టీచింగ్-లెర్నింగ్ ఎవాల్యుయేషన్
  • రీసెర్చ్ కన్సల్టెన్సీ అండ్ ఎక్స్‌టెన్షన్
  • లెర్నింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
  • స్టూడెంట్ సపోర్ట్, ప్రోగ్రెషన్
  • గవర్నెన్స్, లీడర్‌షిప్, మేనేజ్‌మెంట్
  • ఇన్నోవేషన్, బెస్ట్ ప్రాక్టీసెస్.
  • న్యాక్ అసెస్‌మెంట్‌లో భాగంగా విద్యా సంస్థలను మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. అవి..యూనివర్సిటీలు, అటానమస్ కాలేజీలు, అనుబంధ కళాశాలలు. ఆయా ప్రమాణాల పరంగా ఒక్కో ప్రామాణికానికి నిర్దేశిత మార్కుల విధానం అమలు చేస్తారు. మొత్తం వేయి మార్కుల స్కోరింగ్ ఉంటుంది. ఒక్కో ప్రామాణికానికి పొందిన స్కోరు ఆధారంగా తదుపరి దశలో గ్రేడింగ్స్ ఇస్తారు. ఇలా గ్రేడింగ్స్ ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లలో చేరితే నాణ్యమైన విద్య అందుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.


న్యాక్ గ్రేడింగ్స్..
ఏడు ప్రామాణికాలు, వేయి మార్కుల స్కోరింగ్ విధానంలో ఇచ్చే గ్రేడింగ్స్, హోదాల వివరాలు..

సీజీపీఏ

లెటర్ గ్రేడ్

హోదా

- 3.76-4.00

ఎ++

అక్రెడిటెడ్

- 3.26 -3.50

ఎ+

అక్రెడిటెడ్

- 3.01 -3.25

అక్రెడిటెడ్

- 2.76-3.00

బి++

అక్రెడిటెడ్

- 2.51-2.75

బి+

అక్రెడిటెడ్

- 2.01-2.50

బి

అక్రెడిటెడ్

- 1.51-2.00

సి

అక్రెడిటెడ్

- 1.50కంటే తక్కువ

డి

నాట్ అక్రెడిటెడ్


గుర్తింపుతో.. ఎన్నో ప్రయోజనాలు..

  • న్యాక్.. యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు, అనుబంధ కాలేజీలకు గుర్తింపు ఇచ్చేందుకు అనేక ఉన్నత ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటుంది. కాబట్టి సదరు ఇన్‌స్టిట్యూట్‌లో నాణ్యత ప్రమాణాలు అత్యున్నతంగా ఉంటాయనే నమ్మకం విద్యార్థుల్లో కలుగుతుంది.
  • యూజీసీ చట్ట పరిధిలోని 2(ఎఫ్), 12(బి) మేరకు ఏర్పాటైన ఇన్‌స్టిట్యూట్‌లకు యూజీసీ అందించే నిధుల్లో ప్రాధాన్యం లభిస్తుంది.
  • ఉన్నత విద్య అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధుల మంజూరులో అవకాశం దక్కుతుంది. అలాగే రూసా, ఇతర పథకాల ద్వారా అదనపు ఆర్థిక చేయూత అందుతుంది. అంతేకాకుండా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం సహాయం లభిస్తుంది. దీంతో ఆయా న్యాక్ గుర్తింపు ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకునే విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు, బోధనతో కూడిన విద్య సొంతమవుతుంది.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.naac.gov.in  


ఇంకా తెలుసుకోండి: part 3: కాలేజ్ ఏదైనా కోర్సులకు ప్రత్యేకంగా ఇచ్చే గుర్తింపే ఎన్‌బీఏ.. అసలేంటీ ఎన్‌బీఏ?

Published date : 15 Oct 2020 04:20PM

Photo Stories