బీటెక్ కాలేజీ, కోర్సు ఎంపికలో కీలకం.. న్యాక్, ఎన్‌బీఏ గుర్తింపు ఉందా?
Sakshi Education
ఎంసెట్ ఉత్తీర్ణత సాధించి.. బీటెక్‌లో చేరాలనుకుంటున్నారా?! ఐసెట్ ర్యాంకుతో.. మెరుగైన మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ కోసం అన్వేషిస్తున్నారా.. బెటర్ ఇన్‌స్టిట్యూట్ ఏది.. బెస్ట్ ప్రోగ్రాం ఏదో తెలుసుకోవడం ఎలా..! ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం.. న్యాక్(నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్), ఎన్‌బీఏ(నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్)!! ఈ సంస్థల గుర్తింపు ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లలో చేరితే.. అకడమిక్స్ నుంచి ప్లేస్‌మెంట్స్ వరకు.. ఢోకా ఉండదంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ఇంజనీరింగ్, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో.. న్యాక్, ఎన్‌బీఏతో ప్రయోజనాలు.. పరిగణించే ప్రమాణాలు.. గుర్తింపు ఇచ్చేందుకు అనుసరిస్తున్న విధానాల గురించి తెలుసుకుందాం...
వేల సంఖ్యలో ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కళాశాలలు. వాటిలో రకరకాల కోర్సులు. దాంతో మనం చేరాలనుకుంటున్న కోర్సుకు ఏ ఇన్‌స్టిట్యూట్ బెస్ట్ అనే సందేహం ఎదురవుతోంది! ఇలాంటి పరిస్థితుల్లో కోర్సు, కాలేజీ ఎంపికలో విద్యార్థులు న్యాక్, ఎన్‌బీఏ గుర్తింపును పరిగణనలోకి తీసుకోవాలన్నది నిపుణుల సలహా.
యూజీసీ ఆధ్వర్యంలో న్యాక్..
నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్(న్యాక్) కౌన్సిల్.. సంక్షిప్తంగా న్యాక్. జాతీయ స్థాయిలో యూనివర్సిటీలు, అటానమస్ ఇన్‌స్టిట్యూట్స్, డీమ్డ్ యూనివర్సిటీలు వంటి విద్యాసంస్థల నియంత్రణ, పర్యవేక్షణ చేపట్టే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఆధ్వర్యంలో న్యాక్ పనిచేస్తుంది. ఆయా ఇన్‌స్టిట్యూట్‌లకు గుర్తింపు ఇచ్చేందుకు న్యాక్ పలు ప్రామాణికాలను పరిగణనలోకి తీసుకుంటుంది. దీని గుర్తింపుతో నిధుల కేటాయింపులో విద్యాసంస్థలకు ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తుంది. అత్యున్నతమైన ప్రమాణాలు పాటిస్తుండటంతో న్యాక్ గుర్తింపు, గ్రేడింగ్ పొందిన ఇన్‌స్టిట్యూట్‌లలో విద్యార్థులకు టీచింగ్, లెర్నింగ్, రీసెర్చ్ వంటి విషయాల్లో ప్రయోజనం చేకూరుతుంది. ఫలితంగా విద్యార్థులకు భవిష్యత్తు అవకాశాలు మెరుగవుతాయి.
ఇంకా తెలుసుకోండి: part 2: బీటెక్ కాలేజీ, కోర్సులకు ఇచ్చే న్యాక్, ఎన్‌బీఏ గుర్తింపునకు పాటించే ప్రామణికాలు ఇవే?

Published date : 15 Oct 2020 04:17PM