Skip to main content

సీఏ ఫైనల్సన్నద్ధత వ్యూహాలు...

2017, జులై 1 నుంచి చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) కోర్సులో కొత్త విధానం అమల్లోకి వచ్చింది. అంతర్జాతీయంగా ఉన్నత ఉపాధి అవకాశాలు లక్ష్యంతో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ).. సీఏ కోర్సులో మార్పులు చేసింది.
ఈ కోర్సులో చివరి దశ.. సీఏ ఫైనల్. ఐపీసీసీ, ఆపై రెండున్నరేళ్ల ఆర్టికల్‌షిప్ పూర్తిచేసిన విద్యార్థులు సీఏ ఫైనల్ రాసేందుకు అర్హులు. మరికొద్ది రోజుల్లో సీఏ ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. వీటిలో అత్యధిక మార్కుల సాధనకు వ్యూహాలు..

సీఏ ఫైనల్ తేదీలు..
గ్రూప్-1 : నవంబర్ 1, 3, 5, 9
గ్రూప్-2 : నవంబర్ 11, 13, 15, 17

పరీక్ష విధానం :
గ్రూప్-1
పేపర్ సబ్జెక్టులు మార్కులు
1 ఫైనాన్షియల్ రిపోర్టింగ్ 100
2 స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ 100
3 అడ్వాన్స్‌డ్ ఆడిటింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ 100
4 కార్పొరేట్ లాస్ (70 మా.) ఎకనామిక్ లాస్ (30 మా.) 100
 ఒక్కో పేపర్‌కు మూడు గంటల సమయం అందుబాటులో ఉంటుంది.

గ్రూప్-2
5 స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్‌మెంట్, పర్‌ఫార్మెన్స్ ఎవాల్యూయేషన్ 100
6 ఎలక్టివ్ పేపర్
- రిస్క్ మేనేజ్‌మెంట్
- ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్
- ఎకనామిక్ లాస్
- ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్
- గ్లోబల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్
- మల్టీడిసిప్లినరీ కేస్‌స్టడీ
100
7 డెరైక్ట్ ట్యాక్స్‌లాస్ (70 మా.) ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ (30 మా.) 100
8 ఇన్‌డెరైక్ట్ ట్యాక్స్‌లాస్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (75 మా.) కస్టమ్స్ అండ్ ఎఫ్‌టీపీ (25 మా.) 100
ఎలక్టివ్ పేపర్‌కు నాలుగు గంటలు, మిగిలిన పేపర్లకు మూడు గంటల సమయం అందుబాటులో ఉంటుంది.

సబ్జెక్టుల వారీగా సన్నద్ధత...
ఫైనాన్షియల్ రిపోర్టింగ్:

ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. వాల్యూ యాడెడ్, అకౌంటింగ్ ఫర్ షేర్ బేస్డ్ పేమెంట్, అకౌంటింగ్ ఫర్ కార్బన్ క్రెడిట్స్, హ్యూమన్ రిసోర్స్ రిపోర్టింగ్ వంటి చాప్టర్లు ముఖ్యమైనవి.
  • అవసరమైన చోట కంపెనీల చట్టం-2013 ఫార్మాట్‌లోని మూడో షెడ్యూల్ ప్రకారం బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకోవాలి.
  • ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్..ఆడిటింగ్ సబ్జెక్టుల్లోనూ ఉంటాయి కాబట్టి రెండింటినీ ఒకేసారి అధ్యయనం చేయడం వల్ల సమయం ఆదా అవుతుంది.
  • బిజినెస్ కాంబినేషన్ అండ్ కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్; కన్సాలిడేటెడ్ అండ్ సెపరేట్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్ వంటి చాప్టర్లను చదువుతున్నప్పుడు క్లిష్టమైన అంశాలను హైలెట్ చేసుకోవాలి. దీనివల్ల రివిజన్ సులువవుతుంది.

స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్:
ఫారెన్ ఎక్స్ఛేంజ్ ఎక్స్‌పోజర్, రిస్క్ మేనేజ్‌మెంట్, ఇండియన్ క్యాపిటల్ మార్కెట్ల వంటి చాప్టర్లు ముఖ్యమైనవి.
కార్పొరేట్ వాల్యూయేషన్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ అండ్ స్టార్టప్ ఫైనాన్స్ తదితర కొత్త చాప్టర్లపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి.

అడ్వాన్స్‌డ్ ఆడిటింగ్, ప్రొఫెషనల్ ఎథిక్స్:
పరీక్షల్లో ఆడిటింగ్ స్టాండర్డ్ మొత్తం రాయనవసరం లేదు. అడిగిన ప్రశ్న మేరకు రాస్తే సరిపోతుంది. ఎక్కువగా ప్రాక్టికల్ ప్రశ్నలే వస్తాయి కాబట్టి వాటిపై దృష్టిసారించాలి.

కార్పొరేట్ లాస్, ఎకనామిక్ లాస్:
అపాయింట్ మెంట్ ఆఫ్ డెరైక్టర్స్, క్వాలిఫికేషన్ ఆఫ్ డెరైక్టర్స్, బోర్డ్ మీటింగ్ తదితర అంశాలకు ప్రాధాన్యమివ్వాలి.
అపాయింట్‌మెంట్ అండ్ రెమ్యునరేషన్ ఆఫ్ కీ మేనేజీరియల్ పర్సనల్‌కి ప్రాధాన్యమివ్వాలి. లాస్‌లో మార్పులకు సంబంధించి పెనాల్టీ ప్రొవిజన్స్‌పై దృష్టిసారించాలి.

స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్‌మెంట్, పెర్‌ఫార్మెన్స్ ఎవాల్యూయేషన్ :
20-30 శాతం మార్కుల సాధనకు వీలుకల్పించే కేస్‌స్టడీస్ చాప్టర్లపై దృష్టిసారించాలి. మోడర్న్ బిజినెస్ ఎన్విరాన్‌మెంట్, ప్రైసింగ్ డెసిషన్స్ అండ్ పెర్‌ఫార్మెన్స్ మెజర్‌మెంట్ అంశాల్లో థియరీకి ప్రాధాన్యమివ్వాలి.
ఈ సబ్జెక్టు అధ్యయనానికి ఆథర్స్ పుస్తకాలు కంటే క్లాస్‌నోట్స్, స్టడీ మెటీరియల్‌పై ఆధారపడటం మంచిది.
ఎలక్టివ్ పేపర్:ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్, ఎకనామిక్ లాస్ పేపర్లకు ప్రాధాన్యమివ్వడం మంచిది. ఎలక్టివ్ పేపర్ పరీక్షను ఓపెన్ బుక్ విధానంలో నిర్వహిస్తారు.

డెరైక్ట్ ట్యాక్స్‌లాస్, ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్:
రివిజన్ సమయంలో సమ్మరీ మాడ్యూల్, స్టడీమెటీరియల్‌ను తప్పనిసరిగా చదవాలి. Five Heads (అంశాలు)పై దృష్టిసారించాలి. సమయం ఉంటే కేస్ లాస్‌ను కూడా అధ్యయనం చేయాలి. సవరణలను ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి.

గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్; కస్టమ్స్ అండ్ ఎఫ్‌టీపీ:
ఎఫ్‌టీపీ చాప్టర్‌ను నిర్లక్ష్యం చేయొద్దు. థియరీ, సమస్యలకు సమ ప్రాధాన్యమివ్వాలి. ముఖ్యంగా ప్రాక్టికల్ సమస్యలపై దృష్టిసారించాలి.
పరీక్షలో తప్పనిసరిగా ల్యాండ్‌మార్క్ కేస్ లాస్‌ను ప్రస్తావించాలి. దీనివల్ల మార్కులు పెరిగే అవకాశముంది.


కనీసం మూడుసార్లు రివిజన్ చేయాలి..

సీఏ ఫైనల్ పరీక్షల్లో విజయం సాధించాలంటే ఓపిక, కఠోరశ్రమ, సమయ పాలన వంటివి చాలా ముఖ్యం. మొదట్నుంచి చదువుతున్న మెటీరియల్‌నే చివరి వరకు చదవాలి. తరచు మెటీరియల్‌ను మార్చడం మంచిది కాదు. కనీసం మూడుసార్లు సిలబస్‌ను రివిజన్ చేయాలి. ఫార్ములాలను ప్రత్యేకంగా ఓ నోట్స్‌లో రాసుకోవాలి. వీలునుబట్టి ఫ్లోచార్టులను కూడా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మాన్యువల్‌లోని అన్ని సమస్యలను ప్రాక్టీస్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ట్యాక్స్‌కి సంబంధించిన పేపర్లు చదివేటప్పుడు చట్ట సవరణలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలి. రైటింగ్ ప్రాక్టీస్ కూడా ముఖ్యం. రివిజన్ టెస్ట్‌లు రాయడం వల్ల తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. సీఏ ఇన్‌స్టిట్యూట్, శిక్షణ సంస్థ నిర్వహించే పరీక్షలను తప్పనిసరిగా రాసి, స్వీయ విశ్లేషణ చేసుకోవాలి.
- ఎం.ఎస్.ఎస్.ప్రకాశ్, డెరైక్టర్, మాస్టర్‌మైండ్స్.
Published date : 10 Oct 2018 03:43PM

Photo Stories