Skip to main content

తొలి రైల్వే వర్సిటీలో యూజీ, పీజీ అడ్మిషన్స్‌.. ఉద్యోగ అవకాశాలు ఇలా..

దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వేలకు అవసరమైన నిపుణులను అందించేందుకు ఏర్పాటైన తొలి రైల్వే యూనివర్సిటీ.. నేషల్‌ రైల్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌ఆర్‌టీఐ).

భారత ప్రభుత్వం ప్రత్యేక చట్టం ద్వారా ఎన్‌ఆర్‌టీఐను వడోదరలో స్థాపించి.. డీమ్డ్‌ యూనివర్సిటీ హోదా కల్పించింది. ఈ ఇన్‌స్టిట్యూట్‌ 2021–22 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఎన్‌ఆర్‌టీఐ అందించే యూజీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు, ప్రవేశ విధానాలు, ఉద్యోగావకాశాలపై ప్రత్యేక కథనం..

యూజీ కోర్సులు..

  • బీబీఏ ఇన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ మేనేజ్‌మెంట్‌–కోర్సు వ్యవధి మూడేళ్లు.
  • బీఎస్సీ ఇన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ టెక్నాలజీ–కోర్సు వ్యవధి మూడేళ్లు.
  • బీటెక్ ఇన్‌ రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంజనీరింగ్‌–కోర్సు వ్యవధి నాలుగేళ్లు.
  • బీటెక్‌ ఇన్‌ రైల్‌ సిస్టమ్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌–కోర్సు వ్యవధి నాలుగేళ్లు.
  • బీటెక్ ఇన్‌ మెకానికల్‌ అండ్‌ రైల్‌ ఇంజనీరింగ్‌–కోర్సు వ్యవధి నాలుగేళ్లు.

అర్హత: కోర్సును అనుసరించి ఇంటర్మీడియెట్‌ ఎంపీసీ, సైన్స్‌ విభాగాల (మ్యాథ్స్‌ చదివి ఉండాలి) విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు.

వయసు: 01.08.2021 నాటికి 25ఏళ్లు మించకూడదు.

ఎంపిక: బీబీఏ, బీఎస్సీ కోర్సులకు ఎన్‌ఆర్‌టీఐ యూజీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. బీటెక్‌ కోర్సుల్లో జేఈఈ మెయిన్‌ 2021 స్కోర్‌తో అడ్మిషన్‌ పొందొచ్చు.

పీజీ స్థాయి కోర్సులు..

  • ఎంబీఏ ఇన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ మేనేజ్‌మెంట్‌
  • ఎంబీఏ ఇన్‌ సప్లయ్ చైన్‌ మేనేజ్‌మెంట్‌
  • ఎమ్మెస్సీ ఇన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ టెక్నాలజీ అండ్‌ పాలసీ
  • ఎమ్మెస్సీ ఇన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ అండ్‌ అనలిటిక్స్‌
  • ఎమ్మెస్సీ ఇన్‌ రైల్వే సిస్టమ్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ ఇంటిగ్రేషన్‌

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్‌/స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్టుగా ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

ఎమ్మెస్సీ కోర్సుల విద్యార్థులకు ఎన్‌ఆర్‌టీఐ నిర్వహించే ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసి.. సబ్జెక్ట్‌ టెస్ట్, ఇంటర్వూ్యల్లో ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.

ఎంబీఏ కోర్సుల విద్యార్థులకు క్యాట్‌/గ్జాట్‌/మ్యాట్‌ స్కోర్‌ ఉంటే.. ఎన్‌ఆర్‌టీఐ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ నుంచి మినహాయింపు లభిస్తుంది. వీరు మలిదశలో పర్సనల్‌ ఇంటర్వూకు హాజరుకావాల్సి ఉంటుంది.

వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ కోసం..

  • పీజీడీఎం ఇన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌/లాజిస్టిక్స్‌
  • పీజీడీఎం ఇన్‌ ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్సింగ్‌/ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌.

అర్హతలు: ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కనీస పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఎన్‌టీఆర్‌ఐ పీజీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసి.. ఇంటర్వూ్యలో ప్రతిభ చూపిన వారికి ప్రవేశం ఖరారు చేస్తారు.

ఎంట్రన్స్‌ టెస్ట్‌..
జాతీయ స్థాయిలో నిర్వహించే ఎన్‌ఆర్‌టీఐ ఎంట్రన్స్ ఆన్‌లైన్‌ విధానంలో ఉంటుంది. 90 నిమిషాల వ్యవధిలో 100 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలకు(సమాన మార్కులు) సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రొఫిషియన్సీ ఇన్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 25 ప్రశ్నలు, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌ 30, క్వాంటిటేటివ్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ 25, జనరల్‌ అవేర్‌నెస్‌ 20 నుంచి ప్రశ్నలు అడుగుతారు.

ముఖ్య సమాచారం..

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
  • బీబీఏ/బీఎస్సీ/ఎంబీఏ/ఎమ్మెస్సీ కోర్సులకు దరఖాస్తులకు చివరి తేది: 21.07.2021
  • బీటెక్‌ కోర్సులకు దరఖాస్తులకు చివరి తేదీ: 20.08.2021
  • ఎన్‌ఆర్‌టీఐ యూజీ, పీజీ ప్రవేశ పరీక్ష తేది: 01.08. 2021
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.nrti.edu.in/admissionupdates

ఇంటర్న్‌షిప్‌–ప్లేస్‌మెంట్స్‌..
ఎన్‌ఆర్‌టీఐలో చేరిన విద్యార్థులు ‘స్టూడెంట్‌ ఎక్చేంజ్‌ ప్రోగ్రామ్‌’ ద్వారా అంతర్జాతీయంగా పేరున్న కార్నెల్, బర్క్‌లీ, యూనివర్సిటీ ఆఫ్‌ బర్మింగ్‌హమ్, రష్యా యూనివర్సిటీ ఆఫ్ టాన్స్‌పోర్ట్, సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ స్టేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ యూనివర్సిటీ రష్యా), జపాన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ టూరిజం రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వంటి వాటిలో కొంతకాలం చదువుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా విద్యార్థులు ప్రతి విద్యా సంవత్సరంలో తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్‌ చేయాలి. మొదటి సంవత్సరం బీఎస్సీ/బీబీఏ విద్యార్థులు దేశంలోని 34 రైల్వే డివిజిన్స్‌లో ఎనిమిది వారాల ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా విద్యార్థులు ఎంచుకున్న విభాగాల్లో సమస్యను గుర్తించడంతోపాటు పరిష్కారం చూపవచ్చు. విద్యార్థులు తమ ఇంటర్న్‌షిప్‌ కేస్‌ స్టడీస్‌ను భారత రైల్వే అధికారులకు సమర్పిస్తారు. రెండో ఏడాది విద్యార్థులు సైతం దేశంలో ప్రముఖ రైల్వే రవాణా రంగంలోని సంస్థలైన సిమెన్స్‌, ఆల్‌ స్టోమ్, బొంబార్డియర్, డీఎఫ్‌ సీసీఐఎల్, డీఎంఆర్‌సీ, ఫీడ్‌ బ్యాక్ ఇన్‌ఫ్రా, హిటాచీ రైల్, ఐఆర్‌సీటీసీ, ఎల్‌ అండ్‌ టీ మెట్రో, ఎంఆర్‌వీసీ, ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్, రైల్‌టెల్, రైట్స్, ఆర్‌వీఎన్‌ఎల్‌ వంటి కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ చేయవచ్చు.

  • ఎన్‌ఆర్‌టీఐలో.. బీబీఏ, బీఎస్సీ కోర్సు పూర్తి చేసిన 2018–21 బ్యాచ్‌ విద్యార్థులకు ఆదిత్య బిర్లా గ్రూప్, రిలయన్స్‌, అదాని, ఎల్‌ అండ్‌ టీ, మహీంద్రా, హిందుస్థాన్‌ యూనిలీవర్, సిమెన్స్‌, కేఈసీ ఇంటర్నేషనల్‌ వంటి కంపెనీలు ఆఫర్స్‌ ఇచ్చాయి.
Published date : 08 Jul 2021 04:07PM

Photo Stories