Skip to main content

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రిపరేషన్‌ పటిష్టంగా సాగించండిలా..

విద్యార్థులు ఇన్ఫర్మేషన్‌ బులెటిన్‌లో పేర్కొన్న సిలబస్‌ ఆధారంగా పటిష్ట ప్రిపరేషన్‌ కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

అదే విధంగా సిలబస్‌ను, ఇప్పటి వరకు సాగించిన ప్రిపరేషన్‌తో బేరీజు వేసుకొని.. దానికి అనుగుణంగా ప్రిపరేషన్‌ వ్యూహం మార్చుకోవాలంటున్నారు.

మ్యాథమెటిక్స్‌..
కోఆర్డినేట్‌ జామ
ెట్రీ, డిఫరెన్షియల్‌ కాలిక్యులస్, ఇంటిగ్రల్‌ కాలిక్యులస్, మాట్రిక్స్‌ అండ్‌ డిటర్మినెంట్స్‌తోపాటు 3–డి జామెట్రీ; కో ఆర్డినేట్‌ జామెట్రీ; వెక్టార్‌ అల్జీబ్రా; ఇంటిగ్రేషన్‌; కాంప్లెక్స్‌ నెంబర్స్‌; పారాబోలా; ట్రిగ్నోమెట్రిక్‌ రేషియోస్‌; క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌; థియరీ ఆఫ్‌ ఈక్వేషన్స్‌; పెర్ముటేషన్‌ అండ్‌ కాంబినేషన్‌; బైనామియల్‌ థీరమ్‌; లోకస్‌ తదితర అంశాలపై పూర్తి స్థాయి అవగాహన ఏర్పరచుకోవాలి.

కెమిస్ట్రీ..
కెమికల్‌ బాండింగ్, ఆల్కైల్‌ హలైడ్, ఆల్కహాల్‌ అండ్‌ ఈథర్, కార్బొనైల్‌ కాంపౌడ్స్, అటామిక్‌ స్ట్రక్చర్‌ అండ్‌ న్యూక్లియర్‌ కెమిస్ట్రీ అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. వీటితోపాటు మోల్‌ కాన్సెప్ట్, కోఆర్డినేషన్‌ కెమిస్ట్రీ, ఆల్కహాల్, ఫినాల్స్, ఈథర్స్, పి–బ్లాక్‌ ఎలిమెంట్స్, అటామిక్‌ స్ట్రక్చర్, గ్యాసియస్‌ స్టేట్, ఆల్డిహైడ్స్‌ అండ్‌ కీటోన్స్, జనరల్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, డి అండ్‌ ఎఫ్‌ బ్లాక్‌ ఎలిమెంట్స్‌పై పట్టు సాధించాలి.

ఫిజిక్స్‌..
విద్యార్థులు ఎలక్ట్రో డైనమిక్స్, మెకానిక్స్, హీట్‌ అండ్‌ థర్మో డైనమిక్స్‌తోపాటు ఎలక్ట్రో డైనమిక్స్, హీట్‌ అండ్‌ థర్మోడైనమిక్స్, మెకానిక్స్, మోడ్రన్‌ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎస్‌హెచ్‌ఎం అండ్‌ వేవ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. అదే విధంగా సెంటర్‌ ఆఫ్‌ మాస్, మూమెంటమ్‌ అండ్‌ కొలిజన్, సింపుల్‌ హార్మోనిక్‌ మోషన్, వేవ్‌ మోషన్‌ అండ్‌ స్ట్రింగ్‌ వేవ్స్‌పై పట్టు సాధిస్తే మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు.

ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌..
అభ్యర్థులు ప్రిపరేషన్‌ సమయంలోనే ఒక ప్రాబ్లమ్‌ లేదా ప్రశ్నను అంచెలవారీగా సాధించేలా ప్రాక్టీస్‌ చేయాలి. గత ఏడాది పరీక్షలో మూడు సబ్జెక్ట్‌ల నుంచి మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలతోపాటు ఇంటిగ్రల్‌ వాల్యూ ఆధారిత ప్రశ్నలు కూడా అడిగారు. కాబట్టి కేవలం బిట్స్‌ సాధనకు పరిమితం కాకుండా..ఒక ప్రాబ్లమ్‌ను స్టెప్‌ వైజ్‌గా పరిష్కరించే విధంగా కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

నెల రోజుల వ్యవధి..
తాజాగా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ.. జేఈఈ–మెయిన్‌ ఏప్రిల్, మే సెషన్‌ పరీక్షల తేదీలను ఖరారు చేసింది. ఏప్రిల్‌ సెషన్‌ పరీక్షలు జూలై 20 నుంచి 25 వరకు; మే సెషన్‌ పరీక్షలు జూలై 27 నుంచి ఆగస్ట్‌ 2 వరకు జరగనున్నాయి. ఆ తర్వాత మరో వారం లేదా పది రోజుల్లో జేఈఈ మెయిన్‌ ఫలితాలు,ర్యాంకులు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఫలితాలు వెల్లడయ్యాక కనీసం 20 రోజుల వ్యవధి ఉండేలా అడ్వాన్స్‌డ్‌ పరీక్ష తేదీని ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. మెయిన్‌ పరీక్షలు ముగిసిన తర్వాత అడ్వాన్స్‌డ్‌ కోసం ఎక్కువగా రివిజన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్స్‌ సూచిస్తున్నారు. రివిజన్‌తోపాటు మాక్‌ టెస్ట్‌లు,మోడల్‌ టెస్ట్‌ల హాజరుకు సమయం కేటాయించాలంటున్నారు.

ప్రాక్టీస్‌ ప్రధానం..
అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే అభ్యర్థులు ప్రాక్టీస్‌తోపాటు తులనాత్మక అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి సబ్జెక్ట్‌కు సంబంధించి ప్రాథమిక భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలపై అవగాహన పెంచుకోవాలి. అప్లికేషన్‌ అప్రోచ్‌తో సాధన చేస్తే పరీక్షలో ప్రశ్నను ఎలా అడిగినా సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది.
– రవీంద్ర, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్ట్‌ నిపుణులు

ఇంటర్‌ రిలేటెడ్‌ టాపిక్స్‌..
ఫిజిక్స్‌లో అభ్యర్థులు ఇంటర్‌ రిలేటెడ్‌గా ఉండే టాపిక్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించొద్దు. అదే విధంగా న్యూమరికల్‌ వాల్యూ ఆధారిత ప్రశ్నలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మెయిన్‌ తర్వాత కొత్త అంశాలు చదువుదాం అనే ధోరణి సరికాదు. ఇప్పటి నుంచే సిలబస్, గత ప్రశ్న పత్రాల ఆధారంగా ప్రిపరేషన్‌ సాగించడం వల్ల మంచి మార్కులు సొంతం చేసుకునే అవకాశం ఉంది.
– సీహెచ్‌.రామకృష్ణ, ఫిజిక్స్‌ సబ్జెక్ట్‌ నిపుణులు
 
Published date : 12 Jul 2021 03:49PM

Photo Stories