‘సైన్స్’ పరిశోధనలకు నెలవు...ఐఐఎస్‌ఈఆర్
Sakshi Education
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISERs)...
దేశంలో సైన్స్ సబ్జెక్టుల్లో విద్య, పరిశోధనలకు ప్రఖ్యాతిగాంచిన సంస్థలు! విద్యార్థుల్లో ఉత్సుకతను, సృజనాత్మకను తట్టిలేపే బోధనా విధానం వీటి సొంతం! వీటి ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు పరిశోధనా సంస్థలకు నాణ్యమైన మేధోశక్తి అందుతోంది. ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ కోర్సులో ప్రవేశాలకు అర్హతలు, కోర్సు వివరాలు, కెరీర్ అవకాశాలపై ఫోకస్...
ఔత్సాహికులకు అత్యున్నత ప్రమాణాలతో శాస్త్రీయ విద్య ను అందించేందుకు, పరిశోధన కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్)లను నెలకొల్పింది. మొత్తం ఆరు సంస్థలున్నాయి. అవి.. ఐఐఎస్‌ఈఆర్-భోపాల్, కోల్‌కతా, మొహాలి, పుణె, తిరువనంతపురం. ఈ ఏడాది ఆరో ఐఐఎస్‌ఈఆర్‌ను తిరుపతిలో ప్రారంభించారు. వీటిలో అకడమిక్ సెషన్ ఆగస్టులో ప్రారంభమవుతుంది. ఈ సంస్థల్లో 2015-16 విద్యా సంవత్సరంలో బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం ఆరు ఐఐఎస్‌ఈఆర్‌లలో వెయ్యి సీట్లు ఉన్నాయి. కోర్సు కాల వ్యవధి అయిదేళ్లు.
అర్హత: బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో చేరేందుకు మూడు మార్గాలున్నాయి. అవి..
ఆప్టిట్యూడ్ టెస్ట్:
బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల నుంచి 15 చొప్పున మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. మూడు గంటల వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. ప్రతి కచ్చితమైన సమాధానానికి మూడు మార్కులు, తప్పు సమాధానానికి-1 మార్కులు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, తిరుపతి, విజయవాడల్లో పరీక్ష కేంద్రాలున్నాయి.
ముఖ్య తేదీలు:
కేవీపీవై, జేఈఈ అడ్వాన్స్‌డ్ స్ట్రీమ్:
ఎస్‌సీబీ స్ట్రీమ్:
వెబ్‌సైట్: www.iiseradmission.in
బీఎస్-ఎంఎస్ కోర్సు తీరుతెన్నులు
కరిక్యులం
ఐఐఎస్‌ఈఆర్‌లు స్వయంప్రతిపత్తి సంస్థలు కాబట్టి వేటికవే కరిక్యులంను ప్రత్యేకంగా రూపొందించుకున్నాయి. కోల్‌కతా ఐఐఎస్‌ఈఆర్‌ను పరిశీలిస్తే అయిదేళ్ల కోర్సులో పరిశోధనలు దిశగా విద్యార్థులను ప్రోత్సహించేలా కరిక్యులం ఉంటుంది. మొత్తం పది సెమిస్టర్లుంటాయి. వీటిలో తరగతి గది బోధన, ప్రాజెక్టు, రీసెర్చ్ వర్క్ ఉంటాయి. మొదటి ఏడాది బయలాజికల్, కెమికల్, మ్యాథమెటికల్, ఫిజికల్, ఎర్త్ సైన్స్‌లకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేయాలి. రెండో ఏడాది పైన పేర్కొన్న సబ్జెక్టుల నుంచి మూడు ప్రి-మేజర్ సబ్జెక్టులను ఎంపిక చేసుకోవాలి. మూడు, నాలుగో ఏడాదిలో ఒక మేజర్ సబ్జెక్టుతో పాటు ఆప్షనల్ ఇంటర్ డిసిప్లిపనరీ కోర్సు ఉంటుంది. అయిదో ఏడాది మొత్తాన్ని పరిశోధన/టెక్నికల్ ప్రాజెక్టు/ప్రత్యేక శిక్షణకు కేటాయించారు.
అన్ని సబ్జెక్టులపై అవగాహన
ప్రముఖులతో గెస్ట్ లెక్చర్స్
ఐఐఎస్‌ఈఆర్ విద్యార్థులకు ఎప్పటికప్పుడు దేశ, విదేశీ పరిశోధనా సంస్థలు, యూనివర్సిటీల ప్రతినిధులతో గెస్ట్ లెక్చర్స్ ఏర్పాటు చేస్తుంటారు. ఆయా రంగాల్లో అందుబాటులోకి వస్తున్న అధునాత శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తారు. ఉదాహరణకు కోల్‌కతా ఐఐఎస్‌ఈఆర్‌లో ఈనెల 24న అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ సందీపన్ హాల్దెర్ సెమినార్ ఏర్పాటు చేశారు. వీటితో పాటు డిపార్ట్‌మెంట్ల వారీగా వర్క్‌షాప్‌లు, సింపోజియంలు, ఎగ్జిబిషన్లు, కాన్ఫరెన్స్‌లు వంటివి ఉంటాయి. స్పోర్ట్స్ క్లబ్‌లు, ఆర్ట్స్ క్లబ్‌లు, సబ్జెక్టు క్లబ్‌లు ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతాయి.
పరిశోధనలకు ప్రథమ స్థానం
ఐఐఎస్‌ఈఆర్‌లో జరుగుతున్న పరిశోధన కార్యకలాపాల తీరుతెన్నులను పరిశీలించేందుకు సంస్థలో ప్రత్యేక విభాగాలుంటాయి. ఇవి క్యాంపస్‌లో పరిశోధనకు అనువైన వాతావరణాన్ని కల్పిస్థాయి. వివిధ దశల్లో ఉన్న పరిశోధనలను సమీక్షించి, పురోగతికి అవసరమైన చర్యలు తీసుకుంటాయి. అవసరమైతే దేశీయ, విదేశీయ పరిశోధన సంస్థలు, పరిశ్రమల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయి. ప్రస్తుతం సమాజంలో ఉన్న అనేక సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే మల్టీడిసిప్లినరీ/ఇంటర్ డిసిప్లినరీ పరిశోధనలు చేపట్టేలా ప్రోత్సహిస్తాయి. అవసరం మేరకు పరిశోధనలకు నిధులను బయట నుంచి సమకూర్చేందుకు కసరత్తు చేస్తాయి. పరిశోధన పత్రాల సమర్పణలోనూ ఇవి సమన్వయకర్త పాత్ర పోషిస్తాయి.
కెరీర్ అవకాశాలు
బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ కోర్సులను పూర్తిచేసిన వారికి అవకాశాలకు ఆకాశమే హద్దని చెప్పాలి. ఏటా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ జరుగుతుంటాయి. ఐటీ, ఫార్మాస్యూటికల్, పెట్రోకెమికల్స్ తదితర విభాగాలకు చెందిన కంపెనీలు నియామకాలకు విద్యాసంస్థల ప్రాంగణాలను సందర్శిస్తుంటాయి. పుణె సంస్థను తీసుకుంటే యునీలీవర్, షెల్, అజీంప్రేమ్‌జీ ఫౌండేషన్ వంటి సంస్థలు విద్యార్థులకు జాబ్ ఆఫర్లు ఇచ్చాయి. బీఎస్-ఎంఎస్ కోర్సు పూర్తిచేసిన వారిలో చాలామంది దేశ, విదేశాల్లోని ప్రముఖ పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. దేశంలో పరిశోధనల పరంగా ముందువరుసలో ఉన్న సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్, సెంట్రల్ ఫుడ్‌టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వంటి వాటిలో ఉన్నత విద్య, ఉద్యోగాల పరంగా అవకాశాలు లభిస్తాయి. అకడమిక్ సంస్థల్లోనూ ఉన్నత వేతనాలతో ఉద్యోగాలను అందిపుచ్చుకోవచ్చు.
క్యాంపస్.. ఆహ్లాదకరం

- కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై) బేసిక్ సైన్స్ స్ట్రీమ్: ఎస్‌ఏ(2013)/ఎస్‌ఎక్స్(2014)/ఎస్‌బీ (2014)లో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్-జేఈఈ (అడ్వాన్స్‌డ్ 2015): జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా కోర్సులో ప్రవేశించవచ్చు. నిర్దేశించిన కటాఫ్స్‌ను బట్టి దరఖాస్తు చేసుకోవాలి.
- జనరల్ కేటగిరీకి సంబంధించి అడ్వాన్స్‌డ్ కామన్ ర్యాంకు జాబితాలో 12,000 ర్యాంకు వరకు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎస్సీ లేదా ఎస్టీ కేటగిరీకి సంబంధించి అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఓబీసీ నాన్ క్రిమీలేయర్‌కు సంబంధించి అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
- పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించి కూడా అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
- స్టేట్ అండ్ సెంట్రల్ బోర్డ్స్ (ఎస్‌సీబీ): సైన్స్ స్ట్రీమ్‌లో ఇంటర్ ఉత్తీర్ణులైన వారు అర్హులు. దీంతో పాటు కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ పరిధిలోని సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డీఎస్‌టీ).. ఇన్‌స్పైర్ ఫెలోషిప్-2015కు అర్హతగా నిర్దేశించిన కటాఫ్ పర్సంటేజీ సాధించి ఉండాలి. ఓబీసీ (నాన్ క్రిమీలేయర్), పీడీ కేటగిరీ అభ్యర్థులకు డీఎస్‌టీ కటాఫ్‌లో అయిదు శాతం మినహాయింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రం ఏ బోర్డు అయినప్పటికీ కటాఫ్‌ను 55 శాతంగా నిర్ణయించారు.
- 2015లో ఇంటర్ పూర్తిచేసి, డీఎస్‌టీ ఇన్‌స్పైర్ ఫెలోషిప్‌నకు సంబంధించి స్కూల్ బోర్డు నుంచి ఎలిజిబిలిటీ నోట్ అందుకున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎస్‌సీబీ ద్వారా ఐఐఎస్‌ఈఆర్‌లో ప్రవేశించాలనుకునే అభ్యర్థులు ఐఐఎస్‌ఈఆర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2015లో అర్హత సాధించాల్సి ఉంటుంది.
ఆప్టిట్యూడ్ టెస్ట్:
బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల నుంచి 15 చొప్పున మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. మూడు గంటల వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. ప్రతి కచ్చితమైన సమాధానానికి మూడు మార్కులు, తప్పు సమాధానానికి-1 మార్కులు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, తిరుపతి, విజయవాడల్లో పరీక్ష కేంద్రాలున్నాయి.
ముఖ్య తేదీలు:
కేవీపీవై, జేఈఈ అడ్వాన్స్‌డ్ స్ట్రీమ్:
- దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 27, 2015
- దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు రూ.750; మిగిలిన వారికి రూ.1500
- ఫలితాలు-సీట్ల కేటాయింపు జాబితా వెల్లడి: జూన్ 30, 2015
- ప్రవేశ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: జూలై 10, 2015
ఎస్‌సీబీ స్ట్రీమ్:
- దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 4, 2015
- ఐఐఎస్‌ఈఆర్ ఎస్‌సీబీ ఆప్టిట్యూడ్ టెస్ట్: జూలై 12, 2015
- ఫలితాలు/సీట్ల కేటాయింపు: జూలై 15, 2015
- ప్రవేశ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: జూలై 22, 2015
వెబ్‌సైట్: www.iiseradmission.in
|
బీఎస్-ఎంఎస్ కోర్సు తీరుతెన్నులు
- అయిదేళ్ల కాలవ్యవధి గల బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ కోర్సులో ప్రవేశం లభించిన వారు అడ్మిషన్ ఫీజు చెల్లించాలి. ఐఐఎస్‌ఈఆర్ భోపాల్‌లో సీటు లభిస్తే జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ.21,485; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.11,500 చెల్లించాలి. ప్రతి సెమిస్టర్‌కు జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ.15,985; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.6,000 చెల్లించాలి. ఇతర క్యాంపస్‌ల ఫీజుల వివరాలు సంబంధిత వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నాయి. ప్రవేశం లభించిన విద్యార్థులకు కేవీపీవై లేదా ఇన్‌స్పైర్ స్కీమ్ ద్వారా నెలవారీ స్కాలర్‌షిప్ అందుబాటులో ఉంటుంది.
కరిక్యులం
ఐఐఎస్‌ఈఆర్‌లు స్వయంప్రతిపత్తి సంస్థలు కాబట్టి వేటికవే కరిక్యులంను ప్రత్యేకంగా రూపొందించుకున్నాయి. కోల్‌కతా ఐఐఎస్‌ఈఆర్‌ను పరిశీలిస్తే అయిదేళ్ల కోర్సులో పరిశోధనలు దిశగా విద్యార్థులను ప్రోత్సహించేలా కరిక్యులం ఉంటుంది. మొత్తం పది సెమిస్టర్లుంటాయి. వీటిలో తరగతి గది బోధన, ప్రాజెక్టు, రీసెర్చ్ వర్క్ ఉంటాయి. మొదటి ఏడాది బయలాజికల్, కెమికల్, మ్యాథమెటికల్, ఫిజికల్, ఎర్త్ సైన్స్‌లకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేయాలి. రెండో ఏడాది పైన పేర్కొన్న సబ్జెక్టుల నుంచి మూడు ప్రి-మేజర్ సబ్జెక్టులను ఎంపిక చేసుకోవాలి. మూడు, నాలుగో ఏడాదిలో ఒక మేజర్ సబ్జెక్టుతో పాటు ఆప్షనల్ ఇంటర్ డిసిప్లిపనరీ కోర్సు ఉంటుంది. అయిదో ఏడాది మొత్తాన్ని పరిశోధన/టెక్నికల్ ప్రాజెక్టు/ప్రత్యేక శిక్షణకు కేటాయించారు.
అన్ని సబ్జెక్టులపై అవగాహన
- బయాలజీలో యానిమల్ బిహేవియర్, బయోడైవర్సిటీ, సెల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, కన్సర్వేషన్ బయాలజీ, డెవలప్‌మెంటల్ బయాలజీ, ఇమ్యునాలజీ, న్యూరోబయాలజీ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు.
- కెమిస్ట్రీకి సంబంధించి ఫిజికల్, ఇనార్గానిక్, ఆర్గానిక్ కెమిస్ట్రీ అంశాలపై అధ్యయనం చేయాలి. స్పెక్ట్రోస్కోపీ, మెయిన్ గ్రూప్ కెమిస్ట్రీ, సిమ్మెట్రీ అండ్ గ్రూప్ థియరీ, సెపరేషన్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ వంటి అంశాలుంటాయి.
- ఎర్త్ సెన్సైస్‌లో ఎన్విరాన్‌మెంటల్ అండ్ ఎకలాజికల్ స్టడీస్, ఐసోటోప్ జియోకెమిస్ట్రీ, బయోకెమికల్ స్టడీస్, సాలిడ్ ఎర్త్ స్టడీస్ కోర్ అంశాలుగా ఉంటాయి.
- ఫిజికల్ సెన్సైస్‌లో కండెన్స్‌డ్ మ్యాటర్, ఆస్ట్రో ఫిజిక్స్, కాస్మోలజీ, నానో సైన్స్, ఆప్టిక్స్, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ తదితరాలపై దృష్టిసారిస్తారు. మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అంశాలపైనా అవగాహన కల్పిస్తారు.
ప్రముఖులతో గెస్ట్ లెక్చర్స్
ఐఐఎస్‌ఈఆర్ విద్యార్థులకు ఎప్పటికప్పుడు దేశ, విదేశీ పరిశోధనా సంస్థలు, యూనివర్సిటీల ప్రతినిధులతో గెస్ట్ లెక్చర్స్ ఏర్పాటు చేస్తుంటారు. ఆయా రంగాల్లో అందుబాటులోకి వస్తున్న అధునాత శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తారు. ఉదాహరణకు కోల్‌కతా ఐఐఎస్‌ఈఆర్‌లో ఈనెల 24న అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ సందీపన్ హాల్దెర్ సెమినార్ ఏర్పాటు చేశారు. వీటితో పాటు డిపార్ట్‌మెంట్ల వారీగా వర్క్‌షాప్‌లు, సింపోజియంలు, ఎగ్జిబిషన్లు, కాన్ఫరెన్స్‌లు వంటివి ఉంటాయి. స్పోర్ట్స్ క్లబ్‌లు, ఆర్ట్స్ క్లబ్‌లు, సబ్జెక్టు క్లబ్‌లు ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతాయి.
పరిశోధనలకు ప్రథమ స్థానం
ఐఐఎస్‌ఈఆర్‌లో జరుగుతున్న పరిశోధన కార్యకలాపాల తీరుతెన్నులను పరిశీలించేందుకు సంస్థలో ప్రత్యేక విభాగాలుంటాయి. ఇవి క్యాంపస్‌లో పరిశోధనకు అనువైన వాతావరణాన్ని కల్పిస్థాయి. వివిధ దశల్లో ఉన్న పరిశోధనలను సమీక్షించి, పురోగతికి అవసరమైన చర్యలు తీసుకుంటాయి. అవసరమైతే దేశీయ, విదేశీయ పరిశోధన సంస్థలు, పరిశ్రమల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయి. ప్రస్తుతం సమాజంలో ఉన్న అనేక సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే మల్టీడిసిప్లినరీ/ఇంటర్ డిసిప్లినరీ పరిశోధనలు చేపట్టేలా ప్రోత్సహిస్తాయి. అవసరం మేరకు పరిశోధనలకు నిధులను బయట నుంచి సమకూర్చేందుకు కసరత్తు చేస్తాయి. పరిశోధన పత్రాల సమర్పణలోనూ ఇవి సమన్వయకర్త పాత్ర పోషిస్తాయి.
కెరీర్ అవకాశాలు
బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ కోర్సులను పూర్తిచేసిన వారికి అవకాశాలకు ఆకాశమే హద్దని చెప్పాలి. ఏటా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ జరుగుతుంటాయి. ఐటీ, ఫార్మాస్యూటికల్, పెట్రోకెమికల్స్ తదితర విభాగాలకు చెందిన కంపెనీలు నియామకాలకు విద్యాసంస్థల ప్రాంగణాలను సందర్శిస్తుంటాయి. పుణె సంస్థను తీసుకుంటే యునీలీవర్, షెల్, అజీంప్రేమ్‌జీ ఫౌండేషన్ వంటి సంస్థలు విద్యార్థులకు జాబ్ ఆఫర్లు ఇచ్చాయి. బీఎస్-ఎంఎస్ కోర్సు పూర్తిచేసిన వారిలో చాలామంది దేశ, విదేశాల్లోని ప్రముఖ పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. దేశంలో పరిశోధనల పరంగా ముందువరుసలో ఉన్న సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్, సెంట్రల్ ఫుడ్‌టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వంటి వాటిలో ఉన్నత విద్య, ఉద్యోగాల పరంగా అవకాశాలు లభిస్తాయి. అకడమిక్ సంస్థల్లోనూ ఉన్నత వేతనాలతో ఉద్యోగాలను అందిపుచ్చుకోవచ్చు.
క్యాంపస్.. ఆహ్లాదకరం
- సైన్స్ రంగంలో నిష్ణాతులైన బోధనా సిబ్బంది
- పరిశోధనలే ప్రధాన లక్ష్యంగా అకడమిక్ కరిక్యులం
- ఎకో ఫ్రెండ్లీ హరిత క్యాంపస్‌లు దిశగా అడుగులు
- ఆన్‌లైన్ పుస్తకాలు, రీసెర్చ్ జర్నల్స్ గల అత్యాధునిక లైబ్రరీలు
- ఆధునిక బోధనా పద్ధతులు, పరిశోధనలకు అనువైన లేబొరేటరీలు
- క్రీడలు, కో కరిక్యులర్ కార్యక్రమాలకు అనువైన వసతులు
- విద్యార్థులందరికీ హాస్టల్ సదుపాయం
Published date : 26 Jun 2015 11:17AM