Skip to main content

ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లలోనే పరీక్షలు.. ప్రధాన కేంద్రంలో సిబ్బంది..

ఆన్‌లైన్‌ కోర్సు పూర్తయిన తర్వాత నిర్వహించే పరీక్షల విషయంలోనూ యూజీసీ పకడ్బందీగా ప్రతిపాదనలు రూపొందించింది. దీని ప్రకారం – ప్రభుత్వ కళాశాలలు, యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లోనే వీటిని నిర్వహించాలి.

ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీటీవీని ఏర్పాటు చేయాలి.

ప్రధాన కేంద్రంలో సిబ్బంది..
ఆన్‌లైన్‌ డిగ్రీలను అందించే యూనివర్సిటీలు.. తమ ప్రధాన కేంద్రంలోనూ పూర్తి స్థాయి సిబ్బందిని నియమించాలి. ఒక డిప్యూటీ రిజిస్ట్రార్, ఒక అసిస్టెంట్‌ రిజిస్ట్రార్, సెక్షన్‌ ఆఫీసర్, ఇద్దరు అసిస్టెంట్‌లను, ఇద్దరు కంప్యూటర్‌ ఆపరేటర్లను, ఇద్దరు మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ను నియమించాలి.

ప్రవేశాలకు ప్రకటన..
ఆన్‌లైన్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు సదరు యూనివర్సిటీలు తప్పనిసరిగా ప్రకటన విడుదల చేయాలి. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా మెరిట్‌ను అనుసరించి.. ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించి.. సీట్లు భర్తీ చేయాలి. ఫీజులు, ఇతర సదుపాయాలు గురించి కూడా ముందుగానే తెలియజేయాలి.

ఇన్‌స్టిట్యూట్‌ మారే అవకాశం..
ఏదైనా ఒక కోర్సు(యూజీ లేదా పీజీ)లో ఒక యూనివర్సిటీలో చేరిన విద్యార్థులు.. సదరు ప్రోగ్రామ్‌ వ్యవధి మధ్యలోనే.. వేరే ఇన్‌స్టిట్యూట్‌కు మారే అవకాశం సైతం కల్పించారు. ఫలితంగా ఒక యూనివర్సిటీలో బోధన లేదా ఇతర అంశాల పరంగా సమస్యలు ఎదుర్కొనే విద్యార్థులు.. మధ్యలో మరో మెరుగైన ఇన్‌స్టిట్యూట్‌లో చేరేందుకు అవకాశం ఉంటుంది.

అందరికీ ఉన్నత విద్య..
దేశంలో ఇంటర్మీడియెట్‌ తర్వాత డ్రాప్‌–అవుట్స్‌ సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీనికి పలు సామాజిక–ఆర్థిక అంశాలు కారణాలుగా నిలుస్తున్నాయి. ఈ డ్రాప్‌ అవుట్‌ సమస్యకు పరిష్కారంగా.. అందరికీ ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతోనే ఆన్‌లైన్‌ డిగ్రీల విధానానికి యూజీసీ అనుమతి ఇచ్చినట్లు పేర్కొంటున్నారు.

యూజీసీ ఆన్‌లైన్‌ డిగ్రీలు.. ముఖ్యాంశాలు

  • జాతీయ స్థాయిలో 38 యూనివర్సిటీలకు అనుమతి.
  • బ్యాచిలర్, పీజీ స్థాయిలో పలు ట్రెడిషనల్‌ టు ప్రొఫెషనల్‌ ప్రోగ్రామ్స్‌.
  • ఆన్‌లైన్‌ డిగ్రీ సర్టిఫికెట్లకు, రెగ్యులర్‌ డిగ్రీ సర్టిఫికెట్ల మాదిరిగానే గుర్తింపు.
  • ప్రతి ఏటా జనవరి లేదా జులైలో ప్రవేశాలు.
  • వచ్చే ఏడాది జనవరి సెషన్‌ నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం.

ఇంకా చదవండి : part 1: ఇంటి నుంచే ఆన్‌లైన్‌ డిగ్రీలు.. వర్సిటీ ఎంపిక చేసుకోండిలా..

Published date : 28 Jun 2021 06:13PM

Photo Stories