పీజీ...ఎందుకు క్రేజీ?
Sakshi Education
బీఏ, బీఎస్సీ, బీకాం ఫైనలియర్ పరీక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని యూనివర్సిటీల్లో
ముగిశాయి. మరికొన్నింటిలో త్వరలో ముగియనున్నాయి. గ్రాడ్యుయేషన్ తర్వాత ఉన్నత
విద్యవైపు దృష్టి సారిస్తే మంచి భవిష్యత్ అవకాశాలు సొంతం చేసుకోవచ్చని విద్యావేత్తలు, నిపుణులుసూచిస్తున్నారు. బ్యాచిలర్స్ డిగ్రీతో పోలిస్తే పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవారికి ఎక్కువ అవకాశాలుండటం ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో డిగ్రీ తర్వాత పీజీ ఎందుకు చేయాలి? పీజీతో ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
పీజీ ఎందుకు?
గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతోనే సివిల్స్, ఎస్‌ఎస్‌సీ, గ్రూప్స్, బ్యాంక్స్, రైల్వేస్ వంటి పోటీ పరీక్షలు రాసే అవకాశం ఉన్నప్పుడు పీజీ ఎందుకు? అనే ప్రశ్న సహజంగానే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఉదయిస్తుంది. అయితే సంపూర్ణ మూర్తిమత్వం ఉన్న వ్యక్తులుగా ఎదగాలన్నా.. నిర్దేశిత సబ్జెక్టుల్లో మంచి పరిజ్ఞానం పొందాలన్నా పీజీతోనే సాధ్యం అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా గ్రాడ్యుయేషన్‌తోనే పూర్తిస్థాయి నైపుణ్యాలు పొందలేం. డిగ్రీ కళాశాలలు సాధారణంగా మండల కేంద్రాల్లో సైతం ఉంటాయి. అక్కడ వివిధ అంశాలపై విద్యార్థులకు ఎక్స్‌పోజర్ చాలా తక్కువగా లభిస్తుంది. పట్టణాల్లో చదివితే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. అదే పీజీ అయితే యూనివర్సిటీ క్యాంపస్‌ల్లో, లేదా క్యాంపస్ కళాశాలల్లో చదవాల్సి ఉంటుంది కాబట్టి విద్యార్థులకు వివిధ అంశాలపై అపార నైపుణ్యాలు సొంతమవుతాయి. ప్రతిభావంతులైన విద్యార్థులు, నిపుణులైన ఫ్యాకల్టీ ఉంటారు. దీనివల్ల వివిధ అంశాలపై సానుకూల వాతావరణంలో చర్చలు జరపొచ్చు.
కెరీర్‌పరంగా అవకాశాలెన్నో..:
యూజీతో పోల్చుకుంటే పీజీతో కెరీర్ అవకాశాలెన్నో ఉన్నాయి. సివిల్స్, గ్రూప్స్ వంటి పరీక్షలకు డిగ్రీనే అర్హతగా ఉన్నప్పటికీ.. యూపీఎస్సీ నిర్వహించే ఇండియన్ ఎకనమిక్ సర్వీస్/ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామ్‌కు నిర్దేశిత సబ్జెక్టుల్లో పీజీ చేసినవారు మాత్రమే అర్హులు. అదేవిధంగా జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్‌గా పనిచేయాలంటే పీజీ ఉండాల్సిందే. ఇక యూనివర్సిటీలు/కేంద్రీయ విద్యా సంస్థల్లో ఫ్యాకల్టీగా పనిచేయాలంటే పీజీతోపాటు పీహెచ్‌డీ ఉండాల్సిందే. వివిధ ప్రైవేటు ఉద్యోగాల్లోనూ పీజీ పట్టా ఉన్నవారికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. పీజీ ఉంటే అదనపు అర్హతగా పరిగణిస్తున్నారు. కార్పొరేట్, సేవా రంగాలు, మేనేజ్‌మెంట్ వంటి నిర్దిష్ట విభాగాల్లో పీజీ చదివినవారికే అత్యుత్తమ అవకాశాలున్నాయి. వేతనాల్లో కూడా వీరే ముందుంటున్నారు. సంబంధిత విభాగాల్లో టీమ్ లీడర్‌గా ఎంపిక చేయాలన్నా.. అభ్యర్థి అకడమిక్ అర్హతలను పరిగణనలోకి తీసుకుంటున్నారు.
కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ముందంజకు..:
యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, గ్రూప్స్, బ్యాంక్స్, డీఎస్సీ వంటి పోటీ పరీక్షల్లో డిగ్రీ అభ్యర్థుల కంటే పీజీ చదివినవారికే ఎక్కువ అవకాశాలుంటున్నాయి. వివిధ పరీక్షల్లో విజేతలుగా నిలిచినవారిని పరిశీలించినట్లయితే పీజీ అభ్యర్థులే ఉద్యోగ సాధనలో ముందుంటున్నారు. గ్రాడ్యుయేషన్‌లో చదివిన సబ్జెక్టులనే వీరు పీజీలో ఎంచుకోవడం ఇందుకు కారణం. ఉదాహరణకు డిగ్రీలో జాగ్రఫీ చదివినవారు పీజీలో కూడా అదే సబ్జెక్టును పూర్తిస్థాయిలో రెండేళ్లపాటు అధ్యయనం చేస్తారు. దీంతో ఆ సబ్జెక్టుపై మంచి పట్టు సాధిస్తారు. ఈ పరిజ్ఞానంతో పోటీ పరీక్షల్లో డిగ్రీ ఉత్తీర్ణులతో పోలిస్తే సులువుగా ఉద్యోగాలను దక్కించుకుంటున్నారు.
కొత్త స్పెషలైజేషన్లు :
డిగ్రీతో పోల్చుకుంటే పీజీలో నేడు ఎక్కువ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. బహుళజాతి కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుండటం, ఈ-కామర్స్ శరవేగంగా అభివృద్ధి చెందుతుండటం, ప్రైవేటు రంగాల అవసరాల నేపథ్యంలో ఎన్నో స్పెషలైజేషన్లు పీజీలో అందుబాటులోకొచ్చాయి. ఎంకాంలో ఈ-కామర్స్, కార్పొరేట్ సెక్రటరీషిప్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్; ఎంఏలో లిబరల్ ఆర్ట్స్, రూరల్ డెవలప్‌మెంట్, సోషల్‌వర్క్; ఎంఎస్సీలో బయోఇన్ఫర్మేటిక్స్, బయోటెక్నాలజీ, జెనెటిక్స్ వంటి వినూత్న స్పెషలైజేషన్లను ఆయా యూనివర్సిటీలు/కళాశాలలు ప్రవేశపెట్టాయి. ఈ కోర్సులను అభ్యసించడం ద్వారా ఉన్నత విద్యావకాశాలతోపాటు ఉద్యోగావకాశాలు సొంతం చేసుకోవచ్చు.

Published date : 28 Apr 2016 05:16PM