Skip to main content

కెరీర్‌లో విజయం సాధించాలంటే ఆన్‌లైనా లేక ఆఫ్‌లైనా? ఏది బెస్ట్‌!.. తెలుసుకోండిలా..

పోటీ ప్రపంచం... ఏ కోర్సులో చేరాలన్నా.. ఏ కొలువులో అడుగు పెట్టాలన్నా.. పోటీ పరీక్షల్లో విజయం సాధించాల్సిందే! పోటీ పరీక్షల్లో రాణించేందుకు ఏటా లక్షల మంది విద్యార్థులు కోచింగ్‌ల బాట పడుతున్న పరిస్థితి! ప్రస్తుతం కరోనా కారణంగా.. నేరుగా తరగతి గది బోధనకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి.

 మరోవైపు ఆన్‌లైన్‌ శిక్షణ ఇస్తామంటూ.. వందల సంఖ్యలో ఇన్‌స్టిట్యూట్స్‌ ముందుకు వస్తున్న వైనం. దాంతో ఆన్‌లైన్‌ కోచింగ్‌తో ప్రయోజనముందా..? ఎలాంటి ఇన్‌స్టిట్యూట్‌ను ఎంచుకోవాలి? అనే సందేహం ఎదురవుతోంది! ఈ నేపథ్యంలో.. ఆయా పోటీ పరీక్షల అభ్యర్థులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ కోచింగ్‌ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం...

దేశంలో అత్యున్నత ఉద్యోగ నియామక పరీక్ష యూపీఎస్‌సీ–సివిల్‌ సర్వీసెస్‌ మొదలు.. పదో తరగతి అర్హతతో నిర్వహించే మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్ట్‌ల వరకూ..పోటీ పరీక్షల్లో నెగ్గితేనే కొలువు! అకడమిక్‌ కోర్సుల్లో చేరేందుకు.. క్యాట్, గేట్, ఐసెట్, జేఈఈ, నీట్,ఎంసెట్‌.. ఇలా దాదాపు పదికిపైగా ఎంట్రన్స్‌ టెస్ట్‌లు. వీటిలో మంచి స్కోర్‌ సాధిస్తేనే ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్‌మెంట్‌ వంటి ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. ఆయా ఎంట్రెన్స్‌ల్లో ర్యాంకు సాధించే దిశగా కోచింగ్‌ అవసరం ఏర్పడుతోంది.

ఆన్‌లైన్‌కు ప్రాధాన్యం..
ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితుల్లో తరగతి గది శిక్షణకు వెళ్లలేని విద్యార్థులు.. ఆన్‌లైన్‌ కోచింగ్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా గత కొంత కాలంగా ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ట్రెండ్‌ విస్తృతమవు తోంది. దీనికి అనుగుణంగానే వందల సంఖ్యలో ఎడ్యుకేషన్‌ పోర్టల్స్‌ అందుబాటులోకి వస్తు న్నాయి. ఈ పోర్టల్స్‌ ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో శిక్షణ పొందే అవకాశం ఉంది. వందల సంఖ్యలో పుట్టుకొస్తున్న ఆన్‌లైన్‌ కోచింగ్‌ ప్రొవైడర్స్‌లో మెరుగైన పోర్టల్‌ను ఎంచుకోవడం ఎలా అనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.

ప్రామాణికత..
ఆన్‌లైన్‌ మార్గాన్ని ఎంచుకునే విషయంలో విద్యా ర్థులు సదరు ఆన్‌లైన్‌ కోచింగ్‌ సంస్థలకు ఉన్న ప్రామాణికత, గుర్తింపు వంటి అంశాలను పరిశీలిం చాలి. ఇందుకోసం సదరు పోర్టల్‌ ప్రారంభమై ఎంత కాలమైంది? దానిద్వారా ఇప్పటివరకు ఎంతమంది కోచింగ్‌ తీసుకున్నారు?సక్సెస్‌ రేట్‌ ఎలా ఉంది? అనే అంశాలను గుర్తించాలి. ప్రస్తుతం పలు ఆన్‌లైన్‌ కోచింగ్‌ ప్రొవైడర్స్‌.. తమ వెబ్‌సైట్‌లోనే ఈ విష యాలను పేర్కొంటున్నప్పటికీ.. విద్యార్థులు స్వీయ పరిశోధన చేయడం మేలు. సదరు ఆన్‌లైన్‌ కోచింగ్‌ ప్రొవైడర్‌కు లభించిన రివ్యూస్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. విజేతలను సంప్రదించాలి. వాస్తవాలు తెలుసుకొని ముందడుగేయాలి.

మెటీరియల్‌–ఫ్యాకల్టీ..
పోటీ పరీక్షకు సంబంధించి ఆన్‌లైన్‌ విధానంలో అం దిస్తున్న మెటీరియల్‌ ప్రామాణికత, ఆన్‌లైన్‌ బోధన అందిస్తున్న ఫ్యాకల్టీ వివరాలు, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ఉన్నారా, అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రాసిన టెస్టులను మూల్యాంకనం చేసే విధానం ఉందా?! వంటి అంశాలను గుర్తించాలి. ఉదాహరణకు.. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటే..ఈ పరీక్షలో విజయానికి విస్తృత స్థాయిలో ప్రిపరేషన్‌ సాగించాల్సి ఉంటుంది. అనేక అంశాలను అవపోసన పట్టాల్సి ఉంటుంది. సివిల్స్‌ కోచింగ్‌ను అందిస్తున్న ఆన్‌లైన్‌ సంస్థలు..సిలబస్‌కు అను గుణంగా కోచింగ్‌ విధానాన్ని అనుసరిస్తున్నాయా? మెటీరియల్‌.. సిలబస్‌కు సరితూగే విధంగా∙ఉందా?అనేది పరిశీలించాలి. అదే విధంగా ఆన్‌లైన్‌ కోచింగ్‌ క్లాసుల వ్యవధి, ఆ సమయంలో సదరు అంశాలకు సన్నద్ధత పొందే అవకాశం ఉంటుందా? అనే విషయాలను కూడా గుర్తించాలి. ఇదే తరహా అన్వేష ణను జేఈఈ, గేట్, క్యాట్‌ తదితర పోటీ పరీక్షల విషయంలోనూ సాగించాలి.

తాజా సమాచారం..
ఆన్‌లైన్‌ కోచింగ్‌ను ఎంచుకునే క్రమంలో సదరు కోచింగ్‌ ప్రొవైడర్స్‌ అప్‌డేటెడ్‌ ఇన్ఫర్మేషన్‌ను అందు బాటులో ఉంచుతున్నారా? లేదా? అనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఏ పోటీ పరీక్ష చూసినా.. కరెంట్‌ అఫైర్స్‌కు,తాజా సమాచా రానికి ప్రాధాన్యమిచ్చే విధంగా ప్రశ్నలు ఉంటు న్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అప్‌డేట్స్‌ అందుబా టులో లేకపోతే.. సదరు పరీక్షలో రాణించడం కష్టంగా మారుతుంది. కాబట్టి ఆయా సంస్థలు ఆన్‌లైన్‌ విధానంలో లేటెస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ను అందిస్తు న్నాయో లేదో చూడాలి.

వర్చువల్‌ సెషన్స్‌..
ఆన్‌లైన్‌ కోచింగ్‌ పరంగా అభ్యర్థులు పరిగణనలోకి తీసుకోవాల్సిన మరో అంశం.. వర్చువల్‌ సెషన్స్‌. అంటే..ఆన్‌లైన్‌లో ఫ్యాకల్టీ బోధన వినే అవకాశం కల్పించడం. ఈ విషయంలో సదరు సంస్థలు అనుసరిస్తున్న ప్రమాణాలు తెలుసుకోవాలి. అదే విధంగా ఆన్‌లైన్‌లో స్టూడెంట్‌–ఫ్యాకల్టీ ఇంటరాక్షన్, సహచర విద్యార్థులతో ఆన్‌లైన్‌లో చర్చించే అవకాశం వంటివి ఉన్నాయో లేదో అడిగి తెలుసుకోవాలి. ఇలాంటి సదుపాయాలు కల్పిస్తున్న సంస్థలకే ప్రాధా న్యమివ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. సదరు ఫ్యాకల్టీ బోధిస్తున్న మెటీరియల్‌ ప్రామాణికతను కూడా పరిశీలించాలి.

రిమైండర్స్‌.. నోటిఫికేషన్స్‌
ఆన్‌లైన్‌ శిక్షణ పరంగా సదరు కోచింగ్‌ ప్రొవైడర్స్‌.. నిరంతరం విద్యార్థులతో సంప్రదింపులు సాగించే విధానాన్ని అనుసరిస్తున్నారా లేదా? అనేది తెలుసు కోవాలి. ప్రస్తుతం పలు పేరున్న ఇన్‌స్టిట్యూట్‌లు విద్యార్థులకు ఈ మెయిల్స్, మెసేజ్‌ల రూపంలో రిమైండర్స్‌ పంపుతున్నాయి. ఆన్‌లైన్‌లోనే గెస్ట్‌ లెక్చర్స్‌ కూడా అందిస్తున్నారు. ఇలాంటి విషయాల్లో ముందంజలో ఉన్న ప్రొవైడర్స్‌ను ఎంచుకుంటే.. ప్రిపరేషన్‌ ఫలవంతంగా సాగుతుంది.

ప్రీవియస్‌ లెక్చర్స్‌..
ప్రీవియస్‌ లెక్చర్స్‌ వినే సదుపాయం కల్పిస్తున్నారా లేదా వాకబు చేయాలి. దీనివల్ల ఏవైనా అవాంతరా లతో ఆన్‌లైన్‌ క్లాస్‌కు హాజరుకాకపోయినా.. సదరు బోధనను వీలున్నప్పుడు వినే అవకాశం ఉం టుంది. అదే విధంగా సెల్ఫ్‌ లెర్నింగ్‌ మెటీరి యల్‌ను అందించడంలో ముందంజలో ఉన్న వా టిని ఎంచుకోవాలి. నిరంతరం ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ నిర్వహించి, విద్యార్థుల సామర్థ్యాలను, బలహీన తలను గుర్తించి..మెరుగుపరచుకునేలా గైడెన్స్‌ను ఇచ్చే సంస్థను ఎంచుకోవడం మేలు.

టెక్నికల్‌ టూల్స్‌..
ఆన్‌లైన్‌ కోచింగ్‌ పరంగా విద్యార్థులు అందుకు అవసరమయ్యే టెక్నికల్‌ టూల్స్‌(కంప్యూటర్, ఇంట ర్నెట్‌ కనెక్షన్‌ తదితర)ను కూడా ముందుగానే సన్నద్ధం చేసుకోవాలి. టెక్నికల్‌గా ఎలాంటి అవాంతరాలు ఎదురవకుండా అందుకు సంబం ధించిన ఏర్పాట్లు చేసుకోవాలి.

ఇంకా చ‌ద‌వండి: part 2: ఆన్‌లైన్‌ కోచింగ్‌ సదుపాయాలు ఎన్ని అందుబాటులోకి వచ్చినా.. ఆఫ్‌లైన్‌ (క్లాస్‌ రూమ్‌) కోచింగ్‌ ఇలా..

Published date : 29 Apr 2021 08:37PM

Photo Stories