Skip to main content

కెరీర్ + సేవ = స్పెషల్ ఎడ్యుకేషన్

ఈ విశ్వంలో అద్భుత సృష్టి.. మానవ జీవితం. పుట్టకతో ఆలోచనా శక్తి, మాటలు, జ్ఞాపకశక్తి, అర్థం చేసుకునే సామర్థ్యం, శారీరక బలాలు..
వీటిల్లో పెద్దగా తేడాలు కనిపించవు. కానీ కొంతమంది మానసిక, శారీరక సమస్యలతో జన్మిస్తున్నారు. సరిగా నడవలేని, కూర్చోలేని, చెప్పింది అర్థం చేసుకోలేని స్థితి, ఆలోచనలకు మాట రూపం ఇవ్వలేని, ఆలోచన సామర్థ్యం తగుస్థాయిలో లేని పిల్లలను స్పెషల్ నీడెడ్‌గా పిలుస్తున్నారు. ఇలాంటి చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పంచడానికి ప్రత్యేక శిక్షణ పొందిన టీచర్ల అవసరం ఉంటుంది. వారికోసం ఉద్దేశించినవే స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు. ఈ కోర్సుల్లో శిక్షణ ద్వారా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లుగా రాణించవచ్చు. ఇటీవల కాలంలో సామాజికంగా ప్రాధాన్యత పెరుగుతూ.. కెరీర్ పరంగానూ మంచి అవకాశాలు కల్పిస్తున్న స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సెస్, కెరీర్ అవకాశాలపై విశ్లేషణ..
  • కరుణ, సేవా దృక్పథం, ఉద్యోగం పట్ల నిబద్ధత ఉండి... వైకల్యం కలిగిన పిల్ల లకు చదువు చెబుతూ.. అందులో ఆనందం వెతుక్కునే వారికి స్పెషల్ ఎడ్యుకేషన్ చక్కటి అవకాశం. సేవ ద్వారా సంపాదనతోపాటు ఆత్మసం తృప్తిని ఇచ్చే కెరీర్ ఇది.
  • ప్రస్తుతం ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల విషయంలో శారీరకంగా, మానసికంగా కొన్ని వైకల్యాలను గుర్తించారు. అవి బుద్ధి మాంద్యం, వినికిడి లోపం, మానసిక వైకల్యం, మాట్లాడలేకపోవడం(మూగ), వినపడకపోవడం(చెవుడు). ఇలాంటి సమస్యలున్న చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించే వారే స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తి చేసుకున్న టీచర్లు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణులకు డిమాండ్ పెరుగుతోంది. అవసరాలకు అనుగుణంగా ఈ విభాగంలో శిక్షణనిచ్చేందుకు ఎన్నో కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి.
ఆర్‌సీఐ :
స్పెషల్ ఎడ్యుకేషన్ విధి విధానా లు, కరిక్యులం, శిక్షణ పరంగా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కేంద్ర ప్రభు త్వం రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆర్‌సీఐ) పేరుతో ప్రత్యేక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసింది. స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు అందించే సంస్థలన్నీ ఈ కౌన్సిల్ పర్యవేక్షణలో పనిచేస్తాయి. ఈ కౌన్సిల్ అనుమతి ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లు అందించే సర్టిఫికెట్లకు, కోర్సులకు జాబ్ మార్కెట్లో గుర్తింపు ఉంటుంది.

కోర్సుల వివరాలు...
స్పెషల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ఇప్పుడు పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సర్టిఫికెట్ కోర్సులు, డిప్లొమా స్థాయి కోర్సుల నుంచి ఎంఫిల్ వరకూ.. వివిధ స్పెషలైజేషన్లతో కూడిన కోర్సుల్లో శిక్షణ పొందొచ్చు.
  • డీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్, ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్, బీఎస్సీ స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ రిహాబిలి టేషన్, పలు డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను దేశ వ్యాప్తంగా ఆర్‌సీఐ గుర్తింపు ఉన్న పలు ఇన్‌స్టిట్యూట్‌లు అందిస్తున్నార.
  • వీటితోపాటు దూరవిద్య లోనూ కొన్ని కోర్సులు అందు బాటులో ఉన్నాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూ నివర్సిటీ ఆర్‌సీఐతో సహకారంతో కొన్ని కోర్సులు ఆఫర్ చేస్తోంది.
ఈ విభాగాల్లో...
1. విజువల్ ఇంపెయిర్‌మెంట్.
2. హియరింగ్ ఇంపెయిర్‌మెంట్.
3. మెంటల్ రిటార్డేషన్.
4. లెర్నింగ్ డిజెబిలిటీ.
5. ప్రోస్థటిక్స్/ఆర్థోటిక్స్ ఫీల్డ్స్‌లో రిహాబిలిటేషన్ ఇంజనీరింగ్/టెక్నాలజీ.
6. కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్.
7. రిహాబిలిటేషన్ సైకాలజీ.
8. క్లినికల్ సైకాలజీ.
9. స్పీచ్ అండ్ హియరింగ్.
10. లోకోమోటర్ అండ్ సెరెబ్రల్ పాల్సీ.
11. ఆటిజమ్ స్పెక్ట్రమ్ అండ్ డిజార్డర్.
12. రిహాబిలిటేషన్ థెరపీ.
13. వేకేషన్ కౌన్సెలింగ్ అండ్ రిహాబిలిటేషన్ సోషల్ వర్క్/అడ్మినిస్ట్రేషన్.
14. కేర్ గివర్స్.
15. ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్.

ఏడాది కోర్సులు :
స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి పలు సర్టిఫికెట్ కోర్సులు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అవి.. సర్టిఫికెట్ కోర్స్ ఇన్ రిహాబిలిటేషన్ థెరపీ; సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ప్రోస్థటిక్స్ అండ్ ఆర్థోటిక్స్; సర్టిఫికెట్ కోర్స్ ఇన్ కేర్ గివింగ్. ఈ కోర్సులు కాల వ్యవధి 10 నెలలు నుంచి ఏడాది లోపే ఉంటుంది.

ప్రవేశం ఎలా...
ఇంటర్, డిగ్రీ అర్హతలతో స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో చేరొచ్చు. కొ న్ని కోర్సులకు అర్హత పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా, డీఈడీ, బీఈడీ వంటి మరికొన్ని కోర్సులకు సంబంధిత యూనివర్సిటీ/ ఇన్‌స్టి ట్యూట్ నిబంధనల మేరకు రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తున్నారు..

అవకాశాలు మెండు...
  • స్పెషల్ ఎడ్యుకేషన్‌లో డీఈడీ, బీఈడీ, బీఎస్సీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి అవకాశాలు మెండు గా లభిస్తున్నాయి. అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించిన కోర్సు స్థాయి ని బట్టి కెరీర్ ప్రారంభం అవుతుంది. ఇటు ప్రభుత్వ రంగంలో అటు ప్రైవేటు రంగంలోనూ వీరికి అవకాశాలు లభిస్తున్నాయి.
  • బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ డిగ్రీతో నెలకు రూ.15వేల జీతంతో ప్రైవేటు రంగంలో కెరీర్ ప్రారంభించొచ్చు. వీరికి ప్రభుత్వ విభాగంలో టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్టుల్లోనూ పోటీ పడే అవకాశం ఉంది.
  • స్పీచ్, ఆడియాలజీలో బీఎస్సీ, ఎంఎస్సీ కోర్సు విజయవంతంగా పూర్తిచేసిన వారికి కార్పొరేటు ఆసుపత్రులు, ఎన్‌జీవోలు ముఖ్య ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. విద్యార్హతలు, పని అనుభవంతో కేరీర్‌లో మంచి వేతనాలు, ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు.
  • స్పెషల్ ఎడ్యుకేషన్ ట్రెనింగ్ కోర్సులు పూర్తి చేసిన వారికి కోర్సు స్థారుు ఆధారంగా..
  • ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, హియరింగ్ అండ్ ఇయర్ మౌల్డ్ టెక్నీషియన్‌‌స, రిహాబిలిటేషన్ ఇంజనీర్స్ అండ్ టెక్నీషియన్‌‌స, స్పెషల్ టీచర్స్ ఫర్ ఎడ్యుకేటింగ్ అండ్ ట్రెనింగ్ ది హ్యాండిక్యాప్డ్, ఒకేషనల్ కౌన్సిలర్స్, ఎంప్లారుుమెంట్/ ప్లేస్‌మెంట్ ఆఫీసర్స్, మల్టీపర్పస్ రిహాబిలిటేషన్ థెరపిస్ట్, టెక్నీషియన్‌‌స, స్పీచ్ పాథాలజిస్ట్, రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్, రిహాబిలిటేషన్ సోషల్ వర్కర్స్, రిహాబిలిటేషన్ ప్రాక్టీషనర్స్ ఇన్ మెంటల్ రిటార్డేషన్, ఓరియెంటేషన్ అండ్ మొబిలిటీ స్పెషలిస్ట్స్, కమ్యూనిటీ బేస్డ్ రిహాబి లిటేషన్ ప్రొఫెషనల్స్, రిహాబిలిటేషన్ కౌన్సిలర్స్, అడ్మినిస్ట్రేట ర్స్, ప్రోస్థిటిక్స్ అండ్ ఆర్థోథెటిక్స్, రిహాబిలి టేషన్ వర్క్‌షాప్ మేనేజర్స్ వంటి హోదాలు లభిస్తారుు.
సొంతంగా ప్రీస్కూల్స్ :
ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, వివిధ స్వచ్ఛంధ సంస్థలు, ట్రస్టుల ఆధ్వర్యంలో నడిచే పాఠశాల లు, సర్వశిక్షా అభియాన్ పరిధి లోని స్కూల్స్‌లో టీచర్లు; వివిధ ఆస్పత్రులు, రిహాబిలిటేషన్ సెంటర్లు, రెగ్యులర్ ప్రీస్కూళ్లు, వివిధ పాఠశాలల్లో ప్రత్యేక విద్యార్థుల కోసం కేటారుుంచిన విభాగాలు స్పెషల్ ఎడ్యుకేషన్ ట్రెనింగ్ పూర్తి చేసుకున్న వారికి ముఖ్య ఉపాధి వేదికలు. దీంతోపా టు ఈసీఎస్‌ఈ/సీఎస్‌ఈల్లో రీసెర్చ్ ప్రాజెక్ట్స్, అంగన్‌వాడీ పాఠశాలలు, ప్రయివేట్ ప్రీస్కూళ్లలో ప్రత్యేక శిక్షణ అవసరమైన చిన్నారులకు కోఆర్డినేటర్‌గా అవకాశాలు లభిస్తారుు. సొంతంగానూ ప్రీ స్కూల్‌ను నిర్వహించవచ్చు.

స్కిల్స్ ప్రధానమే..
కేవలం కెరీర్, ఆదాయం కోసమే చేరితే స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో రాణించలేరు. ఈ విభాగంలో చేరేందుకు ఉండాల్సిన ముఖ్య లక్షణాలు.. ఓర్పు,సహనం, జాలి, దయ, సహానుభూతి. వీటితోపాటు సేవాదృక్పథం ఉండాలి. బుద్ధి మాంద్యం, మానసిక వైకల్యాలు ఉన్న విద్యార్థులు చెప్పే విషయాలను ఓపిగ్గా విని, అర్థం చేసుకునే నైపుణ్యం అలవర్చుకోవాలి. అలాగే సహనంతో నేర్పించే స్కిల్ ప్రధానంగా ఉండాలి.

స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులను అందిస్తున్న పలు ఇన్‌స్టిట్యూట్స్...
1. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ క్యాంపస్, మనోవికాస్ నగర్, సికింద్రాబాద్
2. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి
3. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖ పట్నం
కోర్సులు, కాలేజీలు, అర్హతలు, కోర్సు వ్యవధి..తదితర పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.
వెబ్‌సైట్: https://rehabcouncil.nic.in
Published date : 15 Dec 2017 06:07PM

Photo Stories