కెరీర్ గైడెన్స్..ఫిజికల్ ఎడ్యుకేషన్
Sakshi Education
విద్యా విధానంలో.. క్రీడలు అంతర్భాగం. పాఠశాల కరిక్యులంలో క్రీడలకు తప్పనిసరిగా ఒక పీరియడ్ కేటాయించారు. పాఠశాల, కాలేజీ, లేదా ఏ ఇతర విద్యాసంస్థకు ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలన్నా.. పరిగణనలోకి తీసుకునే అంశాల్లో.. ఆట స్థలం కూడా ఒకటి. దీన్నిబట్టి క్రీడలకు ఎంతటి ప్రాముఖ్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులకు క్రీడల పరంగా, శారీరకంగా అవసరమైన శిక్షణను ఇవ్వడానికి ప్రతి పాఠశాలలో పీఈటీ/పీడీ ఉంటారు. ఈ నేపథ్యంలో.. ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన కోర్సులు, ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లపై ప్రత్యేక ఫోకస్..
విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేసే అంశాల్లో ఒకటైన.. ఫిజికల్ ఎడ్యుకేషన్‌ను పాఠశాల, కళాశాల స్థాయిలో నిర్వహించడానికి, క్రీడాకారుల ప్రతిభను ప్రాథమిక దశలోనే గుర్తించి.. వారిని మరింత మెరుగైన ఆటగాళ్లుగా తీర్చిదిద్దాలంటే.. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ)/ఫిజికల్ డెరైక్టర్ తప్పనిసరి. ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి పలు ఇన్‌స్టిట్యూట్‌లు వివిధ రకాల కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
ఈ కోర్సులతో విద్యార్థులకు పలు ప్రయోజనాలు ఉన్నాయి..
అవి..
-విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడం
-శారీరకంగా ధృడంగా తయారుచేయడం
-నాయకత్వ లక్షణాలను మెరుగుపరచడం
కోర్సులు:
ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా, బ్యాచిలర్, మాస్టర్, పీహెచ్‌డీ కోర్సులు ఉంటాయి. కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు, కోచింగ్ సెంటర్లు పలు స్పెషలైజేషన్స్‌తో సర్టిఫికెట్ కోర్సులు, పీజీ డిప్లొమా, స్వల్పకాలిక కోర్సులనూ అందిస్తున్నాయి.
మన రాష్ట్రంలో:
మన రాష్ట్రంలో స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి డిప్లొమా స్థాయిలో యూజీడీపీఈడీ, బ్యాచిలర్ స్థాయిలో బీపీఈడీ, పీజీ స్థాయిలో ఎంపీఈడీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
యూజీ:
యూజీడీపీఈడీ(అండర్ గ్రాడ్యుయేట్ డిప్లామా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్)
అర్హత: ఇంటర్మీడియెట్/తత్సమానం.
వయసు: 16 ఏళ్లు నిండి ఉండాలి.
బీపీఈడీ(బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్):
అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ.
వయసు : 19ఏళ్లు నిండి ఉండాలి.
ఏయే అంశాలు:
ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి అందుబాటులో ఉన్న కోర్సులను పరిశీలిస్తే.. థియరీ, ప్రాక్టికల్ సెషన్లు రెండూ ఉంటాయి. యూజీడీపీఈడీ/బీపీఈడీ కోర్సులలో ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ ఫిజియాలజీ, బయో మెకానిక్స్, స్పోర్ట్స్ సైకాలజీ, హిస్టరీ ఆఫ్ స్పోర్ట్స్, లెర్నింగ్ థియరీ, ఫిజికల్ ఫిట్‌నెస్, స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ తదితర సబ్జెక్టులను బోధిస్తారు.
ప్రాక్టీకల్ సెషన్‌లో గేమ్స్, ఫస్ట్ ఎయిడ్, యోగా వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. మన రాష్ట్రంలో దాదాపు 13 కాలేజీలు యూజీడీపీఈడీ/బీపీఈడీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
ప్రవేశం:
యూజీడీపీఈడీ, బీపీఈడీ రెండు కోర్సుల్లో కూడా ప్రవేశానికి ఎటువంటి ఎంట్రెన్స్ టెస్ట్ ఉండదు. ఫిజికల్ ఈవెంట్స్, మెరిట్ సర్టిఫికెట్స్(మండల, జిల్లా స్థాయిల్లో నిర్వహించే క్రీడల్లో పాల్గొన్న సర్టిఫికెట్స్), తదితర అంశాల ఆధారంగా రూపొందించిన తుది జాబితా ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఫిజికల్ ఈవెంట్స్‌లో 100 మీటర్ల పరుగు, 800మీటర్ల పరుగు, 400 మీటర్ల పరుగు, లాంగ్ జంప్/హై జంప్, షాట్‌పుట్ అంశాలు ఉంటాయి. వీటితోపాటు ఆసక్తి ఉన్న క్రీడాంశంలో అభ్యర్థి పరిజ్ఞానాన్ని కూడా పరీక్షిస్తారు. సంబంధిత నోటిఫికేషన్ మార్చి /ఏప్రిల్‌లలో వెలువడుతుంది.
పీజీ:
ఎంపీఈడీ (మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్):
ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన పీజీ కోర్సును ఎంపీఈడీ(మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్)గా వ్యవహరిస్తారు. బీపీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ కోర్సుకు అర్హులు. రాష్ట్రంలోని అన్ని ప్రముఖ యూనివర్సిటీలు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. ఆయా వర్సిటీలు నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్‌ల ఆధారంగా ప్రవేశం ఉంటుంది. సంబంధిత నోటిఫికేషన్లు ఏప్రిల్/మేలో
వెలువడుతాయి. మర్ని వివరాలకు ఆయా యూనివర్సిటీల వెబ్‌సైట్‌ను చూడొచ్చు.
ఈ కోర్సులో:
ఎంపీఈడీ కోర్సులో రీసెర్చ్ మెథడ్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ మెథడ్స్, స్పోర్ట్స్ సైకాలజీ, కౌన్సెలింగ్-గెడైన్స్, తదితర స్పెషలైజేషన్స్ ఉంటాయి. అదేవిధంగా నిర్దేశించిన జాబితాల్లోంచి ఏదో ఒక క్రీడాంశాన్ని స్పెషలైజేషన్‌గా ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఎంఫిల్ /పీహెచ్‌డీ:
ఆసక్తి ఉంటే పీహెచ్‌డీ:
ఎంపీఈడీ తర్వాత ఆసక్తిని బట్టి ఏదో ఒక విభాగంలో ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సులు చదివే
అవకాశం ఉంది. అంతేకాకుండా.. పలు జాతీయ స్థాయి ఇన్‌స్టిట్యూట్‌లు/యూనివర్సిటీలు ..స్పోర్ట్స్ కోచింగ్, ఫిట్‌నెస్ మేనేజ్‌మెంట్, స్పోర్ట్స్ మెడిసిన్ తదితర విభాగాల్లో సర్టిఫికెట్, డిప్లొమా, కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సులను చేయడం ద్వారా కోచ్, ఫిజికల్ ట్రైనర్, స్పోర్ట్స్ అకాడెమీ డెరైక్టర్లుగా కెరీర్‌లో ఉన్నత స్థానానికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ స్కిల్స్, టీచింగ్ ఎబిలిటీ ఉంటే ఈ వృత్తిలో మరింత ఉత్తమంగా రాణించవచ్చు.
కెరీర్.. అవకాశాలు:
ప్రస్తుత ప్రపంచంలో మారిన జీవన విధానం(లైఫ్ స్టైల్) కారణంగా.. ఫిజికల్ ఫిట్‌నెస్ ప్రాధాన్యత పెరిగింది. వైద్యులు కూడా ఫిజికల్ ఫిట్‌నెస్ ప్రాధాన్యతను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. కాబట్టి ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశాల పరంగా ఎటువంటి ఢోకాలేదని చెప్పొచ్చు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే డీఎస్సీ పరీక్షకు ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అర్హులే. ఇందులో విజయం సాధించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(పీఈటీ)గా కెరీర్ ప్రారంభించవచ్చు. ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షల ద్వారా జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఫిజికల్ డెరైక్టర్‌గా స్థిరపడొచ్చు.

- ప్రభుత్వ రంగంలో స్పోర్ట్స్ స్కూల్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్), రాష్ట్ర క్రీడా సాధికారిత సంస్థలు, అకాడెమీలలో అడ్వైజర్స్‌గా, కోచ్‌లు, ఫిజికల్ ట్రైనర్‌గా అవకాశాలు ఉంటాయి.
- పాఠశాల కరిక్యులంలో క్రీడల కోసం ప్రత్యేకంగా ఒక పీరియడ్ కేటాయించాలనే ప్రభుత్వ ఆదేశం ఫలితంగా ప్రైవేట్ రంగంలో వీరికి అవకాశాలు పెరగడం తథ్యం.తదనుగుణంగా కార్పొరేట్ స్కూల్స్, ఇతర ప్రైవేట్ పాఠశాలు, జూనియర్ కాలేజీలు, ప్రొఫెషనల్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో పీఈటీ/పీడీగా కెరీర్ ప్రారంభించవచ్చు.
- టీచింగ్‌పై ఆసక్తి ఉంటే సంబంధిత కోర్సులను ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు/ కాలేజీ/ యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీగా కూడా పని చేయొచ్చు.
- ప్రైవేట్ రంగంలో స్పోర్ట్స్ స్కూల్స్, హెల్త్ క్లబ్స్, ఫిట్‌నెస్ సెంటర్లు, క్రీడాఅకాడెమీల్లో అడ్వైజర్స్‌గా, కోచ్‌లు, ఫిజికల్ ట్రైనర్‌గా అవకాశాలు ఉంటాయి.
- సొంతంగా స్పోర్ట్స్ స్కూలు, అకాడెమీలు, ఫిట్‌నెస్ సెంటర్లు, హెల్త్ క్లబ్‌లు స్థాపించుకోవడం ద్వారా స్వయం ఉపాధిని కూడా పొందొచ్చు.
వేతనాలు:
గతంతో పోల్చితే ప్రస్తుతం ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులు చేసే వారికి విద్య, ఉపాధి పరంగా అవకాశాలు పెరిగాయి. కార్పొరేట్ స్కూల్స్, కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల్లో పీఈటీ/పీడీ (ఫిజికల్ డెరైక్టర్)గా పని చేసే అవకాశం ఉంటుంది. వేతనాలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. నెలకు రూ.18 వేల నుంచి 25 వేల వరకు అందుకోవచ్చు.
విభిన్నమైన ప్రొఫెషన్స్:
ఆసక్తికి అనుగుణంగా విభిన్నమైన ప్రొఫెషన్స్‌ను ఎంచుకునే అవకాశాన్ని కూడా ఈ రంగం కల్పిస్తుంది. వీటి ద్వారా ఆకర్షణీయమైన ఆదాయంతోపాటు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది.
కామెంటేటర్..
జరుగుతున్న ఆటను కళ్లకు కట్టినట్టు తన వాకాచాతుర్యంతో వివరించే వాళ్లే కామెంటేటర్స్(వ్యాఖ్యాత). ఏదైనా ఒక క్రీడాంశం మీద సమగ్ర అవగాహన, చక్కటి స్వరం, పదాలను చక్కగా పలకడం, గలగల మాట్లాడే నైపుణ్యం, వివిధ భాషల్లో ఉండే కొన్నికష్టమైన పదాలను సైతం చక్కగా పలకటం, ఇతర భాషల పట్ల కనీస అవగాహన ఉంటే.. వ్యాఖ్యాతగా కెరీర్ ప్రారంభించవచ్చు. దీనికి సంబంధించి ప్రత్యేకమైన కోర్సులు వంటివి ఏమి లేవు. ఆసక్తితో ఎంచుకోవాల్సిన రంగం ఇది. క్రీడలకు ప్రాధాన్యత పెరగడంతోపాటు, స్పోర్ట్స్ చానెల్స్ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో కామెంటరీని ఒక ఆకర్షణీయమైన ప్రొఫెషన్‌గా పేర్కొనవచ్చు. పే-ప్యాకేజెస్ కూడా అధికంగానే ఉంటాయి.
అంపైర్స్/రీఫరీస్..
క్రీడలను నిబంధనలకనుగుణంగా నిర్వహించడం, సంబంధిత వ్యవహారాలను సమన్వయం చేయడం అంపైర్స్/రీఫరీస్‌ల విధి. గ్రామీణ క్రీడల నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడల వరకు వీరి అవసరం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా ప్రొఫెషన్‌గా ఎంచుకోవచ్చు.
స్పోర్ట్స్ స్టాటి స్టీషియన్..
క్రీడలకు సంబంధించిన గణంకాలు, రికార్డులు, సంబంధిత సమాచారాన్ని సేకరించడం, విశ్లేషించడం స్పోర్ట్స్ స్టాటిస్టీషియన్ విధి. టీవీ చానెల్స్, దినపత్రిక లు, వెబ్‌సైట్స్, క్రీడా సంఘాలు, స్టాటిస్టిక్స్ బ్యూరోలు వీరికి కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి.
-ఇవే కాకుండా అథ్లెటిక్స్ ట్రైనర్‌గా, కోచ్‌గా, స్పోర్ట్స్ జర్నలిస్ట్, ఫిజికల్ ట్రైనర్‌గా, స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్ కూడా కెరీర్‌లో స్థిర పడొచ్చు.
కొత్తగా..స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్:
ఇటీవలి కాలంలో క్రీడా రంగం కూడా అవకాశాల వేదికగా మారుతోంది. ఇందులో తాజాగా చేరిన మరో విభాగం ‘స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్’. ముఖ్యంగా ఇటీవల కాలంలో వర్ధమాన క్రీడాకారులు అంతర్జాతీయంగా సంచలనాలు సృష్టిస్తుండడంతో.. పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ‘స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్’.. మన దేశంలోనూ బహుళ ప్రాచుర్యం సంతరించుకుంటూ ఉపాధి అవకాశాలకు సరికొత్త మార్గంగా ఆవిర్భవించింది.
స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ అంటే:
వివిధ క్రీడలకు సంబంధించిన టోర్నమెంట్లను సక్రమంగా నిర్వహించడమే.. స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్. ఒక స్పోర్ట్స్ ఈవెంట్‌కు సంబంధించి షెడ్యూల్ రూపకల్పన మొదలు.. పర్యవేక్షణ, పాల్గొనే క్రీడాకారులు, అధికారులు, సంబంధిత వర్గాలకు తగిన సౌకర్యాలు కల్పించడం వరకు అన్నీ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో ముఖ్య విధులు. అంతేకాకుండా టోర్నీలకు తగిన ప్రచారం కల్పించడం, మార్కెటింగ్ వ్యవహారాలను పర్యవేక్షించేబాధ్యత కూడా వీరిదే.
అవకాశాలు:
వివిధ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ సంస్థల్లో స్పోర్ట్స్ మేనేజర్‌గా అవకాశాలుంటాయి. ఆయా టోర్నమెంట్ల నిర్వహణ సమయంలో పీఆర్‌ఓగా కూడా వ్యవహరించవచ్చు. అంతేకాకుండా ప్రముఖ క్రీడాకారుల వ్యవహారాలను పర్యవేక్షించే పర్సనల్ మేనేజర్, ఏజెంట్స్, పీఆర్‌ఓలుగా అవకాశాలుంటాయి. టైగర్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ వంటి ప్రైవేట్ సంస్థలతోపాటు ప్రభుత్వ క్రీడా సంస్థల్లో కూడా వీరికి అవకాశాలుంటాయి. ప్రస్తుతం వివిధ క్లబ్‌లు, హోటల్స్, రిసార్టులు, స్పోర్ట్స్ సెంటర్లు కూడా స్పోర్ట్స్ మేనేజర్లను నియమించుకుంటున్నాయి. విదేశాల్లోనూ అనేక అవకాశాలు ఉంటాయి. గ్లోబల్ స్పోర్ట్స్, వరల్డ్ టెల్, ఇంటర్నేషనల్ మేనేజ్‌మెంట్ గ్రూప్ వంటి అంతర్జాతీయ సంస్థలు స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా ఉన్న వారిని రిక్రూట్ చేసుకుంటున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ వేల్స్, యూనివర్సిటీ ఆఫ్ బాత్(లండన్) వంటి విద్యాసంస్థలు స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ చేసిన వారికి ఫ్యాకల్టీలుగా అవకాశం కల్పిస్తున్నాయి. దేశంలోని ప్రఖ్యాత మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఐఐఎం- అహ్మదాబాద్, వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కోర్సును ప్రవేశ పెట్టనుంది. దీన్నిబట్టి ఈ కోర్సుకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
అలగప్ప యూనివర్సిటీ -తమిళనాడు (డిస్టెన్స్ విధానంలో)
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్
వెబ్‌సైట్: www.alagappauniversity.ac.in
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ - కోల్‌కతా

వెబ్‌సైట్: www.iiswbm.edu
లక్ష్మీబాయ్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్-గ్వాలియర్.

వెబ్‌సైట్: www.lnipe.gov.in
తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ-చెన్నై
కోర్సు: ఎంబీఏ (స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్)
వెబ్‌సైట్: www.tnpesu.org
టాప్ ఇన్‌స్టిట్యూట్స్:
నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్:
దేశంలో స్పోర్ట్స్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన ప్రతిష్టాత్మక సంస్థ నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్-పాటియాలా (పంజాబ్). స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆధ్వర్యంలో ఈ సంస్థ పని చేస్తుంది.
ఆఫర్ చేస్తున్న కోర్సులు:

- ఎంఎస్సీ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్
- పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ మెడిసిన్
- డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్
- డిప్లొమా ఇన్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ మాసాజ్
- సర్టిఫికెట్ కోర్స్ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్
వివరాలకు: www.nsnis.org
ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సెన్సైస్
వివరాలకు: https://igipess.du.ac.in/
లక్ష్మీబాయ్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్-గ్వాలియర్, తిరువనంతపురం క్యాంపస్‌లు
వివరాలకు: www.lnipe.gov.in
తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ-చెన్నై
వెబ్‌సైట్: www.tnpesu.org
అలగప్ప యూనివర్సిటీ
వివరాలకు: www.alagappauniversity.ac.in
ప్రభుత్వ నిర్ణయం.. పెంచిన అవకాశం:
ప్రతి పాఠశాలలో ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌ను నియమించాలనే ప్రభుత్వ నిర్ణయం ఫలితంగా బీపీఈడీ పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు బాగా పెరగనున్నాయి. ముఖ్యంగా టీచింగ్ (ఫిజికల్ ట్రైనింగ్) విభాగంలో వేల సంఖ్యలో ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. దీన్ని గమనించిన విద్యార్థులు ఈ కోర్సువైపు ఆసక్తి చూపుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది పీఈసెట్ కోసం 36,993 దరఖాస్తులు రావడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. అకడెమిక్ పరంగా ఇంటర్మీడియెట్ తర్వాత రెండేళ్ల వ్యవధిలో యూజీ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో తొమ్మిది నెలల వ్యవధిలో బీపీఈడీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యూజీ డిప్లొమాలో 785 సీట్లు, బీపీఈడీ కోర్సులో 1860 సీట్లు ఉన్నాయి. ఈ రెండు కోర్సుల్లో బోధించే అంశాలు, సబ్జెక్టులు ఒకే మాదిరిగా ఉంటాయి. బీపీఈడీలోని సబ్జెక్టులను విభజించి ఎక్కువ పేపర్లతో యూజీ డిప్లొమా కోర్సు బోధన సాగుతుంది. బీపీఈడీ తర్వాత పీపీఈడీ, పీజీ, పీపీఈడీ, ఎంఫిల్, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యావకాశాలు కూడా ఉన్నాయి. అవకాశాల విషయానికొస్తే.. కేవలం పాఠశాలలే కాకుండా బహుళ జాతి సంస్థలు కూడా ఇటీవల కాలంలో తమ ఉద్యోగుల్లో శారీరక, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడం కోసం ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణులను నియమించుకుంటున్నాయి. వీరికి విదేశాల్లోనూ మెరుగైన అవకాశాలుంటున్నాయి.
ముఖ్యంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అమెరికా, దుబాయ్ వంటి దేశాల్లోని పాఠశాలలు, ప్రైవేటు సంస్థలు మన ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేట్లకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఈ కోర్సులో చేరే విద్యార్థులకు సహనం, ఇతరుల మనస్తత్వానికి అనుగుణంగా వ్యవహరించే నైపుణ్యాలు ఉంటే మరింత ఉన్నతంగా రాణించగలరు.
-డాక్టర్॥పి.పి.ఎస్. పౌల్ కుమార్,
పీఈసెట్-2013 కన్వీనర్,
ప్రిన్సిపల్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్,
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ.

Published date : 01 Jul 2013 03:52PM