Skip to main content

ఇంటి నుంచే ఆన్‌లైన్‌ డిగ్రీలు.. యూనివర్సిటీ ఎంపిక చేసుకోండిలా..

ఇంట్లో కూర్చునే ఉన్నత విద్య అభిలాషను నెరవేర్చుకోవచ్చు. ఆన్‌లైన్‌ విధానంలో చదువుకొని డిగ్రీ, పీజీ పూర్తిచేసుకోవచ్చు. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ).. పూర్తిస్థాయి ఆన్‌లైన్‌ డిగ్రీల విధానానికి ఆమోదం తెలిపింది.
జాతీయ స్థాయిలో 38 యూనివర్సిటీలు ఆన్‌లైన్‌ డిగ్రీ, పీజీ కోర్సులు నిర్వహించేందుకు తాజాగా అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో.. యూజీసీ ఆన్‌లైన్‌ డిగ్రీలు, అందించే కోర్సులు, విధి విధానాలపై ప్రత్యేక కథనం..
 
ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌.. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. కేజీ టు పీజీ ఆన్‌లైన్‌ క్లాసులు జరుగు తున్న పరిస్థితి. ఇవి రెగ్యులర్‌ కాలేజీల్లో, కోర్సుల్లో చేరి.. కరోనా కారణంగా ప్రత్యక్షంగా తరగతులకు హాజరుకాలేని విద్యార్థులు సబ్జెక్టు నైపుణ్యాలు పొందేందుకు మార్గం. కాని ఇకపై ఆన్‌లైన్‌లో ఆయా కోర్సుల్లో ప్రవేశం పొంది.. ఆన్‌లైన్‌లోనే తరగతులకు హాజరై... పూర్తిస్థాయి డిగ్రీ,పీజీ పట్టా పొందొచ్చు. ఇలాంటి అవకాశం కల్పిస్తోంది.. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌. ఇందుకోసం.. తాజాగా యూజీసీ (ఓపెన్‌ అండ్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్స్‌ అండ్‌ ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్స్‌) రెగ్యులేషన్స్‌–2020 పేరిట మార్గదర్శకాలు జారీ చేసింది.

38 యూనివర్సిటీలు..
పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌ విధానంలో బ్యాచిలర్‌ డిగ్రీ, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందించేందుకు యూజీసీ.. మొత్తం 38 యూనివ ర్సిటీలకు అనుమతి మంజూరు చేసింది. వీటిలో సెంట్రల్‌ యూనివర్సిటీలు, స్టేట్‌ యూనివర్సిటీలు, డీమ్డ్‌ టు బి యూనివర్సిటీలు, ప్రైవేటు యూనివ ర్సిటీలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్ర ప్రదేశ్‌లో ఆంధ్రా యూనివర్సిటీతోపాటు మరో రెండు డీమ్డ్‌ యూనివర్సిటీలకు, తెలంగాణలో ఒక డీమ్డ్‌ యూనివర్సిటీకి అనుమతి లభించింది.

ట్రెడిషనల్‌.. టు ప్రొఫెషనల్‌..
ఆన్‌లైన్‌ విధానంలో సంప్రదాయ డిగ్రీ కోర్సులతో పాటు ప్రొఫెషనల్‌ కోర్సులకు కూడా యూజీసీ అనుమతి ఇచ్చింది. బ్యాచిలర్‌ స్థాయిలో బీఏతో పాటు బీబీఏ, బీసీఏ వంటి కోర్సులు; పీజీ స్థాయి లో ఎంఏతోపాటు ఎంబీఏ, ఎంసీఏ వంటి ప్రొఫె షనల్‌ ప్రోగ్రామ్స్‌ అందించేందుకు సదరు యూనివ ర్సిటీలకు అవకాశం కల్పించింది. లేటెస్ట్‌ నైపుణ్యా లైన బిజినెస్‌ అనలిటిక్స్, డేటాసైన్స్, డిజిటల్‌ మార్కెటింగ్‌ వంటి సబ్జెక్ట్‌లతో బ్యాచిలర్, పీజీ కోర్సుల స్వరూపాన్ని నిర్దేశించడం విశేషం.

వర్సిటీల ఎంపిక ఇలా..

  • ఆన్‌లైన్‌ విధానంలో డిగ్రీ, పీజీ కోర్సులను అందించేందుకు యూనివర్సిటీలను ఎంపిక చేసి, అనుమతి ఇచ్చే క్రమంలో యూజీసీ నిర్దిష్ట ప్రామాణికాలను పేర్కొంది.
  • న్యాక్‌ గ్రేడింగ్‌లో 4.0 పాయింట్‌ స్కేల్‌లో 3.26 స్కోర్‌తో న్యాక్‌ గుర్తింపు ఉండాలి. (లేదా)
  • నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌)లో గత మూడేళ్లలో కనీసం రెండుసార్లు టాప్‌–100 జాబితాలో నిలిచిన యూనివర్సిటీలకే అనుమతి లభిస్తుంది.
  • 2019–20 వరకు ఓడీఎల్‌ ప్రోగ్రామ్‌లకు అను మతి పొందిన యూనివర్సిటీలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ వర్సిటీలు నిర్దిష్ట నమూనాలో ధ్రువీకరణ పత్రాలు అందించాలని సూచించింది. ఇలా పలు ప్రమాణాల ఆధారంగా జాతీయ స్థాయిలో 38 యూనివర్సిటీలకు యూజీసీ అనుమతి ఇచ్చింది.
  • ఒక్కో యూనివర్సిటీ గరిష్టంగా మూడు బ్యాచిలర్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లు, పది పీజీ ప్రోగ్రామ్‌లు ఆన్‌లైన్‌లో అందించొచ్చని తెలిపింది.
  • విదేశీ విద్యార్థులకూ ఈ ఆన్‌లైన్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం కల్పించేలా యూజీసీ మార్గదర్శకాలు రూపొందించింది.

ఈ లెర్నింగ్‌..
యూజీసీ ఆన్‌లైన్‌ డిగ్రీ విధానం ప్రకారం–పీజీ కోర్సుల వ్యవధి కనిష్టంగా రెండేళ్లు, యూజీ కోర్సు ల వ్యవధి కనిష్టంగా మూడేళ్లుగా పేర్కొంది. మొత్తం సిలబస్‌కు సంబంధించి 60 శాతం మేరకు ఈ–లె ర్నింగ్‌ విధానం అమలు చేయాలి. ఇందుకోసం ఈ–లెర్నింగ్‌ మెటీరియల్‌ను రూపొందించాలి. మిగతా నలభై శాతానికి సంబంధించి ఇతర ఎలక్ట్రానిక్‌ రిసోర్సెస్‌(ఈ–రిసోర్సెస్‌) ద్వారా అందుబాటులో ఉంచాలి. స్వయం, ఇతర గుర్తింపు పొందిన పోర్టల్స్‌ను విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని యూజీసీ సూచించింది.

ఫార్మేటివ్, సమ్మేటివ్‌ విధానం..
ఆన్‌లైన్‌ డిగ్రీ కోర్సుల్లో చేరిన విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు ఫార్మేటివ్‌ లేదా కంటిన్యూయస్‌ మూల్యాంకన, సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ విధానాల ను అనుసరించాలని యూజీసీ పేర్కొంది. సెమిస్టర్‌ విధానంలో లేదా టర్మ్‌ ఎండ్‌ విధానంలో.. పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఈ రెండు విధా నాలకు వెయిటేజీ కల్పిస్తూ విద్యార్థుల ఉత్తీర్ణతను నిర్ధారించాలని పేర్కొంది. ఫార్మేటివ్‌ అసెస్‌మెం ట్‌కు 30 శాతం, సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌(సెమిస్టర్‌ పరీక్షలు)కు 70 శాతం వెయిటేజీని నిర్ధారించింది. దీంతోపాటు విద్యార్థులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌ లెర్నింగ్‌లో 75 శాతం పూర్తి చేసుకుంటేనే పరీక్షలకు అనుమతించాలి. విద్యార్థుల ప్రతిభను గుర్తించ డానికి ప్రాజెక్ట్‌ రిపోర్ట్స్, కేస్‌ స్టడీస్, ప్రజెంటేషన్స్‌ వంటి వాటిని కూడా అనుసరించాలి. అంతేకాకుం డా ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహించే క్రమంలో.. టెక్నాలజీ ఆధారిత సదుపాయాలు కల్పించాలని పేర్కొంది.

ఇంకా చదవండి : part 2: ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ నిర్వహించాలంటే.. ఈ ప్రమాణాలు ఉండాల్సిందే..

Published date : 28 Jun 2021 06:07PM

Photo Stories