Skip to main content

ఏపీ ఈఏపీసెట్‌–2021 సిలబస్‌ ఇదే.. ప్రిపరేషన్‌ టిప్స్‌ ఇవే..

ఈఏపీసెట్‌ పరీక్ష విధానం గత ఎంసెట్‌ను తరహాలోనే ఉంటుంది. పరీక్షను ఆన్‌లైన్‌ విధానం(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌)లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది.

మొత్తం 160 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది.

ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌: మ్యాథమెటిక్స్‌ 80ప్రశ్నలు–80 మార్కులు, ఫిజిక్స్‌40 ప్రశ్నలు–40 మార్కులు, కెమిస్ట్రీ 40 ప్రశ్నలు–40 మార్కులకు.. ఇలా మొత్తం 160 ప్రశ్నలు–160 మార్కులకు పరీక్ష జరుగుతుంది. nఅగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీæ స్ట్రీమ్‌: బోటనీ 40 ప్రశ్నలు–40 మార్కులు, జువాలజీ 40 ప్రశ్నలు–40 మార్కులు, ఫిజిక్స్‌ 40 ప్రశ్నలు–40 మార్కులు, కెమిస్ట్రీ 40 ప్రశ్నలు–40 మార్కులు.. ఇలా మొత్తం మొత్తం 160 ప్రశ్నలు–160 మార్కులకు పరీక్ష జరుగుతుంది.

ప్రవేశం కల్పించే కోర్సులు..

  • ఇంజనీరింగ్‌(బీటెక్‌), బయోటెక్నాలజీ, బీటెక్‌ (డైరీ టెక్నాలజీ), బీటెక్‌(అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌), బీటెక్‌(ఫుడ్‌æ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ).
  • బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బ్యాచిలర్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌ అండ్‌ యానిమల్‌ హజ్బెండ్రీ, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీ సైన్స్‌.
  • బీఫార్మసీ అండ్‌ ఫార్మాడీ.

సిలబస్‌.. ఇలా
మ్యాథమెటిక్స్‌..
సిలబస్‌లో ముఖ్య టాపిక్స్‌.. అల్జీబ్రా, ట్రిగనోమెట్రీ, వెక్టార్‌ అల్జీబ్రా, ప్రాబబిలిటీ, కోఆర్డ్‌నేట్‌ జామెట్రీ, కాల్కులస్‌. అభ్యర్థులు ఫార్ములాలు, సినాప్సిస్, స్టాండర్డ్‌ రిజల్ట్స్‌పై పట్టుసాధించాలి. ట్రిగనోమెట్రిలో ఫార్ములాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకొని సరైన చోట అన్వయించగలిగేలా ప్రిపరేషన్‌ సాగించాలి. దీంతోపాటు విద్యార్థులు వేగం, కచ్చితత్వంపై ప్రధానంగా దృష్టిసారించాలి.

ఫిజిక్స్‌..

  • సిలబస్‌లో ప్రధాన అంశాలు.. ఫిజికల్‌ వరల్డ్, యూనిట్స్‌ అండ్‌ మెజర్‌మెంట్స్, మోషన్‌ ఇన్‌ ఏ స్రై్టట్‌లైన్, మోషన్‌ ఇన్‌ ఏ ప్లేన్, లాస్‌ ఆఫ్‌ మోషన్, వర్క్, ఎనర్జీ అండ్‌ పవర్, సిస్టమ్స్‌ ఆఫ్‌ పార్టికల్స్‌ అండ్‌ రొటేషనల్‌ మోషన్, ఆషిలేషన్స్, గ్రావిటేషన్, మెకానికల్‌ ప్రాపర్టీస్‌ ఆఫ్‌ సాలిడ్స్, థర్మల్‌ ప్రాపర్టీస్‌ ఆఫ్‌ మేటర్, థర్మోడైనమిక్స్, కైనటిక్‌ థియరీ, వేవ్స్, రే ఆప్టిక్స్‌ అండ్‌ ఆప్టికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్, వేవ్‌ ఆప్టిక్స్, ఎలక్ట్రిక్‌ చార్జెస్‌ అండ్‌ ఫీల్డ్స్, ఎలక్ట్రోస్టాటిక్‌ పొటెన్షియల్‌ అండ్‌ కెపాసిటెన్స్, కరెంట్‌ ఎలక్ట్రిసిటీ, మూవింగ్‌ చార్జెస్‌ అండ్‌ మ్యాగ్నటిజమ్, మాగ్నటిజమ్‌ అండ్‌ మేటర్, ఎలక్ట్రోమాగ్నటిక్‌ ఇండక్షన్, ఆల్టర్నేట్‌ కరెంట్, ఎలక్ట్రోమాగ్నటిక్‌ వేవ్స్, డుయల్‌ నేచర్‌ ఆఫ్‌ రేడియేషన్‌ అండ్‌ మేటర్, ఆటమ్స్, నూక్లియ్, సెమికండక్టర్‌ ఎలక్ట్రానిక్స్, కంప్యూటేషన్‌ సిస్టమ్స్‌.
  • హీట్‌ అండ్‌ థర్మోడైనమిక్స్‌ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. ఈ చాప్టర్‌ నుంచి దాదాపు పది ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. దీని తర్వాత వర్క్‌ ఎనర్జీ పవర్, సిస్టమ్‌ ఆఫ్‌ పార్టికల్స్‌ అండ్‌ రొటేషనల్‌ మోషన్, లాస్‌ ఆఫ్‌ మోషన్, మోషన్‌ ఇన్‌ ఎ ప్లేన్, మూవింగ్‌ చార్జెస్‌ అండ్‌ మ్యాగ్నటిజం చాప్టర్ల నుంచి ఐదు లేదా ఆరు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

కెమిస్ట్రీ

  • కెమిస్ట్రీ సిలబస్‌ టాపిక్స్‌.. అటామిక్‌ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్‌ ఆఫ్‌ ఎలిమెంట్స్‌ అండ్‌ పిరియాడిసిటీ ఇన్‌ ప్రాపరిటీస్, కెమికల్‌ బాండింగ్‌ అండ్‌ మాలిక్యులర్‌ స్ట్రక్చర్, స్టేట్స్‌ ఆఫ్‌ మాటర్‌–గ్యాసెస్‌ అండ్‌ లిక్విడ్స్, స్టయికోమెట్రీ, థర్మోడైనమిక్స్, కెమికల్‌ ఈక్విలిబ్రియం అండ్‌ యాసిడ్స్‌–బేసెస్, హైడ్రోజన్‌ అండ్‌ కాంపౌండ్స్, ద ఎస్‌ బ్లాక్‌ ఎలిమెంట్స్, పీ బ్లాక్‌ ఎలిమెంట్స్, ఎన్విరాన్‌మెంటల్‌ కెమిస్ట్రీ, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, సాలిడ్‌ స్టేట్,సొల్యూషన్స్,ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్‌ కెమికల్‌ కైనటిక్స్, సర్ఫేస్‌ కెమిస్ట్రీ, జనరల్‌ ప్రిన్సిపుల్స్‌ ఆఫ్‌ మెట్లర్జీ, డీ అండ్‌ ఎఫ్‌ బ్లాక్‌ ఎలిమెంట్స్, పాలిమర్స్, బయోమాలిక్యూల్స్, కెమిస్ట్రీ ఇన్‌ ఎవ్రీ డే లైఫ్, ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌ తదితరాలు.
  • కెమిస్ట్రీని విద్యార్థులు ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్‌ కెమిస్ట్రీలుగా విభజించుకొని చదవాలి. ఫిజికల్‌ కెమిస్ట్రీలో.. ప్రాబ్లమ్‌ బేస్డ్‌ ప్రశ్నలను సాధన చేయాలి. ఇనార్గానిక్‌ కెమిస్ట్రీకి సంబంధించి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను అనుసరించడం లాభిస్తుంది. ఆర్గానిక్‌ కెమిస్ట్రీని జనరల్, హైడ్రోకార్బన్లు, హాలో కాంపౌండ్లుగా విభజించుకొని చదవాలి.

బోటనీ..
డైవర్సిటీ ఇన్‌ ద లివింగ్‌ వరల్డ్, మార్ఫాలాజీ, రీప్రొడక్షన్‌ ఇన్‌ ప్లాంట్స్, ప్లాంట్‌ సిస్టమాటిక్స్, సెల్‌ స్ట్రక్చర్‌ అండ్‌ ఫంక్షన్, ఇంటర్నల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ప్లాంట్స్, ప్లాంట్‌ ఎకాలజీ, ప్లాంట్‌ ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, జెనిటిక్స్, మాలిక్యులర్‌ బయాలజీ, బయోటెక్నాలజీ, ప్లాంట్స్, మైక్రోబ్స్‌ అండ్‌ హుమాన్‌ వెల్ఫేర్‌ తదితర అంశాలు బోటనీ సిలబస్‌లో ఉన్నాయి.

జువాలజీ..
ఇందులో డైవర్సిటీ ఆఫ్‌ లివింగ్‌ వరల్డ్, స్ట్రక్చరల్‌ ఆర్గనైజేషన్‌ ఇన్‌ యానిమల్స్, యానిమల్‌ డైవర్సిటీ–1,2, లోకోమోషన్‌ అండ్‌ రీప్రొడక్షన ఇన్‌ ప్రోటోజువా, బయాలజీ ఇన్‌ హుమాన్‌ వెల్ఫేర్, పెరిప్లాంటా అమెరికా, ఎకాలజీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్, హుమాన్‌ అనాటమీ అండ్‌ ఫిజియాలజీ–1,2,3,4, హుమాన్‌ రిప్రొడక్షన్, జెనిటిక్స్, ఆర్గానిక్‌ ఎవల్యూషన్, అప్లయిడ్‌ బయాలజీ తదితర అంశాలు సిలబస్‌లో ఉన్నాయి.

ముఖ్యసమాచారం..

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: జూలై 25, 2021
  • హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్‌: ఆగస్టు 12 నుంచి
  • ఏపీ ఈఏపీసెట్‌ పరీక్ష తేదీలు: ఆగస్టు 19–25
  • పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://sche.ap.gov.in
Published date : 06 Jul 2021 04:14PM

Photo Stories