ఆన్‌లైన్ కోచింగ్ సదుపాయాలు ఎన్ని అందుబాటులోకి వచ్చినా.. ఆఫ్‌లైన్ (క్లాస్ రూమ్) కోచింగ్ ఇలా.
సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు ఇన్‌స్టిట్యూట్‌లు వేర్వేరుగా బోధిస్తున్నాయా? లేదా రెండింటికీ కలిపి ఉమ్మడిగా తరగతులు నిర్వహిస్తున్నాయా? వంటి అంశాలను గుర్తించాలి. కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు పలు పోటీ పరీక్షలకు కామన్‌గా ఉండే టాపిక్స్‌కు ఉమ్మడి బోధన విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇలాంటి వాటి కంటే.. ప్రతి పరీక్షకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహించే ఇన్‌స్టిట్యూట్‌లను ఎంచుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.
లెక్చర్ సెషన్, ఇంటరాక్షన్..
ఆఫ్‌లైన్ కోచింగ్ విధానంలో బోధన పరంగా.. లెక్చర్ సెషన్‌తోపాటు, ఇంటరాక్టివ్ సెషన్‌కు కూడా అవకాశం ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లను ఎంచుకోవడం మేలు. పోటీ పరీక్షల కోచింగ్‌లో ప్రతి సబ్జెక్ట్‌కు సంబంధించి ప్రతి రోజు సగటున గంటన్నర లేదా రెండు గంటల వ్యవధిలో బోధన సాగుతోంది. ఈ సమయంలో సదరు ఫ్యాకల్టీ కనీసం 20 నిమిషాల పాటైనా ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహిస్తే.. విద్యార్థులు తమ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి వీలవుతుంది.
వ్యక్తిగత పర్యవేక్షణ..
ఆఫ్‌లైన్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్.. విద్యార్థుల ప్రతిభకు సంబంధించి వ్యక్తిగత పర్యవేక్షణకు ఎంత మేరకు ప్రాధాన్యం ఇస్తున్నాయనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. విద్యార్థులు మెరుగుపరచుకోవాల్సిన నైపుణ్యాలపై సూచనలిచ్చే ఇన్‌స్టిట్యూట్‌లను ఎంచుకోవాలి. కేవలం క్లాస్ రూమ్ బోధనకే పరిమితమైతే.. విద్యార్థుల్లో తలెత్తే సందేహాలకు పరిష్కారం లభించదు. ఇది తుది సన్నద్ధతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని గుర్తించాలి.
స్వీయ ప్రేరణ ..
శిక్షణ ఆన్‌లైన్ అయినా..ఆఫ్‌లైన్ అయినా.. పోటీ పరీక్షలో నెగ్గాలన్న తపన, కష్టపడే తత్వం అభ్యర్థుల్లో ఉంటేనే లక్ష్య సాధనకు చేరు వవుతారని నిపుణులు పేర్కొంటున్నారు. దీర్ఘకాలం ప్రిపరేషన్ సాగించేలా స్వీయ ప్రేరణ పొందాలని సూచిస్తున్నారు.
ఆన్‌లైన్ కోచింగ్–సానుకూలతలు
- విద్యార్థులు తమకు అనుకూలమైన సమయాన్ని ఎంచుకునే అవకాశం.
- ఏదైనా క్లాస్‌కు హాజరుకాకుంటే.. గత లెక్చర్స్ విధానం వినే సదుపాయం.
- ఈ–మెయిల్స్, మెసేజ్‌ల రూపంలో అప్‌డేట్స్ పొందే వీలు.
ఆన్‌లైన్ కోచింగ్–ప్రతికూలతలు:
- లెక్చరర్‌తో నేరుగా సంభాషించే అవకాశం కొంత తక్కువ.
- టెక్నికల్ సదుపాయాలు సరిగా లేకపోతే ఇబ్బందులు.
- సహచరులతో గ్రూప్ చర్చించే అవకాశం లేకపోవడం.
క్లాస్ రూమ్ కోచింగ్– సానుకూలతలు
- నేరుగా లెక్చరర్‌తో, సహచరులతో సంభాషించే అవకాశం.
- ఇంటరాక్టివ్ సెషన్స్ ద్వారా క్లాస్ రూమ్‌లోనే సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.
- ఇన్‌స్టిట్యూట్‌లను వ్యక్తిగతంగా సందర్శించి.. అప్పటికే అక్కడ శిక్షణ తీసుకుంటున్న విద్యా ర్థులతో సంప్రదించి నిర్ణయం తీసుకునే అవకాశం లభిస్తుంది.
క్లాస్ రూమ్ కోచింగ్–ప్రతికూలతలు:
- పదుల సంఖ్యలో విద్యార్థులతో తరగతులు నిర్వహిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు.
- విద్యార్థుల సందేహాలు నివృత్తి చేసుకోవడానికి సమయం లభించని పరిస్థితి.
- ఉమ్మడి బోధన సాగిస్తుండటంతో తమకు సరితూగే టాపిక్‌ను గుర్తించలేని పరిస్థితి.
ఇంకా చదవండి: part 1: కెరీర్‌లో విజయం సాధించాలంటే ఆన్‌లైనా లేక ఆఫ్‌లైనా? ఏది బెస్ట్!.. తెలుసుకోండిలా..